ప్రతికూల సమయాల్లో ధైర్యంగా ఉండటం అనే అంశంపై పరమహంస యోగానంద

8 ఏప్రిల్, 2020

ఏప్రిల్ వార్తా లేఖ నుండి ప్రేరణ

సవాళ్ళు ఎదురవుతున్న ఇలాంటి సమయాల్లో ధైర్యం యొక్క శక్తివంతమైన ఆలోచనలతో మనల్ని మనం ఎలా నింపుకోవచ్చు మరియు దేవుని రక్షణ గురించి లోతైన అవగాహనను పెంపొందించుకోవడం గురించి పరమహంస యోగానందగారి వివరణలను ఈ నెల మేము మీతో పంచుకుంటున్నాము.

[“శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు నిర్వహించిన ధ్యానం: ఆధ్యాత్మిక హామీ పై ఒక సందేశం” అనే వీడియోలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు ఇటీవల ఈ క్రింది అనేక సత్య పరమైన విషయాలను వినియోగించారు — పరమహంస యోగానందగారి ఆచరణాత్మకమైన మరియు ప్రోత్సాహకరమైన జ్ఞానంతో తమను తాము బలపరచుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ సమతుల్యత మరియు ప్రేరణాత్మక శక్తి పొందడానికి సహాయపడే విధంగా వివరించారు.]

భగవంతునిచే సృష్టించబడినదంతా మనలో నిక్షిప్తమైన ఆత్మ యొక్క అమరత్వాన్ని బయటకు తీసుకురావడానికి మనం ప్రయత్నించడానికే. అదే జీవితం యొక్క సాహసం, జీవితం యొక్క ప్రయోజనం. మరియు ప్రతి ఒక్కరి సాహసం భిన్నంగా ఉంటుంది, ప్రత్యేకమైనది. జీవితంలో లేదా మరణంలో మీ ఆత్మ అజేయమైనదని తెలుసుకొని, ఆరోగ్యం, మనస్సు మరియు ఆత్మకు సంబంధించిన అన్ని సమస్యలను ఇంగిత జ్ఞానం మరియు దేవునిపై నమ్మకం ఉంచడం ద్వారా ఎదుర్కోవటానికి మీరు సిద్ధంగా ఉండాలి.

జీవితం మిమ్మల్ని ఎప్పుడూ ఓడించనివ్వకండి. జీవితాన్ని ఓడించండి! దృఢ సంకల్పం ఉంటే అన్ని కష్టాలను అధిగమించవచ్చు. కష్టాల మధ్య కూడా ఈ విధంగా స్థిరంగా మననం చేసుకోండి: “ప్రమాదం మరియు నేను కలిసి పుట్టాము మరియు నేను ప్రమాదం కంటే ప్రమాదమైనవాణ్ణి!” ఇది మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన సత్యం; దీన్ని అమలుపర్చండి మరియు అది పనిచేస్తుందని మీరు తెలుసుకొంటారు. నశించేవారిలా అధమంగా ప్రవర్తించవద్దు. నీవు దేవుని బిడ్డవి!

మీరు ధ్యానం ద్వారా భగవంతుడిని అన్వేషించడంలో నిమగ్నమై తీరిక లేకుండా ఉండాలని నేను నొక్కి చెబుతున్నాను....ఈ జీవితం యొక్క ఛాయల వెనుక ఆయన అద్భుతమైన కాంతి ఉంది. విశ్వం ఆయన సాన్నిధ్యానికి సంబంధించిన విశాలమైన దేవాలయం. మీరు ధ్యానం చేసినప్పుడు, ద్వారాలు ఆయన కోసం ప్రతి చోటా తెరిచి ఉండడాన్ని మీరు కనుగొంటారు. మీరు ఆయనతో అనుసంధానమైనప్పుడు, ప్రపంచంలోని ఏ విధ్వంసాలు ఆ ఆనందాన్ని మరియు శాంతిని తప్పించలేవు.

భయం, హృదయం నుండి వస్తుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాద భయంతో ఉన్నట్లు భావిస్తే, చాలా సార్లు గాఢంగా, నెమ్మదిగా మరియు లయబద్ధంగా శ్వాస తీసుకొని వదిలి పెట్టండి. ప్రతి నిశ్వాసంతో మీరు విశ్రాంతి పొందండి. ఇది రక్త ప్రసరణ సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది. మీ హృదయం నిజంగా ప్రశాంతంగా ఉంటే మీరు అస్సలు భయపడరు.

ధృఢంగా మననం చేయండి: “నీ ప్రేమతో కూడిన రక్షణ కోటలో నేను ఎప్పుడూ సురక్షితంగా ఉన్నాను.”

పైన పేర్కొన్న స్వామి చిదానందగారి వీడియోతో పాటుగా, వై.ఎస్.ఎస్. అనేక ఇతర ఆన్‌లైన్ వనరులను అందిస్తుంది, ముఖ్యంగా ప్రస్తుత క్లిష్ట ప్రపంచ పరిస్థితులలో ఇది భద్రత మరియు భరోసా యొక్క అంతర్గత మూలంతో అనుసంధానం అవ్వడానికి మనకు సహాయపడుతుంది. వీటిలో ప్రత్యక్ష ఆన్‌లైన్ సామూహిక ధ్యానాలు, వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు నిర్వహించే, ప్రతి వారం ప్రసారమయ్యే స్ఫూర్తిదాయక ప్రసంగాలు మరిన్ని ఉన్నాయి. వీటిని మరియు స్వామి చిదానందగారి ప్రస్తుత సందేశాలను సౌకర్యవంతంగా పొందడానికి, ఇటీవల మా బ్లాగ్ పోస్ట్‌లో అందించిన లింక్‌లను ఉపయోగించండి “ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని ఎదుర్కోవడంలో మీకు సహాయం చేయడానికి మా వెబ్‌సైట్‌లోని వనరులు”:

ఇతరులతో షేర్ చేయండి