భయం, ఆందోళన మరియు చింతలను జయించడం

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి రచనల నుండి సారాంశాలు

శంఖు ఊదుతున్న కృష్ణుడు మరియు అర్జునుడు

జీవితపు యుద్ధభూమిలో ప్రతి ఒక్కరినీ, ప్రతి పరిస్థితినీ ఒక వీరుడి ధైర్యంతోను మరియు విజేత యొక్క చిరునవ్వుతోను కలుసుకోండి.

నీవు దేవుని బిడ్డవి. నీవు దేనికి భయపడాలి?

వైఫల్యాల భయం లేదా అనారోగ్యం కలిగించే ఆలోచనలను చేతన మనస్సులో పదే పదే కలిగి ఉండడం వల్ల అవచేతనలో మరియు చివరకు అధిచేతన స్థితిలో పాతుకుపోతాయి. అప్పుడు అధిచేతనలోను, అవచేతనలోను పాతుకుపోయిన భయం అనే మొక్కలు చేతనా మనస్సులో మొలకెత్తడం మరియు భయం అనే మొక్కలతో నింపడం ప్రారంభిస్తుంది, అవి అసలు ఆలోచన వలె, నాశనం చేయడం అంత సులభం కాదు మరియు ఇవి చివరికి తమ విషపూరితమైన, మరణాన్ని కలిగించే ఫలాలను అందిస్తాయి.

ధైర్యం మీద బలమైన ఏకాగ్రతతో మరియు మీ చైతన్యాన్ని భగవంతుని సంపూర్ణ శాంతి వైపునకు మార్చడం ద్వారా వాటిని లోపలి నుండి వేరు చేయండి.

మీరు దేని గురించి భయపడుతున్నారో, మీ మనస్సును దాని నుండి తీసివేయండి మరియు దానిని దేవునికి వదిలివేయండి. ఆయనపై విశ్వాసముంచండి. చాలా బాధలు కేవలం ఆందోళన వల్లనే జన్మిస్తాయి. జబ్బు ఇంకా రానప్పుడు, ఇప్పుడే బాధ ఎందుకు పడతారు? మనకు కలిగే అనారోగ్యాలు చాలా వరకు భయం ద్వారానే కలుగుతాయి కాబట్టి, మీరు భయాన్ని విడిచిపెట్టినట్లయితే, ఒక్కసారిగా మీరు విముక్తి పొందుతారు. తక్షణమే మీకు నయమవుతుంది. ప్రతి రాత్రి, మీరు నిద్రపోయే ముందు, ఈ విధంగా ధృవీకరించండి: “పరలోకపు తండ్రి నాతో ఉన్నాడు; నేను రక్షించబడ్డాను.” మానసికంగా పరమాత్మతో మిమ్మల్ని మీరు అనుసంధానించుకోండి….అద్భుతమైన ఆయన రక్షణను మీరు అనుభవిస్తారు.

మీ చైతన్యం భగవంతునిపై ఉంచినప్పుడు, మీకు భయాలు కలుగవు; మీకు కలిగే ప్రతి అడ్డంకి, ధైర్యం మరియు విశ్వాసం ద్వారా అధిగమించబడుతుంది.

భయం గుండె నుండి వస్తుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాద భయంతో బయటపడినట్లు భావిస్తే, మీరు ప్రతి నిశ్వాసంతో విశ్రాంతి తీసుకుంటూ చాలాసార్లు లోతుగా, నెమ్మదిగా మరియు లయబద్ధంగా శ్వాసించండి మరియు వదిలిపెట్టండి. ఇది మీ రక్త ప్రసరణ సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది. మీ హృదయం నిజంగా నిశ్శబ్దంగా ఉంటే మీరసలు భయాన్ని అనుభవించలేరు.

శారీరక ఉద్రిక్తతను సడలించుకోవడానికి ఒక ప్రక్రియ

సంకల్పంతో బిగించండి. సంకల్పం ద్వారా, శరీరాన్ని లేదా ఏదైనా శరీర భాగాన్ని నింపడానికి ప్రాణశక్తిని (బిగింపు ప్రక్రియ ద్వారా) నిర్దేశించండి. అక్కడ బలాన్ని చేకూర్చి, పునర్జీవింపచేయగల స్పందించే శక్తిని అనుభూతి పొందండి. సడలించండి మరియు అనుభూతి చెందండి: ఒత్తిడిని సడలించండి మరియు మళ్ళీ శక్తి నింపబడిన ప్రదేశంలో కొత్త జీవాన్ని మరియు చైతన్యం యొక్క ఓదార్పు జలదరింపును అనుభూతి చెందండి. మీరు శరీరం కాదని భావించండి; శరీరాన్ని నిలబెట్టే జీవమే నీవు. ఈ ప్రక్రియను అభ్యసించడం ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రశాంతతతో వచ్చే శాంతి, స్వేచ్ఛ, పెరిగిన అవగాహనను అనుభవించండి.

చాలా మంది తమ బాధలు చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను వారిని నిశ్శబ్దంగా కూర్చోవాలని, ధ్యానం చేయమని మరియు ప్రార్థించమని కోరుతాను; మరియు అంతర్లీనంగా ప్రశాంతతను అనుభవించిన తర్వాత, సమస్యను పరిష్కరించగల లేదా తొలగించగల ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించండి. భగవంతునిపై మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, భగవంతుడిపై విశ్వాసం బలంగా ఉన్నప్పుడు, వారు తమ సమస్యకు పరిష్కారం కనుగొనగలుగుతారు. సమస్యలను విస్మరించడం వలన మాత్రమే వాటికి పరిష్కారం లభించదు, కానీ వాటి గురించి చింతించినా పరిష్కారం లభించదు. మీరు ప్రశాంతత పొందే వరకు ధ్యానం చేయండి; అప్పుడు మీ సమస్య పై మీ మనస్సు పెట్టి, దేవుని సహాయం కోసం గాఢంగా ప్రార్థించండి. సమస్యపై దృష్టి కేంద్రీకరించండి మరియు భయంకరమైన ఆందోళనకు గురికాకుండా పరిష్కారాన్ని మీరు కనుగొంటారు….

గుర్తుంచుకోండి, మనస్సులో మెదిలే లక్షలకొద్దీ హేతువుల కంటే ముఖ్యమైనది, మీరు లోపల ప్రశాంతతను అనుభవించే వరకు కూర్చుని భగవంతుని ధ్యానించడమే. అప్పుడు ప్రభువుతో ఇలా చెప్పండి, “నేను కోటి భిన్నమైన ఆలోచనలు చేసినా నా సమస్యను ఒంటరిగా పరిష్కరించుకోలేను; కానీ నేను దానిని నీ చేతుల్లో ఉంచడం ద్వారా దాన్ని పరిష్కరించగలను, ముందుగా నీ మార్గదర్శకత్వం కోరి, ఆపై సాధ్యమైన పరిష్కారం కోసం వివిధ కోణాలను ఆలోచించడం ద్వారా నేను దానిని పరిష్కరించగలను.” తనకు తానుగా సహాయం చేసుకునే వారికి దేవుడు సహాయం చేస్తాడు. ధ్యానంలో దేవునికి ప్రార్థన చేసిన తర్వాత మీ మనస్సు ప్రశాంతతతో మరియు విశ్వాసంతో నిండినప్పుడు, మీరు మీ సమస్యలకు వివిధ సమాధానాలను పొందగలుగుతారు; మరియు మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నందున, మీరు ఉత్తమమైన పరిష్కారాన్ని ఎంచుకోగలుగుతారు. ఆ పరిష్కారాన్ని అనుసరించండి మరియు మీరు విజయం సాధిస్తారు. ఇది మీ దైనందిన జీవితంలో మత శాస్త్రాన్ని వర్తింపజేస్తుంది.

మనం పనులలో ఎంతగా నిమగ్నమై ఉన్నప్పటికీ, మన మనస్సును చింతల నుండి మరియు అన్ని విధుల నుంచి పూర్తిగా విముక్తి చేయడం మనం ఇప్పుడే మరచిపోకూడదు….ప్రతికూల ఆలోచనలతో బాధపడుతున్నట్లయితే, ప్రతికూలంగా ఆలోచించకుండా, మనస్సును శాంతింపజేయడానికి ఒక నిమిషం పాటు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. తర్వాత నిశ్చలమైన మనస్సుతో కొన్ని నిమిషాలు ఉండేందుకు ప్రయత్నించండి. ఆ తర్వాత, ఏదైనా ఒక సంతోషకరమైన సంఘటన గురించి ఆలోచించండి; దానిపై దృష్టి పెట్టండి మరియు దానిని దృశ్యమానం చేయండి; మీరు మీ చింతలను పూర్తిగా మరచిపోయే వరకు మానసికంగా కొన్ని ఆహ్లాదకరమైన అనుభవాలను పదే పదే భావన చేయండి.

ఆలోచించే, మాట్లాడే, అనుభూతి చెందే మరియు ప్రవర్తించే శక్తి అంతా భగవంతుని నుండి వచ్చిందని మరియు ఆయన మనతో ఎప్పటికీ ఉంటాడని, మనకు స్ఫూర్తినిస్తూ మరియు నడిపిస్తూ ఉంటాడని గ్రహించడం వలన భయాందోళన నుండి తక్షణ విముక్తి లభిస్తుంది. ఈ సాక్షాత్కారంతో దైవిక ఆనందం యొక్క మెరుపులు వస్తాయి; కొన్నిసార్లు ఒక లోతైన ప్రకాశం ఒకరి ఉనికి అంతటా వ్యాపించి, భయం అనే భావనను తొలగిస్తుంది. సముద్రంలా, దేవుని శక్తి ప్రవహిస్తుంది, హృదయాన్ని శుభ్రపరిచే వరదలా ప్రవహిస్తుంది, భ్రమ కలిగించే సందేహం, వ్యాకులత మరియు భయం యొక్క అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. పదార్థం యొక్క భ్రాంతి, కేవలం మర్త్య శరీరం మాత్రమే ముఖ్యం అనే స్పృహ, ఆత్మ యొక్క మధురమైన ప్రశాంతతను స్పృశించడం ద్వారా అధిగమించబడుతుంది, రోజువారీ ధ్యానం ద్వారా దాన్ని సాధించవచ్చు. అప్పుడు భగవంతుని విశ్వ సముద్రంలో శరీరం, శక్తి యొక్క చిన్న బుడగ అని మీకు తెలుస్తుంది.

భగవంతుణ్ణి చేరుకోవడానికి అత్యున్నత ప్రయత్నం చేయండి. నేను మీతో ఆచరణాత్మక సత్యాన్ని గురించి మాట్లాడుతున్నాను, ఆచరణాత్మక భావం; మరియు మీకు బాధ కలిగించే మీ స్పృహ మొత్తాన్ని తీసివేసే తత్వశాస్త్రాన్ని అందిస్తున్నాను. దేనికీ భయపడకండి….గాఢంగా మరియు నమ్మకంగా ధ్యానించండి, మరియు ఒక రోజు మీరు దేవునితో పారవశ్యంలో మేల్కొంటారు. అప్పుడు ప్రజలు తాము బాధపడుతున్నారని భావించడం ఎంత మూర్ఖంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. మీరు, నేను మరియు వారందరూ స్వచ్ఛమైన ఆత్మ మాత్రమే.

ప్రతిజ్ఞ

ప్రతిజ్ఞ యొక్క సిద్ధాంతం మరియు సూచనలు

“నేను సేద తీరి అన్ని మానసిక భారాలను పక్కనపెట్టి, దేవుడు నా ద్వారా తన పరిపూర్ణమైన ప్రేమను, శాంతిని మరియు జ్ఞానాన్ని వ్యక్తీకరించడానికి అనుమతిస్తాను.”

“ఓ సర్వవ్యాపక రక్షకుడా! యుద్ధ మేఘాలు, వాయువు మరియు అగ్నిని వర్షించేటప్పుడు, నీవే నాకు ఆశ్రయంగా ఉండు.”

“జీవితంలో మరియు మరణంలో, వ్యాధి, కరువు, తీవ్రమైన అంటువ్యాధులలో లేదా పేదరికంలో నేను ఎప్పుడైనా నిన్ను అంటిపెట్టుకుని ఉంటాను. బాల్యం, యవ్వనం, వయస్సు మరియు ప్రపంచ కల్లోలాల మార్పులచే తాకబడకుండా, నేను అమరమైన ఆత్మనని గ్రహించడానికి నాకు సహాయం చేయి.”

మరింతగా అన్వేషించడానికి

ఇతరులతో పంచుకోండి