ప్రార్థనా శాస్త్రం

సూర్యాస్తమయం సమయంలో ప్రార్థన.

“బలమైన మరియు గాఢమైన ప్రార్థన ఖచ్చితంగా దేవుని సమాధానాన్ని పొందుతుంది…. మతంలో శాస్త్రం యొక్క అన్వయం ద్వారా, ఆధ్యాత్మిక అవకాశాల పట్ల మీ అనిశ్చిత విశ్వాసం వాటి అత్యున్నత అనుభవంలోకి రాగలదు.”

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

భగవంతుడే విశ్వాన్ని నిలబెట్టే ప్రేమ – సమస్త సృష్టిలో వ్యాపించి ఉన్న జీవ శక్తి సాగరం. శాస్త్రీయ ప్రార్థనా పద్ధతుల ద్వారా, మనల్ని మనం ఆ అనంత శక్తితో అనుసంధానం చేసుకోవచ్చు, తద్వారా శరీరం, మనస్సు మరియు ఆత్మకు స్వస్థత చేకూర్చవచ్చు.

కొందరు వ్యక్తులు ప్రార్థనను కోరికతో కూడిన ఆలోచనలో అస్పష్టమైన మరియు అసమర్థమైన వ్యాయామంగా భావిస్తారు. సాధారణ వ్యక్తి తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరియు ఇతర ప్రత్యామ్నాయాలన్నీ విఫలమైనప్పుడు మాత్రమే ప్రార్థనను ఆశ్రయిస్తాడు. కానీ పరమహంస యోగానందగారు నిజమైన ప్రార్థన శాస్త్రీయమైనదని బోధించారు – సమస్త సృష్టిని నియంత్రించే ఖచ్చితమైన నియమాలపై ఆధారపడి ఉంటుంది – మరియు సామరస్యపూర్వక జీవనానికి అది నిత్యావసరం.

దేవుని సృష్టిలో భాగంగా గెలాక్సీ.మన భౌతిక శరీరాలు మరియు మనం జీవిస్తున్న భౌతిక ప్రపంచం ఘనీభూతమైన అదృశ్య శక్తి నమూనాలేనని ఆయన వివరించారు. ఆ శక్తి సూక్ష్మతరమైన ఆలోచన నమూనా – శక్తి మరియు పదార్థం యొక్క అన్ని వ్యక్తీకరణలను నియంత్రించే అత్యంత సూక్ష్మ ప్రకంపన. మొదటగా సృష్టి మొత్తాన్ని భావన లేదా ఆలోచన రూపంలో దేవుడు తీసుకువచ్చాడు. అప్పుడు దివ్య చైతన్యం ఆ ఆలోచనా నమూనాలను కాంతిగా, శక్తిగా మరియు చివరకు పదార్థం యొక్క స్థూలమైన ప్రకంపనలుగా మార్చడానికి సంకల్పించింది.

మానవులుగా, దేవుని స్వరూపంలో తయారు చేయబడినందున, మనం సృష్టిలోని నిమ్నతర రూపాల నుండి భిన్నంగా ఉన్నాము: ఆలోచన మరియు శక్తి యొక్క అదే సామర్థ్యాలను ఉపయోగించుకునే స్వేచ్ఛ మనకు ఉంది. అలవాటుగా తలపెట్టి అమలుపరిచే ఆలోచనల ద్వారా, వెల్లడయ్యే మన జీవిత స్థితిగతులను మనమే సృష్టించుకుంటాము.

శాస్త్రీయ ప్రార్థన ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం మరియు సృష్టి యొక్క సార్వత్రిక శక్తుల అన్వయంపై ఆధారపడి ఉంటుంది: ఆరోగ్యం, సామరస్యం మరియు పరిపూర్ణత అనే దేవుని ఆలోచనా నమూనాలతో ఇది అనుసంధానించబడి ఉంటుంది – ఆపై ఆ నమూనాలను సాకారం చేయడంలో శక్తిని ప్రవహింప చేయటానికి సంకల్ప శక్తిని ఉపయోగిస్తుంది.

ప్రార్థన అనేది మానవ మనస్సు మరియు చిత్తాన్ని భగవంతుని చైతన్యం మరియు చిత్తానికి అనుగుణంగా మార్చగల శాస్త్రం. ప్రార్థన ద్వారా, మనం దేవునితో ప్రేమపూర్వకమైన, వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరుచుకుంటాము. అటువంటి ప్రార్థనకు ఆయన ప్రతిస్పందించకుండా ఉండడు. పరమహంస యోగానంద ఆత్మకథలో మనం ఇలా చదువుతాము:

“ప్రభువు అందరికీ ప్రతిస్పందిస్తాడు మరియు అందరి కోసం పనిచేస్తాడు. దేవుడు తమ ప్రార్థనలను ఎంత తరచుగా ఆలకిస్తాడో మనుషులు చాలా అరుదుగా గ్రహిస్తారు. ఆయన ఎవరికీ పక్షపాతం చూపడు, తనను విశ్వాసంతో సమీపించే ఎవరినైనా అలకిస్తాడు. సర్వవ్యాపి అయిన తమ తండ్రి యొక్క ప్రేమపూర్వక దయపై అతని పిల్లలు ఎప్పటికీ సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి.”

భగవంతుని అపరిమిత శక్తిని సహనంతో మరియు పట్టుదలతో అన్వయించడం ద్వారా, మనం ఆయన ప్రేమతో, సహాయంతో మనం కోరుకునే పరిస్థితులను సృష్టించవచ్చు మరియు కష్టాలు, వ్యాధులను పోగొట్టవచ్చు – మనకే కాదు, ఇతరులకు కూడా.

ప్రార్థనను సమర్థవంతంగా చేయడానికి చిట్కాలు మరియు పద్ధతులను అన్వేషించండి

దేవుణ్ణి ప్రార్థిస్తున్న పిల్లలు

ఇతరులతో పంచుకోండి