పుస్తకములు మరియు రికార్డింగులు

యోగదా సత్సంగ పాఠాలు

శ్రీ పరమహంస యోగానందగారు బోధించిన శాస్త్రీయ ప్రక్రియలు, క్రియాయోగాతో సహా – మరియు సంతులమైన ఆధ్యాత్మిక జీవన విధానము గురించిన అన్ని విషయాల పై ఆయన మార్గదర్శకత్వం ఈ యోగదా సత్సంగ పాఠాలలో నేర్చుకోవచ్చు. ఇంటినుండే చదువుకొని తెలుసుకోవడానికి వీలైన సమగ్రమైన పాఠాలతో కూడిన కొన్నివేల పుటలలో మహా గురువుల వారిచే స్వయంగా తన శిష్యుల కోసం ఇవ్వబడిన సూచనలతో సులభంగా అర్థంచేసుకొని ఆచరణలోపెట్టడానికి వీలైనవి, వారం వారం చదువుకోవటానికి అనుగుణంగా తీర్చిదిద్దబడినవి. ఈ పాఠాల కోసం అభ్యర్థించండి.

ఒక యోగి ఆత్మకథ

ఒక యోగి ఆత్మకథ

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రచురణల్లోని ఈ గొప్ప ఆధ్యాత్మిక గ్రంథంలో గ్రంథకర్త శ్రీ పరమహంస యోగానందగారు 1924 నుంచి 1952లో ఆయన మహాసమాధి వరకు స్వయంగా అందించిన సూచనలన్ని చేర్చబడిన ఈ పుస్తకం ప్రచురణ కర్తకు తన రచనలు ప్రచురించడానికి సంబంధించిన అన్నిహక్కులూ కలిగి, వారిద్వారా తీసుకొని రాబడినది.

ఆర్డర్ చేయండి

ప్రసంగాలు మరియు వ్యాస సంకలనాలు

మానవుడి నిత్యాన్వేషణ

మానవుడి నిత్యాన్వేషణ

పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు వ్యాస సంకలనాలు అందించిన లోతైన విస్తృతమయిన గొప్ప ప్రేరణాత్మకము మరియు సార్వ జనీన సత్యాలను గురించిన కూలంకషమయిన చర్చ ఒక యోగి ఆత్మకథ ద్వారా లక్షలాది మందిని ఆకట్టుకున్నవి. ఈ మొదటి సంకలనంలో ధ్యానానికి సంబంధించి చాలామందికి తెలియని, తెలిసినా పూర్తిగా అర్థంకానట్టి విషయాల గురించి, మరణానంతర జీవితం, సృష్టి యొక్క స్వభావం, ఆరోగ్యం మరియు ఉపశమనం, మనస్సుకున్న అపరిమిత శక్తులు, ముఖ్యంగా మానవుడి నిత్యాన్వేషణ భగవంతుణ్ణి తెలుసుకోవడం ద్వారా మాత్రమే నెరవేరుతుందనే విషయాల గురించి విశ్లేషిస్తుంది.

ఆర్డర్ చేయండి

దివ్య ప్రణయం

దివ్య ప్రణయం

శ్రీ పరమహంస యోగానందగారి ప్రసంగాల, వ్యాస సంకలనాలలో రెండవది ఈ ‘దివ్య ప్రణయం’. దీనిలో ఎంపిక చేసి పొందుపరచిన వ్యాసాల్లో కొన్ని: దివ్యప్రేమను అలవరచుకోవడం ఎలా; రోగ నివారణ అందించే భౌతిక, మానసిక, అధ్యాత్మిక చికిత్సా పద్ధతుల సమన్వయం; సరిహద్ధులు లేని ప్రపంచం; మీ ప్రారబ్ధాన్ని నియంత్రించడం; మృత్యు భావనను, మర్త్య చైతన్యాన్ని అధిగమించే యోగకళ; విశ్వప్రేమికుడు; జీవితంలో ఆనందాన్ని కనుగొనడం.

ఆర్డర్ చేయండి

జర్నీ టు సెల్ఫ్-రియలైజేషన్

ఆత్మసాక్షాత్కారం వైపు ప్రయాణం

శ్రీ పరమహంస యోగానందగారి ప్రసంగాల, వ్యాస సంకలనంలో మూడవది: జర్నీ టు సెల్ఫ్-రియలైజేషన్. దీనిలో పొందుపరచిన ముఖ్య వ్యాసాల్లో శ్రీ యోగానందగారి విశిష్ట జ్ఞాన సంపద, కరుణ, సులభమైన వాస్తవిక మార్గదర్శకాలు మరియు డజన్ల కొద్ది మరెన్నో ఆకట్టుకునే విషయాలు: మనిషి పరిణామ క్రమాన్ని వేగవంతం చేయడం, నిత్య యవ్వనాన్ని ఎలా వ్యక్తీకరించాలి, భగవంతుణ్ణి నిత్యజీవితంలో ఎలా తెలుసుకోగలం అనేవి దీనిలో చెప్పబడ్డ కొన్ని ముఖ్య విషయాలు.

ఆర్డర్ చేయండి

పురాణాలపై వ్యాఖ్యానాలు

గాడ్ టాక్స్ విత్ అర్జున: భగవద్గీతపై యోగానందగారి వ్యాఖ్యానం.

గాడ్ టాక్స్ విత్ అర్జున: ది భగవద్గీత (God Talks With Arjuna: The Bhagavad Gita) — ఒక క్రొత్త వ్యాఖ్యానం మరియు అనువాదం

చిరస్మరణీయమైన, రెండు భాగాలుగా ప్రచురితమైన ఈ పుస్తకంలో శ్రీ పరమహంస యోగానందులు, భారతదేశానికి గర్వకారణమైన ఆధ్యాత్మిక గ్రంథంలోని అంతర్గత సారాన్ని విశదీకరించారు. భగవద్గీతలోని భౌతిక, అధ్యాత్మిక, ఆధిభౌతిక నిగూడార్థాల లోతులను విశ్లేషించి, ఈ ఆత్మజ్ఞానోదయ ప్రయాణంలో రాజశాస్త్రం ద్వారా భగవద్దర్శనం అనే విపులమైన, వివరణాత్మక ఉద్గ్రంథం అందించారు.

ఆర్డర్ చేయండి

ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్: జీసస్ బోధనలకు ఒక వివరణాత్మక వ్యాఖ్యానం

ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్: ద రిసరక్షన్ ఆఫ్ క్రైస్ట్ వితిన్ యూ (The Second Coming of Christ: The Resurrection of the Christ Within You) — జీసస్ బోధనలకు ఒక వివరణాత్మక వ్యాఖ్యానం

ఈ అపూర్వమైన ప్రేరణాత్మక 1700 పేజీల మహత్తరమైన రచనలో శ్రీ పరమహంస యోగానందగారు పాఠకులకు నాలుగు క్రీస్తు బోధనలలోని లోతైన వివేకాన్ని పరిచయం చేశారు. వాక్యం తరువాత వాక్యం వివరణతో సార్వజనీయమైన మార్గము ద్వారా భగవంతుణ్ణి చేరుకోవడానికి ఏసు క్రీస్తు ద్వారా ఆయన శిష్యులకు నేర్పబడినదే ఇది, కాని శతాబ్దాలుగా తప్పుడు వివరణతో మరుగునపడ్డ మార్గాన్ని ఆయన ఈ వ్యాఖ్యానంలో తిరిగి చూపించారు: “క్రీస్తులా మారడానికి ఏం చేయాలి, మన ఆత్మలోనే ఉన్న శాశ్వతమైన క్రీస్తును పునరుత్థానం చేయడమెలా.”

ఆర్డర్ చేయండి

ఆధ్యాత్మిక కవిత్వం

సాంగ్స్ ఆఫ్ ద సోల్: శ్రీ పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక కవితలు

సాంగ్స్ ఆఫ్ ద సోల్ (Songs of the Soul)

శ్రీ పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక కవితలు — భగవంతుని ప్రత్యక్షానుభూతిని ప్రకృతిలోని విలక్షణమైన అందాలలో, మనిషిలో, ప్రతిదినం కలిగే అనుభవాలలో, సమాధిలో పొందే ఆధ్యాత్మిక జాగృతిక స్థితి అవగాహనలో కవితా ప్రవాహంగా పెల్లుబికిన పాటల సంపుటి.

ఆర్డర్ చేయండి

విస్పర్స్-ఫ్రం-ఎటర్నిటీ

విస్పర్స్ ఫ్రం ఎటర్నిటీ (Whispers from Eternity)

పరమహంస యోగానందగారి ధ్యాన సమాధి స్థితిలో కలిగిన దివ్య అనుభవాలు మరియు ప్రార్థనలతో కూర్చబడిన సమాహారం. ఎంత చూసినా తరగని ఆ దేవుని అనంత దివ్య స్వభావాలను మరియు ఆయన్ని అన్వేషించే వారి ప్రార్థనకు ప్రతిస్పందన ఇచ్చే ఆ అనంత మధురిమనాస్వాదించి వాటిని తన మోహనకవనంలో మనోహరమైన లయలతో వ్యక్తం చేసిన దివ్య ప్రబంధం.

ఆర్డర్ చేయండి

శాస్త్రీయమైన స్వాస్థ్యకారక దివ్యసంకల్పాలు

శాస్త్రీయమైన స్వాస్థ్యకారక దివ్యసంకల్పాలు

ఈ పుస్తకంలో పరమహంస యోగానందగారు ‘ధృవీకరణల’ శాస్త్రీయతను గురించిన లోతైన వివరణ ఇస్తారు. ఈ ‘ధృవీకరణలు’ ఎలా పనిచేస్తాయో స్పష్టంగా తెలియజేయడమే కాకుండా మాటల యొక్క, మరియు ఆలోచనల యొక్క అపరిమిత శక్తిని మనం రోగ చికిత్సకు మాత్రమే కాకుండా మన జీవితంలోని ప్రతి దశలో కోరుకునే మార్పులను పొందడానికి ఎలా ఉపయోగించుకోవచ్చనేది తెలియజేస్తారు. ఎన్నో రకములైన ధృవీకరణలు ఇందులో చేర్చబడ్డాయి.

ఆర్డర్ చేయండి

ఇన్ ది శాంక్చుయరీ ఆఫ్ ది సోల్

ఇన్ ది శాంక్చుయరీ ఆఫ్ ది సోల్: ఎ గైడ్ టు ఎఫెక్టివ్ ప్రేయర్ (In the Sanctuary of the Soul: A Guide to Effective Prayer)

పరమహంస యోగానందగారి రచనల నుంచి సేకరించిన ప్రేరణాత్మక భక్తిభావాల సాహచర్యంలో ప్రతి రోజు చేసే ప్రార్థనలు మనకు అనునిత్యం ప్రేమను, శక్తిని మరియు మార్గదర్శకత్వాన్ని ఇస్తాయి.

ఆర్డర్ చేయండి

ధ్యానము మరియు క్రియాయోగం

మత విజ్ఞాన శాస్త్రము

మత విజ్ఞాన శాస్త్రము

ప్రతి మనిషిలోనూ వున్న ”అనివార్యమైన” ఒక కోరిక ఏమిటంటే బాధల నుండి విముక్తి మరియు అంతం లేని ఆనందం, అని పరమహంస యోగానందగారు చెప్పారు. ఈ కోరికలను ఎలా తృప్తి పరచాలి అనే విషయాన్ని వివరిస్తూ ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడే వివిధ విధానాల విశ్లేషణ ఉంటుంది.

ఆర్డర్ చేయండి

మెటాఫిజికల్ మెడిటేషన్స్

మెటాఫిజికల్ మెడిటేషన్స్ (Metaphysical Meditations)

ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళే 300కి పైగా ధ్యాన ప్రక్రియలు, ప్రార్థనలు మరియు ధృవీకరణాల ద్వారా మన ఆరోగ్యాన్ని, బలాన్ని, సృజనాత్మక శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని, ప్రశాంతతను పెంపొందించుకోవటానికి మరియు భగవత్సాన్నిధ్యమనే ఆనందకరమైన స్థితిలో పూర్తిగా మునిగిపోయి ఉన్న సంపూర్ణ అవగాహనలో జీవించడానికి ఉపయోగపడేవి.

ఆర్డర్ చేయండి

స్ఫూర్తిదాయకమైనవి

వెలుతురున్న చోట

వెలుతురున్న చోట: జీవితపు సవాళ్ళను ఎదుర్కొనే ప్రావీణ్యం, ప్రేరణ

పరమహంస యోగానందగారి రచనల నుంచి తీసుకొన్న ఆలోచనా మణుల సమాహారం. చదువరులు తమకు కలిగిన అనిశ్చితమైన సంక్షోభం నుంచి బయటపడటానికి లేదా నమ్మకమైన మార్గదర్శినిగా ఉపయోగపడే ఏకైక నిఘంటువు, లేదా నిత్య జీవితంలో నిత్యసత్యమైన భగవత్శక్తిని గూర్చిన అవగాహనను పెంపొందింపజేసే విశిష్ట గ్రంథం.

ఆర్డర్ చేయండి

పరమహంస యోగానందుల సూక్తులు

పరమహంస యోగానందుల సూక్తులు

ఆయన మార్గదర్శకత్వం కోసం వచ్చిన వాళ్ళకు శ్రీ పరమహంస యోగానంద ద్వారా ప్రేమతో మరియు నిజాయితీగా ఇవ్వబడిన వివేకమూ మరియు సూక్తుల సేకరణ. ఇవి ఆయన సన్నిహిత శిష్యులనేకమంది ద్వారా పొందు పరచబడినవి. ఈ పుస్తకంలోని సంఘటనలు, చదువరులకు గురువుగారితో వారికి కలిగిన స్వీయ అనుభూతులను పంచుకొనే అవకాశాన్ని కలిగిస్తాయి.

ఆర్డర్ చేయండి

ఆధ్యాత్మిక సలహాలు

ఇన్నర్ పీస్ - 2000 బెంజమిన్ ఫ్రాంక్లిన్ అవార్డు విజేత.

ఇన్నర్ పీస్: హౌ టు బి కామ్లీ ఆక్టివ్ అండ్ ఆక్టివ్లీ కామ్ (Inner Peace: How to Be Calmly Active and Actively Calm)

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి ప్రసంగాల నుంచి, రచనల నుంచి సేకరించబడిన ప్రేరణాత్మకము మరియు ఆచరణీయమైన మార్గదర్శకాల ద్వారా మనం ధ్యానంలో మనశ్శాంతిని పొందడం ద్వారా “చురుకుదనంలో ప్రశాంతత”ను మేళవించడం మరియు “ప్రశాంతతలో చురుకుదనం” అనుభవించడం — అంటే మన సహజ స్వభావమైన నిశ్చలత, సంతోషంతో ఉత్సాహకరమైన, సంతృప్తికరమైన మరియు సమతుల జీవనం చేయడం. ఇది ఆధిభౌతిక/ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతమైన గ్రంథంగా గుర్తింపబడి, 2000వ సంవత్సరంలో ‘బెంజమిన్ ఫ్రాంక్లిన్ బహుమతి’ని గెలుచుకున్న పుస్తకం.

ఆర్డర్ చేయండి

సఫలతా నియమం

సఫలతా నియమం

ప్రతి మనిషి జీవిత లక్ష్యాలను సాధించడానికి కావలసిన శక్తివంతమైన నియమాలు ఏమిటో వివరించేది మరియు విజయం, సఫలత కోసం పాటించవలసిన సార్వజనీయమైన సూత్రాలు వివరించబడ్డాయి — వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు ఆధ్యాత్మిక జీవనంలో లక్ష్యాల సారాంశం.

ఆర్డర్ చేయండి

దేవుడితో మాట్లాడ్డం ఎలా

దేవుడితో మాట్లాడ్డం ఎలా

భగవంతుణ్ణి ఒక అతీంద్రియ శక్తిగానూ, సార్వజనీయమైన దివ్యాత్మగానూ నిర్వచిస్తూ ఆయనే మనకు ఆప్త మిత్రుడు, తల్లి, తండ్రి మరియు ప్రేమికుడు అంటూ శ్రీ పరమహంస యోగానంద మనందరికి ప్రభువైన ఆ భగవంతుడు మనకెంత దగ్గరగా ఉన్నాడో, ఆయన మౌన వ్రతాన్ని భగ్నం జేసి మనతో మాట్లాడేలా చేయడమెలాగో, మన ప్రార్థనలకు అర్థమయ్యే రీతిలో ఆయన నుండి సమాధానం ఎలా వస్తుందో వివరిస్తారు.

ఆర్డర్ చేయండి

కీర్తనలు మరియు భక్తి పాటలు

కాస్మిక్ ఛాంట్స్: భగవంతుని అనుసంధానం కోసం ఆధ్యాత్మిక గీతాలు.

కాస్మిక్ ఛాంట్స్ (Cosmic Chants): భగవంతుని అనుసంధానం కోసం ఆధ్యాత్మిక గీతాలు

అరవై భక్తి గానాలకు మాటలు, సంగీతంతో పాటు ఆధ్యాత్మిక కీర్తనలు భగవంతునితో అనుసంధానానికి ఎలా దారితీస్తాయో అనే పరిచయ వివరణ ఇచ్చారు.

ఆర్డర్ చేయండి

పరమహంస యోగానందగారి ఆడియో రికార్డులు

మా ఆన్‌లైన్ బుక్‌స్టోర్ (Bookstore)ను సందర్శించండి. మీకు యోగదా సత్సంగ సొసైటీ వారి మొత్తం ప్రచురణలు మరియు ఆడియో/వీడియో రికార్డింగుల వివరాలు లభిస్తాయి.

ఇతరులతో పంచుకోండి