ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని ఎదుర్కోవడంలో మీకు సహాయం చేయడానికి మా వెబ్‌సైట్ లోని వనరులు

28 మార్చి, 2020

ప్రస్తుత క్లిష్ట ప్రపంచ పరిస్థితులలో పరమహంస యోగానందగారి ఆశ్రమాలలో ఉన్న మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ఆధ్యాత్మిక కుటుంబం మరియు మొత్తం మానవాళి సంక్షేమం గురించి గాఢంగా చింతిస్తున్నాము. అన్నిటినీ మించి, ఎన్నడూ విఫలమవ్వని, రక్షణ మరియు భరోసాను కలిగించే, ఆంతరిక మూలాధారం వైపు మళ్లేలా మేము మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాము. ఈ సమయంలోగాని లేదా మరేదైనా అవసరమైన సమయంలోనైనా మీ ప్రయత్నాలలో సహాయపడటానికి ఇక్కడ కొన్ని ఆన్‌లైన్ వనరులు ఉన్నాయి. రాబోయే వారాల్లో మరిన్ని విషయాలతో మేము ఈ జాబితాను నవీకరిస్తాము.

స్వామి చిదానంద గిరి గారి సందేశాలు

“సంక్షోభమా లేదా ఆధ్యాత్మిక అవకాశమా?” అనే ఈ సందేశంలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ద్వారా ఎదురవుతున్న సవాళ్లను మనమందరం శ్రేష్టమైన రీతిలో ఎలా ఎదుర్కోవచ్చో మార్గనిర్దేశం చేస్తున్నారు.

ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై స్వామి చిదానందగారు మార్చి 14వ తేదీన ఒక వీడియోను విడుదల చేశారు, దీనిలో ఈ కష్ట సమయాలను ఎదుర్కోవడానికి ప్రోత్సాహం మరియు ఆచరణాత్మక మార్గదర్శకత్వంతో కూడిన సందేశాన్ని అందించారు, మరియు నిర్దేశిత ధ్యానం, ప్రార్థనను ఆయన నిర్వహించారు.

వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం

Online Dhyan yoga Kendra

మీరు భారతదేశంలో ఉన్నా లేదా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు, మండళ్ళు మరియు ఏకాంత ధ్యాన వాసాలలో నిర్వహించే ప్రత్యక్ష సామూహిక ధ్యానాల అనుభవాన్ని వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం ప్రతి ఒక్కరికీ కలుగజేస్తోంది. ఈ ధ్యానాలను వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహిస్తున్నారు. దైవంతో మరియు ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబానికి చెందిన భక్తులు మరియు సాధకులతో సంబంధాన్ని కలిపే అవకాశము ఉన్న ఈ శక్తివంతమైన విధానంలో పాల్గొంటున్న వేలాది మందితో చేరాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

பாரா-ஆபரணம்

ప్రతివారం ఆన్‌లైన్ స్ఫూర్తిదాయక సత్సంగాలు

ప్రస్తుతం మేము వై.ఎస్.ఎస్. లేదా ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసుల నేతృత్వంలో ప్రతి వారం కొత్త ఆన్‌లైన్ స్ఫూర్తిదాయక సత్సంగాన్ని అందిస్తున్నాము. ధ్యానం, కీర్తన గానం మరియు పరమహంస యోగానందగారి బోధనలపై ఉపన్యాసంతో కూడి ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ ప్రతివారం నిర్వహించబడే సత్సంగాల ద్వారా మీరు పరమహంస యోగానందగారి ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబీకులతో దివ్య సహవాసం చేయవచ్చు.

దయచేసి గమనించండి: మేము ఈ ఆన్‌లైన్ స్ఫూర్తిదాయకమైన సేవలను మా వెబ్‌సైట్‌లోని “వీక్లీ & స్పెషల్ సర్వీసెస్” విభాగంలో భద్రపరుస్తాము.

பாரா-ஆபரணம்

పరమహంస యోగానందగారి జ్ఞాన వారసత్వం నుండి చదవడానికి సిఫార్సు చేయబడినవి

వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌ లోని “జ్ఞానంతో జీవించడం ఎలా”

ఈ-బుక్స్

Where there is Light

వెలుతురున్న చోట: ప్రత్యేకించి అధ్యాయం 2, “ప్రతికూల సమయాల్లో ధైర్యంగా ఉండడం”; అధ్యాయం 3, “ధ్యానించడం నేర్చుకోండి”; మరియు అధ్యాయం 4, “బాధను అధిగమించడం”

Man's Eternal Quest

మానవుడి నిత్యాన్వేషణ: ప్రత్యేకించి “మనస్సులోంచి భయాన్ని తొలగించడం” అనే అధ్యాయం

பாரா-ஆபரணம்

మీ ఆంతరిక దివ్యత్వంతో అనుసంధానం పొందడానికి నిర్దేశిత ధ్యానాలు

Dhyana and meditation yoga under open sky

“నిర్భయంగా జీవించడం” మరియు “శాంతి” వంటి విభిన్న అంశాలపై అనేక నిర్దేశిత ధ్యానాలను మా వెబ్‌సైట్ అందిస్తుంది. ప్రతి ధ్యానాన్ని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సన్యాసులు నిర్వహిస్తారు.

பாரா-ஆபரணம்

ప్రార్థన మరియు ప్రతిజ్ఞల యొక్క శక్తి

మా వెబ్‌సైట్లో ఒక విభాగాన్ని మొత్తం ప్రార్థన మరియు ప్రతిజ్ఞల యొక్క శక్తిని తెలపడం కోసం అర్పించచబడింది, వీటిలో:

பாரா-ஆபரணம்

ప్రార్థనను అభ్యర్థించండి

Offering flower prayer request

ఆవశ్యకమైన వ్యక్తుల కోసం, ప్రార్థనల కోసం అభ్యర్థనలను సమర్పించమని కూడా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులతో కూడిన మరియు వై.ఎస్.ఎస్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి నేతృత్వంలోని యోగదా సత్సంగ సొసైటీ ప్రార్థన మండలి యొక్క రోజువారీ ప్రార్థనలలో ఇవి చేర్చబడతాయి. ఈ ప్రార్థన మండలి ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం ఇతరుల కోసం గాఢంగా ధ్యానం చేసి, ప్రార్థిస్తుంది మరియు పరమహంస యోగానందగారు సాధన చేసిన మరియు బోధించిన స్వస్థతా ప్రక్రియను నిర్వహిస్తుంది.

பாரா-ஆபரணம்

వై.ఎస్.ఎస్. కార్యకలాపాల గురించి వార్తలు మరియు ప్రకటనలు

వై.ఎస్.ఎస్. కార్యకలాపాలకు సంబంధించిన తాజా పరిణామాల గురించి మేము మీకు నిరంతరంగా తెలియజేస్తాము. మీ ఇన్‌బాక్స్‌లో ముఖ్యమైన వార్తల గురించి నెలవారీ ప్రేరణ మరియు సమయానుకూల నోటిఫికేషన్‌లను స్వీకరించడానికి మా వార్తా లేఖకు (న్యూస్ లెటర్) సబ్ స్క్రైబ్ చేయాలని కూడా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

ఇతరులతో పంచుకోండి