సన్యాసుల పర్యటనలు మరియు క్రియాయోగ దీక్ష వేడుకలు

2024 సంవత్సరానికి ప్రణాళిక చేయబడిన, వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే వివిధ కార్యక్రమాలు: ‘సంగమం’లు, ఏకాంత ధ్యాన వాసాలు మరియు పర్యటన కార్యక్రమాలను గురించి ఎంతో ఆనందంతో మేము మీకు తెలియజేస్తున్నాము. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

యోగానందగారి బోధనల మీద సత్సంగంపరమహంస యోగానందగారి ఆత్మ-విముక్తి బోధనల పట్ల నిరంతరం పెరుగుతున్న ఆసక్తిని తీర్చడంలో సహాయం చేయడానికి, ప్రతి సంవత్సరం యోగదా సత్సంగ సొసైటీకి చెందిన సన్యాసులు దేశవ్యాప్తంగా ఉన్న నగరాలను సందర్శిస్తారు. వారాంతపు ఏకాంత ధ్యాన వాసాలు మరియు పరమహంస యోగానందగారి “జీవించడం ఎలా” బోధనలపై తరగతులు, వై.ఎస్.ఎస్. యోగ ప్రక్రియల సమీక్ష, సామూహిక ధ్యాన కార్యక్రమాలు, కీర్తనలు, దృశ్య, శ్రవణ సంబంధిత ప్రదర్శనలు మరియు క్రియాయోగ దీక్షా వేడుకలతో కూడిన వివిధ స్ఫూర్తివంతమైన కార్యక్రమాలను వారు నిర్వహిస్తారు.

ప్రసంగిస్తున్న స్వామి స్మరణానందపర్యటనలలో చేసే ప్రసంగాలు, పరమహంస యోగానందగారి బోధనలపై కొత్తవారికి పరిచయాన్ని మరియు పాఠాల విద్యార్థులకు వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియల్లో లోతైన మార్గదర్శకత్వాన్ని కలుగజేస్తాయి. సభ్యుల కార్యక్రమాలు మరియు ప్రాంతీయ ఏకాంత ధ్యాన వాసాలలో వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలపై తరగతులు నిర్వహించబడతాయి మరియు సామూహిక ధ్యానానికి మరియు సత్సంగానికి అవకాశాలను కలిగిస్తాయి. ఈ కార్యక్రమాలలో పరమహంస యోగానందగారి బోధనలలోని అనేక ఇతర ముఖ్యమైన అంశాలు కూడా పొందుపరచబడి ఉంటాయి, అవి:

  • దైనందిన జీవితంలో ధ్యానం యొక్క ప్రాముఖ్యత
  • జీవితాన్ని మరింత సామరస్యంగా గడపడం ఎలా
  • అంతరంగ ఆవశ్యకతలను బాహ్యమైన అవసరాలతో సంతులనం చేసే విధానం నేర్చుకోవడం

అంతరంగంలో శాంతి మందిరాన్ని నిర్మించుకోవడానికి స్ఫూర్తినిస్తూ మన గురుదేవులు ఇలా అన్నారు: “మీ మనస్సు యొక్క ప్రధాన ద్వారం వెనుక ఉన్న నిశ్శబ్దంలో ఎంత ఆనందం నిరీక్షిస్తూ ఉందో ఏ మానవ జిహ్వ కూడా వర్ణించలేదు. కానీ మీరు ధ్యానం చేసి ఆ వాతావరణం సృష్టించుకోవాలి. గాఢంగా ధ్యానం చేసేవారు అద్భుతమైన అంతరంగ నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు.” ఈ విధులు దైనందిన జీవితంలో నిరంతర కార్యకలాపాల నుండి తమ దృష్టిని ఉపసంహరించుకోవడానికి మరియు అంతరంగ నిశ్శబ్దంపై దృష్టిని కేంద్రీకరించడానికి, శ్రద్ధ కలిగిన సాధకులకు అద్భుతమైన అవకాశాన్ని కలుగజేస్తాయి. తద్ద్వారా భగవంతుని శాంతి మరియు ఆనందం యొక్క అమృతాన్ని గ్రోలడం సాధ్యమవుతుంది.

జనవరి — డిసెంబర్ 2024 మధ్య జరిగే సన్యాసుల పర్యటనల వివరాల కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

జనవరి – డిసెంబర్ 2024 మధ్య జరుగబోయే సన్యాసుల పర్యటనలు

రాష్ట్రం

తేదీ

ప్రాంతం

కార్యక్రమ స్వరూపం

ఆంధ్రప్రదేశ్

ఫిబ్రవరి 8

పిఠాపురం

ఒక-రోజు కార్యక్రమం

ఫిబ్రవరి 11

గుంటూరు

ఒక-రోజు కార్యక్రమం

డిసెంబర్ 13-15

కాకినాడ

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

అస్సాం

ఏప్రిల్ 6-7

గౌహతి

రెండు-రోజు కార్యక్రమం

బీహార్

ఫిబ్రవరి 10-11

దరౌండ

రెండు-రోజు కార్యక్రమం

గుజరాత్

ఫిబ్రవరి 18

విజాపూర్

ఒక-రోజు కార్యక్రమం

ఫిబ్రవరి 21

పోర్బందర్

ఒక-రోజు కార్యక్రమం

ఫిబ్రవరి 25

భావ్‌నగర్

ఒక-రోజు కార్యక్రమం

సెప్టెంబర్ 20-22

వడోదర

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

హిమాచల్ ప్రదేశ్

జూలై 26-28

సోలన్

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

ఆగస్టు 31-సెప్టెంబర్ 1

పాలంపూర్

రెండు-రోజు కార్యక్రమం

జమ్మూ

నవంబర్ 22-24

జమ్మూ

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

కర్ణాటక

మార్చి 3

అర్సికెరె

ఒక-రోజు కార్యక్రమం

మార్చి 7

బైల్‌హోంగల్

ఒక-రోజు కార్యక్రమం

ఆగస్టు 10-11

ధార్వాడ్

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

కేరళ

ఫిబ్రవరి 25

కొచ్చిన్

ఒక-రోజు కార్యక్రమం

ఫిబ్రవరి 28

కన్నూర్

ఒక-రోజు కార్యక్రమం

మధ్యప్రదేశ్

నవంబర్ 29-డిసెంబర్ 1

జబల్పూర్

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

డిసెంబర్ 4

ఇండోర్

ఒక-రోజు కార్యక్రమం

మహారాష్ట్ర

మార్చి 10

నాసిక్

ఒక-రోజు కార్యక్రమం

మార్చి 1-3

ముంబై

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

డిసెంబర్ 1

చంద్రపూర్

ఒక-రోజు కార్యక్రమం

ఒడిషా

ఫిబ్రవరి 23-25

భువనేశ్వర్

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

డిసెంబర్ 6-8

పూరి

ఏకాంత ధ్యాన వాసం (ఒడియా)

డిసెంబర్ 13-15

పూరి

ఏకాంత ధ్యాన వాసం (ఇంగ్లీష్)

పంజాబ్

సెప్టెంబర్ 5

అమృత్‌సర్

ఒక-రోజు కార్యక్రమం

రాజస్థాన్

ఫిబ్రవరి 3-4

అజ్మీర్

రెండు-రోజు కార్యక్రమం

ఫిబ్రవరి 7

సూరన

ఒక-రోజు కార్యక్రమం

ఫిబ్రవరి 10-11

ఉదయపూర్

రెండు-రోజు కార్యక్రమం

సెప్టెంబర్ 27-29

జైపూర్

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

తమిళనాడు

జూలై 26-28

సేలం

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

ఆగస్టు 2-4

తిరుచిరాపల్లి

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

ఆగస్టు 7

తిరుతురైపూండి

ఒక-రోజు కార్యక్రమం

తెలంగాణ

ఫిబ్రవరి 4

వరంగల్

ఒక-రోజు కార్యక్రమం

డిసెంబర్ 20-22

హైదరాబాద్

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

ఉత్తర ప్రదేశ్

జనవరి 5-7

బరేలీ

ధ్యాన మందిరం ప్రారంభోత్సవంతో

క్రియాయోగ దీక్ష కార్యక్రమం

మార్చి 3

గోరఖ్‌పూర్

ఒక-రోజు కార్యక్రమం

మార్చి 7

వారణాసి

ఒక-రోజు కార్యక్రమం

సెప్టెంబర్ 6-8

ఆగ్రా

క్రియాయోగ దీక్షతో కూడి ఉంటుంది

ఉత్తరాఖండ్

మార్చి 10

హరిద్వార్

ఒక-రోజు కార్యక్రమం

పశ్చిమ బెంగాల్

జనవరి 1-5

దక్షిణేశ్వర్

జన్మోత్సవం వేడుకలతో

క్రియాయోగ దీక్ష కార్యక్రమం

మార్చి 31

సిలిగురి

ఒక-రోజు కార్యక్రమం

నవంబర్ 22-24

దిహికా

ఏకాంత ధ్యాన వాసం (బెంగాలీ)

రాబోవు కార్యక్రమాలు

ఇతరులతో పంచుకోండి