యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం, ద్వారహాట్

యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం, ద్వారహాట్ (ఉత్తరాఖండ్)

ద్వారహాట్ – 263653, అల్మోరా జిల్లా, ఉత్తరాఖండ్
ఫోన్లు: +91 9756082167, +91 9411708541
కాల్ సమయం: 8:30 a.m – 4:30 p.m
ఇ-మెయిల్: yssdwtaccom@gmail.com 

వెబ్‌సైట్ లింక్: https://dwarahat.yssashram.org

ద్వారహాట్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కుమవోన్ ప్రాంతంలో అల్మోరా జిల్లాలోని ఒక చిన్న పట్టణం. దీని సగటు ఎత్తు 5000 అడుగులు (1500 మీ). సంవత్సరం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది మరీ ముఖ్యముగా శీతాకాలంలో (నవంబర్-ఫిబ్రవరి) చల్లగా ఉంటుంది.
వై.ఎస్.ఎస్. ఆశ్రమం ద్వారహాట్ పట్టణం నుండి 1.5 కి.మీ దూరంలో మరియు అన్ని వైపులా దేవదారు వృక్షాల అడవిచే చుట్టబడి ఉంది. పట్టణం నుండి ఆశ్రమానికి వెళ్ళే మార్గంలో, కుడి వైపున ప్రభుత్వ విశ్రాంతి భవనం ఉంది. 1963-64లో వై.ఎస్.ఎస్. ఆశ్రమం నిర్మాణం కానందున గుహను సందర్శించిన సమయంలో శ్రీ దయామాతగారు అక్కడే బస చేశారు.

మహావతార్ బాబాజీ గుహ

గుహ యొక్క చారిత్రక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, భక్తులు ఒక యోగి ఆత్మకథలోని 34వ అధ్యాయం “హిమాలయాల్లో మహాభవన సృష్టి” మరియు శ్రీ శ్రీ దయామాతగగారి ప్రేమ మాత్రమేలోని “మహావతార్ బాబాజీ ఆశీస్సులు” చదవాలని సూచించడమైనది.

బాబాజీ గుహ ఉన్న ఈ ప్రాంతంలోనే 1861లో బాబాజీ లాహిరీ మహాశయులకు దీక్ష ఇచ్చారు మరియు ఈ ద్వాపర యుగంలో క్రియాయోగం యొక్క జన్మస్థానం. ప్రపంచంలోని క్రియావంతులందరు వారి పరంపరను ఈ ఆనవాళ్లతో గుర్తించగలరు. (2011 – క్రియాయోగం యొక్క 150వ వార్షికోత్సవం)

గుహ పాండుఖోలి పర్వతంపై కుకుచినా (ద్వారహాట్ నుండి 25 కి.మీ.) గ్రామానికి అవతల ఉంది.

గుహకు చేరుకునే పర్వత మార్గం పునరుద్ధరించబడింది. గుహ దగ్గరకు ఎక్కడానికి సాధారణంగా సగటు వ్యక్తికి ఒక గంట సమయం పడుతుంది. వర్షాల సమయంలో, ఒక యోగి ఆత్మకథలో పేర్కొన్న గగాస్ నదికి నీరు అందించే కొన్ని ప్రవాహాలు ఉన్నాయి.

ఆశ్రమం నుండి గుహకు మరియు గుహ నుండి ఆశ్రమానికి తిరిగి చేరుకోవడానికి దాదాపుగా ఆరు నుండి ఎనిమిది గంటలు పడుతుంది.

మరిన్ని వివరాల కోసం దయచేసి ద్వారహాట్ ఆశ్రమాన్ని సంప్రదించండి.

మహావతార్ బాబాజీ గుహ, ఉత్తరాఖండ్

వసతి

పాఠాలలో బోధించిన విధంగా రోజువారీ ధ్యానాన్ని అభ్యసించే వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల విద్యార్థులు ఆశ్రమంలోని దినచర్యలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక పునరుద్ధరణ కోసం ఆశ్రమంలో ఉండడానికి ఆహ్వానితులు. 

విధులు మరియు కార్యకలాపాలు

ప్రతి సంవత్సరం ఆశ్రమం 2 వైద్య శిబిరాలు (ఏప్రిల్ మరియు నవంబర్) నిర్వహిస్తుంది. మార్చిలో నిర్వహించే రిట్రీట్, సెప్టెంబర్ 26-30 తేదీలలో క్రియాయోగ దీక్షతో సాధన సంగమం జరుగుతుంది. జులై 25వ తేదీ మహావతార్ బాబాజీ స్మృతి దినం సందర్భంగా బాబాజీ గుహ వరకు ఊరేగింపు జరుగుతుంది మరియు జనవరి 5వ తేదీ గురుదేవుల జన్మదినం సందర్భముగా ఉదయం వై.ఎస్.ఎస్. ద్వారహాట్ స్కూల్ విద్యార్థులు మరియు భక్తులతో ఊరేగింపు, సాయంత్రం స్థానిక ప్రజలచే భజన మరియు రాత్రికి స్మారక సేవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

వైద్య శిబిరాలలో పాల్గొనడానికి వైద్యులు మరియు వై.ఎస్.ఎస్. వాలంటీర్లు ఆహ్వానితులు. ఆసక్తి గల భక్తులు ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా ద్వారహాట్ ఇన్‌చార్జ్ స్వామీజీని సంప్రదించవచ్చు.

ఇతరులతో పంచుకోండి