యోగదా సత్సంగ

ఆత్మ-సాక్షాత్కార బోధనలు

మీ జీవితాన్ని మార్చడానికి,
సమతుల్యతను సాధించటానికి
పవిత్ర క్రియాయోగ ధ్యాన శాస్త్రాన్ని నేర్చుకోండి.

Devotee reading YSS Lesson in self-realization

ఈ బాటలో మీ పయనాన్ని మొదలుపెట్టండి

దైవంతో మీ అనుబంధాన్ని మేల్కొల్పడం ద్వారా సమతుల్యమైన, విజయవంతమైన జీవితాన్ని ఎలా గడపాలో వై.ఎస్.ఎస్. పాఠాలు మీకు నేర్పుతాయి

మీరు వెతుకుతున్నది మీలోనే ఉంది

దైనందిన జీవితంలోని సమస్యలు, ఒత్తిళ్లలో మునిగిపోవడం, ఇతరులు, సమాజం మనపై ఉంచిన అంచనాల నుండి దూరంగా, విరక్తితో ఉండటం సులభం. కానీ శాశ్వతమైన శాంతి, భద్రత, సంతోషాలకు అవసరమైనవన్నీ మీలో ఇప్పటికే ఉన్నాయి.

ఈ దాగి ఉన్న బావిబుగ్గలోకి ప్రవేశించడానికి, మీరు చేయాల్సిందల్లా యోగా యొక్క శాస్త్రీయ మరియు సార్వత్రిక మార్గాన్ని అనుసరించి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా రోజువారీ ధ్యాన అభ్యాసాన్ని పెంపొందించుకోవడం.

మీరు మీ లోతైన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలను పొందవచ్చు. శాశ్వతమైన ఆనందాన్ని పెంపొందించుకోవచ్చు

జీవితం గురించిన మీ ప్రశ్నలకు సమాధానాలు మరియు శాశ్వతమైన ఆనందం, నిజమైన సార్థకత మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆధ్యాత్మిక మార్గంలో అంచెలంచెలుగా ఎడుగుతుండడాన్ని మీరు రోజువారీ అనుభూతి చెందుతారు.

ధ్యానం అత్యున్నత ప్రజాదరణ పొందింది. ధ్యానం ద్వారా కలిగే అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. రోజువారీ అభ్యాసం మీ జీవితాన్ని ఎంతో సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. కానీ ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యం వీటన్నిటికంటే చాలా గొప్పది.

ధ్యానం అనేది మీ ఆనంద చైతన్యానికి ద్వారం

ధ్యానాన్ని శాస్త్రీయంగా ఆచరించినప్పుడు, మీరు మీ మనస్సు, శ్వాస మరియు హృదయాలను శాంతపరచవచ్చు. మీలోని శక్తులను చైతన్యవంతం చెయ్యవచ్చు. అక్కడ మీరు ఆత్మానందాన్ని, ఏకత్వాన్ని గ్రహించవచ్చు.

ఈ ఆత్మావగాహన జీవన్మరణ పరిమితుల భావాన్ని తొలగిస్తుంది. గొప్ప ఆనందాన్ని మాత్రమే కాకుండా, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ శాంతి, జ్ఞానం మరియు ప్రేమను కూడా అందిస్తుంది. ఇది ప్రాచీన కాలం నుండి యోగులచే సాక్షాత్కరింపబడిన, ఇప్పుడు మనందరికీ అందుబాటులో ఉన్న స్థితి.

మీ వ్యక్తిగత సమస్యలను లేదా జీవిత రహస్యాన్ని అర్థం చేసుకుని, సార్వత్రిక మానవ సమస్యలను నిజంగా పరిష్కరించాలనే తృష్ణ ఉన్నవారిలో మీరు ఒకరయితే, భారతదేశంలో అనాది కాలం నుండి ప్రకాశించే జ్ఞానులు మరియు ఋషులచే అందించబడిన యోగాదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్) వారి శాస్త్రీయ ఆధ్యాత్మిక బోధనలను అభ్యసించి, అనుసరించండి. అందులో మీరు తప్పక సమాధానాలు కనుగొంటారు.

— పరమహంస యోగానంద

మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని మార్చే ప్రగతిశీల గృహ-అధ్యయన కార్యక్రమం

వై.ఎస్.ఎస్. పాఠాలు మీ జీవితంలోని అన్ని అంశాలను మెరుగుపరిచే, మార్చే పవిత్రమైన జ్ఞాన ప్రసారం: ధ్యాన పద్ధతులను బోధించే ప్రగతిశీల, గృహ-అధ్యయన కార్యక్రమం, ప్రఖ్యాత యోగా మాస్టర్ల పరంపర ద్వారా అందించబడిన ఆధ్యాత్మిక సారాంశం — మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, స్వామి శ్రీయుక్తేశ్వర్, మరియు పరమహంస యోగానంద — మరియు మీకు అందుబాటులో ఉన్న గురువులు.

paramahansa-yogananda-for-lessons-page

మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఎంత దూరం వెళ్ళాలనుకుంటే అంతవరకు, నేను మీకు దారి చూపించగలను. మీరు పాఠాలలోని మెళకువలను సాధన చేస్తే, మీ పురోగతిలో మీరు ఎప్పటికీ స్తబ్దతను అనుభవించరు.

— పరమహంస యోగానంద

మీరు ప్రాచీన క్రియాయోగ ధ్యాన పద్ధతులను నేర్చుకుంటారు

ఈ పాఠాలు పరమహంస యోగానందగారిచే బోధింపబడినవి. ఆయన బోధనలలో ప్రధానమైనది ధ్యాన పద్ధతుల యొక్క శక్తివంతమైన వ్యవస్థ: క్రియాయోగా ధ్యాన శాస్త్రం. ఒక యోగి ఆత్మకథ మరియు ఆయన ఇతర పుస్తకాల ద్వారా మిలియన్ల ప్రజలకు పరిచయం చేయబడిన ఈ ప్రాచీన ఆత్మ శాస్త్రం—అధిక ఆధ్యాత్మిక స్పృహను మరియు దైవిక సాక్షాత్కారం యొక్క అంతర్గత ఆనందాన్ని మేల్కొల్పడానికి శక్తివంతమైన పద్ధతులను అందిస్తుంది.

మొదటి పాఠంలోనే మీరు ధ్యానం యొక్క ప్రయోజనాలను వెంటనే అనుభవించే ఖచ్చితమైన పద్ధతులను పొందుతారు.

లోతైన ధ్యానం కోసం బలమైన పునాదిని నిర్మించే క్రమంలో, క్రియాయోగ యొక్క సమగ్ర ఆధ్యాత్మిక శాస్త్రంలో అవసరమైన మొదటి దశలుగా పరమహంస యోగానందగారు బోధించిన మూడు శక్తివంతమైన పద్ధతులను మీరు నేర్చుకుంటారు. అవి:

శక్తి పూరణ వ్యాయామాలు

పరమహంస యోగానందగారు అభివృద్ధి చేసిన సరిక్రొత్త శక్తిని కూర్చే వ్యాయామాల శ్రేణి విశ్వ చైతన్యం నుండి శరీరంలోకి స్పృహతో శక్తిని పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ జీవ-శక్తి నియంత్రణా మెళకువ (టెక్నిక్) శరీరాన్ని శుద్ధి చేసి బలపరచడమే కాక ధ్యానం కోసం శరీరాన్ని సిద్ధం చేస్తుంది. స్పృహతో ఉన్నత స్థితికి చేరుకోవడానికి శక్తిని లోపలికి మళ్లించడం సులభం చేస్తుంది. నియమిత అభ్యాసం మానసిక, శారీరక విశ్రాంతిని కూడా ఇస్తుంది. మనలో అద్భుతమైన సంకల్ప శక్తిని అభివృద్ధి చేస్తుంది.

ఏకాగ్రత కోసం హాంగ్-సా ప్రక్రియ

ఈ పురాతన మరియు శక్తివంతమైన మెళకువ, మనస్సులోని ఏకాగ్రత యొక్క గుప్త శక్తులను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. క్రమమైన అభ్యాసం ద్వారా బాహ్య విషయాల నుండి ఆలోచనలను, శక్తిని ఉపసంహరించుకోవడం నేర్చుకుంటారు. తద్ద్వారా వారు ఏదైనా లక్ష్య సాధనపై, లేదా సమస్య పరిష్కరంపై దృష్టి పెట్టవచ్చు. విజయవంతమైన అభ్యాసం వల్ల కలిగే ఏకాగ్ర దృష్టిని మీ లోపల ఉన్న దైవిక స్పృహను గ్రహించడం వైపు మళ్లించవచ్చు.

‘ఓం’ ధ్యాన ప్రక్రియ

మునుపటి పద్ధతుల అభ్యాసం ద్వారా, శరీరానికి విశ్రాంతినివ్వడం, మనస్సును కేంద్రీకరించడం, సాధకుడు నేర్చుకున్న తర్వాత, ఈ అధునాతన ధ్యాన సాధన, మన అవగాహనను/స్పృహను శరీరం, మనస్సు అనే పరిమితులను దాటి మనలో అనంతమైన సామర్థ్యం, ఆనందాల సాక్షాత్కారం వైపుకి విస్తరిస్తుంది.

క్రియాయోగాను పొందడం

ఆధ్యాత్మిక స్పృహను కోరుకునే అన్వేషకులందరూ—తమ మతపరమైన అనుబంధంతో సంబంధం లేకుండా—వై.ఎస్.ఎస్. ప్రాథమిక పాఠ్య క్రమాన్ని, పద్ధతులను పొందగలరు. మొదటి ఎనిమిది నెలల లెసన్స్ స్టడీలో ఈ మూడు ప్రాథమిక పద్ధతులను నేర్చుకుని, సాధన చేసిన తర్వాత, కోరుకునే వారు క్రియాయోగ దీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. క్రియాయోగ దీక్ష ఈ మార్గం పట్ల లోతైన నిబద్ధతను కలిగి ఉంటుంది. ప్రాథమిక పాఠాలను అధ్యయనం, అభ్యాసం చేయడం ద్వారా మీరు ఆ నిబద్ధతతో ఉండాలనుకుంటున్నారో లేదో నిర్ణయించడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఎవరైనా క్రియాయోగాను స్వీకరించాలని నిర్ణయించుకున్నా, తీసుకోకున్నా, ప్రాథమిక పాఠాల శ్రేణిలో బోధించిన పద్ధతులను ఆచరించడంలో శ్రద్ధగల వారందరూ తమకు తాముగా గొప్ప ఫలితాన్నిచ్చే ధ్యాన అభ్యాసాన్ని అలవరచుకోగలరు. క్రియాయోగ అత్యంత వేగవంతమైన, అత్యంత ప్రభావవంతమైన పద్ధతి అయినప్పటికీ, పైన పేర్కొన్న ప్రాథమిక పద్ధతుల ద్వారా అత్యున్నత దైవిక స్పృహను పొందవచ్చని పరమహంస యోగానందగారు ఇచ్చిన హామీని వారు స్వయంగా నిర్దారించుకోగలుగుతారు.

మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రేరేపించడంలో, మీ కష్టాలను అధిగమించడంలో మీకు సహాయపడే అంశాలు

ఈ అధ్యయనాలను ఉపయోగించడం, క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల మీరు మీ సమస్యలకు సమాధానాలను, అనంతమైన ఆనందాన్ని పొందుతారు. మాటలతో సంతృప్తి చెందకండి. సత్యం యొక్క వాస్తవ అనుభవాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని పొందండి!

— పరమహంస యోగానంద

  • ఆత్మ-సాక్షాత్కారానికి, భగవంతుని-సాంగత్యాన్ని అనుభవించడానికి క్రమక్రమంగా ఉన్నతిని కలిగించే వై.ఎస్.ఎస్. ధ్యాన యోగా పద్ధతులను స్వీకరించండి.
  • వై.ఎస్.ఎస్. సన్న్యాసులతో వ్యక్తిగత అనుబంధం మరియు మార్గదర్శకత్వం నుండి ప్రయోజనం పొందండి. మీ అభ్యాసం, పాఠాలు, ధ్యాన పద్ధతుల గురించి మీ ప్రశ్నలకు సమాధానాలను పొందండి.
  • మీ జీవితంలోని వివిధ సమస్యలను పరిష్కరించుకోవడానికి “జీవించడం ఎలా” అనే ఆచరణాత్మక జ్ఞానాన్ని వర్తింపజేయండి. మీ ఉనికిలోని ప్రతి ప్రాంతంలో సామరస్యాన్ని మరియు విజయాన్ని సృష్టించండి.
  • మీ స్వీయ-అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక పురోగతి కోసం మీరు ధ్యాన సాధన ద్వారా సాధించిన ఏకాగ్రతను, సంకల్ప శక్తిని ఉపయోగించండి.
  • దైవ ప్రేరేపిత ప్రార్థనలు, కవిత్వంతో మీలో దేవుని పట్ల హృదయపూర్వకమైన భక్తి శ్రద్ధలను మేల్కొల్పండి.
  • మీ హేతువాద దృక్పధాన్ని, మీ హృదయాన్ని సంతృప్తి పరచడానికి ధ్యాన పద్ధతులు ఆధారపడిన శాస్త్రీయ సూత్రాలు మరియు తత్వశాస్త్రం గురించి అవగాహన పొందండి.
  • శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతల శాస్త్రీయ నివారణ, స్వస్థత ఎలా పొందాలో తెలుసుకోండి.
  • నైతిక మరియు ఆధ్యాత్మిక సూత్రాలను వివరించే బోధనాత్మక కథనాలను మీకు, మీ కుటుంబ జీవితానికి వర్తింపజేయండి.
  • పరమహంస యోగానందగారి దివ్యమైన బోధనల స్ఫూర్తిని అనుభవించండి.
  • జీవితపు అత్యున్నత లక్ష్యం: భగవంతుని సాక్షాత్కారం దిశగా మీ వ్యక్తిగత ప్రయాణాన్ని ప్రేరేపించండి.

స్ఫూర్తినిచ్చే ఆచరణాత్మక మార్గదర్శకత్వం ఒక అమూల్య సంపద

ధ్యాన నైపుణ్యాలు, పాఠాలు ఆధ్యాత్మిక జీవనానికి ఆవసరమైన స్ఫూర్తిని, ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. నిరంతరం పరిణామం చెందే ఈ ప్రపంచంలో ఎడతెగని సవాళ్లు మరియు అవకాశాల మధ్య ఆనందంగా, విజయవంతంగా జీవించడం ఎలా? అన్నదానిని కూడా చూపుతాయి. మీరు ఆ స్ఫూర్తిని రోజువారీ ఆధ్యాత్మిక సాధనగా మార్చుకోవడం నేర్చుకుంటారు.

కొన్ని పాఠ్యాంశాల నమూనా

  • యోగ: భగవంతుడిని తెలుసుకునే శాస్త్రీయ మార్గం
  • శారీరక, మానసిక, అలౌకిక ఆనందం
  • సృష్టి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం
  • వెన్నెముకలోని చక్రాలను మేల్కొల్పడం
  • ఆరోగ్యము, స్వస్థతను గూర్చే యోగా సూత్రాలు
  • గురుశిష్య సంబంధం
  • జీవితం, మరణం, కర్మ మరియు పునర్జన్మ
  • ఆధ్యాత్మిక నేత్రం: అనంతానికి ద్వారం
  • ప్రార్థన ద్వారా భగవంతుని సాంగత్యాన్ని పొందడం
  • సమతుల్య ఆధ్యాత్మిక జీవన కళ

పరమహంస యోగానందగారు రాసిన పరిచయ పాఠాన్ని ఇప్పుడు చదవండి

మాతో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి — ఈరోజే దరఖాస్తు చేసుకోండి

పరమహంస యోగానందగారి బోధనల ద్వారా లభించే ఆత్మశాంతి, ఆనందం మరియు జ్ఞానంతో జీవితాన్ని మార్చే ఆవిష్కరణలో మాతో కలిసి ప్రయాణించాల్సిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

వై.ఎస్.ఎస్. పాఠాల కోసం మూడు సులభ మార్గాలలో దరఖాస్తు చేసుకోండి.

మొదటి దశ: ఒక ఖాతాను సృష్టించండి.

రెండవ దశ: అప్లికేషన్ ‌ను పూర్తి చేయండి.

మూడవ దశ: ప్రతిజ్ఞపై డిజిటల్ రూపంలో సంతకం చేసి ఆన్‌లైన్‌లో దాఖలు చేయండి.

ఖర్చు మరియు సమయం

వై.ఎస్.ఎస్. పాఠాలు (ప్రాథమిక శ్రేణి) 18 లోతైన పాఠాలుగా విభజించబడ్డాయి (సుమారుగా ఒక్కొక్కటి 24-40 పేజీలు). విద్యార్థులు ప్రతి రెండు వారాలకు ఒక పాఠం చొప్పున 9 నెలల పాటు అందుకుంటారు. క్రియాయోగా యొక్క అన్ని సన్నాహక ప్రాథమిక ధ్యాన పద్ధతులు ఈ వ్యవధి ముగింపు నాటికి మీకు మెయిల్ చేయబడతాయి.

మేము వై.ఎస్.ఎస్. పాఠాల ప్రాథమిక శ్రేణిని ప్రత్యేక పరిచయ ధరతో అందిస్తున్నాము — ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపబడిన పాఠాలకు ₹ 600 మరియు కొరియర్/స్పెషల్ పోస్ట్ ద్వారా పంపబడిన పాఠాలకు ₹ 1000 — వాటి వాస్తవ ధర కంటే చాలా తక్కువ.

పై రేట్లు భారతదేశంలో మాత్రమే వర్తిస్తాయి. బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు మరియు శ్రీలంకకు సభ్యత్వ ధరలు రూ. 4,200 లు. నేపాల్‌లోని విద్యార్థులను సభ్యత్వం కోసం కోపుండోల్ ‌లోని మా ధ్యాన కేంద్రాన్ని సంప్రదించవలసిందిగా అభ్యర్థించాము.

ఈ ధరలో వై.ఎస్.ఎస్. లెసన్స్ యాప్ ‌లోని పాఠాల డిజిటల్ వెర్షన్ ‌కి కాంప్లిమెంటరీ యాక్సెస్ మరియు మీ బేసిక్ లెసన్స్ సిరీస్ సబ్‌స్క్రిప్షన్ వ్యవధిలో, పాఠాలకు సంబంధించిన మొత్తం సహాయక సమాచారం ఉంటుంది.

ప్రత్యేక గమనిక: మేము పాఠాల కొత్త ఎడిషన్ ‌ను వీలైనంత తక్కువ ధరకు పరిచయం చేస్తున్నాము. తద్ద్వారా పాఠాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. పరమహంస యోగానందగారి కృషిని అన్ని దేశాల్లోని ప్రజలకు వ్యాప్తి చేయడం కోసం యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన అనేక మంది భక్తుల నుండి మేము ఉదారమైన మద్దతును ఆశిస్తున్నందున మేము ఈ తక్కువ ధరను అందించగలుగుతున్నాము.

మీకు వీలయితే, మీ సభ్యత్వ నమోదు సమయంలో మీరు విరాళం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినట్లయితే మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము. ఇది మా సాధారణ నిర్వహణ ఖర్చులకు మరియు పరమహంస యోగానందగారి బోధనల లభ్యతను నిజాయితీ గల అన్వేషకులందరికీ విస్తరించడానికి ఉపయోగపడుతుంది.

దయచేసి మొదటి పాఠం రావడానికి 2 నుండి 4 వారాల సమయం ఇవ్వండి.

“కొత్త పాఠాలకు చాలా ధన్యవాదాలు. అవి చాలా సహాయకారిగా ఉన్నాయి. నేను ఇప్పుడు బోధనలను చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాను. మన పూజ్య గురువుల ఆశీర్వాదాలను అనుభవిస్తున్నాను.”
– ఎస్.జె., ఢిల్లీ

క్రియాయోగ

ఆధునిక కాలానికి ప్రాచీన మెళకువలు

క్రియాయోగా అనేది సాధారణ శ్వాస వ్యాయామం కాదు: ఇది ప్రాణాయామం యొక్క అత్యున్నత మెళకువ. దీని ద్వారా మీరు శరీరంలోని ప్రాణశక్తిని స్పృహతో నియంత్రించవచ్చు. తద్ద్వారా విశ్వ చైతన్యాన్ని పొందవచ్చు.

— పరమహంస యోగానంద

నేను క్రియాయోగ దీక్షను ఎప్పుడు స్వీకరించగలను?

క్రియాయోగా యొక్క ఉన్నత మెళకువలను అభ్యసించే ముందు ధ్యానంలో ఒక బలమైన పునాదిని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. పాఠాలలో పరమహంస యోగానందగారి వ్యక్తిగత సూచనలను స్వీకరించిన మొదటి ఎనిమిది నెలలలో మూడు ప్రాథమిక పద్ధతులను (శక్తిని పుంజుకోవడం, ఏకాగ్రత మరియు ధ్యానం) నేర్చుకుని, సాధన చేసిన తర్వాత, కోరుకునే వారు క్రియాయోగాలో దీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వై.ఎస్.ఎస్. పాఠాలు క్రియయోగా బోధన కోసం పవిత్రమైన మార్గదర్శకాలను పాటిస్తాయి.

‘ఒక యోగి ఆత్మకథ’ పుస్తకంలో, పరమహంసజీ 1861లో మహావతార్ బాబాజీ ద్వారా మానవాళి కోసం క్రియాయోగా ఎలా పునరుత్థానం చేయబడిందనే విషయాన్ని వివరించారు. ఆయన తన శిష్యుడైన లాహిరీ మహాశయునికి ప్రాచీన శాస్త్రాన్ని ఉపదేశించారు. దానిని ఇతరులకు బహిరంగంగా బోధించడమే జీవితంలో తన కర్తవ్యమని చెప్పారు (చాలా శతాబ్దాలుగా చేయలేదు). మొదట బాబాజీ క్రియాయోగ దీక్షకు చాలా ఉన్నత ప్రమాణాన్ని, కఠిన నిబంధనలను ఏర్పాటు చేశారు. లాహిరీ మహాశయులు తమ శిష్యుల కోసం ఆ సంప్రదాయబద్ధమైన కఠిన నిబంధనలను సడలించమని బాబాజీని అభ్యర్థించారు. “అలానే కానివ్వండి,” అంటూ బాబాజీ కరుణతో అంగీకరించారు. “నీ ద్వారా భగవదాకాంక్ష వ్యక్తమైంది. వినయపూర్వకంగా నిన్ను సహాయం అడిగే వారందరికీ క్రియాయోగ దీక్షను ఇవ్వు,” అని బాబాజీ లాహిరి మహాశయుునికి అనుమతినిచ్చారు.

1949లో ఎస్.ఆర్.ఎఫ్. మదర్ సెంటర్ లో శిష్యులతో మాట్లాడుతూ, పరమహంసజీ దీని గురించి మరింత వివరించారు: “సాధారణ ప్రజానీకానికి క్రియాయోగ నుండి ప్రయోజనం చేకూరేలా సన్యాసం, పరిత్యాగం వంటి పురాతన పరిమితులను బాబాజీ మాఫీ చేసినప్పటికీ, వారిని క్రియాయోగ అభ్యాసానికి సన్నద్ధం చేయడానికి, ప్రాథమిక ఆధ్యాత్మిక శిక్షణ వరకు మాత్రమే దానిని పరిమితం చేయవలసిందిగా బాబాజీ లాహిరీ మహాశయుని, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురు పరంపరలోని ఇతర శిష్యులను ఆయన ఆదేశించారు.”

పాశ్చాత్య దేశాలలో తన మిషన్ ను ప్రారంభించినప్పటి నుండి, పరమహంసజీ, యోగ సూత్రాలు మరియు పద్ధతుల్లో క్రమబద్ధమైన బోధనా కోర్సును అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఇది బాబాజీ ఏర్పాటు చేసిన నిబంధనలకు అనుగుణంగా క్రియాయోగ దీక్ష చేపట్టాలనే తీవ్రమైన ఆకాంక్ష కలిగిన విద్యార్థులను సిద్ధం చేస్తుంది. ఈ కోర్సు మొదట పరమహంసజీచే వ్యక్తిగతంగా నిర్వహించబడే తరగతులలో మాత్రమే బోధించబడింది. ప్రభావవంతమైన క్రియాయోగ సాధనకు అత్యంత ప్రధానమైనవిగా భావించే మూడు ప్రాథమిక పద్ధతులను ఆయన బోధించారు: అవి శక్తినిచ్చే మెళకువలు, ఏకాగ్రతను పెంచే హాంగ్-సా ప్రక్రియ మరియు ఓమ్ ధ్యాన ప్రక్రియ.

1934 నుండి, యోగదా సత్సంగ పాఠాలలో పైన పేర్కొన్న అన్ని పద్ధతులలో వివరణాత్మక సూచన ఇవ్వబడింది. క్రియాయోగ విజ్ఞాన శాస్త్రాన్ని భగవంతుని వైపు వారిని వ్యక్తిగతంగా నడిపించే మార్గంగా భావించే వై.ఎస్.ఎస్. విద్యార్థులకు, క్రియాయోగ మెళకువలను అభ్యసించడానికి దీక్షను అందించారు పరమహంసజీ. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా అందించబడిన ఆ పవిత్ర దీక్ష (దీక్ష) విద్యార్థికి, పరమహంస యోగానందగారికి మధ్య గురు-శిష్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది.

పరమహంస యోగానందగారు గురు-శిష్య సంబంధాన్ని “అత్యంత వ్యక్తిగతమైన, ప్రత్యేకమైన ఆధ్యాత్మిక బంధం…శిష్యుని యొక్క చిత్తశుద్ధితో కూడిన ఆధ్యాత్మిక ప్రయత్నాలు, గురువు అందించే దైవిక ఆశీర్వాదాల కలయిక” గా అభివర్ణించారు.

మీరు దేవునిలో మీ ఆనందాన్ని పొందాలని మాత్రమె నేను కోరుకుంటాను. మీరు నా నుండి దేవుని జ్ఞానాన్ని మరియు ఆనందాన్ని మాత్రమే కోరుకుంటారు.

— పరమహంస యోగానంద

ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

అత్యంత తీరిక లేకుండా ఉండే వ్యక్తి కూడా ధ్యానం చేయవచ్చు

మెళకువలు నేర్పడం, అనవసరమైన సిద్ధాంతాన్ని ప్రక్షాళన చేయడంపైనే యోగదా సత్సంగ బోధనల యొక్క ప్రాథమిక దృష్టి. పాఠాలలో వివరించిన సత్యాలు విశ్వవ్యాప్తంగా ఆచరణీయమైనవి. వారి స్పష్టమైన మరియు సరళమైన బోధనాశైలి అత్యంత సంక్లిష్టమైన సత్యాలను కూడా సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది. రోజువారీ జీవితంలో యువకులు మరియు పెద్దలు అనే తేడా లేకుండా ఎవరైనా సులభంగా అభ్యసించవచ్చు. ఈ సూత్రాలను అత్యంత తీరికలేకుండా గడిపే వ్యక్తి కూడా గమనించి అభ్యసించవచ్చు. ఎందుకంటే ఈ మెళకువలను అభ్యసించడానికి ప్రతి రోజు చాలా తక్కువ సమయం సరిపోతుంది.

— పరమహంస యోగానంద

మూడు సులభమైన దశల్లో వై.ఎస్.ఎస్. పాఠాల కోసం దరఖాస్తు చేసుకోండి:

మొదటి దశ: ఒక ఖాతాను సృష్టించండి.

రెండవ దశ: అప్లికేషన్ ‌ను పూర్తి చేయండి.

మూడవ దశ: ప్రతిజ్ఞపై డిజిటల్ రూపంలో సంతకం చేసి ఆన్‌లైన్‌లో దాఖలు చేయండి.

భారతదేశం మరియు పొరుగు దేశాల వెలుపల నివసిస్తున్న వారి కోసం గమనిక:

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పరమహంస యోగానందగారి బోధనలను భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్ మరియు శ్రీలంకలలో ప్రచారం చేస్తుంది. మీరు ఈ దేశాలలో ఒకదాని వెలుపల నివసిస్తుంటే, దయచేసి సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) ద్వారా పాఠాల కోసం దరఖాస్తు చేసుకోండి. ఎస్.ఆర్.ఎఫ్. అనేది మన సోదర సంఘం, పరమహంసజీ తన బోధనలను ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో వ్యాప్తి చేయడానికి 1920లో దానిని స్థాపించారు. వై.ఎస్.ఎస్. పాఠాలు మరియు ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల కంటెంట్ ఒకేలా ఉంటుంది.

ఖర్చు మరియు సమయం

వై.ఎస్.ఎస్. పాఠాలు (ప్రాథమిక శ్రేణి) 18 లోతైన పాఠాలుగా విభజించబడ్డాయి. (ఒక్కొక్కటి సుమారు 24-40 పేజీలు), విద్యార్థులు వీటిని రెండు వారాలకు ఒక భాగం చొప్పున 9 నెలల పాటు అందుకుంటారు. క్రియాయోగాకు సిద్ధం చేసే అన్ని ప్రాథమిక ధ్యాన పద్ధతులూ ఈ వ్యవధి ముగింపు నాటికి మెయిల్ చేయబడతాయి.

మేము వై.ఎస్.ఎస్. పాఠాల ప్రాథమిక శ్రేణిని ప్రత్యేక పరిచయ ధరతో అందిస్తున్నాము — ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపబడిన పాఠాలకు ₹ 600 మరియు కొరియర్/స్పెషల్ పోస్ట్ ద్వారా పంపబడిన పాఠాలకు ₹ 1000 — వాటి వాస్తవ ధర కంటే చాలా తక్కువ.

పై రేట్లు భారతదేశంలో మాత్రమే వర్తిస్తాయి. బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు మరియు శ్రీలంకకు సభ్యత్వ ధరలు రూ. 4,200 లు. నేపాల్‌లోని విద్యార్థులను సభ్యత్వం కోసం కోపుండోల్ ‌లోని మా ధ్యాన కేంద్రాన్ని సంప్రదించవలసిందిగా అభ్యర్థించాము.

ఈ ధరలో వై.ఎస్.ఎస్. లెసన్స్ యాప్ ‌లోని పాఠాల డిజిటల్ వెర్షన్ ‌కి కాంప్లిమెంటరీ యాక్సెస్ మరియు మీ ప్రాథమిక పాఠాల సిరీస్ సబ్‌స్క్రిప్షన్ వ్యవధిలో పాఠాలకు సంబంధించిన మొత్తం సహాయక సమాచారం ఉంటుంది.

ప్రత్యేక గమనిక: మేము పాఠాల కొత్త ఎడిషన్ ‌ను వీలైనంత తక్కువ ధరకు పరిచయం చేస్తున్నాము. తద్ద్వారా పాఠాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. పరమహంస యోగానందగారి కృషిని అన్ని దేశాల్లోని ప్రజలకు వ్యాప్తి చేయడం కోసం యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన అనేక మంది భక్తుల నుండి మేము ఉదారమైన మద్దతును ఆశిస్తున్నందున మేము ఈ తక్కువ ధరను అందించగలుగుతున్నాము.

మీకు వీలయితే, మీ సభ్యత్వ నమోదు సమయంలో మీరు విరాళం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినట్లయితే మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము. ఇది మా సాధారణ నిర్వహణ ఖర్చులకు మరియు పరమహంస యోగానందగారి బోధనల లభ్యతను నిజాయితీ గల అన్వేషకులందరికీ విస్తరించడానికి ఉపయోగపడుతుంది.

దయచేసి మొదటి పాఠం రావడానికి 2 నుండి 4 వారాల సమయం ఇవ్వండి.

“కొత్త పాఠాలకు చాలా ధన్యవాదాలు. అవి చాలా సహాయకారిగా ఉన్నాయి. నేను ఇప్పుడు బోధనలను చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాను. మన పూజ్య గురువుల ఆశీర్వాదాలను అనుభవిస్తున్నాను.”
– ఎస్.జె., ఢిల్లీ

ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ – అధ్యయనం, ధ్యానం మరియు ప్రేరణ కోసం మీ డిజిటల్ ఆధ్యాత్మిక సహవాసి

మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి సహాయపడే ఒక డిజిటల్ సాధనము

ఆధ్యాత్మిక మహా కావ్యం, ఒక యోగి ఆత్మకథ రచయిత శ్రీ పరమహంస యోగానందగారి బోధనల ద్వారా జీవితాన్ని పరివర్తన చేసే ఆత్మ యొక్క శాంతి, జ్ఞానం మరియు ఆనందాల మేల్కొలుపును అనుభవించండి.

ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ ప్రతి ఒక్కరి కోసం ఉన్నది — మీరు పరమహంస యోగానందగారి బోధనలకు సరికొత్తగా వచ్చినవారైనా లేక దశాబ్దాలుగా ఈ గొప్ప గురుదేవుల జ్ఞాన బోధనలలో నిమగ్నమైనవారైనా, ధ్యానం, క్రియాయోగ శాస్త్రం గురించి మరియు ఆధ్యాత్మికంగా సమతుల్య జీవితాన్ని గడపడానికి, ఆచరణాత్మక మార్గాల గురించి తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరికీ ఇది ఉపయోగపడుతుంది.

యాప్ లోని అంశాలు:

  • 15 నుండి 45 నిమిషాల వరకు అనుకూలించదగిన ధ్యాన సమయాలతో — శాంతి, నిర్భయంగా జీవించడం, దేవుడు కాంతిగా, చైతన్యాన్ని విస్తరించడం వంటి వాటిపై మార్గదర్శక ధ్యానాలు మరియు మరిన్ని.
  • ఆన్‌లైన్ ప్రత్యక్ష ధ్యాన కార్యక్రమాలకు ఉచిత ప్రవేశం
  • వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. వార్తలు మరియు కార్యక్రమాల సమాచారం

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠముల విద్యార్థుల కోసం...

మీ రోజువారీ జీవితంలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. క్రియాయోగ బోధనలను వర్తింపజేయడంలో సహాయపడటానికి మీ పాఠాల డిజిటల్ అనువాదాలతో పాటు అనేక రకాల ప్రసార సాధనాల విషయాలను ఈ యాప్ కలిగి ఉంటుంది.

అదనంగా:

  • పరమహంస యోగానందగారి ఆడియో రికార్డింగులు
  • వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు నిర్వహించే మార్గదర్శక ధ్యానాలు మరియు మానసిక చిత్రీకరణలు
  • వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ధ్యాన ప్రక్రియలపై తరగతులు
  • దశలవారీ సూచనలతో కూడిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. శక్తిపూరణ వ్యాయామాల వీడియో

మీరు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల విద్యార్థి అయితే, యాప్ లోని పాఠాలను పొందడానికి, మీ నిర్ధారించిన ఖాతా సమాచారాన్ని దయచేసి ఉపయోగించండి.

YSS SRF App Introductory Video
Play Video about YSS SRF App Introductory Video

ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ ను నేనెలా పొందగలను

  • ఇంకా మీరు పాఠాల విద్యార్థి కాకపోతే? ముందుగా వై.ఎస్.ఎస్. పాఠాల సభ్యత్వాన్ని పొందండి. అప్పుడు మీరు యాప్ ని డౌన్ లోడ్ మరియు సైన్-ఇన్ ఎలా చేయాలో తెలిపే సూచనలతో కూడిన ఇ మెయిల్ ను అందుకుంటారు.
  • ప్రస్తుతం మీరు వై.ఎస్.ఎస్. ప్రాధమిక పాఠాల సభ్యత్వం పొందినట్లైతే? గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుండి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. లాగిన్ చేయడానికి మీ వై.ఎస్.ఎస్. డివోటీ పోర్టల్ యూజర్ నేమ్ మరియు పాస్ వార్డ్ మీకు అవసరమవుతుంది.

వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులు, వై.ఎస్.ఎస్. పాఠాలను మరియు ఆక్సీలరీ మెటీరియల్ ను (అనుబంధ విషయాలను) కూడా డెస్క్-టాప్ యాప్ పై వీక్షించవచ్చు.

మా తాజా అప్ ‌గ్రేడ్ కు అందిన ప్రశంసలు

తరచుగా అడిగే ప్రశ్నలు

యాప్ కు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలను చదవడానికి క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.

పైన కనిపిస్తున్న ప్రశ్నోత్తరాలు ప్రత్యేకంగా ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్‌కి సంబంధించినవి. మీరు వై.ఎస్.ఎస్. మరియు ఈ బోధనల కోసం సాధారణ ప్రశ్నలు (FAQ) కోసం చూస్తున్నట్లయితే, దయచేసి మా తరచుగా అడిగే ప్రశ్నల పేజీని సందర్శించండి.

వై.ఎస్.ఎస్. తెలుగు పాఠాలు: తరచుగా అడిగే ప్రశ్నలు

వై.ఎస్.ఎస్. తెలుగు పాఠాల కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
తాజా దరఖాస్తుదారులు, ప్రస్తుత పాఠాల సభ్యులు, వారు నివసిస్తున్న దేశం ఏదైనా తెలుగు పాఠాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చును.

వై.ఎస్.ఎస్. తెలుగు పాఠాల కోసం నమోదు రుసుము ఎంత?
ప్రాథమిక అనుక్రమాన్ని మేము దిగువ ఇచ్చిన విధంగా అందిస్తున్నాము:

భారతదేశంలోని ధరలు –
1. రూ.600 – సాధారణ తపాలా
2. రూ.1000 – ప్రత్యేక తపాలా

భారతదేశానికి వెలుపల ధరలు –
1. రూ.4200 – సార్క్ దేశాలు
2. రూ.6000 – సార్క్ లో లేని దేశాలు

యాప్ (App) లో డిజిటల్ రూపంలో ఉన్న పాఠాలను, పాఠాలలోని మొత్తం అనుబంధ విషయాలను చందాదారులు ఉచితంగా పొందగలరు.


వై.ఎస్.ఎస్. తెలుగు పాఠాల కోసం నేను ఏ విధంగా దరఖాస్తు చేసుకోగలను?
కింద ఇచ్చిన విధానాలలో ఏదో ఒకదాన్ని అనుసరించి భక్తులు దరఖాస్తు చేసుకోగలరు:

తాజా దరఖాస్తు (ప్రస్తుతం వై.ఎస్.ఎస్. సభ్యులు కాని వారు)
1. డివోటీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో
2. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పేరు మీద దేశమంతటా చెల్లుబాటయ్యే చెక్కుతో పాటు పూర్తిగా నింపిన దరఖాస్తు పత్రాన్ని పోస్టులో పంపడం ద్వారా.
దయచేసి మనియార్డరు, బాంక్ డ్రాఫ్టు లేదా ఐ.పి.వో. ద్వారా చెల్లింపులు చేయవద్దు.

ఇప్పటికే వై.ఎస్.ఎస్. పాఠాల సభ్యులైనవారు
1. డివోటీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో
2. చెల్లింపు వివరాలతో పాటు పూర్తిగా నింపిన పాఠాల చందాపత్రాన్ని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వారికి పంపడం ద్వారా.
దయచేసి మనియార్డరు, బాంక్ డ్రాఫ్టు, ఐ.పి.వో. ద్వారా చెల్లింపులు చేయవద్దు.
3. ఫోను — హెల్ప్ డెస్క్, పాఠాల చందాల కోసం అభ్యర్థనలను స్వీకరించి రుసుము చెల్లించడానికి భక్తులకు ఒక రుసుము లింకు పంపగలదు.

అప్లికేషన్ ఫారమ్ ను డౌన్‌లోడ్‌ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


డిజిటల్ రూపంలో ఉన్న విషయాలను నేనెలా అందుకోగలను?
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యాప్ ద్వారా పాఠాలను ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చును, మరియు భక్తుని పరిచయ వివరాలతో ఆన్‌లైన్‌ పోర్టల్ study.local.yssofindia.org లో లాగిన్ ద్వారా కూడా వీటిని చదువుకోవచ్చును.


క్రియాయోగం గురించి

నేను క్రియాయోగం కోసం అప్లై చేయాలని అనుకుంటున్నాను, దాని కోసం తెలుగు పాఠాలు తీసుకోవాలా?
క్రియాయోగం కోసం అప్లై చేద్దామని అనుకుంటున్న వారు కొత్త ప్రాథమిక అనుక్రమ వై.ఎస్.ఎస్. పాఠాలను (ఇంగ్లీషు లేదా తెలుగు లేదా తమిళంలో) చదవాల్సిన ఆవశ్యకత ఉంది.


నేను ఒక క్రియావంతుడిని, నేను తెలుగులోని క్రియా పాఠాల కోసం చందా కట్టవచ్చా?
తెలుగులో ప్రాథమిక శ్రేణి వై.ఎస్.ఎస్. పాఠాల నమోదు ఒకసారి ప్రారంభమయ్యాక కొత్త క్రియా పాఠాలు తెలుగులో అందుబాటులోకి రావడానికి తొమ్మిది నెలలు పడుతుందని దయచేసి గమనించండి. మీరు ఇప్పటికే ఒక వై.ఎస్.ఎస్. క్రియావంతులైతే, మొదట తెలుగు భాషలో ఉన్న కొత్త ప్రాథమిక అనుక్రమాన్ని చదువకుండానే కొత్త తెలుగు క్రియా పాఠాల కోసం అడుగవచ్చును.

ప్రాథమిక అనుక్రమ పాఠాలను మీరింతవరకూ చదవకపోతే, ప్రాథమిక అనుక్రమంలో నమోదు చేసుకోమని మేము గట్టిగా సిఫార్సు చేస్తున్నాము, ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం గురించి ఎంతో మెరుగైన మార్గదర్శకత్వం, బోధనలు — శక్తిపూరణ వ్యాయామాలు, హాంగ్-సా, ఓం ప్రక్రియలతో సహా — ఈ కొత్త పాఠాలలో ఇవ్వబడ్డాయి.


తెలుగు పాఠాల కోసం ఆన్‌లైన్‌లో చందా కట్టడం

నాకు ఇంగ్లీషు రాదు, నేను ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయగలను?
డివోటీ పోర్టల్ ప్రధాన పుట, అప్లికేషన్ ఫారమ్ ఇప్పుడు తెలుగులో లభ్యమౌతున్నాయి. డివోటీ పోర్టల్ లో, కుడివైపు పైభాగంలో వివిధ భాషల పట్టికను చూడడానికి “ఇంగ్లీషు” మీద క్లిక్ చేయండి. ఆ పేజిని తెలుగు భాషలో చూడడానికి “తెలుగు”ను ఎంచుకోండి.

గమనిక: ఇంగ్లీషులో ఉన్న డివోటీ పోర్టల్ లో కూడా తెలుగు పాఠాల కోసం అప్లికేషన్ ఫారమ్ తెలుగులోనే ఉంది.


విభిన్న వినియోగదారుల కోసం సన్నివేశాలు
సందర్భం 1 ఉపయోగించండి: వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థి కాదు, విద్యార్థి ప్రథమ అప్లికేషన్
పాఠాల కోసం అప్లై చేయండి – “తెలుగు” పై క్లిక్ చేయండి – తెలుగు భాషలో ఉండడం మినహాయించి మిగిలినవన్నీ ఇంగ్లీషు విద్యార్థి అప్లికేషన్ లో వలెనే ఉంటాయి.

సందర్భం 2 ఉపయోగించండి: వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థి కాదు, సహవిద్యార్థి అప్లికేషన్
పాఠాల కోసం అప్లై చేయండి – “తెలుగు” పై క్లిక్ చేయండి – తెలుగు భాషలో ఉండడం మినహాయించి మిగిలినవన్నీ ఇంగ్లీషు సహవిద్యార్థి అప్లికేషన్ లో వలెనే ఉంటాయి.

సందర్భం 3 ఉపయోగించండి: ఇప్పటికే వై.ఎస్.ఎస్. విద్యార్థి, ధృవీకరించబడిన వై.ఎస్.ఎస్. ఖాతా లేదు
మొదట సభ్యత్వాన్ని ధృవీకరించుకోండి, తర్వాత భక్తుని పాఠాల చందా స్థితిని అనుసరించి సందర్భం 4 లో ఉన్న సన్నివేశాలలో ఏదో ఒక దాన్ని అనుసరించండి.

సందర్భం 4 ఉపయోగించండి: ఒక ధృవీకరించబడిన ఖాతా కలిగిన ప్రస్తుత వై.ఎస్.ఎస్. విద్యార్థి
సన్నివేశం A: పాత ఇంగ్లీషు/హిందీ పాఠాలు పూర్తి చేశారు మరియు/లేదా ఇంగ్లీషు/తమిళం పాఠాల కొత్త ప్రచురణ కోసం చందా కట్టారు.
పాఠాల కోసం అప్లై చేయండి – “తెలుగు” పై క్లిక్ చేయండి – తెలుగు భాషలో ఉండడం తప్ప మిగిలిన పద్ధతి అంతా ఇంగ్లీషులో వలెనే ఉంటుంది.

సన్నివేశం A (అసాధారణమైన కేసు)
భక్తుడు ప్రస్తుతం ఇంగ్లీషులో ప్రాథమిక అనుక్రమం పాఠాలు అందుకుంటున్నాడు (18 పాఠాలకన్నా తక్కువ అందుకున్నాడు) కాని తెలుగులోని ప్రాథమిక అనుక్రమం పాఠాలకు మారుదామని అనుకుంటున్నాడు.

పద్ధతి అంతా పూర్తిగా హెల్ప్ డెస్క్ సహాయంతో చేయవలసినదే. భక్తుడు హెల్ప్ డెస్క్ కు ఫోను చేసి ఇంగ్లీషు నుంచి తెలుగు పాఠాలలోకి మార్చమని కోరాలి.

సన్నివేశం B: ప్రస్తుత సహవిద్యార్థి తెలుగు పాఠాల కోసం అప్లై చేయడం; ప్రధాన విద్యార్థి తెలుగు పాఠాల కోసం అప్లై చేసేశారు.

  • ఎంపిక 1: తెలుగు పాఠాల కోసం సహవిద్యార్థిగానే కొనసాగడం
    తెలుగు పాఠాల కోసం రూ.300 కట్టి, భక్తుడు సహవిద్యార్థిగానే కొనసాగవచ్చును.

  • ఎంపిక 2: తెలుగు పాఠాల కోసం ప్రధాన సభ్యుడుగా నమోదు చేసుకోవడం
    భక్తుడు “ప్రధాన విద్యార్థి”ని ఎంచుకుని, పాఠాల కోసం పూర్తి చందా రుసుము (రూ.600 లేదా రూ.1000) చెల్లించడం ద్వారా చందా కట్టడం పూర్తి చేయవచ్చును.

సన్నివేశం C: సహవిద్యార్థి తెలుగు పాఠాల కోసం అప్లై చేశారు, ప్రధాన విద్యార్థి తెలుగు పాఠాల కోసం అప్లై చేయలేదు.
భక్తుడు ఒక “ప్రధాన విద్యార్థి”గా కొనసాగుతూ పాఠాల కోసం చందా పూర్తి రుసుము (రూ.600 లేదా రూ.1000) చేయించడం ద్వారా అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చును.

సందర్భం 5 ఉపయోగించండి: ప్రస్తుత ఎస్.ఆర్.ఎఫ్. విద్యార్థి తెలుగు పాఠాల కోసం చందా కట్టాలని అనుకుంటున్నాడు.
భక్తుడు కొత్త వై.ఎస్.ఎస్. విద్యార్థిగా అప్లై చేసి, తెలుగు పాఠాల కోసం చందా కట్టవచ్చు. ఒకసారి అప్లికేషన్ నింపడం పూర్తయ్యాక భక్తుడు ఒక వై.ఎస్.ఎస్. అప్లికేషన్ నెంబరు అందుకుంటాడు, ఒకసారి అప్లికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఒక వై.ఎస్.ఎస్. పాఠాల నెంబరు అందుకుంటాడు.

ధరలు –
రూ. 4200 – సార్క్ దేశాలు
రూ. 6000 – సార్క్ లో లేని దేశాలు