సామూహిక ధ్యానం అనేది కొత్త ఆధ్యాత్మిక అన్వేషకులను, అలాగే అనుభవజ్ఞులైన ధ్యానులను రక్షించే కోట. సామూహిక ధ్యానం వల్ల సామూహిక అయస్కాంతత్వం యొక్క అదృశ్య తరంగ మార్పిడి సిద్ధాంతం ద్వారా సమూహంలోని ప్రతి సభ్యుని స్వీయ-సాక్షాత్కార స్థాయి పెరుగుతుంది.

— పరమహంస యోగానందగారు

వ్యవస్థాపకుడు పరమహంస యోగానందగారు
Play Video

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుడు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు జనవరి 31, 2021న వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు.

స్వాగతం

మా గౌరవనీయ గురువు, వ్యవస్థాపకుడు, శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి స్ఫూర్తితో, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ ధ్యాన కేంద్రానికి నేను మిమ్మల్ని ఆనందంగా స్వాగతిస్తున్నాను. అన్ని వై.ఎస్.ఎస్. కేంద్రాలు మరియు మండలాల మాదిరిగానే, ఈ ఆన్‌లైన్ వేదికను భారతదేశంలోని మా వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో సేవలందిస్తున్న వై.ఎస్.ఎస్. సన్న్యాసుల పర్యవేక్షణలో, భక్తులైన స్వచ్ఛంద సేవకుల సహాయ సహకారాలతో నడుస్తోంది.

ఈ ఆన్‌లైన్ కేంద్రం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇతర వై.ఎస్.ఎస్. భక్తులు మరియు స్నేహితులతో సహవాసం చేస్తూ, సామూహిక ధ్యానాన్ని, పరమహంసజీ బోధనల అధ్యయనాన్ని అనుభవిస్తూ వారి ఆశీస్సులను మీతో పంచుకోవడానికి మేము ఎదురుచూస్తున్నాము.

భగవత్సాంగత్యంలో,
స్వామి చిదానంద గిరి

అధ్యక్షుడు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్

ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం నుండి అప్ డేట్లు మరియు కార్యక్రమ ప్రకటనలను అందించే వై.ఎస్.ఎస్. ఈ-న్యూస్ కోసం సైన్-అప్ చేయండి

ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం ఎందుకు?

యోగదా సత్సంగ ఆశ్రమం, కేంద్రం లేదా మండలిలో భౌతికంగా పాల్గొనడం వల్ల అనేక ప్రత్యక్ష పరోక్ష ప్రయోజనాలు ఉన్నాయి. సాధ్యమైనంతవరకు ప్రతి ఒక్కరూ ధ్యాన తరగతులకు వ్యక్తిగతంగా హాజరు కావాలని మేము ప్రోత్సహిస్తున్నాము. వై.ఎస్.ఎస్. మండలి లేదా కేంద్రానికి దూరంగా నివసిస్తున్నందువల్ల మరియు ఇతర కారణాల వల్ల భక్తులు చాలామంది వ్యక్తిగతంగా హాజరు కాలేరు. ఆన్‌లైన్ ధ్యాన తరగతుల వల్ల భక్తులందరూ, వారి స్థలం, పరిస్థితులతో సంబంధం లేకుండా, ఇతర సత్యాన్వేషకులతో కలసి సామూహిక ధ్యానం చెయ్యడానికి, ఆధ్యాత్మిక సహవాసం చెయ్యడానికి అవకాశం ఉంది.

Play Video
ఆన్‌లైన్ ధ్యాన యోగా కేంద్రం

ఆన్‌లైన్ సామూహిక ధ్యాన తరగతులు

ఒకరి సాధనను మరింతగా పెంచుకోవడానికి సామూహిక ధ్యానం అమూల్యమైనదని పరమహంస యోగానందగారు తన జీవిత పర్యంతం అభివర్ణించారు. అదే విధంగా ఇప్పుడు మీరు మీ స్థలం, పరిస్థితులతో సంబంధం లేకుండా సామూహిక ధ్యాన తరగతులలో చేరే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ సామూహిక ధ్యానంలో పాల్గొనడం ద్వారా, మీరు భారతదేశం అంతటా, ప్రపంచం నలుమూలలా ఉన్న పరమహంస యోగానందగారి అనుచరులతో కలిసి ధ్యానం, భగవత్సాంగత్యాన్ని పొందే ఒక ఉత్తేజకరమైన వాతావరణంలో చేరతారు.

భవిష్యత్తులో, ఈ సామూహిక ధ్యాన తరగతులలో వివిధ రకాల ధ్యాన ప్రక్రియలు జోడింపబడతాయి: ఉదాహరణకు సంక్షిప్తమైన, సుదీర్ఘమైన, కీర్తనలు కలిగిన, మరియు మరికొన్ని ఇతర ప్రక్రియలు. వీలైనంత త్వరగా, మేము అనేక భారతీయ భాషలలో కూడా ఈ కార్యక్రమాలను అందించడం ప్రారంభిస్తాము.

మేము రాబోయే నెలల్లో ఆన్‌లైన్ లిఖిత (ముద్రిత) మరియు వై.ఎస్.ఎస్. పాఠాల స్టడీ గ్రూపులను ప్రారంభించాలని యోచిస్తున్నాము.

కార్యక్రమణికను చూడండి

పాల్గొనడం ఎలా

ఆన్‌లైన్ ధ్యాన తరగతులలో పాల్గొనటానికి ఈ క్రింది క్రమాన్ని అనుసరించండి:

1.  ఉచిత జూమ్ యాప్ ‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్ ‌స్టాల్ చేసుకోండి (మీరు ఖాతాను సృష్టించాల్సిన అవసరం లేదు).

2.  ఆన్‌లైన్ ధ్యాన తరగతులు, ప్రత్యేక కార్యక్రమాల క్యాలెండర్ ను అనుసరించండి.

3.  క్యాలెండర్‌లోని కార్యక్రమంపై క్లిక్ చేసి, ఆపై జూమ్ ‌ను తెరిచి ధ్యానంలోకి ప్రవేశించడానికి కార్యక్రమం వివరణలోని బ్లూ కలర్ జూమ్ లింక్ ‌ని క్లిక్ చేయండి.

మీకు ఇంకేమైనా సూచనలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి

సేవలందించడంపై ఆసక్తి ఉందా?

మీరు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. క్రియాబాన్ అయి వుండి, ఆన్‌లైన్ ధ్యాన తరగతుల నాయకుడిగా లేక ఆన్ ‌లైన్ సహాయకుడిగా కావాలనే ఆసక్తి ఉంటే, దయచేసి వాలంటీర్ పోర్టల్ ‌లో సైన్-అప్ చేయండి. మేము మీతో కలిసి గురుదేవునికి సేవ చేయడానికి ఎదురుచూస్తున్నాము.

భక్తులు మాతో పంచుకున్న అనుభవాలు

“ఇది నిజంగా సామూహిక ధ్యానం యొక్క స్ఫూర్తిని సంగ్రహించింది. ఇది చాలా అద్భుతమైనది. ఇది వ్యక్తిగతంగా పాల్గొనే సామూహిక ధ్యానానికి ఎంత సారూప్యంగా ఉందో చూసి నేను ఆశ్చర్యపోయాను!”

“మా ఆన్‌లైన్ ధ్యానంతో నాకు గొప్ప అనుభవం ఉంది. నిజంగా మేము సమూహంలో భాగమైనట్లుగానే అనిపిస్తుంది!”

“పొద్దున్నే నిద్రలేచి, భక్తులతో కూర్చుని ధ్యానం చేయడం మరియు ప్రత్యక్ష కీర్తనలు వినడం చాలా మంచి అనుభూతి!”

“నేను ధ్యానాన్ని ఇష్టపడ్డాను. ప్రతిరోజూ దీనిని చేయగలను. సమయం ఆహ్లాదకరంగా, మధురంగా గడిచిపోయింది!”

“నేను నిజంగా దాన్ని ఆనందించాను. సామూహిక ధ్యానం యొక్క బలం మరియు అనుబంధాన్ని నేను అనుభవించగలిగాను.”

ఇతరులతో పంచుకోండి