ఆదివారం సత్సంగం

 

దేశవ్యాప్తంగా ఉన్న మా ఆశ్రమాలు మరియు ధ్యాన కేంద్రాలలో, ప్రతివారం స్ఫూర్తిదాయకంగా జరిగే సత్సంగాలు, ఇతర సత్యాన్వేషకులతో కలిసి ఆధ్యాత్మిక సహవాసాన్ని పొందేందుకు మరియు భగవంతునితో అనుసంధానం పొందేందుకు అవకాశాన్ని కలుగజేస్తాయి. ఈ సత్సంగాలలో పరమహంస యోగానందగారి రచనల నుండి స్ఫూర్తిదాయక పఠనాలు, దానితోపాటు భక్తి గీతాలాపన, నిశ్శబ్ద ధ్యానం మరియు ప్రార్థన కూడి ఉంటాయి. యోగదా సత్సంగ పరంపరకు చెందిన సన్యాసులు క్రమం తప్పకుండా మా ఆశ్రమాలలో సత్సంగాలను నిర్వహిస్తారు మరియు గృహస్థ భక్తులు వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రాలలో స్ఫూర్తిదాయక సేవలను నిర్వహిస్తారు.

పరమహంస యోగానందగారి “జీవించడం ఎలా” ఆధ్యాత్మిక సూత్రాలపై, 3-12 సంవత్సరాల వయస్సు గల బాలల కోసం, మా అన్ని ఆశ్రమాలు మరియు అనేక ధ్యాన కేంద్రాలు బాలల సత్సంగాలను నిర్వహిస్తాయి.

ఆదివారం జరిగే సత్సంగం వివరాల కోసం, మీకు స్థానికంగా అందుబాటులో ఉన్న ఆశ్రమం లేదా ధ్యాన కేంద్రం/మండలిని సంప్రదించండి.

ఇతరులతో పంచుకోండి