శాశ్వతమైన ఆనందానికి రహస్యాలు

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి రచనల నుండి సారాంశాలు

సానుకూల మానసిక వైఖరులు

మీరు ఎప్పుడైనా సంతోషంగా ఉండాలనే ఆశను కోల్పోతున్నట్లు అనిపిస్తే, ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆశను కోల్పోవద్దు. మీ ఆత్మ, ఎప్పుడూ ఆనందంగా ఉండే పరమాత్మ యొక్క ప్రతిబింబం, సారాంశంలో, అంటే ఆనందమే.

ఆనందం కొంతవరకు బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది, కాని ప్రధానంగా మానసిక వైఖరులపై ఆధారపడి ఉంటుంది.

ముఖ్యంగా, పరిస్థితులు మంచివీ కావు లేదా చెడ్డవీ కావు; అవి ఎల్లప్పుడూ తటస్థంగా ఉంటాయి. వాటితో సంబంధమున్న ఒక వ్యక్తి యొక్క విచారకరమైన లేదా ప్రోత్సాహకరమైన మానసిక వైఖరి కారణంగానే పరిస్థితులు నిరుత్సాహకరంగా లేదా ప్రోత్సాహకరంగా ఉన్నట్లు కనపడతాయి.

మీ పరిస్థితులను మార్చుకోవాలనుకుంటే మీ ఆలోచనలను మార్చుకోండి. మీ ఆలోచనలకు మీరు మాత్రమే బాధ్యత వహించగలరు కాబట్టి, మీరు మాత్రమే వాటిని మార్చగలరు. ప్రతి ఆలోచన దాని స్వంత స్వభావం ప్రకారమే సృష్టించబడుతుందని మీరు గ్రహించినప్పుడు మీరు వాటిని మార్చుకోవాలనుకుంటారు. నియమాలు అన్ని సమయాల్లో పని చేస్తాయని మరియు మీకు అలవాటైన ఆలోచనలను బట్టే మీరు ఎల్లప్పుడూ నియంత్రించబడుతున్నారని గుర్తుంచుకోండి. అందువల్ల, మీకు ఆరోగ్యము మరియు ఆనందాన్ని కలిగించే ఆలోచనలను మాత్రమే ఆలోచించడం ప్రారంభించండి.

మనస్సు, మెదడు, అనుభూతి మరియు అన్ని జీవకణాల యొక్క అవగాహన, మానవ శరీరాన్ని అప్రమత్తతకు లేదా నిరాశకు గురి చేస్తుంది. మనస్సు రాజు వంటిది, మరియు దానిలోని అన్ని జీవకణజాల సముదాయాలు వాటి రాజోచితమైన గురువు యొక్క మానసిక స్థితికి అనుగుణంగా ప్రవర్తిస్తాయి. మన రోజువారీ ఆహార పదార్థాల యొక్క పోషక విలువల గురించి మనం ఆందోళన చెందుతున్నట్లే, మనం ప్రతిరోజూ మనస్సుకు సేవ చేసే మానసిక పదార్థాల కార్యక్రమ పట్టిక యొక్క పోషక శక్తిని పరిగణనలోకి తీసుకోవాలి.

ఆకాశంలో వ్యాపిస్తున్న సూర్య కిరణాలు ఆనందాన్ని సూచిస్తున్నాయి.నిరంతరం మీరు దుఃఖాన్ని ధృవీకరిస్తారు, కాబట్టి అదే జరుగుతుంది. మీ మనస్సులో దానిని తిరస్కరించండి, ఇకపై అది ఉండదు. నేను మనిషిలోని ఈ మానసిక దృఢత్వాన్ని వీరుడు అని పిలుస్తాను. ఇది అతని దైవిక లేదా ముఖ్యమైన స్వభావం. దుఃఖం నుండి విముక్తి పొందాలంటే, మనిషి తన దైనందిన కార్యక్రమాలన్నింటిలోనూ తన వీరత్వాన్ని చాటుకోవాలి.

మీరు సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోకపోతే ఎవరూ మిమ్మల్ని సంతోషంగా ఉంచలేరు. అందుకు దేవుణ్ణి నిందించకండి! మరియు మీరు సంతోషంగా ఉండాలని నిర్ణయించుకొంటే, ఎవరూ మిమ్మల్ని అసంతృప్తికి గురి చేయలేరు. మన స్వంత సంకల్పాన్ని ఉపయోగించుకునే స్వేచ్ఛ ఆయన మనకు ఇవ్వకపోతే, మనం సంతోషంగా లేనప్పుడు ఆయనను మనం నిందించవచ్చు, కానీ ఆయన మనకు ఆ స్వేచ్ఛను ఇచ్చాడు. మన జీవితం ఎలా ఉండాలో తీర్చిదిద్దుకునేది మనమే.

బలమైన స్వభావం గల వ్యక్తులు సాధారణంగా సంతోషంగా ఉంటారు. వారు సాధారణంగా వారి స్వంత చర్యలు మరియు అవగాహన లేకపోవడం ద్వారా గుర్తించదగిన ఇబ్బందులకు ఇతరులను నిందించరు. ఇతరుల ప్రతికూల ఆలోచనలు మరియు దుష్ట చర్యలు తమపై ప్రభావం చూపేటంత బలహీనంగా ఉంటే తప్ప వారి ఆనందాన్ని పెంచడానికి లేదా దాని నుండి దూరం చేసే శక్తి ఎవరికీ లేదని వారికి తెలుసు.

నేర్చుకోవడానికి మరియు సరిగా ప్రవర్తించడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటంలోనే మీ అత్యధిక ఆనందం ఉంది. మిమ్మల్ని మీరు ఎంతగా మెరుగుపరుచుకుంటే, మీ చుట్టూ ఉన్న ఇతరులను మీరు అంతగా ఉన్నతపరుస్తారు. స్వీయ-అభివృద్ధి చెందుతున్న వ్యక్తే పెరుగుతున్న సంతోషకరమైన వ్యక్తి. మీరు ఎంత సంతోషంగా ఉంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అంత సంతోషంగా ఉంటారు.

జీవితానికి ప్రతికూల విధానాన్ని నివారించండి. మన చుట్టూ మనోహరంగా ఉన్నప్పుడు మురుగు కాలువలను ఎందుకు చూడటం? కళ, సంగీతం, మరియు సాహిత్యం యొక్క గొప్ప కళాఖండాలలో కూడా ఎవరైనా తప్పును కనుగొనవచ్చు. అయితే వారి రమ్యతను మరియు వైభవాన్ని ఆస్వాదించడం మంచిది కాదా?

“చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు”, అనే సూత్రాన్ని వర్ణించే ఆ మూడు చిన్న కోతి బొమ్మలు దాదాపు అందరికీ సుపరిచితమే. నేను సానుకూల విధానాన్ని నొక్కి చెబుతున్నాను: “మంచిని చూడండి, మంచిని వినండి, మంచిని మాట్లాడండి.”

ప్రతికూల మానసిక స్థితి నుండి విముక్తి

ఆత్మలో స్వాభావికంగా ఉన్న భగవంతుని నిత్య నవీన ఆనందం నాశనం చేయలేనిది. అలాగే, దానిని ఎలా పట్టుకోవాలో ఒక వ్యక్తి తెలుసుకుంటే, మరియు అతను ఉద్దేశపూర్వకంగా తన మనసు మార్చుకోకపోతే మరియు మనోభావాలను పెంపొందించుకోవడం ద్వారా దుఃఖపడకపోతే మనస్సులో దాని వ్యక్తీకరణ ఎప్పటికీ నాశనం చేయబడదు.

పిల్లి ఆత్మలో అంతర్లీనంగా ఉన్న దేవుని యొక్క సరికొత్త ఆనందాన్ని వర్ణిస్తుంది.

మీరు దేవుని ప్రతిరూపం; మీరు దేవుడిలా ప్రవర్తించాలి. కానీ ఏమి జరుగుతుంది? ఉదయాన్నే మీరు నిగ్రహాన్ని కోల్పోయి, “నా కాఫీ చల్లగా ఉంది!” అని ఫిర్యాదు చేస్తారు. దాని వల్ల ఏమవుతుంది? ఇలాంటి వాటికి ఎందుకు కలవరపడాలి? మీరు పూర్తిగా ప్రశాంతంగా, కోపానికి దూరంగా ఉండే సమత్వమైన మనస్సును కలిగి ఉండండి. అదే మీకు కావాలి. ఎవరినీ లేదా దేనినీ “మీ మేకను పొందుటకు” అనుమతించవద్దు. మీ “మేక” మీ శాంతి. ఏదీ మీ నుండి తీసివేయనివ్వకండి.

జీవితంలోని అల్పత్వం నుండి, మిమ్మల్ని కలవరపరిచే చిన్న చిన్న విషయాల నుండి మిమ్మల్ని మీరు పునరుత్థానం చేసుకోండి.

దౌర్భాగ్యాన్ని ఎవరూ ఇష్టపడరు. తదుపరిసారి మీరొక భావనలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎందుకు విశ్లేషించుకోకూడదు? మిమ్మల్ని మీరే ఇష్టపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా దుఃఖానికి ఎలా గురి చేసుకుంటున్నారో మీరు చూస్తారు. మరియు మీరు అలా చేస్తున్నప్పుడు, మీ చుట్టూ ఉన్న ఇతరులు మీ మానసిక స్థితి యొక్క అసౌకర్యమైన అనుభూతిని గమనిస్తారు.

మీ మనోభావాలు ఎంత భయంకరంగా అనిపించినా వాటిని మీరు జయించగలరు. మీరు ఇకపై మూతి ముడుచుకొని ఉండబోరని మీ మనస్సును దృఢపరచుకోండి; మరియు మీ సంకల్పానికి వ్యతిరేకంగా మీ మానసిక స్థితి ఉన్నట్లయితే, దానికి కారణమైన దాన్ని విశ్లేషించండి మరియు దాని గురించి నిర్మాణాత్మకంగా ఏదో ఒకటి చేయండి.

మీరు విచారంగా ఉన్నారంటే దానర్థం సాధారణంగా మీరు జీవితంలో ఖచ్చితంగా సాధించాలనుకునే గొప్ప విషయాలపై తగినంతగా దృష్టి పెట్టకపోవడం లేదా మీ కలలు సాకారమయ్యే వరకు మీ సంకల్ప శక్తి, మీ సృజనాత్మక సామర్థ్యం మరియు మీ సహనాన్ని మీరు స్థిరంగా ఉపయోగించకపోవడం వల్లనే అని గుర్తుంచుకోండి.

మీ స్వంత స్వీయ-అభివృద్ధి కోసం మరియు ఇతరుల ప్రయోజనం కోసం నిర్మాణాత్మక పనులను చేయడంలో తీరిక లేకుండా ఉండండి, ఎందుకంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశించే వారు ప్రతిరోజూ ఇతరులకు మంచి చేయడానికి కూడా ప్రయత్నించాలి. ఈ పద్ధతిని అనుసరిస్తే, విచారకరమైన భావాలను చెదరగొట్టి, మీరు మానసికంగా, శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలుసుకునే ఆనందాన్ని అనుభవిస్తారు.

ఇతరులకు సేవ

ఆధ్యాత్మిక అవగాహన యొక్క హంసలు.

ఇతరులను సంతోషపెట్టడంలోను, ఇతరులకు సంతోషాన్ని కలిగించడానికి స్వప్రయోజనాలను విడిచిపెట్టడంలోనూ సంతోషం ఉంది.

ఇతరులకు సంతోషాన్ని ఇవ్వడం మన స్వంత సంతోషానికి చాలా ముఖ్యమైనది మరియు అత్యంత సంతృప్తికరమైన అనుభవం. కొంతమంది తమ సొంత కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తారు: “మనం నలుగురు మాత్రమే ఇంక ఎవరూ వద్దు.” ఇతరులు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు: “నేను ఎలా సంతోషంగా ఉండబోతున్నాను?” కానీ సంతోషంగా ఉండలేని వ్యక్తులు వీరే!

స్వార్థంతో జీవించడమే అన్ని దుఃఖాలకు మూలం.

ఇతరులకు ఆధ్యాత్మికంగా, మానసికంగా మరియు భౌతికంగా సేవ చేయడం ద్వారా, మీ స్వంత అవసరాలు తీరుతున్నట్లు మీరు తెలుసుకుంటారు. ఇతరులకు సేవ చేయడంలో మిమ్మల్ని మీరు మరచిపోయినప్పుడు, మీరు దానిని కోరకుండానే, మీ స్వంత ఆనందం యొక్క పాత్ర నిండిపోయిందని మీరు కనుగొంటారు.

మీరు ఈ లోకంలోకి వచ్చాక ఏడ్చారు, అందరూ నవ్వారు. మీరు మీ జీవితాన్ని ఎలా గడపాలంటే, మీరు వెళ్ళిపోయినప్పుడు, అందరూ ఏడవాలి, కానీ మీరు నవ్వుతూ ఉండాలి.

సంతోషం యొక్క అంతర్గత పరిస్థితులు

మీరు ఎంత గాఢంగా ధ్యానం చేస్తే, ఎంత ఇష్టపూర్వకంగా సేవ చేస్తే, అంత సంతోషంగా ఉంటారు.

ధ్యానం చేయడం ద్వారా మరియు మీ చైతన్యాన్ని, ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్న, ఎల్లప్పుడూ ఎరుక కలిగిన, నిత్య నవీన ఆనందమైన భగవంతునితో అనుశ్రుతిలో ఉంచుకోవడం ద్వారా మీలో ఉన్న ఆనందం యొక్క అన్ని పరిస్థితులను కొనసాగించడం నేర్చుకోండి. మీ ఆనందం ఎప్పుడూ బయటి ప్రభావాలకి లోబడి ఉండకూడదు. మీ వాతావరణం ఏదైనప్పటికీ, మీ అంతర్గత శాంతిని తాకడానికి దానిని అనుమతించవద్దు.

నిజమైన ఆనందం అన్ని బాహ్య అనుభవాల సవాలును ఎదుర్కోగలదు. మీకు వ్యతిరేకంగా ఇతరుల తప్పుల శిలువలను మీరు భరించగలిగినప్పుడు మరియు ఇప్పటికీ ప్రేమ మరియు క్షమాపణలను తిరిగి ఇవ్వగలిగినప్పుడు; మరియు బాహ్య పరిస్థితుల యొక్క అన్ని బాధాకరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మీరు ఆ దైవిక అంతర్గత శాంతిని చెక్కుచెదరకుండా ఉంచగలిగినప్పుడు, మీరు ఈ ఆనందాన్ని తెలుసుకుంటారు.

ప్రతి రాత్రి మీరు నిద్ర పోవడానికి ముందు మరియు ఉదయం మళ్ళీ దైనందిన కార్యకలాపాలను ప్రారంభించే ముందు కనీసం అరగంట పాటు వీలైతే ఇంకా ఎక్కువసేపు మౌనంగా మరియు ప్రశాంతంగా [ధ్యానంలో] ఉండండి. దైనందిన జీవితంలో జరిగే యుద్ధంలో ఎదురయ్యే అన్ని క్లిష్ట పరిస్థితులను మీరు ఎదుర్కొనేలా చేసే ఆనందం యొక్క నిస్సంకోచమైన, విడదీయరాని అంతర్గత అలవాటును ఇది కలిగజేస్తుంది. ఈ విధమైన మార్పులేని అంతర్గత ఆనందంతో, మీ దైనందిన అవసరాలను నెరవేర్చుకోవడానికి ముందుకు సాగండి.

ఆనందం కోసం బయట ఉన్న పరిస్థితులపై మీరు ఎంత ఎక్కువగా ఆధారపడతారో, అంత తక్కువగా ఆనందాన్ని మీరు అనుభవిస్తారు.

మీరు భగవంతుడిని మరచిపోయి సంతోషంగా జీవించగలరని అనుకుంటే, మీరు పొరపాటుపడ్డట్లే, ఎందుకంటే మీరు విశ్వంలో ఉన్న ఏకైక వాస్తవికతలో భగవంతుడు మాత్రమే ఉన్నాడని గ్రహించే వరకు మీరు ఒంటరితనంలో పదే పదే దుఃఖిస్తారు. మీరు ఆయన స్వరూపంలోనే తయారయ్యారు. భగవంతుడు తప్ప ఏదీ సంపూర్ణం కాదు, కాబట్టి మీరు ఏ విషయంలోనూ శాశ్వతమైన ఆనందాన్ని పొందలేరు.

ప్రభువుతో అనుసంధానంలో నేను పొందిన అపరిమితమైన ఆనందాన్ని ఏ పదాలు వర్ణించలేవు. రాత్రింబగళ్లు ఆ ఆనందకర స్థితిలో ఉన్నాను. ఆ ఆనందమే భగవంతుడు. ఆయనను తెలుసుకోవడమంటే మీ బాధలన్నిటికీ అంత్యక్రియలు చేయడమే. మీరు దిగులుగా మరియు విచారగ్రస్తుడుగా ఉండాలని ఆయన ఆశించడు. ఇది దేవునికి సంబంధించిన సరైన భావన కాదు, ఆయనను సంతోషపెట్టే మార్గం ఇది కాదు. సంతోషంగా లేకుండా మీరు ఆయనను కనుగొనలేరు….మీరు ఎంత సంతోషంగా ఉంటే, ఆయనతో మీ అనుసంధానం అంత గొప్పగా ఉంటుంది. ఆయనను తెలిసుకున్నవారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు, ఎందుకంటే భగవంతుడే ఆనంద స్వరూపుడు.

ప్రతిజ్ఞలు

ప్రతిజ్ఞ యొక్క సిద్ధాంతం మరియు సూచనలు

తెల్లవారినప్పటి నుండి ప్రారంభించి, ఈ రోజు నేను కలిసే ప్రతి ఒక్కరికీ నా ఉత్సాహాన్ని ప్రసరిస్తాను. ఈ రోజు నా మార్గంలో తారసపడే వారందరికీ నేను మానసిక సూర్యకాంతి అవుతాను.

నేను ప్రతిచోటా మంచిని చూడటం ద్వారా, మరియు అన్నిటినీ భగవంతుని యొక్క పరిపూర్ణమైన ఆలోచనగా చూడటం ద్వారా కొత్త ఆలోచనా అలవాట్లను ఏర్పరుచు కుంటాను.

ఈ రోజు నేను ఉన్న చోటనే, నాలో నేను సంతోషంగా ఉండేందుకు నా మనసును ఇప్పుడే స్థిరపరుచుకుంటాను.

మరింత చదవడానికి

ఇతరులతో పంచుకోండి