మీ ప్రాంతంలో ధ్యాన కార్యక్రమాలు

ధ్యాన కార్యక్రమాలు

రాంచీ ఆశ్రమం యొక్క ముఖ్య కార్యాలయం

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 180 కంటే ఎక్కువ రిట్రీట్‌లు, ఆశ్రమాలు మరియు ధ్యాన కేంద్రాలను కలిగి ఉంది — ఆసక్తి ఉన్న అన్వేషకులందరికీ సమూహ ధ్యానాల శక్తిని అనుభవించడానికి అవకాశాన్ని అందిస్తోంది. ప్రతి వారము ఉండే స్ఫూర్తిదాయకమైన సేవల్లో శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి రచనల నుండి పఠనాలు, అలాగే భక్తితో కూడిన గానము, నిశ్శబ్ద ధ్యానం మరియు ప్రార్థనలు ఉంటాయి.

పరమహంస యోగానందగారు బోధించిన ధ్యానం యొక్క మెళుకువలను పొందేందుకు, యోగదా సత్సంగ పాఠాల కోసం నమోదు చేసుకోండి.

ఉపన్యాస పర్యటనలు

సత్సంగంలో పాల్గొన్న భక్తులు

ప్రతి సంవత్సరం యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సన్యాసులు పరమహంస యోగానందగారి బోధనలు మరియు ధ్యాన పద్ధతులు, సమూహ ధ్యానాలు, బహిరంగ చర్చలు మరియు ప్రాంతీయ రిట్రీట్లపై తరగతులు నిర్వహించడానికి దేశవ్యాప్తంగా ఉన్న నగరాలను సందర్శిస్తారు:

ఈ సన్యాసుల సందర్శనలు పరమహంస యోగానందగారి బోధనలను కొత్తవారికి పరిచయాన్ని అందిస్తాయి మరియు పాఠాల విద్యార్థులకు వై.ఎస్.ఎస్. ధ్యాన పద్ధతులలో లోతైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి.

రెట్రీట్స్ లో ధ్యాన పద్ధతులపై తరగతులు ఉంటాయి మరియు సమూహ ధ్యానం మరియు స్నేహపూర్వక చర్చలకు అవకాశాలను అందిస్తాయి.

దయచేసి ఉపన్యాస పర్యటనల ప్రదేశాలు మరియు తేదీల పూర్తి జాబితా కోసం పర్యటన షెడ్యూల్‌ను చూడండి.

మీ సంఘంలో అందుబాటులో ఉన్న కార్యక్రమాలను గురించి తెలుసుకోండి.

మీ స్థానిక కేంద్రం, ఆశ్రమం లేదా ధ్యాన సమూహాన్ని సంప్రదించండి.

మీరు పరమహంస యోగానందగారు బోధించిన ధ్యాన పద్ధతులను మీ స్వంత ఇంటి గోప్యతలో అధ్యయనం చేయాలనుకుంటే, మా గృహ-అధ్యయన పాఠాల గురించి తెలుసుకోండి.

ఇతరులతో పంచుకోండి