అధ్యాపకులు మరియు శాస్త్రీయ సంఘం

“అమెరికన్లకు హిందూమతాన్ని బోధపరచిన యోగానందగారు చాలా ఉన్నత స్థానంలో ఉంటారు. పండితులలో కూడా ఆయన చాలా గౌరవించబడ్డారు.”

— టెడ్ సోలమన్, మతపరమైన అధ్యయనాల ప్రొఫెసర్, అయోవా స్టేట్ యూనివర్శిటీ (రిటైర్డ్) మరియు డ్రేక్ విశ్వవిద్యాలయం

“యోగానందగారు భగవంతునితో నిండిన జ్ఞానమూర్తి మరియు సాధువు, తత్వవేత్త మరియు కవి, ఆయన అత్యుత్తమమైన వాస్తవికత యొక్క అసంఖ్యాకమైన అంశాలను అనుభవించారు.... ఆధ్యాత్మిక స్థితి యొక్క రహస్యాలను చాలా మంది మనుష్యుల కంటే ఎక్కువగా గ్రహించిన అరుదైన మేధావి.”

— రేమండ్ పైపర్, ఎమెరిటస్ ఆఫ్ ఫిలాసఫీ ప్రొఫెసర్, సిరక్యూస్ యూనివర్సిటీ, న్యూయార్క్

“యోగానందగారు ఒక ఆదర్శంగా మారారు — ఒక అద్భుతమైన, లోతైన, మధురమైన, కవితాత్మక, పరమానందాన్ని పొంది విశ్వ చైతన్యంతో ఉప్పొంగేవారు — అమెరికా మత జీవన రూపురేఖల్ని ఆయన మార్చారు.”

— రాబర్ట్ ఎస్. ఎల్‌వుడ్, పి‌హెచ్.డి., ఛైర్మన్, స్కూల్ ఆఫ్ రిలిజియన్, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా

“నిజమైన 'దైవసాక్షాత్కారం,' నుండి వచ్చే దైవ సాన్నిహిత్యాన్ని మనకు గుర్తు చేయడమే పరమహంస యోగానందగారు ప్రపంచానికి ఇచ్చిన బహుమతి.”

— రాబర్ట్ జె. విక్స్, పి‌హెచ్.డి., చైర్‌పర్సన్, గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స ఇన్ పాస్టోరల్ కౌన్సెలింగ్ లయోలా కాలేజీ, మేరీల్యాండ్

“ఆయన ఒక గొప్ప ఆత్మ మరియు అమెరికా సాంస్కృతిక జీవితంలో శాశ్వతమైన స్మృతులను మరియు ప్రభావాన్ని చూపించారు.”

— డా. డాగోబర్ట్ రూన్స్, ప్రెసిడెంట్, ఫిలాసఫికల్ లైబ్రరీ, న్యూయార్క్

“పరమహంస యోగానందగారు భారతదేశపు దైవ సాక్షాత్కారానికి సంబంధించిన శాశ్వత వాగ్దానాన్ని మాత్రమే కాకుండా, అన్ని వర్గాల ఆధ్యాత్మిక ఔత్సాహికులు ఆ లక్ష్యం వైపు వేగంగా పురోగమించే ఒక ఆచరణాత్మక పద్ధతిని కూడా పాశ్చాత్య దేశాలకు తీసుకువచ్చారు…వాస్తవానికి పాశ్చాత్య దేశాలలో అత్యంత ఉన్నతమైన మరియు తత్వాల స్థాయిలో మాత్రమే ప్రశంసించబడిన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక వారసత్వం ఇప్పుడు భగవంతుడిని తెలుసుకోవాలని కోరుకునే వారందరికీ అభ్యాసం చేయడానికీ మరియు అనుభవం పొందడానికీ అందుబాటులో ఉంది, వెనుక ఎప్పుడో కాదు, ఇక్కడ మరియు ఇప్పుడు....యోగానందగారు అత్యంత ఉన్నతమైన ధ్యాన పద్ధతులన్నిటినీ అందరికీ అందుబాటులో ఉంచారు.”

— క్విన్సీ హోవే, జూనియర్, పి‌హెచ్.డి., ప్రాచీన భాషల ప్రొఫెసర్, స్క్రిప్స్ కళాశాల, క్లేర్‌మోంట్, కాలిఫోర్నియా

“ప్రతి సంప్రదాయంలోని గ్రంథాలన్నీ మానవాళి యొక్క అన్ని మత సంప్రదాయాలకు చెందిన ప్రజల వారసత్వంగా భావించే యుగ ప్రారంభంలో మనం ఉన్నాము, అయితే అంతకుముందు ఇవి ఒకే సంప్రదాయానికి మాత్రమే చెందిన విలువైన ఆస్థిగా భావించేవారు, గోస్పెల్స్ క్రైస్తవ మతానికి చెందినట్లుగా. ఈ గూఢార్ధము గ్రహించేటట్లు ప్రపంచీకరణ కొనసాగుతుండగా, అధికారికంగా ఒక మతానికి బయట ఉన్న చాలా ఎక్కువ మంది వ్యక్తులు, అందులో ఉన్నవారి కంటే ఎక్కువగా ఒక మతం యొక్క గ్రంథాలపై వ్యాఖ్యానిస్తారు, ఎందుకంటే ప్రపంచ మతాల అధ్యయనం నిజంగా అంతర్జాతీయంగా జరిగితే, ఈ మత గ్రంథాలను ఏదైనా బయటి సంప్రదాయాల నుండి స్వీకరించే వ్యక్తుల సంఖ్య సాంప్రదాయంలో ఉన్నవారి కంటే ఎక్కువగా ఉంటుంది. అటువంటి భవిష్యత్తుకు నాందిగా పరమహంస యోగానందగారు నిలుస్తారని నాకు అనిపిస్తుంది.”

— డాక్టర్ అరవింద్ శర్మ, పి‌హెచ్. డి., తులనాత్మక మతం యొక్క బిర్క్స్ ప్రొఫెసర్, మెక్‌గిల్ విశ్వవిద్యాలయం

“[యోగానందగారి బోధనలు] మానవుడి శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక స్వభావాలకు శిక్షణ ఇవ్వడానికి మరియు సమన్వయం చేయడానికి ఆదర్శమైనవి...

“ఏకాగ్రత మరియు ధ్యానం యొక్క సరళమైన మరియు శాస్త్రీయ పద్ధతుల ద్వారా, జీవితంలోని చాలా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించవచ్చు. అప్పుడు శాంతి మరియు మంచితనం-భూమిపైకి వస్తాయి. [యోగానందగారి] సరైన విద్య యొక్క భావం ఏమిటంటే స్పష్టమైన లోకజ్ఞానం కలిగి ఉండడం, అన్ని మార్మికవాదాలకు మరియు ఆచరణ లేనివాటికి అతీతమైనది; లేకుంటే దానికి నా ఆమోదం లభించదు....నాకు తెలిసిన పద్ధతులన్నిటిలో, స్వర్ణ యుగాన్ని తీసుకురావడానికి ఇది దగ్గరగా ఉంటుంది.”

— లూథర్ బర్బ్యాంక్, హార్టికల్చరిస్ట్

“ఆయన భౌతిక విద్యా విధానం యొక్క సౌందర్యం, పాశ్చాత్య పద్ధతులను పురాతన యోగ విధానంతో సామరస్యపూర్వకంగా మేళవించడంలో ఉంది...విద్యార్థుల యొక్క శరీరం, మనస్సు మరియు ఆత్మలను అభివృద్ధి చేయడంలో సామరస్యంగా ఉండాలని వారు కోరుకున్నారు. వారి విద్యా సంబంధిత అధ్యాయనాలలో కళ, సాహిత్యం, విజ్ఞానము వంటి వివిధ జ్ఞాన రంగాలలో విద్యార్థులు నూతన ఆవిష్కరణాలలో ప్రవేశం కలిగి ఉండాలని కోరుకునేవారు. ఆయన ఈ రంగంలో కూడా మార్గదర్శకులే. ఉద్యోగాధారిత విద్య యొక్క ఆవశ్యకతను ఆయన దృశ్యమానం చేశారు. తద్ద్వారా విద్యార్థులు సమాజానికి ఉపయోగపడతారు........

“ఆ సమయంలో మన నాయకులు పరమహంస యోగానందగారి విద్యా విధాన ఆదర్శాలను స్వీకరించకపోవడం విచారకరం. యాభై సంవత్సరాల తర్వాత, నిపుణులు ఇప్పుడు ఉద్యోగ ఆధారిత విద్య మరియు పని అనుభవం అవసరమని గ్రహించారు....

“ఇంద్రియాలపై ఆధిపత్యంగల వ్యక్తిగా, ప్రేమ, నిజాయితీ, చిత్తశుద్ధి, సహనం మరియు విశ్వాసం యొక్క సార్వత్రిక సూత్రాలు మూర్తీభవించిన వ్యక్తిగా మరియు సంకల్ప శక్తి, ఆత్మవిశ్వాసం మరియు స్వావలంబనను పెంపొందించుకోగలిగే పరిపూర్ణమైన వ్యక్తిని నిర్మించాలనేది ఆయన విద్యా భావన.”

— డాక్టర్ తారా ముఖర్జీ, వైస్-ఛాన్సలర్, బీహార్ విశ్వవిద్యాలయం, భారతదేశం

“[పరమహంస యోగానందగారు] బ్రహ్మాండమైన కార్యమును చేశారు. ఆసక్తిగల చాలామంది అన్వేషకులకు లోపల దాగి ఉన్న కాంతిని కనుగొనడానికి, వారి దివ్య స్వభావాన్ని గ్రహించడానికి మరియు తమకు తాము ప్రావీణ్యులు కావడానికి ఆయన సహాయం చేశారు. కష్టాలను అనుభవిస్తున్న మానవాళి కోసం వారి ఆశీర్వాదించబడిన కార్యాన్ని మరింత తీవ్రంగా మరియు విజయవంతంగా యోగదా సత్సంగ సొసైటి ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థలు కొనసాగిస్తాయని మేము నమ్ముతున్నాము.”

— ప్రొఫెసర్ వ్లాదిమిర్ నోవికీ, ప్రేగ్, చెకోస్లోవేకియా

“మన కాలపు అత్యంత ముఖ్యమైన పోకడలలో ఒకటి చైతన్యం మరియు పదార్థానికి మధ్య ఉన్న సంబంధాన్ని క్రమంగా శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం....వైద్యులు, అలాగే వారి రోగులు కూడా ఇప్పుడు మన రోజువారీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు, మన మానసిక స్థితిపై ఎంతగా ఆధారపడి ఉంటుందో చూడటం ప్రారంభించారు. మన శరీరాల పరిస్థితి కేవలం భౌతిక కారకాల ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుందనే నమ్మకం గణాంక ఖచ్చితత్వంతో లిఖితరూపం చేసిన అధునాతన పరిశోధనల నేపథ్యంలో తుడిచిపెట్టుకుపోతోంది, వ్యక్తిత్వం, భావోద్వేగాలు మరియు జీవనశైలి యొక్క ప్రభావం ప్రతి శరీర వ్యవస్థ పనితీరుపై ఉంటుంది, హృదయం నుండి కడుపుకి మరియు రోగనిరోధక వ్యవస్థపై కూడా. శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క పరస్పర సంబంధాన్ని వెల్లడిస్తూ, ఈ పరిశోధనలు దీర్ఘకాలిక నొప్పులకు చేసే చికిత్సలో తీవ్ర ప్రభావాన్ని చూపాయి మరియు పరమహంస యోగానందగారు చాలా సంవత్సరాల క్రితం బోధించిన “జీవించడం ఎలా” అనే సూత్రాల యొక్క అపారమైన విలువను వెల్లడించే నొప్పి యొక్క దృక్పథానికి దారితీశాయి.

“యోగానందగారు మరియు ఇతరులు యోగశాస్త్రముపై చేసిన కృషి వల్ల కొత్త ఆసక్తి అభివృద్ధి చెందింది, ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్‌లో, ఇక్కడ అనేక యోగ పద్ధతులు అనుభావిక అధ్యయనాల ద్వారా బాగా పరిశీలించబడ్డాయి మరియు ఆరోగ్య సంరక్షణ సాధనలో, క్లినికల్ సైకాలజీ మరియు దీర్ఘకాలిక నొప్పులు కలిగిన రోగుల నిర్వహణ రంగంలో ప్రధానంగా ఆమోదం పొందాయి.”

— స్టీవెన్ ఎఫ్. బ్రెనా, ఎం.డి., రీహాబిలిటేషన్ మెడిసిన్ యొక్క క్లినికల్ ప్రొఫెసర్, ఎమోరీ విశ్వవిద్యాలయం; జార్జియా యొక్క నొప్పి నియంత్రణ మరియు పునరావాస సంస్థ యొక్క బోర్డు ఛైర్మన్

“పరమహంస యోగానందగారి జీవితం మరియు కృషి మనోహరంగా ఉన్నాయి….[ఆయన] కీర్తి పరిమళములా వ్యాపించింది....అమెరికా మరియు ప్రపంచంలోని సుదూర తీరాలకు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పేరు మీద, ఆయన అనేక దేశాలలో అనేక ధ్యాన కేంద్రాలను స్థాపించారు. ఈ ఆశ్రమాలు, దేవాలయాలు మరియు ఆయన కార్య కేంద్రాలు, భారతదేశం యొక్క గొప్ప యోగ శాస్త్రాన్ని సాధన చేయడానికి పవిత్ర స్థలాలు...

“ఈ ఆధునిక యుగంలో, పాశ్చాత్యుల భౌతికవాదం ఉన్నప్పటికీ, తూర్పు నుండి వచ్చిన యోగియైన పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక సాఫల్యాలపై అసంఖ్యాకమైన వ్యక్తులు ఆసక్తిని కనబరచడం అద్భుతమైనది. గొప్ప సాధువుల మార్మికవాదం, సమస్యాత్మకమైన మానవ మనస్సుకు లోతైన అభ్యర్థన మరియు ఆశ యొక్క వాగ్దానాన్ని కలిగి ఉంటుంది. ఇలా ఎందరో పరమహంస యోగానందగారి జీవితం నుండి స్ఫూర్తి పొందారు....
“క్రియాయోగం వంటి ఆత్మ శాస్త్రం యొక్క అభ్యాసం, అడవులు మరియు పర్వత గుహలలో ఏకాంతముగా ఉండే సన్యాసులకు పరిమితం చేయబడిందని సాధారణంగా భావించబడింది. పరమహంస యోగానందగారి లక్ష్యం ఏమిటంటే, ప్రపంచంలో ఎక్కడైనా సాధారణ కుటుంబ జీవితంలో ఉన్న వ్యక్తి, క్రియాయోగమును పొందగలరని మరియు సాధన చేసి అత్యధిక ఆధ్యాత్మిక ప్రయోజనం పొందగలరని నిరూపించడం. ఆయన మానవాళికి అత్యున్నతమైన సేవ చేశారు.”

— డాక్టర్ అశుతోష్ దాస్, ఎం.ఏ., పి‌హెచ్.డి., డి. లిట్., ప్రొఫెసర్, కలకత్తా విశ్వవిద్యాలయం

ఇతరులతో పంచుకోండి