ఉద్యోగ అవకాశాలు

April 2024

భగవంతుడు మరియు మహా గురువుల అనుగ్రహంతో, మన సంస్థ భారత ఉపఖండం అంతటా వేగంగా అభివృద్ధి చెందుతూ, మరింతమంది సత్యాన్వేషకులను పరివర్తన చేకూర్చే, విముక్తి మార్గమయిన క్రియాయోగంలోకి తీసుకువస్తోంది. 

మన మానవ వనరుల శక్తిని పెంపొందించుకునే ఉద్దేశ్యంతో మేము, మన రాంచీ ఆశ్రమంలో వేతన ప్రాతిపదికన పూర్తి స్థాయిలో ఈ క్రింది ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంటున్న సమాచారాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాము.

వై.ఎస్.ఎస్. లో ప్రతి ఉద్యోగము, ప్రతిఫలము మరియు ప్రయోజనాలతో కూడిన ఆకర్షణీయమైన ప్యాకేజీతో ఉంటుంది.

వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో పనిచేసే ఉద్యోగులు ఆశ్రమంలో ఉండే సదుపాయాలను ఆస్వాదించవచ్చు, దానితోపాటు సాధన మరియు సేవ అనే పునాదిపై సమతుల్య జీవితాన్ని గడిపే అవకాశాన్ని పొందుతారు. సామూహిక ధ్యానాలు మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం, సామరస్య వాతావరణంలో పనిచేయడం, మరియు గురుదేవుల దివ్య సాన్నిధ్యంతో నిండిన పావనమైన ఆశ్రమ ప్రదేశాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

Previous slide
Next slide

అందుబాటులో ఉన్న ప్రస్తుత స్థానం(లు)

మేము ఈ క్రింది రంగంలో వృత్తినిపుణుల (ప్రొఫెషనల్) కోసం చూస్తున్నాము:

para-ornament

బుక్ డిస్ట్రిబ్యూషన్ మరియు ప్రమోషన్ మేనేజర్

జాబ్ కోడ్: J11
ప్రదేశము: యోగదా సత్సంగ శాఖా మఠం, రాంచీ (పూర్తి సంవత్సరం)
విభాగము:
పుస్తక విక్రయాలు & పంపిణీ
అవకాశం ఉన్న స్థానం(లు) సంఖ్య: 1

పాత్ర యొక్క సారాంశం:

వై.ఎస్.ఎస్. ప్రచురణల కోసం వ్యూహాత్మక ప్రణాళిక, అమలు మరియు మార్కెటింగ్‌కు నాయకత్వం వహించాలి. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రెండింటిలోనూ పంపిణీ మార్గాలను ప్రభావితం చేయడం, నిర్వహించడం, వృద్ధి చేయడం మరియు బలోపేతం చేయడం. వై.ఎస్.ఎస్. ప్రచురణల పంపిణీ కోసం మరియు అందరికీ చేరుకోవడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపేందుకు ఆన్‌లైన్ మార్కెటింగ్‌ను మరియు డిజిటల్ ప్రచారాలను నిర్వహించడం.

పాత్ర యొక్క ప్రధాన విధులు:

  • పీపుల్ మేనేజ్‌మెంట్ – జట్టుకు మార్గదర్శకత్వ బాధ్యత వహించడం
  • మార్కెటింగ్ (క్రయవిక్రయాలు) – వ్యూహాత్మక ప్రణాళికా రచన మరియు వాటిని అమలు పరచడం
  • పంపిణీ మార్గాల నిర్వహణ, వృద్ధి మరియు వాటిని బలోపేతం చేయడం
  • మార్కెటింగ్ దృక్కోణం నుండి దోహదపడేందుకు పరిశోధన మరియు విశ్లేషణల మద్దతుతో విక్రయాల అంచనాలను రూపొందించాలి
  • పుస్తక ప్రదర్శనకు ప్రణాళిక మరియు పర్యవేక్షణ, ప్రచురణల విక్రయాల కోసం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ లో సాధ్యమయ్యే అవకాశాలను గుర్తించడం
  • నిరంతరాయమైన సేవల కోసం కొరియర్ భాగస్వాములు మరియు భారతదేశ తపాలా (పోస్టల్) సంస్థలతో వ్యవహరించడం
  • వస్తువుల సమగ్ర జాబితా నిర్వహణ మరియు ఈ ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి గల అవకాశాలను ఉపయోగించడం
  • వినియోగదారుల చెల్లింపు ఖాతా నిర్వహణ
  • ప్యాకేజింగ్ సామగ్రి సేకరణ మరియు ప్రణాళిక
  • కేటాయించబడిన ఇతర సంబంధిత పనులు నిర్వహించాలి


అనుభవం మరియు నైపుణ్యాలు:

  • మార్కెటింగ్/డిస్ట్రిబ్యూషన్ లో ప్రత్యేక నైపుణ్యంతో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేట్ / పోస్ట్-గ్రాడ్యుయేట్ / మాస్టర్స్ డిగ్రీ (లేదా సమానమైనది)
  • మార్కెటింగ్ లో 5-7 సంవత్సరాల నిరూపితమైన నైపుణ్యం (పుస్తకాలు/ప్రచురణ పరిశ్రమలో అవగాహన కలిగినవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది), ఆన్‌లైన్ మార్కెట్‌ ప్లేస్ ప్రాసెస్‌లు, సోషల్ మీడియా డిజిటల్ ప్రచార నిర్వహణ మరియు వృద్ధి చేసే పరిజ్ఞానం కలిగి ఉండాలి
  • పటిష్టమైన కార్యనిర్వాహక నైపుణ్యాలు మరియు విభిన్న బృందాలతో కలిసి పని చేసే సామర్థ్యం కలిగి ఉండాలి
  • MS ఆఫీస్ ప్రోగ్రామ్‌లు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నైపుణ్యం కలిగి ఉండాలి
  • సంప్రదింపులు జరిపే సామర్థ్యం, విక్రయ వ్యవస్థలను నిర్వహించగల నైపుణ్యం మరియు వ్యక్తుల మధ్య సత్సంబంధాలు నెరపగల నేర్పు కలిగి ఉండాలి
  • ఉత్తరప్రత్యుత్తరాలు జరపడానికి అద్భుతమైన వాచక మరియు వ్రాత పూర్వక నైపుణ్యాలు కలిగి ఉండాలి
  • సమస్యను పరిష్కరించే సామర్థ్యం మరియు మంచి నిర్ణయం తీసుకొనే నేర్పు కలిగి ఉండాలి
  • వై.ఎస్.ఎస్. బోధనలు మరియు సిద్ధాంతాలపై జ్ఞానం మరియు అనుభవం కలిగి ఉండటం సహాయకరంగా ఉంటుంది
  • హిందీ మరియు ఆంగ్ల భాషలలో పట్టు కలిగి ఉండాలి

ప్రాజెక్ట్ మేనేజర్ (IT)

జాబ్ కోడ్: J6
ప్రదేశము: యోగదా సత్సంగ శాఖా మఠం, రాంచీ / సమీప ప్రాంతం (రిమోట్)
విభాగము:
ఐటీ
అవకాశం ఉన్న స్థానం(లు) సంఖ్య: 1

పాత్ర యొక్క ప్రధాన విధులు:

  • ప్రాజెక్ట్ అవసరాలు, గడువులు మరియు షెడ్యూల్‌లతో వాటాదారులందరూ మార్గంలో ఉన్నారని నిర్ధారించుకోవడానికి క్రాస్-డిసిప్లిన్ బృందాలతో సమన్వయం చేసుకోవడం
  • కార్యక్రమ బృందాల నుండి ప్రాజెక్ట్ అవసరాలను సేకరించడం మరియు వాటిని సాంకేతిక అవసరాలకు అనుగుణంగా అనువదించడం
  • అంతర్గత వాటాదారుల నుండి ధృవీకరణ పొందడానికి మాతృకలను రూపొందించడం
  • సమస్యలను గుర్తించడానికి మరియు పరిష్కరించడానికి ప్రాజెక్ట్ బృంద సభ్యులతో (ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్లతో) సన్నిహితంగా పని చేయడం
  • ప్రతి ప్రాజెక్ట్ కోసం క్షుణ్ణంగా Q/A టెస్టింగ్ ఉండేలా చూసుకోవడం
  • సమర్థవంతమైన ప్రాజెక్ట్ కమ్యూనికేషన్ ప్రణాళికలను ఏర్పాటు చేయడం మరియు వాటి అమలును నిర్ధారించడం
  • అన్ని పక్షాలకు సమాచారం అందేలా మార్పు అభ్యర్థనలను సులభతరం చేయడం
  • విజయవంతమైన అమలును ప్రారంభించడానికి అవసరమైన వినియోగదారు మాన్యువల్‌లు, శిక్షణా సామగ్రి మరియు ఇతర పత్రాల అభివృద్ధిని సమన్వయం చేయడం


అర్హతలు:

  • కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి
  • 5-10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి


సాంకేతిక ఆవశ్యకతలు:

  • వెబ్ అప్లికేషన్‌లు, MySQL డేటాబేస్‌లు
  • HTML, CSS, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, LAMP స్టాక్, క్లౌడ్ కంప్యూటింగ్
  • ప్రోగ్రామింగ్ భాషల్లో ఏదైనా ఒకదానిపై అవగాహన (PHP ప్రాధాన్యత)
  • సేల్స్‌ఫోర్స్ పరిజ్ఞానం అదనపు ప్రయోజనం


అదనపు వివరాలు:

  • వయస్సు: 30-55 సంవత్సరాలు
  • సమీప (రిమోట్) బృందాలతో సౌకర్యవంతంగా పని చేయగలగాలి
  • ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో నిరూపితమైన అనుభవం
  • సమీప ప్రాంతం (రిమోట్): మీరు సమీప (రిమోట్) ప్రాంతంలో పని చేస్తుంటే, మీరు ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు క్రమానుగతంగా రాంచీకి రావలసి ఉండవచ్చు.

మాకు వ్రాయండి:

పైన పేర్కొన్న అవకాశాల పట్ల మీకు ఆసక్తి ఉంటే మరియు మీరు దాని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే (వేతనం లేదా అదనపు వివరాలతో సహా), మేము careers@yssi.org కి ఈ-మెయిల్ పంపమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము లేదా కింది వాటిని సూచిస్తూ 88601 88799 కి కాల్ చేయండి:

– జాబ్ కోడ్ & మీకు ఆసక్తి గల పాత్ర యొక్క శీర్షిక
– ప్రాధాన్యత: సేవకులు (స్వచ్ఛంద సేవకులు) / వేతన ప్రాతిపదిక పై

దయచేసి మీ CV (ప్రాధాన్యంగా ఫోటోతో పాటు) మరియు మీరు భాగస్వామ్యం చేయాలనుకుంటున్న ఏవైనా ఇతర వివరాలను పంపండి.

మేము మీ నుండి వినడానికి మరియు గురుదేవుల లక్ష్యం కోసం కలిసి సేవ చేయడంలో ఆనందాన్ని పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాము.

ఇతరులతో పంచుకోండి