ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయము

ప్రార్థనల గురించి శ్రీ పరమహంస యోగానంద

శ్రీ శ్రీ దయామాత నుండి ఆహ్వానము:

శ్రీ దయామాత - ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్ యొక్క మూడవ అధ్యక్షురాలు.యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క “ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయం” గురించిన ఈ చిన్ని పుస్తకం ద్వారా ప్రార్థన యొక్క క్రియాశీలమైన శక్తి ద్వారా ఇతరులకు మాతోపాటు సేవచేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

ప్రతిరోజూ వార్తా పత్రికలలో ఏదో ఒక కొత్త రోగం లేక వినాశం, లేక ప్రపంచాన్ని యుద్ధానికి సమీపంగా తీసుకువెళ్ళే మరో అంతర్జాతీయ ఉపద్రవం, గురించో చదివి ఎందరో మనుష్యులు తమ యొక్క లేక తమ ఆప్తుల యొక్క జీవితాల విషయంలో ఎంతో అభద్రతా భావానికి లోనవుతున్నారు. “ఈ ప్రపంచంలో నేను ఆధార పడగలిగినది అసలు ఏదైనా ఉందా? నా కోసం, మొత్తం మానవజాతి కోసం నేను కోరుకునే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ భయాలకు విరుగుడుగా నేను చెయ్యగలిగినది ఏదైనా ఉందా?” అని చాలామంది అనుకునే సమయం ఆసన్నమయింది.

మన అవసరాలకు అనుగుణంగా ఖచ్చితంగా ఎప్పుడు, ఎలా మనం ప్రార్థించాలో తెలుసుకోవడం ద్వారా మనము కోరుకున్న ఫలితాలను పొందవచ్చు. సరైన పద్ధతిని పాటించినపుడు, అది దేవుని సరైన నియమాలను అమలులోకి తెస్తుంది; ఈ నియమాలను అమలు చేయడం వల్ల శాస్త్రీయంగా ఫలితాలను కలుగచేస్తుంది.

ఇలాంటి ప్రశ్నలకు మనం అందరం గాఢంగా స్పందిస్తాం—మన హృదయాలను ఇలా కలతపెట్టే ఈ సమస్యలకు ఒక సమాధానం ఉంది. వ్యక్తులు భౌతికంగానూ, భావోద్వేగపరంగానూ బాధపడడానికీ, దేశాలు సాంఘికమైన సంఘర్షణలకు, అంతర్జాతీయమైన కలహాలకు గురి అవడానికీ ఉన్న ఏకైక కారణమేమిటంటే తమ తమ స్వంత తప్పుడు ఆలోచనలు, పనుల వల్ల వారు దివ్య శక్తి మరియు ఆశీస్సు యొక్క మూలం నుండి తమను తాము దూరం చేసుకున్నారు.

బహుశః మునుపు ఎన్నటికంటే కూడా ఇప్పుడు, ఈ వర్తమానంలో ఆ నకారాత్మకతను మనం గట్టిగా వ్యతిరేకించవలసి ఉంది. ఈ భూమి మీద అసౌకర్యమైన జీవితం గడపడం కంటె అధికంగా ఏదైనా మనం కోరుకుంటూంటే, ఆ దివ్య మూలం (పరమాత్మ)తో మనం మన సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయం యొక్క ధ్యేయం అదే. ఆ కారణం చేతనే ఈ పుస్తకంలోని సందేశాన్ని గాఢంగా పరిశీలించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. అన్ని మతాలకు, అన్ని జాతులకు చెందిన ప్రతి మనిషి, ప్రతి స్త్రీ, ప్రతి బిడ్డా తమ యొక్క, తమ ప్రియతముల యొక్క స్వస్థత, భద్రతల కోసం ఏ విధంగా కృషి చెయ్యవచ్చో ఈ పుస్తకం వివరిస్తుంది. ప్రార్థన యొక్క శక్తిని, మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్న అపరిమిత దైవశక్తిని, కేంద్రీకృతం చెయ్యడానికి మీరు చేసే వ్యక్తిగత కృషి కలతల్లో చిక్కుపడిన ప్రపంచ దేశాల మధ్య సామరస్యం నెలకొల్పడానికి ఎంతో దోహదం చేస్తుంది.

అన్నిచోట్లా ఉన్న స్త్రీ పురుషులు తమలోనున్న దివ్యశక్తిని ఇంకా బాగా అనుభవంలోకి తెచ్చుకోవడంలో జాగృతులవడం కోసం మరియు ఆ దివ్య శక్తి బాహ్యంలో సమస్త జనులలోనూ శాంతి సౌభ్రాతృత్వాలుగా వ్యక్తమవడం కోసం మీరు ఈ ‘ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయం’లో భాగస్వాములవుతారని ఆశిస్తున్నాను.

— శ్రీ శ్రీ దయామాత

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ మూడవ అధ్యక్షులు

స్వస్థత ప్రార్థనలు చేస్తున్న ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయములోని వై.ఎస్.ఎస్. భక్తులు

ఇతరులతో పంచుకోండి