నేపాల్ భూకంపంపై శ్రీ శ్రీ మృణాళినీమాతగారి ప్రత్యేక సందేశం

27 ఏప్రిల్, 2015

శ్రీ శ్రీ మృణాళినీమాత నేపాల్ లో పరిస్థితిని చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు మరియు ఇటీవలి విధ్వంసకర భూకంపాల బారిన పడిన వారందరికీ భగవంతుని ప్రేమపూర్వక ఆశీస్సుల కోసం ప్రగాఢంగా ప్రార్థిస్తున్నారు. ఆమె హృదయం ప్రేమతో ఈ ఆత్మల దరి చేరుతుంది. విపత్తు ప్రాంతంలో ఉన్నవారికి ఉదార సహాయ ప్రయత్నాలకు తోడ్పడుతున్న అనేక ఆధ్యాత్మిక మరియు కారుణ్య సమాజాలతో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా జతకూడింది, అలాగే మృణాళినీమాతగారు గురుదేవుల ఆశ్రమాల్లోని సన్యాసుల ప్రార్థనలతో మరియు మన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి యొక్క ప్రార్థనలతో, ప్రతి ఒక్కరినీ తమ ప్రార్థనల ద్వారా కలవమని ప్రేరేపిస్తున్నారు. ఈ క్రింది లేఖలో ఆమె, ఓదార్పును మరియు ధైర్యాన్ని కలిగించే ప్రార్థన యొక్క శక్తిని గురించి, ముఖ్యంగా నేపాల్లో భూకంపాలు వంటి విపత్కర మరియు విషాద సమయాల్లో బాధపడేవారికి ఈ విధంగా చేయూతనివ్వడం యొక్క ప్రాముఖ్యతను, విలువను గురించి కొన్ని ఆలోచనలను పంచుకున్నారు.

విపత్కర జీవన పరిస్థితుల్లో ప్రార్థన యొక్క ఆధ్యాత్మిక శక్తి పై శ్రీ శ్రీ మృణాళినీమాత నుండి ఒక సందేశం

ప్రియతమలారా,

మన ప్రియతమ గురుదేవులైన శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు, చీకటిని పారదోలే ఆధ్యాత్మిక వెలుగులు, పెరిగే యుగం మనది అని మనకు అభయమిచ్చారు. అయినా ఈ ఐహిక ప్రపంచంలో అనివార్యమైన జీవితపు హెచ్చుతగ్గులను మనం అనుభవము చెందినప్పుడు, సామూహిక కర్మల విరుద్ధ ధోరణిలలో చిక్కుకున్న నిరపరాధి ఆత్మల బాధను చూసినప్పుడు, తరచూ మనం ఎంత దుర్బలతని అనుభూతి చెందుతాము. అలా౦టి సమయాల్లో, “ఎ౦దుకు ఇలా?” అని హృదయ౦ ఆక్రోశించినప్పుడు, మన మానవ అవగాహనకు తగిన సమాధాన౦ దొరకనప్పుడు, మన పరిమిత పరిధికి ఆవల, ఈ మాయ తుఫానుల మధ్య కూడా మనకు రక్షణనిచ్చే పరమాత్ముని వైపు మనం చూడాల్సిన అవసర౦ ఉ౦ది.

సృష్టిలోని సమస్తమూ దేవుని తలంపు నుండే ఉనికిలోకి వచ్చింది. మనము ఆయన బిడ్డలము. మన ఆలోచనలను, పనులను ఆయన సర్వసాధ్యమైన సంకల్పముతో ముడిపెట్టుట వలన, మన మర్త్య నిస్సహాయత అనే భ్రాంతి నుండి విముక్తులమై, మనలో ప్రతి ఒక్కరమూ ఈ లోకములో మంచికి ప్రేరణగా మనలో ఉండవలసిన సామర్థ్యాన్ని ప్రత్యక్షీకరించుకొంటాము. ఆత్మ యొక్క సహజ విశ్వాసం, భరోసా మరియు బేషరతుగా ప్రేమించబడతాము అనే అవగాహన నుండి ప్రవహించే ప్రార్థన, దేవుని స్వస్థత శక్తి యొక్క సువిశాల జలాశయము నుంచి ఆకర్షిస్తుంది. మనము అంతరికంగా నిజమైన భక్తి యొక్క ఆవశ్యకత, మరియు మన మదిలోని చిత్తశుద్ధితో ఆయనతో మాట్లాడినప్పుడు, మన ప్రార్థనను ఏకాగ్రతా శక్తితో నింపినప్పుడు, మన ప్రార్థన సృజనాత్మక దివ్య చైతన్యంలో వాస్తవికమవుతుంది. మన౦ ఆశించే సహాయ౦ దేవుని సర్వశక్తితో బలోపేతమై, మన జీవితాల్లో, ఇతరుల జీవితాల్లో సానుకూల ఫలితాల కోస౦ సాకారమయ్యే శక్తిగా సాక్షాత్కారమవుతుంది. “చాలా మంది జనులు ఘటనల గమనాన్ని సహజమైనవిగా మరియు అనివార్యమైనవిగా భావిస్తారు” అని గురుదేవులు మనతో అన్నారు. “ప్రార్థన ద్వారా ఎంతటి సమూలమైన మార్పులు సాధ్యమవుతాయో వారికి తెలియదు.” మన౦ అవసరమైన సమయాల్లో మన ప్రప౦చ కుటు౦బాన్ని చేరుకోగల అత్య౦త సమర్థవ౦తమైన, తక్షణ మార్గాల్లో ప్రార్థన కూడా ఒకటి. ఆ చైతన్యంలో, భాధలకు కారణమయ్యే ఒక పరిస్థితి గురి౦చి మన౦ తెలుసుకున్నప్పుడు మన మొదటి ప్రతిస్ప౦దన ఎల్లప్పుడూ ప్రార్థి౦చడము కానివ్వ౦డి — దేవుని పరిరక్షక ప్రేమలో ప్రభావితమైనవార్ని పరివేష్టించడము. అలా చేయడ౦ ద్వారా, మానవ ఉదార ప్రయత్నాల ద్వారా అందించబడుతున్న సహాయ౦లో ఒక అధికోన్నత శక్తిని పె౦పొ౦ది౦పజేసే విధ౦గా ఆయన (దేవుని) ఆశీస్సులు వారికి ప్రవహి౦చే మార్గాన్ని మన౦ విస్తృత౦ చేస్తాము; అలాగే మనము ఆయన శాంతి మరియు భరోసా కోసం మన హృదయాలను తెరుస్తాము.

దేవునితో గాఢమైన అనుశ్రుతి, సంశయము, అశాంతి అనే నిస్తేజాల్ని స్తబ్దపరచి, ఇతరుల కోస౦ మన౦ చేసే ప్రార్థనల అమోఘతను పె౦పొ౦దిస్తు౦ది, అలాగే ఆయన ప్రేమ, సత్య నియమాల ప్రకార౦ జీవి౦చడానికి మన౦ ప్రయత్ని౦చే చిత్తశుద్ధిని కూడా పెంచుతుంది. గురుదేవులు మనకు గుర్తు చేసినట్లుగా: “ఒక ఆత్మ యొక్క మంచితనం లక్షలాది మంది సామూహిక కర్మను సమర్థవంతంగా తటస్థ పరుస్తుంది.” మన౦ భావసారూప్యతగల ఇతర ఆత్మలతో జతకూనడినప్పుడు మన వ్యక్తిగత ప్రార్థనల ప్రభావ౦ ఎ౦త ద్విగుణీక్రుతమవుతుందో కూడా ఆయనకు తెలుసు కాబట్టి, గురుదేవులు తన ప్రప౦చవ్యాప్త సమాజ సేవలో భాగ౦గా ప్రప౦చవ్యాప్త ప్రార్థనా మండలిని స్థాపి౦చారు. ఆయన ఆశ్రమాల్లోని మనమందరం ప్రతిరోజూ చేస్తున్నట్లే, అసాధరణ అవసరంలో ఉన్న ఆయన పిల్లలందరికీ భగవత్ ఆశీస్సుల కోసం ఈ ఐక్య ప్రయత్నంలో మీ స్వీయ దైనందిన ప్రార్థనల ద్వారా పాల్గొనాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అలా౦టి ప్రార్థన ద్వారా, ప్రతీ సానుకూలమైన ఆలోచన ద్వారా, క్రియ ద్వారా, మీరు ఈ లోక౦లో సర్వోన్నత స్వస్థత చేకూర్చే, అ౦దరికీ తోడ్పాటునందించే, దేవుని కాంతిని, ప్రేమను విస్తారం చేయడానికి సాయము చేస్తున్నారు అని తెలుసుకో౦డి.

భవంతుడు, గురుదేవులు సదా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు,

శ్రీ శ్రీ మృణాళినీమాత

కాపీరైట్ © 2015 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం. 

ఇతరులతో షేర్ చేయండి