వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు స్వామి చిదానందగారి భారతదేశ పర్యటన — 2023

7 ఏప్రిల్, 2023

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి భారతదేశంలో అడుగుపెట్టారని, తన నెల రోజుల భారత పర్యటనను ప్రారంభించడానికి జనవరి 22న నోయిడా ఆశ్రమానికి చేరుకున్నారని మీకు తెలియజేయడం మాకు చాలా సంతోషాన్ని కలుగచేస్తోంది. ఆయనతో పాటు ఎస్.ఆర్.ఎఫ్. కు చెందిన స్వామి కమలానంద కూడా ఉన్నారు.

స్వామి చిదానందగారి పర్యటన సందర్భంగా, హైదరాబాద్ లో నిర్వహించిన ఒక ప్రత్యేక ఐదు రోజుల కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ప్రసంగాలు మరియు ధ్యానాలకు ఆయన అధ్యక్షత వహించారు. వై.ఎస్.ఎస్. సంగమం 2023 ప్రత్యక్ష ప్రసారం చేయబడింది, మరియు ఆ కార్యక్రమాలు ఇప్పటికీ వీక్షించడానికి అందుబాటులో ఉన్నాయి.

భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో స్వామీజీ పర్యటనకు సంబంధించిన ఫోటోలను మీతో ఇక్కడ పంచుకోవడం మాకెంతో సంతోషాన్ని కలుగజేస్తోంది.

శ్రీరాంపూర్ తీర్థయాత్ర ప్రదేశాలు

పరమహంస యోగానందుల గురువు, స్వామి శ్రీయుక్తేశ్వర్ గారితో సంబంధం ఉన్న రెండు తీర్థయాత్రా ప్రదేశాలను అభివృద్ధి చేసే ప్రణాళికల గురించి హైదారాబాద్ లో ఉన్నప్పుడు స్వామి చిదానందగారు ఆనందకరమైన ప్రకటన చేశారు.

వీటిలో మొదటిది గంగా నది ఒడ్డున ఉన్న మర్రిచెట్టుకి సంబంధించినది. ఇది శ్రీరాంపూర్ లోని శ్రీయుక్తేశ్వరుల ఆశ్రమానికి కొద్ది దూరంలో ఉన్నది. 1894లో దీని క్రింద ఆయనను మహావతార్ బాబాజీ కలిశారు (ఒక యోగి ఆత్మకథ లో వివరించినట్లుగా).

ఈ పవిత్రమైన మర్రిచెట్టు నుండి నదికి వెళ్ళే ప్రదేశం యొక్క నిర్వహణ బాధ్యతను వై.ఎస్.ఎస్. తీసుకోవడం జరిగింది మరియు దాని నిర్వహణను కొనసాగించేందుకు శ్రీరాంపూర్ మున్సిపాలిటీతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆ మర్రిచెట్టు ప్రక్కనే ఉన్న రెండు పెద్ద భవనాలను కూడా వై.ఎస్.ఎస్. సమకూర్చుకోవడం జరిగింది. అవతార పురుషులైన బాబాజీ అక్కడ శాశ్వతంగా వదిలిన ప్రకంపనల అనుభూతిని భక్తులు పొందేందుకు తగిన ధ్యాన వాతావరణాన్ని కల్పించడానికి తగిన సమయంలో ఈ ప్రదేశం కోసం వై.ఎస్.ఎస్. ప్రణాళికలను అభివృద్ధి చేస్తుంది.

రెండవ ప్రదేశం, శ్రీరాంపూర్ లోని స్వామి శ్రీయుక్తేశ్వరుల ప్రధాన ఆశ్రమానికి సంబంధించినది, ఇక్కడ పరమహంసగారు తన జీవితాన్ని పరివర్తన చేసిన ఆధ్యాత్మిక శిక్షణను పొందడం జరిగింది. దీని గురించి ఆయన ఒక యోగి ఆత్మకథ లోని “గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం” అనే అధ్యాయంలో వివరించడం జరిగింది.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అనేక సంవత్సరాలుగా ఈ ఆశ్రమ ఆస్తిలోని కొంత భాగంలో స్మారక మందిరాన్ని (పైన చూపబడింది) నిర్వహిస్తోంది. స్వామి శ్రీయుక్తేశ్వరుల ఈ స్మృతి మందిరాన్ని 1977లో వై.ఎస్.ఎస్. వజ్రోత్సవ ఉత్సవాల్లో భాగంగా శ్రీ మృణాళినీమాత అంకితం చేశారు.

ఆశ్రమ ఆస్తికి సంబంధించిన సంపూర్ణ యాజమాన్య హక్కులను వై.ఎస్.ఎస్. సొంతం చేసుకొంది. ఈ గొప్ప గురువుల శాశ్వత ప్రకంపనలతో నిండిన తీర్థయాత్రా ప్రదేశాన్ని ఆధ్యాత్మిక అన్వేషకులకు అందుబాటులో ఉంచడానికి అసలైన ఆశ్రమ భవనాన్ని సాధ్యమైనంత వరకు పునరుద్ధరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది.

శ్రీరాంపూర్ లోని ఈ రెండు పవిత్ర తీర్థయాత్రా ప్రదేశాలకు సంబంధించిన సవివరమైన ప్రణాళికలను సరైన సమయంలో మీకు తెలియచేయడానికి మేము ఎదురుచూస్తున్నాం.

నోయిడా ఆశ్రమంలో సత్సంగం

వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమంలో ఫిబ్రవరి 26న “క్రియాయోగం యొక్క పరివర్తక శక్తి” అనే అంశంపై వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు స్వామి చిదానంద గిరి గారు స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. ఈ ప్రసంగానికి దాదాపు 1,400 మంది భక్తులు మరియు స్నేహితులు హాజరయ్యారు.

క్రియాయోగ శాస్త్రాన్ని క్రమబద్ధంగా, అంకితభావంతో, నిరంతరాయంగా, భక్తితో సాధన చేసినప్పుడు కలిగే పరివర్తన శక్తిని గురించి స్వామీజీ ప్రసంగించారు.

తన భారతదేశ పర్యటన చివరి దశలో స్వామీజీ నోయిడాలో పాల్గొన్నారు.

నోయిడాలో స్వామి చిదానందగారి సత్సంగంలోని కొన్ని ముఖ్య సన్నివేశాలు:

యోగదా సత్సంగ మఠం సందర్శన, దక్షిణేశ్వరం

హైదారాబాద్ లో జరిగిన సంగమంలో పాల్గొన్న తరువాత, స్వామి చిదానందగారు దక్షిణేశ్వరంలోని యోగదా సత్సంగ మఠానికి ప్రయాణించారు. ఫిబ్రవరి 19, 2023 ఆదివారం నాడు ఒక ప్రత్యేక సత్సంగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెందిన కొన్ని చిత్రాలను మీతో పంచుకోవడం మాకు ఆనందాన్ని కలిగిస్తోంది.

వై.ఎస్.ఎస్. సంగమం 2023లో పాల్గొనేందుకు హైదారాబాద్ పర్యటన

రాంచీలోని యోగదా సత్సంగ మఠం సందర్శన తరువాత, స్వామి చిదానందగారు కాన్హా శాంతి వనంలో జరిగిన వై.ఎస్.ఎస్. సంగమం 2023లో పాల్గొనేందుకు ఫిబ్రవరి 10, 2023న హైదరాబాద్ చేరుకున్నారు. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు గురుదేవుల బోధనలలోని జ్ఞాన ముత్యాలను భక్తులతో పంచుకొని, 3-గంటల ప్రత్యేక సామూహిక ధ్యానాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 16న స్వామీజీ ముగింపు సత్సంగం నిర్వహించారు. సంగమ అనుభవాన్ని భక్తులు తమతో ఎలా కొనసాగించవచ్చో ప్రేరణాత్మకంగా ప్రసంగించారు.

దయచేసి కార్యక్రమంలోని కొన్ని ఫోటోలను క్రింద చూసి ఆనందించండి.

సంగమంలో ప్రత్యక్ష ప్రసారమైన కార్యక్రమాలన్నిటినీ వీక్షించడానికి దిగువనున్న బటన్ మీద క్లిక్ చేయండి.

వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో స్వామి చిదానందగారి సత్సంగం

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన స్వామి చిదానంద గిరి గారు ఫిబ్రవరి 5న వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో సత్సంగం నిర్వహించారు. ఇందులో 800 మంది వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అక్కడ సమావేశమైన వారికోసం స్వామీజీ ఒక నిర్దేశిత ధ్యానాన్ని నిర్వహించి, నిష్క్రమించే వారందరికీ వ్యక్తిగతంగా ప్రసాదం అందజేసి నమస్కరించారు.

యోగదా సత్సంగ విద్యా సంస్థ ఆవరణలో నూతన సౌకర్యాల అంకిత కార్యక్రమం — జగన్నాథ్‌పూర్‌ (రాంచీ)

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క పూజ్యనీయ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి స్వామి చిదానందగారు జనవరి 29న రాంచీలోని జగన్నాథ్‌పూర్‌లో యోగదా సత్సంగ విద్యావరణలో నూతన సదుపాయాలను అంకితం చేశారు. 1,100 మంది పైగా హాజరైన ఈ చిరస్మరణీయ కార్యక్రమంలో రాంచీ విద్యా సంస్థలకు చెందిన సభ్యులు, వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు భక్తులు, వై.ఎస్.ఎస్. విద్యాసంస్థ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే నూరు సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర కలిగిన ఈ సంస్థ గురించి వివరించే ఒక చిన్న వీడియో కూడా ప్రదర్శించబడింది.

ప్రాచీన గురుకుల సూత్రాలకు అనుగుణంగా నాడు శ్రీ పరమహంస యోగానందగారు స్థాపించిన పాఠశాల మాదిరిగా, ప్రకృతి సాన్నిధ్యంలో అభ్యాసన వంటి అత్యాధునిక సౌకర్యాలను రూపొందించారు. వాటిలో తరగతి గదులు, ప్రయోగశాలలు, సమావేశ మందిరం మరియు పరిపాలనా భవనం ఉన్నాయి. ఈ ఆధునిక పాఠశాల ప్రాంగణాన్ని ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన విద్యార్థులు వినియోగించుకుంటారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలోని కొన్ని ఫోటోలను ఈ క్రింద వీక్షించండి.

రాంచీ సందర్శన

స్వామి చిదానందగారు జనవరి 24, 2023 సాయంత్రం, రాంచీలోని యోగదా సత్సంగ శాఖా మఠం చేరుకున్నారు. రాంచీలో స్వామీజీ నివసించే సమయంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. వారు ఇక్కడకు వచ్చినప్పటి కొన్ని ఫొటోలను మీతో మేము పంచుకుంటున్నాం.

భారతదేశంలో స్వామీజీ ఆగమనం

స్వామీజీ రాక సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయం మరియు వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం వద్ద స్వాగతం చెబుతున్న కొన్ని చిత్రాలను మీతో పంచుకోవడం మాకు సంతోషాన్ని కలుగచేస్తోంది.

ఇతరులతో షేర్ చేయండి