వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవం — జనవరి 31, 2021

26 జనవరి, 2021

ఆన్‌లైన్ ధ్యాన కేంద్రానికి స్వాగతం

“సామూహిక ధ్యానం కొత్త ఆధ్యాత్మిక ఔత్సాహికులను అలాగే అనుభవజ్ఞులైన సాధకులను సంరక్షించే కోట. కలిసి ధ్యానం చేయడం వల్ల సామూహిక అయస్కాంత తత్వం యొక్క అదృశ్య ప్రకంపనా మార్పిడి నియమం ద్వారా సమూహంలోని ప్రతి సభ్యునికి ఆత్మసాక్షాత్కార స్థాయిని పెంచుతుంది.”

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం యొక్క స్ఫూర్తిదాయకమైన ప్రారంభపు 3-గంటల ధ్యానం యొక్క అనుభవం పొందేందుకు మీ అందర్నీ ఆహ్వానిస్తున్నాము, ఆదివారం, జనవరి 31, 2021న జరిగిన ఈ ధ్యానం యొక్క మొదటి గంటను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.) అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు నిర్వహించారు, మిగిలిన భాగానికి వై.ఎస్.ఎస్. సన్యాసి నేతృత్వం వహించారు.

2019 అక్టోబర్ లో స్వామి చిదానందగారు ప్రారంభించిన ఎస్.ఆర్.ఎఫ్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రానికి ప్రతిరూపంగా ఈ వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం ఉంటుంది. (“ధ్యాన కేంద్రం” అనేది “మెడిటేషన్ సెంటర్”కు హిందీ పదం). అప్పటి నుండి క్రమంగా పెరుగిన ఎస్.ఆర్.ఎఫ్. మరియు వై.ఎస్.ఎస్. భక్తులు మరియు స్నేహితులు సామూహిక ధ్యానాల యొక్క ప్రయోజనాలను మరియు ఆశీస్సులను అనుభూతిచెందడానికి, ఆన్‌లైన్‌లో సమ్మిళితమవుతున్నారు.

వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం వై.ఎస్.ఎస్. భక్తులకు సేవలందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఆన్‌లైన్ సామూహిక ధ్యానాలు, ఏకాంత ధ్యాన వాసాలు మరియు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఈ ఆశీస్సుల లభ్యత మరింత విస్తరిల్లుతుంది. మరింత సమాచారం కొరకు దయచేసి మా ఆన్‌లైన్ ధ్యాన కేంద్ర పేజీని సందర్శించి పూర్తి కార్యక్రమ వివరాలను చూడండి.

కార్యక్రమ తేదీలు మరియు ఇతర ప్రతిపాదనలు

తేదీల పేజీని సందర్శించడం ద్వారా ప్రతీ వారం వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం ద్వారా వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించే ధ్యానాలు, మరియు ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు హాజరు కావడానికి అందరికీ సుస్వాగతం.

భవిష్యత్తులో, వివిధ రకాల ధ్యానాలను నిర్వహించాలనుకుంటున్నాము: తక్కువ నిడివి కలవి, దీర్ఘమైనవి, కీర్తనలతో కూడినవి, మొదలైనవి చేర్చి మా ఆన్‌లైన్ కార్యక్రమాలను విస్తరించాలని ఆశిస్తున్నాము. మేము త్వరలో అనేక భారతీయ భాషలలో వాటిని అందించడం ప్రారంభిస్తాము. రాబోయే నెలల్లో పవిత్ర గ్రంథాల మరియు వై.ఎస్.ఎస్. పాఠాల పఠన బృందాలను కూడా ప్రారంభించాలని యోచిస్తున్నాము.

మీరు ఈ సంతోషకరమై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము, అలాగే మీరు క్రమం తప్పకుండా సామూహిక ధ్యానాలు మరియు ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారని మేము ఆశిస్తున్నాము.

కార్యక్రమం యొక్క వార్తలను సేకరించిన ప్రసార సాధనాలు

ఇతరులతో షేర్ చేయండి