“క్షమించడం అంటే మనశ్శాంతిని పొందడమే” అనే అంశంపై శ్రీ దయామాత

7 ఏప్రిల్, 2023

1955 నుండి 2010లో పరమపదించే వరకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కు సంఘమాతగా మరియు అధ్యక్షురాలిగా పనిచేసిన శ్రీ శ్రీ
దయామాత రచించిన “
ఫైండింగ్ ది జాయ్ వితిన్ యు” పుస్తకం నుండి ఈ క్రింది సారాంశం.

గులాబీని చిదిమేసినా అది సువాసనను వెదజల్లిన్నట్లే, భగవంతుని భక్తుడు నిర్దయ వలన అణచివేయబడినప్పటికీ మధురమైన ప్రేమ స్వభావాన్నే వెదజల్లుతూ ఉంటాడు అని పరమహంస యోగానందులు చెప్పేవారు.

క్షమ, దివ్యప్రేమ యొక్క ఓదార్పు ప్రకంపనలతో, కోపం, అపరాధము మరియు ద్వేషం యొక్క హరింపజేసే ఆందోళనను తటస్థీకరిస్తుంది. అపరిపూర్ణ ప్రపంచంలో మంచితనం అనివార్యంగా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది, క్షమించడమనేది దివ్య చైతన్యం యొక్క వ్యక్తీకరణ.

మనం చెడు ప్రవర్తనకు గురైనప్పుడు, మన పట్ల తప్పుగా ప్రవర్తించినవారిని ఖండించే బదులు, మనం యథేచ్ఛగా క్షమాభిక్ష ప్రసాదించి, మన చైతన్య ఫలకాన్ని శుభ్రపరుచుకుంటే, దాని ఫలితం మనకు మనమే దివ్యమైన మనశ్శాంతిని పొందుతాము.

క్షమించడము, మరచిపోవడము మరియు దానిని పూర్తిగా వదిలివేయడమూ ఎందుకని కొన్నిసార్లు చాలా కష్టం అనిపిస్తుంది? మానవుడి అహం ప్రతీకారేచ్ఛను కోరుతుంది, అది ప్రతీకారం లేదా దండన ద్వారా దానిని ఆశిస్తుంది; దండించినప్పుడు అది ఘనంగా అనిపిస్తుంది. కాని ఇది మనకు శాంతిని ఇవ్వదు.

నిజంగా తానైన ఆత్మ నుండి మనం విన్నప్పుడు మనం చాలా సంతోషిస్తాము — స్వయం సంతృప్తమైనది — మరియు తప్పు చేసినవారి తప్పులను మాఫీ చేసి, “ప్రభూ, అతన్ని దీవించు” అని ప్రార్థిస్తే మనం మరింత సంతోషంగా ఉంటాం. మన తప్పులను భగవంతుడు మరియు ఇతరులు క్షమించాలని మనం కోరుకోవడం లేదా? “క్షమించండి మరియు మీరు క్షమించబడతారు” అనేది దివ్య నియమం.

హిందూ గ్రంథాలలో ఇలా వ్రాయబడింది: “గాయమెంతటిదైనా క్షమించాలి….క్షమ ఈ విశ్వాన్ని నిలిపి ఉంచుతుంది. క్షమ అనేది బలవంతుల బలం; క్షమ త్యాగం; క్షమించడం అనేది మనస్సు యొక్క శాంతి. క్షమ, సౌమ్యత అనేవి స్వయం సంపన్న గుణాలు. అవి శాశ్వత ధర్మానికి ప్రతీకగా నిలుస్తాయి.”

అందరికీ దయ మరియు స్వస్థతను చేకూర్చే ప్రేమను అందించండి, ఈ ఆదర్శంతో జీవించడానికి ప్రయత్నించండి. అప్పుడు దేవుని సర్వస్వరూపమైన ప్రేమ మీ హృదయంలోకి జాలువారుతున్నట్లు మీరు అనుభూతి చెందుతారు.

ఇతరులతో షేర్ చేయండి