క్రియాయోగంలో ఆశ్రయం పొందడం — స్వామి చిదానంద గిరి గారి మూడు వీడియోలు

10 మార్చి, 2023

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆన్‌లైన్ “సంగమం 2023” హాజరయ్యారా?

పరమహంస యోగానందగారి బోధనలపై ఫిబ్రవరిలో జరిగిన ఐదు రోజుల కార్యక్రమం మొత్తం హైదరాబాద్ నుండి ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఈ కార్యక్రమానికి వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులైన స్వామి చిదానంద గిరి గారు అధ్యక్షత వహించారు — ఇది ఇప్పటికీ వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్ మరియు వై.ఎస్.ఎస్. యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది.

స్వామి చిదానందగారు సంగమంలో ప్రసంగించిన ప్రారంభ మరియు ముగింపు కార్యక్రమాల వీడియో రికార్డింగ్‌లను మరియు కార్యక్రమం సందర్భముగా ఆయన నిర్వహించిన మూడు గంటల ధ్యానాన్ని ఈ పేజీలో చూడవచ్చు. ఈ ప్రత్యేక కార్యక్రమాలలో లభించిన ప్రేరణ మరియు మార్గదర్శకత్వాన్ని ఆచరణలో పెట్టడానికి మీరు ఈ వనరులను ఉపయోగించుకొంటారని ఆశిస్తున్నాం.

ప్రారంభ ప్రసంగం

ఈ ప్రారంభ ప్రసంగం శరణం అనే భావనతో మనం ఎలా సంబంధం ఏర్పరచుకోవచ్చో తెలియజేస్తుంది — క్రియాయోగ మార్గం యొక్క వివిధ ఆశీస్సులతో — ఆశ్రయం మరియు శరణం పొందడం. స్వామి చిదానందగారు వివరించినట్లుగా, సంగమం యొక్క ముఖ్యాంశాలలో ఒకటి క్రియాయోగంలో శరణం పొందడం “మన దివ్య మరియు గౌరవనీయులైన పరమహంసగారి వంటి సద్గురువుల ఆశీస్సులతో సాధన చేసినప్పుడు క్రియాయోగ ధ్యానం ప్రసాదించే ఆ దివ్య సాక్షాత్కారంలో శరణం మరియు శాశ్వతమైన ఆశ్రయం పొందడమై ఉండాలి.”

మూడు-గంటల ధ్యానం

స్వామి చిదానందగారు నిర్వహించిన మూడు గంటల ధ్యానంలో పాల్గొనండి, ఇందులో నిర్దేశిత మానసిక చిత్రీకరణలు మరియు దివ్య సంకల్పాలు, అలాగే నియమిత సమయం పాటు భక్తి సంకీర్తన మరియు నిశ్శబ్ద ధ్యానంలో ఆత్మ యొక్క శాంతి మరియు నిశ్చలత్వంలో చైతన్యాన్ని నిమగ్నం చేయడం వంటివి ఉన్నాయి.

ముగింపు ప్రసంగం

సంగమంలోని తన చివరి కార్యక్రమంలో, స్వామి చిదానందగారు తన ప్రారంభ ప్రసంగంలో పరిచయం చేసిన అత్యున్నతమైన మరియు పరవశింపజేసే ఆలోచన గురించి విస్తృతంగా వివరించారు, మనలో ప్రతి ఒక్కరూ “భారతదేశ ఆధ్యాత్మిక స్వర్ణ యుగానికి మరియు అభివృద్ధి చెందుతున్న ప్రపంచ నాగరికత మధ్య వారధిగా ఎలా ఉండవచ్చో వివరించారు.” క్రియాయోగ మార్గం యొక్క ధ్యాన పద్ధతులను మరియు విశ్వజనీనమైన జీవించడం-ఎలా అనే సూత్రాలను ఉపయోగించడం ద్వారా మన జీవితాలను ఉద్ధరించుకొని ప్రకాశవంతం చేసుకోవచ్చు — మనకు మరియు ప్రపంచం యొక్క గొప్ప ప్రయోజనం కోసం.

ఇతరులతో షేర్ చేయండి