స్వామి చిదానందగారి రాంచీ ఆశ్రమ సందర్శన

11 నవంబర్, 2019

మన గౌరవనీయ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు, శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి, భారతదేశంలోని మూడు ప్రధాన నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు అధ్యక్షత వహించడానికి అక్టోబర్ మధ్య నుండి నవంబర్ 2019 మధ్య వరకు భారతదేశంలో ఉన్నారు.

నోయిడాలో తన మొదటి కార్యక్రమాన్ని ముగించుకుని, తదుపరి 10 రోజులు గడపడానికి రాంచీలోని వై.ఎస్.ఎస్. ఆశ్రమానికి వచ్చారు. అనంతరం హైదరాబాద్, ముంబైను సందర్శించిన ఆయన, అక్కడ తన పర్యటనను ముగించారు.

రాంచీ ఆశ్రమంలో స్వామీజీకి వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు భక్తులు గౌరవంతో, భక్తితో, ప్రేమతో స్వాగతం పలికారు.

రాంచీలో ఉన్న సమయంలో ఆయన భక్తులు, ప్రభుత్వ అధికారులు, ప్రసార సాధనాలతో సమావేశమయ్యారు. ఇద్దరు వై.ఎస్.ఎస్. సన్యాసులకు సన్యాస ప్రమాణ వేడుకను కూడా నిర్వహించారు.

అక్టోబరు 27న దీపావళి సందర్భంగా స్వామి చిదానందగారు, మన జీవితాల్లోకి భగవంతుని వెలుగును తీసుకురావడం అనే అంశంపై ప్రసంగించారు. దీనికి 800 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది.

ఆయన సాన్నిధ్యాన్ని, అందరి పట్ల ఆయనకున్న ప్రేమను చూసి భక్తులు ఉప్పొంగిపోయారు. ఒక భక్తుడు ఇలా వ్రాశాడు, “ఆయనకు భారతదేశం పట్ల మరియు ఇతర భక్త బృందం పట్ల ఉన్న ప్రేమ మరియు వారు భారతీయులైనా లేదా ఇతర తీరాల నుండి వచ్చినా, ఆయన దానిని దాచలేనంత స్పష్టంగా ఉంది. ప్రతిసారీ ఆయన మమ్మల్ని దాటుకుంటూ వెళ్ళినప్పుడు లేదా మేము ఒక మార్గంలో వేచి ఉన్నప్పుడు మమ్మల్ని చూసి నవ్వినప్పుడు ఆయన కళ్ళు మెరుస్తూ, మనం ఆయనచే మరియు మన గురుదేవులచే ప్రేమించబడ్డామని చెప్పాయి.”

రాంచీలో ఆయన బస చేసినప్పటి కొన్ని చిత్రాలను ఇక్కడ పంచుకుంటున్నాము.

ఇతరులతో షేర్ చేయండి