స్వామి చిదానందగారి ఆశాజనక సందేశం – మే 21

20 మే, 2020

ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు స్వామి చిదానంద

వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. అధ్యక్షుడు స్వామి చిదానంద గిరి, ఇతర ప్రపంచ ఆధ్యాత్మిక ప్రముఖులతో కలిసి, ఈ గురువారం, మే 21, రాత్రి 11:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) సియోన్ ఎర్త్ వారి #MAYDAY ఆన్‌లైన్ కార్యక్రమం సందర్భంగా ఆశాజనక మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం యొక్క సందేశాన్ని మనందరికీ అందించనున్నారు. “ప్రపంచ ధ్యాన దినోత్సవం” రోజున జరిగే సమైక్య ధ్యానం మరియు దైవప్రార్థన ప్రత్యేక కార్యక్రమం కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో, ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రపంచంలోనే ఇది అతిపెద్ద సమావేశ౦ కావాలని ఆశిస్తున్నారు.

“ప్రపంచానికి ఒక కొత్త రూపు వస్తున్నందున, భయం నుండి ప్రేమలోకి ప్రపంచ శక్తిని మార్చడానికి నేటి తరం ప్రపంచ ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు మరియు కళాకారులతో చేరవల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాము” అని సియోన్ ఎర్త్, తన ఉదాత్తమైన ఆకాంక్షను తెలియజేసింది. #MAYDAY వక్తలు మరియు కళాకారులతో ఒక గంట కార్యక్రమం, పిదప ఇరవై నిమిషాల పాటు ప్రపంచవ్యాప్త ధ్యానం ఉంటుంది. అనేక విశ్వాసాల సంప్రదాయాలకు చె౦దిన జనులను ఏకం చేసే, ఒక అద్వితీయమైన ఆధ్యాత్మిక ప్రయత్నంలో మనుష్యులు “స్వస్థత, సహానుభూతి మరియు శ్రద్ధ” పై దృష్టిని కేంద్రీకరి౦చడ౦ మరి౦త మెరుగ్గా నేర్చుకోగలరని సియాన్ ఎర్త్ ఆశిస్తో౦ది.

ఈ కార్యక్రమంలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌తో బాటు పాల్గొనే సంస్థలలో అగాపే ఇంటర్నేషనల్, బ్రహ్మ కుమారీస్, ది హఫింగ్టన్ పోస్ట్, ఎ గ్రేటర్ గుడ్ ఫౌండేషన్ ఇంకా అనేక ఇతర సంస్థలు ఉన్నాయి.

ఇదే ప్రాతిపదికన, వై.ఎస్.ఎస్. కూడా సాధకులందరినీ స్వాగతిస్తుంది:

సియోన్ ఎర్త్ #MAYDAY కార్యక్రమం గురించి మరింత సమాచారం కొరకు, దయచేసి www.sionearth.com సందర్శించండి.

ఇతరులతో షేర్ చేయండి