స్వామి చిదానందగారి భారతదేశ పర్యటన సందర్భంగా ప్రసారసాధనాల వార్తాసేకరణ — 2023

6 మే, 2023

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.) అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులైన స్వామి చిదానందగిరి గారు, ఇటీవల ఫిబ్రవరి 2023లో భారతదేశాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో, స్వామిజీ నోయిడా, రాంచీ మరియు దక్షిణేశ్వరంలలో ఉన్న వై.ఎస్.ఎస్. ఆశ్రమాలను సందర్శించారు మరియు హైదరాబాద్‌లో జరిగిన వై.ఎస్.ఎస్. సంగమం 2023కు అధ్యక్షత వహించారు.

స్వామిజీ భారత పర్యటన సందర్భంగా ప్రసారసాధనాల వార్తాసేకరణలోని కొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ ఇవ్వబడాయి.

స్వామి చిదానందగారితో భేటీ — ద పయనీర్‌ లో ప్రచురించబడిన స్వామీజీ ముఖాముఖి సమావేశం

స్వామీజీ “ది పయనీర్,” అనే ఓ ఆంగ్ల పత్రికతో సమావేశమయ్యారు. సమాజం మరియు ప్రపంచంలోని వివిధ శ్రేణులను ప్రభావితం చేసే వివిధ ముఖ్యమైన సమస్యలపై పది భాగాల శ్రేణిలోని అన్ని కథనాలు (క్రింద అందించబడ్డాయి) ది పయనీర్ లో ప్రచురించబడ్డాయి.

భాగం 10: ఆచరించనప్పుడు స్ఫూర్తి పొందిన విషయానికి విలువ చాలా తక్కువగా ఉంటుంది

ప్రశ్న: స్వామీజీ, భారతదేశంలో రామాయణం, గీత, ఉపనిషత్తులు వంటి గ్రంథాలను చదివే సంప్రదాయం మనకు ఉంది. యోగానందగారి బోధనలు చదువుతున్న వారందరికీ, వాటిలో ఉన్న జ్ఞానమంతా ఈ బోధనలలో లభిస్తుందా? ఇంకా అవి కూడా చదవాల్సిన అవసరం ఉందా?
అలాగే, కొన్నిసార్లు ఎవరైనా ఒక పుస్తకాన్ని చదవమని లేదా ఒక నిర్దిష్ట ప్రేరణాత్మక ప్రసంగాన్ని వినమని మనకు సిఫార్సు చేస్తారు. ఒక భక్తుడు ఇతర మార్గాల వైపు చూడకపోవడం లేదా ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపకపోవడం ఆధ్యాత్మిక దురభిమానమవుతుందా?

స్వామి చిదానందజీ: లేదు! అది విధేయత అవుతుంది! ఇంకా అది నిజంగా ఒకరు ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కడ ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు బోధనలను అన్వేషించే మరియు సరిపోల్చుకొనే దశలో ఉన్నప్పుడు, అది సహజంగానే “ఓహ్! మనం ఆ ఉపన్యాసం విందాము మరియు అది అర్థవంతంగా ఉందా లేదా, ఇది మరింత అర్థవంతంగా ఉందా అని చూస్తాం.” ఫరవాలేదు. కాని, గురువుతో ఆ సంబంధాన్ని ఏర్పరచుకున్న క్రియాబాన్ శిష్యులకు, ఆధ్యాత్మికశక్తి ఒక మార్గం ద్వారా మాత్రమే వస్తుందని, అది భగవత్ సాక్షాత్కారం పొందిన గురువు ద్వారా మాత్రమే అని యోగానందగారు మనకు స్పష్టంగా తెలిపారు.

ఇప్పుడు, దాన్ని కూడా సంతులనంతో మరియు ఇంగితజ్ఞానంతో అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదని లేదా విషయాలకు దూరంగా ఉండాలని దీని అర్థం కాదు. ఇతర వ్యక్తుల స్ఫూర్తిదాయక కథల నుండి మీరు పొందగలిగే అద్భుతమైన ప్రేరణ మరియు ప్రోత్సాహం చాలా ఉంటుంది. ఆ శాస్త్రీయ సమాచారం మనస్సును ఉత్తేజపరిచేందుకు నిజంగా సహాయపడి, మా గురువుగారు బోధించిన దానిని ధృవీకరిస్తుంది. మీరు మీ స్వీయ గురువు బోధించిన సాధనా పద్ధతులను ఆమోదించిన తర్వాత, ఇతర ఆధ్యాత్మిక సూచనలను లేదా ఆధ్యాత్మిక పద్ధతులను తీసుకోకపోవడమే ఇది.

అన్నింట్లోకల్లా మొదటిది, యోగానందగారి భక్తులుగా ఇప్పటికే మీరు — ‘గీత’ ను మరియు పాశ్చాత్య ప్రపంచం కోసం ‘క్రీస్తు సువార్త బోధనలు’ అనే గ్రంథాలను చదువుతున్నారు. అవి రెండూ అద్భుతమైన గ్రంథాలు. “మీరు పవిత్ర గ్రంథాలను చదవడం మానేయండి,” అని మేము అనడం లేదు. అయితే అన్ని గ్రంథాలను చదవడం అవసరమా? లేదు! ఎందుకంటే గురుదేవులు భక్తునికి కావలసినవన్నీ పవిత్ర గ్రంథాల సారమంతా, సాధన చేసుకోడానికి వీలైన ఆచరణాత్మక కార్యక్రమంగా రూపొందించి భక్తులకు అందించారు. చాలా మంది వ్యక్తులు (ఈ ప్రపంచంలో సాధారణంగా చేసేది ఇదే), కొన్ని గ్రంథాలను చదివి, ఆ తరువాత వారు “సరే, నేను నా బాధ్యతను నెరవేర్చాను,” అని అనుకుంటారు. కాని దాని వల్ల మీరు కోరుకున్నది మీకు లభించదు. మీకు మీ ఆత్మ యొక్క చైతన్యం కావాలి, దేవునితో సజీవ క్రియాశీల సంబంధం గురించి మీకు చైతన్యం కావాలి. ఒక పుస్తకాన్ని, ఒక గ్రంథాన్ని చదవడం ద్వారా మీరు దాన్ని పొందలేరు.

కాబట్టి, గ్రంథాలు చదవడంలో తప్పు లేదు. అవి అద్భుతమైనవి, వాటిలో చాలా స్ఫూర్తిదాయకమైన అంశాలు చాలా ఇమిడి ఉంటాయి మరియు సరైన ప్రవర్తన, గాఢమైన ఆధ్యాత్మిక సత్యాలు మొదలైనవాటికి సంబంధించిన అనేక శాశ్వతమైన ఉపయోగకరమైన సూత్రాలు వాటిలో ఉంటాయి. కాని, వాటిని చదవాల్సిన అవసరం లేదని నేను చెబుతాను. కాని అలా చేయడంలో తప్పు లేదు, ఒక భక్తుడు, అవి చదివి ఎక్కువ సమయం వెచ్చించేకంటే, వై.ఎస్.ఎస్. పాఠాలు చదువుకొని ధ్యానానికి ఆ సమయాన్ని కేటాయించడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చు. మీరు ఒక గంట చదివితే, మీ పునఃపరిశీలన రెండింతలు అవుతుంది మరియు దాని గురించి ఇంకా ఎక్కువ కాలం లోతుగా ఆలోచిస్తారు అని గురుదేవులు చెప్పారు. మొట్టమొదట ముఖ్యమైనది ధ్యానం. పుస్తకాలు చదవడం మనకు నిరంతరం స్ఫూర్తినిస్తుంది, కాని చివరికి, దానిని ఆచరణలో పెట్టకపోతే ఆ స్ఫూర్తి నిష్ఫలమై పోతుంది.

భాగం 9: ఒక ఆధ్యాత్మిక యోధుడిగా ఉండి, మీలోని కౌరవులతో పోరాడండి

ప్రశ్న: “ప్రయత్నాన్ని ఎన్నడూ విడిచిపెట్టని పాపాత్ముడే మహాత్ముడు,” అని యోగానందగారు అన్నారు. కాని, కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదట ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రారంభించినప్పుడు, దానిలో తమకు నిజంగా అర్హత లేదనే భావనను కలిగి ఉంటారు. మనం మన స్వంత భౌతిక అలవాట్లు మరియు ప్రాపంచిక మార్గాలలో లోతుగా పాతుకుపోయినందున, “సాధువులందరు ఇక్కడ ఉన్నారు, వారి మధ్య కూర్చొన్న పాపిని నేను!” అని ఆలోచిస్తూ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడానికి నిరుత్సాహపడవచ్చు.

స్వామి చిదానందగారు: ఇది సార్వత్రిక మాయ, మానవులందరికి ఈ మాయ కలుగుతుంది, ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులకు ఈ విధంగా ఉంటుంది. మనందరికీ కొంచెం వినయం ఉంటుంది, మరియు ఆ వినయం తప్పుగా నిర్దేశించబడినప్పుడు కొంచెం ఆత్మాభిమానం లేదా తన గురించి చెడుగా ఆలోచించడం జరుగుతుంది.
అయితే గుర్తుంచుకోండి, ఒకసారి యోగానందగారిని ఎవరో అడిగారు, ఒక యోగి ఆత్మకథ లో అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం ఏమిటి అని, దానికి ఆయన ఇలా అన్నారు, “నా గురువు శ్రీయుక్తేశ్వర్ గారి మాటలు: ‘గతాన్ని మరచిపో. మనుషులందరి జీవితాలు అనేక అవమానాలతో చీకటిగా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రతిదీ మెరుగుపడుతుంది.’’’ అది ఏకాగ్రతకు సానుకూలమైన మార్గం.

ఇది కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ ఒక నిర్దిష్ట సమయంలో ప్రజలు “అందరూ నాకంటే ఆధ్యాత్మికంగా చాలా అభివృద్ధి చెందారు, మరియు ఇక్కడ ఉన్నవారిలో నేను మాత్రమే ఈ మార్గంలో పూర్తిగా విఫలమయ్యాను,” అని తమను తాము ధృవీకరించుకుంటూ ఉంటారు. అది ఒక రకంగా ప్రయత్నం చేయకపోవడానికి దాదాపు ఒక సాకుగా మారుతుంది. మీరు మీలో ఉన్న ఆ ధోరణిని ఎదుర్కోవాలి మరియు “ఆపు! నేను నీ మాట వినడం లేదు! బయటికి వెళ్ళు!” అని దానిని ఆజ్ఞాపించండి, ఎవరైనా స్థిర బుద్ధిలేని వ్యక్తి మీ ఇంటి వద్ద ఉంటే, “ఓహ్, మీరు భయంకరమైన వ్యక్తి, మీరు మంచివారు కాదు” అని మీకు చెప్పినట్లు. ఎందుకంటే, సరిగ్గా అదే జరుగుతోంది.

మీరు అహంతో ముడిపడి ఉన్న మాయను కలిగి ఉన్నారు, ఆధ్యాత్మిక ప్రయత్నం చేయకుండా మిమ్మల్ని నిరోధించడమే వాటి మొదటి లక్ష్యం. మీ గురించి మీరు నిరుత్సాహపడటం అనేది సాధారణంగా ఆధ్యాత్మిక ప్రయత్నం చేయకుండా మిమ్మల్ని నిరోధించే అత్యంత ప్రభావవంతమైన మార్గం. కాబట్టి, మీరు దానిని ఎదుర్కోవాలి, మీరు “ఆధ్యాత్మిక యోధుడు”గా ఉండాలి. పరమహంస యోగానందగారు భగవద్గీతపై 1వ అధ్యాయంలో తన వ్యాఖ్యానం వ్రాసిన కౌరవ యోధులు వీరే (గాడ్ టాక్స్ విత్ అర్జున). అది మీ ఆలోచనా ప్రక్రియలకు కట్టుబడి మరియు మిమ్మల్ని మళ్లించటానికి ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా మీ విజయవంతమైన ఆధ్యాత్మిక స్వభావాన్ని నిలబెట్టుకోకుండా మరియు నొక్కి చెప్పకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది.

కాని అది స్వతసిద్ధంగా వచ్చేది కాదు. దానికి సంకల్పశక్తి కావాలి, దృఢ నిశ్చయం కావాలి, అంతర్గత బలం కావాలి. కాని ఎవరైనా చేసే అత్యంత దారుణమైన పని ఏమిటంటే, “నేను మంచిగా లేను, మిగిలిన అందరూ మెరుగ్గా ఉన్నారు,” అని తమలో తాము పునరావృతం చేసుకోవడం. అలా ఆలోచించడం మానేయండి మరియు ‘వెలుతురున్న చోట’ లేదా ‘మెటాఫిజికల్ మెడిటేషన్స్ (Metaphysical Meditations)’ లాంటి గురుదేవుల పుస్తకాలలో మరింత సానుకూలమైన ఒక విషయాన్ని తీసుకోండి. అందుకే గురుదేవులు మనకు ఆ సానుకూల దివ్యసంకల్పాలను అందించారు. వాటి ద్వారా “నేను దేవుని బిడ్డను, నేను దేవుని రూపంలోనే సృష్టించబడ్డాను” అని ఆయన తెలియజేశారు. మన గురించిన తప్పుడు భావనల భ్రమలను రూపుమాపడానికి కృషి అవసరం. ఆ పని ధ్యానం ద్వారా మరియు సానుకూల దివ్యసంకల్పం ద్వారా జరుగుతుంది.

భాగం 8: మరింతగా ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్న కొద్దీ సమాజం అభివృద్ధి చెందుతుంది

ప్రశ్న: భగవంతుని తెలుసుకోవడానికి సరళమైన మార్గం ప్రేమ మార్గం అని యోగానందగారు చెప్పారు. ధ్యాన మార్గం “ప్రేమ మార్గం”గా ఎలా అవుతుంది? ఈ “బేషరతు” ప్రేమ యొక్క అనుభవానికి మరియు వ్యక్తీకరణకు యోగా మనల్ని నడిపించగలదా?
స్వామి చిదానందగారు: “ఔను! ఔను! అది నిజం! ధ్యానం మనల్ని అంతిమంగా సర్వ జీవవ్యాపిగా చేస్తుంది, ఎందుకంటే మనలోనే భగవంతుని ఉనికిని మనం అనుభూతి చెందుతాము, ఆపై ఆ చైతన్యం విస్తరిస్తున్నప్పుడు, మొదట అవచేతన లేదా సూక్ష్మ స్థాయిలో ఆ తరువాత మరింత ప్రత్యక్షంగాను, మరియు చేతనా స్థాయిలో మనం ఆ భగవంతుని ఉనికిని ఇతరులలో దర్శిస్తాము. ఈ విశ్వంలో భగవంతుడు మాత్రమే అత్యంత ప్రియమైనవాడు. ఒకవేళ భగవంతుడు అంటే ఏమిటో అందరికీ తెలిసినట్లయితే….భగవంతుడే అందం, ఆనందం, సంతోషం, పరిపూర్ణ సేవ, మరియు స్వతసిద్ధంగా మన ఆదరణ, ఆప్యాయతలకు ఆధిపత్యం వహించే అద్భుతమైన లక్షణాలన్నీ ఆయనే. కాబట్టి, దయామాతగారు పదేపదే చెప్పినట్లుగా ఆ ప్రేమను మనలో అనుభవించడానికి కీలకమైనది ప్రేమ యొక్క మూలానికి వెళ్ళడం. అదే ఆమె జీవితంలో ముఖ్యభాగం. “నేను ప్రేమను కోరుకున్నాను, మానవ అపరిపూర్ణతలతో లోపభూయిష్టంగా లేని ప్రేమను అనుభవించాలనుకున్నాను” అని ఆమె చెప్పారు. “ఆ ప్రేమను కనుగొనడానికి నేను దేవుడి వద్దకు వెళ్ళాలని ముందుగానే నిశ్చయించుకున్నాను” అని ఆమె చెప్పారు. మరి దేవుడి దగ్గరకు ఒక వ్యక్తి ఎలా వెళ్ళాలి? ధ్యానం ద్వారా! ఆమె వ్రాసిన ప్రేమ మాత్రమే పుస్తకమంతా దీని గురించే.

ప్రశ్న: స్వామీజీ, మతపరమైన హింసను, విద్వేషాన్ని ఎలా ఎదుర్కోగలం?
స్వామి చిదానందజీ: “బాగుంది, మా గురుదేవుల యొక్క (శ్రీ యోగానంద) సంప్రదాయాలలో మరియు గురుదేవుల బోధనలలో మనం కనుగొనే విశ్వజనీనత మరియు అవగాహన ఇంకా ఇతర మత సంప్రదాయాల పట్ల గౌరవాన్ని కలిగి ఆదర్శంగా మరియు ఉదాహరణగా నిలువడం అనేది మొదటిది.

“భక్తులు స్వయంగా తమంతట తాము అకస్మాత్తుగా మతపరమైన హింసను ఆపుతారని భావించడం ఒక అత్యాశగల యోచన అవుతుంది. ఇది పరిణామాత్మకమైన విషయం. కాని ప్రప్రథమంగా, మతాలలో అంతర్లీనంగా ఉన్న సారూప్యతపై వాస్తవమైన దృష్టి సారించిన మా గురుదేవుల యొక్క విభిన్న రచనలు లేదా పుస్తకాలను వీలైనంత ఎక్కువ మందితో పంచుకోవడం మరియు వాటి ఆదరణకు మరియు అవగాహనకు నమూనాగా ఉండడం ద్వారా మనలో ప్రతి ఒక్కరు దీనికి దోహదపడవచ్చు. ఉదాహరణకు, గురుదేవుల పుస్తకం: మత విజ్ఞానశాస్త్రం, మానవుడి నిత్యాన్వేషణలోని కొన్ని అధ్యాయాలు లేదా అలాంటి ఇతర పుస్తకాలు, తద్ద్వారా ఈ ఆలోచనలు మరింత ఎక్కువగా సమాజంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత, ఎవరైనా మరొక మార్గాన్ని అనుసరించే వారి గురించి అవమానకరంగా లేదా అవమానకరమైన రీతిలో మాట్లాడుతున్నప్పుడు, గౌరవంగా మరియు సున్నితంగా తిప్పికొట్టే అవకాశం ఉంటే, ఈ ప్రపంచంలో తగినంత ద్వేషం ఉందని, నిజానికి దానికి మరింత జోడించడానికి ఇది సహాయం చేస్తుందని వారికి చెప్పండి. మనం ఇతరులను సరిదిద్దేవారిగా లేదా క్రమశిక్షణ కలిగినవారిగా మార్చాలని కాదు, కాని మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరైనా ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు మీరు వెనక్కి లాగవచ్చు. కాని అన్నింటికంటే ముఖ్యంగా, ఆ ప్రశ్నకు సమాధానంగా ఏమిటంటే, నిజంగా అనేకమంది భక్తులు వై.ఎస్.ఎస్. పాఠాల్లో నేర్చుకున్న విశ్వజనీన దృక్పధంతో జీవిస్తున్నారు. మరియు మీకు తెలుసు, కాలక్రమేణా సమాజంలో పరిణామాత్మక మార్పు వస్తుందని. కాని వారు చేయగలిగితే తప్ప వ్యక్తిగతంగా భక్తులు బయటకు వెళ్ళి మతపరమైన హింసను నేరుగా ఎదుర్కోవాలని భావించడాన్ని నేను ప్రోత్సహించను.

భాగం 7: సామూహిక ధ్యానమే నిజమైన సత్సంగం

ప్రశ్న: ఇటీవల హైదరాబాద్‌లో వై.ఎస్.ఎస్. నిర్వహించిన సంగమంలో దాదాపు 3200 మంది భక్తులు పాల్గొన్నారు. సంగమ సమయంలో పొందిన ఆశీస్సులను, ఇంటికి తీసుకెళ్ళడానికి భక్తులు ఏమి చేయాలి?
స్వామి చిదానందగారు: దానికి నా సమాధానం మూడేళ్ల క్రితం ఉండే దానికి భిన్నంగా ఉంటుంది, ఎందుకో నేను మీకు చెబుతాను. సత్సంగం యొక్క ప్రాథమిక సూత్రాన్ని తీసుకుందాం — ఆధ్యాత్మిక సాహచర్యం.

‘సంకల్ప శక్తి కంటే పరిసరాల ప్రభావమే బలమైనది’ అని పరమహంస యోగానందగారు ప్రస్తావించారు. మన సాహచర్యాన్ని బట్టి మనం అలాగే తయారవుతాం. మనం వ్యాపారం లేదా క్రీడలు లేదా మరేదైనా రంగంలో సఫలత సాధించాలని కోరుకున్నప్పటికీ, మీరు మీతో సహవాసం చేసే వ్యక్తుల్లా అవుతారు. మన వ్యక్తిగత ప్రయత్నాలకు సామూహిక చైతన్యం తోడ్పడుతుంది. యోగానందగారు ఆధ్యాత్మిక కార్యం ప్రారంభించినప్పటి నుండి, భక్తులు వారానికి ఒకటి లేదా రెండుసార్లు సామూహిక ధ్యానానికి రావాలని ఆయన ఉద్ఘాటించేవారు. సత్సంగాన్ని కొనసాగించుకోవడానికి అది ఒక మార్గం.

రెండో విషయం, గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందడంతో అన్ని ధ్యాన కేంద్రాలు మరియు ఆశ్రమాలు మూసి ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. ఈ మూసివేతకు కొన్ని నెలల ముందు మేము వీడియో కాన్ఫరెన్సింగ్‌ని ఉపయోగించి ఆన్‌లైన్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించాము, దీనిలో భక్తులు ఆన్‌లైన్‌లో కలిసి సామూహిక ధ్యానాలు మరియు సామూహిక సత్సంగాలలో పాల్గొనవచ్చు. ఈ మూడు సంవత్సరాలపాటు ఒంటరిగా ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఇది నిజమైన ప్రాణదాతగా మారిపోయింది. ఇప్పుడు మీరు మీ ఇంటి నుండి బయటకు వెళ్ళకపోయినా, సత్సంగానికి ఆ సాంకేతికతను ఉపయోగించుకోవడానికి, ఆ శక్తిని ఉపయోగించి సరైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి అద్భుతమైన సామర్థ్యం ఉంది.

మూడవ విషయమేమిటంటే….“ఒకసారి మీరు పరమహంస యోగానందగారి వంటి జ్ఞానమూర్తితో లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత, మీరు ఎప్పుడూ ఒంటరిగా ధ్యానం చేయరు, ఎందుకంటే ఎల్లప్పుడూ భక్తుడు చేసే ప్రయత్నాలు, భక్తుడిని దైవానికి పరిచయం చేసే గురువు సహాయంతో బలపడతాయి. ఒక విధంగా సత్సంగం యొక్క అత్యంత విలువైన రూపం — గురువుతో సత్సంగం – నేను ధ్యాన కేంద్రంలో ఉన్నా, కంప్యూటర్ ముందు ఉన్నా, ఎక్కడ ఉనప్పటికీ, ఇది బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా పూర్తిగా అందుబాటులో ఉంటుంది.”

“నేను ఎల్లప్పుడూ ఇక్కడ (కూటస్థ కేంద్రాన్ని సూచిస్తూ) దృష్టిని నిలిపి ఉంటాను, ఈ పవిత్రమైన ఆశ్రయం, ఆత్మ యొక్క పవిత్ర స్థానం, భక్తుడికి మరియు అతని గురువుకు మధ్య ఉండే సత్సంగం ఎప్పటికీ తప్పిపోదు. ఇది ఎల్లప్పుడూ ఉంటుంది.”

భాగం 6: సఫలత పొందాలంటే మీరు జీవితానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవాలి

ప్రశ్న: స్వామీజీ, యువత నిజమైన విజయం సాధించడానికి మీ వద్ద ఏమైనా చిట్కాలు ఉన్నాయా?
స్వామి చిదానందగారు: మొట్టమొదటగా నాకు శరీరం, మనస్సు ఉంది, కానీ నేను ఆత్మను — ఒక ఆత్మనని గ్రహించండి. నిజమైన సఫలత అంటే, ఒకరి జీవితాన్ని మరియు లక్ష్యాలను నిర్వహించుకోవడం కోసం ప్రతి దానికి సరైన సమయాన్ని కేటాయించడం. మీరు భౌతిక విషయాలను విస్మరించలేరు మరియు మీరు మేధో వికాసం మరియు విద్యాభివృద్ధిని విస్మరించలేరు మరియు మీరు నిస్సందేహంగా ఆధ్యాత్మిక చైతన్య అభివృద్ధినీ విస్మరించలేరు.

“వాటిలో ప్రతి ఒక్క దానికి సమయాన్ని ఇచ్చే జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా నిజమైన సఫలత సిద్ధిస్తుంది. ఖశ్చితంగా యోగదా సత్సంగ పాఠాలలో మీరు దీన్ని కనుగొంటారు. శారీరక ఆరోగ్యం, మనస్సు యొక్క సామర్థ్యం, విద్య మరియు మేధస్సును పెంపొందించుకోవడం మరియు హేతుబద్ధమైన లక్షణాలన్నీ చాలా ముఖ్యమైనవి: సమతుల్య జీవనం కోసం సమగ్రమైన దిక్సూచి.

“మరియు ధ్యానం చేయడం నేర్చుకోవడం కోసం కొంచెం సమయం తీసుకోవడం. ఉదయం 10 నిమిషాలు మరియు సాయంత్రం 10 నిమిషాలు ఉండవచ్చు. (ఇది ఒక విధంగా సరైంది కాదు, ఎందుకంటే వారు దీన్ని 10 నిమిషాలు చేస్తే, వారు దీన్ని 20 నిమిషాలు చేయాలనుకుంటారు, మరియు ఒకసారి 20 నిమిషాలు చేస్తే, వారు దీన్ని ఎక్కువసేపు చేయాలనుకుంటారు… ధ్యానం అలా పని చేస్తుంది!)

“అయితే విషయం ఏమిటంటే…సఫలత కావాలంటే మీరు జీవితం కోసం ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి…సఫలత వచ్చేవరకు వేచి ఉండడం ద్వారా ఎవరూ సఫలత పొందలేరు. ప్రతి ఒక్కరికీ ఒక రోజులో ఉన్న 24 గంటలను మనం ప్రణాళికాబద్ధంగా కేటాయించుకోవాలి. మీరు దానికి అనుగుణంగా స్పృహతో ఉండి మీ సమయాన్ని నియంత్రించుకోవాలి మరియు మీకున్న ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసం స్పృహతో మీ సమయాన్ని ఉపయోగించాలి.”

భాగం 5: మీ పిల్లవాడు ఆదర్శంగా చూడగలిగే వ్యక్తిగా ఉండండి!

ప్రశ్న: పరమహంస యోగానందగారి ధ్యాన-యోగ బోధనలపై మేము పిల్లలకు ఆసక్తి ఎలా కలిగించగలము? పిల్లలను ధ్యానానికి పరిచయం చేయడానికి వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. దగ్గర సాహిత్యం ఏమైనా ఉందా?
స్వామి చిదానందగారు: “తల్లిదండ్రులు సంతోషంగా ఉండడం ద్వారా, సంతృప్తి ద్వారా మరియు తమ పిల్లలలో వారు చూడాలనుకునే లక్షణాలకు ఉదాహరణగా ఉండడం ద్వారా పిల్లలను బోధనలకు పరిచయం చేయవచ్చు. మీరు పిల్లలతో ఇలా చెప్పలేరు, ‘నేను చెప్పినట్లు చేయండి, నేను చేసినట్లు కాదు.’ అది ఎప్పుడూ పనిచేయదు . మరోవైపు తాను ఏమీ చెప్పకుండా, తన జీవితంలో ఇతరులపట్ల దయ, గౌరవం మరియు హుందాగా ప్రవర్తించడం ద్వారా మరియు, ‘నా జీవితం ఖచ్చితంగా నేను రూపొందించుకున్నట్లుగా ఉంటుంది’ అనే స్వీయ-నిర్ణయాన్ని ప్రతిబింబించే విధంగా జీవించేవాడు తన పిల్లలపై ఒక చక్కటి ముద్ర వేస్తాడు.

“… తల్లిదండ్రులు తమ పిల్లలకు అదర్శప్రాయమైన ఉదాహరణగా ఉండాలి, ఎందుకంటే పిల్లలు స్వతహాగా నేర్చుకొనే పద్ధతిలో ఉంటారు. ఆ ప్రారంభ సంవత్సరాల్లో నేర్చుకోవడానికి మరియు గ్రహించడానికి వారి మెదళ్ళు మరియు నరాలు అధికముగా అలవాటు పడి ఉంటాయి. పిల్లల మనస్సు చాలా మృదువైనది మరియు సున్నితమైనది కాబట్టి సానుకూల లేదా ప్రతికూల దిశలలోకి తేలికగా ఒంగుతుంది. నేను దీని గురించి చాలా దృఢంగా భావిస్తున్నాను, ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యతలపై నేటి ప్రపంచంలో తగినంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. మీరు పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకురాబోతున్నట్లయితే, వారికి మీరు బాధ్యత వహించాలి. మీరు అధునాతన వీడియో గేమ్స్, వస్త్రాలు, ఈ నూతన వైఖరులు మరియు అటువంటి యంత్ర పరికరాలు, మొదలైనవాటిని కొనుగోలు చేయమని కాదు. మీ పిల్లలు ఆదర్శంగా చూడగలిగే వ్యక్తిగా మీరు ఉండాలి.”

ఈ రోజు మహిళలు ఒక పరివర్తన దిశలోని పరిస్థితులలో ఉన్నారు
ప్రశ్న: భారతదేశంలో (మరియు బహుశా ప్రపంచవ్యాప్తంగా కూడా) సాధారణంగా – కుటుంబం, గృహ విధులు, పని మరియు అన్ని రకాల అంచనాలను నైపుణ్యంతో నెరవేర్చడమనే ఇంటి వ్యవహారాల మధ్య తల్లి ఉంటుంది. మహిళలు, వారికున్న వివిధ బాధ్యతలలో రాజీపడకుండా, వారి ఇళ్లలోని సామరస్యాన్ని భంగపరచకుండా, యోగానందగారు సూచించినట్లుగా నిత్యజీవితంలో ప్రతిరోజూ-రెండుసార్లు ధ్యానాన్ని ఎలా చేయగలరు?
స్వామి చిదానందగారు: “ఇది చాలా పెద్ద బాధ్యతల జాబితా కదా? దీన్ని సందర్భోచితంగా ఉంచడానికి ఒక విషయం చెబుతాను. ఈ రోజు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర అభివృద్ధి చెందిన దేశాలలోని మహిళలు ఒక పరివర్తన దశలోని పరిస్థితిలో ఉన్నారు. మహిళలు మరింతగా అణిచివేయబడి, వంటింటి కుందేలుగా చూడబడి, ‘మీరు ఇంట్లోనే ఉండి వంటచేయడం, శుభ్రపరచడం చేయండి’ అనే తరములో నుండి వారితో బాగా పని చేయించడమనేది వచ్చింది. ఇది అనాగరికమైనది మరియు ఛాందసమైనది. అదే సమయంలో, మనం నడిమి దశలో ఉన్నాము, ఇక్కడ మహిళలు, వారి వ్యక్తిగత అభివృద్ధికి మరియు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారు స్వంతంగా ఇతర మార్గాలను అన్వేషించగలుగుతున్నారు. కానీ స్త్రీ పురుషులకు, ఇంటిలోనూ మరియు వ్యాపార ప్రపంచంలోనూ సామరస్య జీవితాన్ని సృష్టించుకోవడమనే సమతుల్య పాత్ర ప్రశంసాత్మకమైనది.”

“నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మరియు మహిళలు దీన్ని ఎలా సహించారో నాకు తెలియడంలేదు. సాధారణంగా, మహిళలు పురుషుల కంటే బలంగా ఉంటారు, ఎందుకంటే వారు చాలా బాధ్యతలను భరించాలి. ఒక సంస్థలో కార్యనిర్వహణాధికారిగా, ఇద్దరు లేదా ముగ్గురు బాగా నేర్పరులైన-పిల్లలతో రెండు, మూడు మంచి పెద్ద ఇళ్ళు, పరిపూర్ణ శరీరం, పరిపూర్ణ ఆరోగ్యం మరియు మొదలైనవి “ఇవన్నీ కలిగి ఉండాలని” మహిళలు భావించనవసరం లేదు. ఈ ఉద్రిక్తతల సమూహం భరించగలిగినవి కావు, మరియు దురదృష్టవశాత్తు సమాజం సరైన సమతుల్యతను కనుగొనడానికి ఒక ప్రక్రియను ఆవిష్కరించే పనిలో ఇప్పుడు కూడా ఉంది. కానీ ఇంకా అక్కడికి ఎలా చేరుకోవాలో మాకు తెలియదు, మరియు మీరు వివరిస్తున్న ఈ పరిస్థితి మితిమీరి పెరిగే వరకు భరించాల్సి ఉంటుంది. మేము ఎంత త్వరగా దాన్ని అధిగమిస్తే అంతా మంచిది.”

భాగం 4: భారతదేశ ఆధ్యాత్మికత ఎదుగుతున్న ప్రపంచ ఆధ్యాత్మిక నాగరికతతో ముడిపడి ఉంది

ప్రశ్న: స్వామీజీ, ఎదుగుతున్న ప్రపంచ ఆధ్యాత్మిక నాగరికతలో భారతదేశ ఆధ్యాత్మికత ఏ పాత్ర పోషిస్తుందని మీరు భావిస్తున్నారు?
స్వామి చిదానందగారు: “మా గురుదేవులు పరమహంస యోగానందగారి వలె ఇది నా హృదయానికి కూడా చాలా ప్రియమైన విషయం, మరియు ఆయన నెరవేర్చవలసిన ముఖ్య లక్ష్యాలలో ఇది కూడా ఒకటి. భారతదేశం యొక్క ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నప్పుడు, మనం గీత, యోగ సూత్రాలు మరియు ఉపనిషత్తులు వచ్చిన నాగరికత యొక్క స్వర్ణ యుగానికి తిరిగి వెళ్దాం. ఈ మతంలోని ఒక సభ్యుడితోనో లేదా ఆ మతంతోనో లేదా ఒక స్వజాతి సభ్యుడితో కాని మాట్లాడని ఒక నిజమైన సార్వత్రిక బోధనను ఇక్కడ మీరు కనుగొంటారు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ స్థితి గురించి మాట్లాడుతోంది. అందుకే ఈ అందమైన భావనలు ‘ప్రపంచం ఒక కుటుంబం’ [‘వసుదైక కుటుంబకం’] అని ఉపనిషత్తులలో మీకు ఉన్నాయి, మరియు ‘ఋషులు దీనిని చాలా పేర్లతో పిలిచినప్పటికీ, సత్యం ఒక్కటే’ [‘ఏకం సత్, విప్రా బహుధా వదంతి’].

“ఆదర్శవంతమైన మతం ఇలా ఉండాలి: ‘జీవులందరూ సంతోషంగా ఉండాలి, జీవులందరూ వ్యధ చెందకుండా ఉండాలి.’ కాని ఇలా అనకూడదు ‘భారతీయులందరూ సంతోషంగా ఉండాలి’ లేదా ‘హిందువులందరూ సంతోషంగా ఉండాలి కాని ముస్లింలు, క్రైస్తవులు మరియు ఇతరులు మాత్రం కాదు,’ ఎందుకంటే మనందరిలో ఒకే దేవుని తేజఃకణం మనలోని ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇది మనం చూడటానికి వచ్చిన పరిణామ ప్రక్రియలో భాగం: మనం ఒకరినొకరు సోదరులు మరియు సోదరీమణులుగా గుర్తించాలి లేకపోతే మనము ఒకరినొకరు నాశనం చేసుకుంటాము మరియు దానితో పాటు దేవుని ప్రణాళికని కూడా.

“అటువంటి ప్రశంసలతో ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది”

“భారతదేశం యొక్క పాత్ర పరంగా, భారతదేశం ప్రపంచానికి అందించగల గొప్ప విషయం ఏమిటంటే, భారతదేశానికి సొంతమైన దైవిక మరియు శాశ్వతమైన వారసత్వానికి సరియైన ప్రతిరూపంగా మరియు చక్కని ఉదాహరణగా ఉండడం, ఎందుకంటే ప్రపంచం అటువంటి ప్రశంసాభావంతో భారతదేశం వైపు చూస్తోంది. మీరు పశ్చిమ దేశాలకు వెళ్ళి ఉండకపోతే మీకు ఇది తెలియకపోవచ్చు, కానీ ఒక యోగి ఆత్మకథ ను చదివిన చాలామంది ప్రజలలో ఒకరిగా లేదా భారతదేశం నుండి అమెరికాకు వచ్చిన ఆధ్యాత్మిక గురువుల కార్యక్రమానికి హాజరైన ఒక తరంలోని వ్యక్తిగా ప్రపంచం భారతదేశాన్ని ఈ విధంగా చూస్తోందని తెలుసు. యూరప్, ఆస్ట్రేలియా మరియు దక్షిణ అమెరికాకు కూడా ఇదే వర్తిస్తుంది. లక్షలాది మంది ప్రజలు మానవాళికి ఆధ్యాత్మికంగా బోధించగల పెద్దన్నలా భారతదేశాన్ని దాదాపుగా గౌరవిస్తారు.

“ప్రపంచ ఆధ్యాత్మిక నాగరికత రెండు విధాలుగా జరుగుతోంది అన్న విషయంలో ప్రశ్నే లేదు — ఒకటి భౌతిక మార్గం — సాంకేతికత ద్వారా, ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా మరియు యాత్రల ద్వారా. మీరు ఇంతకు ముందు కొన్ని తరాల వెనక్కి తిరిగి చూసినప్పుడు, అమెరికా నుండి భారతదేశానికి ప్రయాణించడం చాలా పెద్దవిషయం మరియు చాలా మందికి ఇది అసాధ్యం. కానీ ఇప్పుడు ప్రజలు బెంగళూరు లేదా షికాగోను సందర్శించడానికి తేలికగా విమానంలో వెళ్ళవచ్చు. కాబట్టి, ప్రపంచం కుంచించుకుపోయింది. ప్రపంచం ఇకపై వ్యక్తిగత దేశాలు మరియు సంస్కృతులతో కూడినది కాదు.

“నిజంగా మానవ సమాజం యొక్క కూర్పును ఇంటర్నెట్ మార్చివేసింది. ఇది నిజంగా మానవ కుటుంబం అనే ఒక శరీరాన్ని ఏకం చేసే నాడీ వ్యవస్థలాగా మారిపోయింది. అప్పుడు ఏమి జరుగుతుందంటే, మీరు ప్రజలను దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, ఒకరితో ఒకరు కలిసి ఉండటము మీరు నేర్చుకోకతప్పదు. మీరు ఒక కుటుంబంలో ఉన్నట్లుగా ఉంటుంది, అక్కడ మీరు ఒకే ఇంటిలో నివసిస్తున్నారు. దురదృష్టవశాత్తు, మీరు ఒకరితో ఒకరు పోట్లాడుకొనే కుటుంబ సభ్యులను చూశారు. కాని మానవ జాతి అలా చేస్తే అది కొన్ని తరాల కంటే ఎక్కువ ఉండదు.

“సామూహిక విధ్వంసం చేయగల సామర్థ్యం మనకు ఉంది, ఇది వంద సంవత్సరాల క్రితం లేదు. సాంకేతిక శక్తి పెరుగుదలతోపాటు మరియు ప్రపంచం కుంచించుకుపోతున్న ఈ తరుణంలో మనకు ప్రామాణికంగా ఉన్న చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ఒకే ఇంటిలో ఉన్నంత దగ్గరగా మనం ఉన్నాము. అప్పుడు మనం అదే స్థాయిలో ‘ఆధ్యాత్మికంగా ఎదగాలి,’ మనకు స్వీయ నియంత్రణ ఉన్న ఆధ్యాత్మిక పరిపక్వత ఉండాలి, ఇక్కడ మనం ఇష్టపడని వ్యక్తులను నివారించడానికి ప్రయత్నించడం లేదు. ఆనందం మరియు భద్రత, శాంతి మరియు సాఫల్యతను నేను ఎలా కొరుకుంటునానో, అలాగే ఇతర మానవులందరు కోరుకుంటున్నారని తెలుసుకోవడానికి కావలసిన ఆధ్యాత్మిక పరిపక్వత ఉండాలి. చివరికి ప్రజలు ‘నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉంటే తప్ప నేను నిజంగా సంతోషంగా ఉండలేను,’ అని గ్రహించగలుగుతారు. మీరు వారిని నెట్టివేసి, ఆ దేశంలో జరిగింది లేదా ఆ దేశంలో ముగిసిందని చెప్పలేరు, ఎందుకంటే అది మొత్తంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. రష్యా మరియు ఉక్రెయిన్‌తో ఏమి జరిగిందో చూడండి. వంద సంవత్సరాల క్రితం, రెండు పొరుగు దేశాలు ఒకదానికొకటి వ్యతిరేకముగా వెళుతున్నాయి. ఇప్పుడు ప్రధాని మోడీ నుండి అధ్యక్షుడు బైడెన్ వరకు ఉన్న ప్రతి ఒక్కరూ 21వ శతాబ్దంలో మనం ఇలా చేయవలసింది కాదని అన్నారు. భౌతిక సాంకేతికతతో పాటు ఆధ్యాత్మికత సమాంతరంగా అభివృద్ధి చెందాలి.”

భాగం 3: మనుగడ కోసం ధ్యానం ఒక దక్షత

ప్రశ్న: ప్రజలు తమ తీరికలేని జీవితంలో ధ్యానం చేయడానికి సమయం ఎలా కేటాయించగలరు?
స్వామి చిదానందగారు: “ప్రపంచం మరింత క్లిష్టంగా మారుతున్నందున, మరియు ఆ భౌతిక కోణంలో మరింతగా నడపబడుతున్నందున, మనుగడ కోసం ధ్యానం అనేది ఒక దక్షత అని ప్రజలు గ్రహిస్తున్నారు. మీకు ఆ రకమైన ఊట లేదా అంతర్గత శాంతి ఊటకు ప్రాప్యత లేకపోతే మీరు తునాతునకలయిపోతారు. ధ్యానం మనకు అటువంటి శాంతిని తెస్తుంది.

“ప్రజలను ప్రేరేపించే విధంగా మరియు వారు ధ్యానానికి సమయాన్ని ఎలా కనుగొంటారో తెలపాలంటే, వారు నిద్రపోవడానికి సమయాన్ని ఎలా కనుగొంటారు, వారు తినడానికి సమయాన్ని ఎలా కనుగొంటారు, వీటిలో దేనినైనా చేయడానికి వారు సమయాన్ని ఎలా కనుగొంటారు? ఎలాగంటే వారు దానిని అవసరమని అంగీకరిస్తారు కాబట్టి. సమాజం మరింత వెర్రిదవుతున్నకొద్దీ దానిని ఎక్కువ మంది ప్రజలు ‘నేను కూడా నా మానవత్వం మరియు నా చిత్తశుద్ధిపై నా పట్టు నిలుపుకోవాలంటే, నేను ఆ ఆత్మ అవగాహనతో సంబంధం కలిగి ఉండడం నేర్చుకోవాలి,’ అనేది పశ్చిమ దేశాలలో: ఐరోపాలో, యు.ఎస్., దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా మరియు ఖచ్చితంగా భారతదేశంలోనూ గ్రహిస్తున్నారు.’”

ధ్యానం: దీన్ని ప్రయత్నించండి మరియు పోల్చి చూడండి!
ప్రశ్న: జీవితాన్ని ఆస్వాదించడానికి ఏకైక మార్గం ఇంద్రియాలలో మునిగిపోవడమని నేటి సమాజం యువతకు బోధిస్తుంది, అయితే ధ్యానం మరియు యోగం దీనికి విరుద్ధమైనవాటిని బోధిస్తాయి – స్వీయనియంత్రణ మరియు అంతర్ముఖత్వమే ఆనందానికి మార్గం. యోగానందగారి బోధనలు ఈ గందరగోళాన్ని పరిష్కరిస్తాయా?
స్వామి చిదానందగారు: “పరమహంస యోగానందగారు ఎప్పుడూ ఇలా అనేవారు, ‘దీనిని ప్రయత్నించండి మరియు పోల్చి చూడండి.’ జన్మపరంపరల్లోని ఆత్మ యొక్క పరిణామం సమయంలో, ప్రతి మానవుడు ఇలా ఆలోచించే స్థాయికి వస్తాడు: ‘ఇంద్రియాలను సంతృప్తి పరచడం నన్ను అసంతృప్తికి గురిచేస్తుంది, ఎందుకంటే నేను ఇంద్రియాలు కాదు.’ మనమందరం దాని గుండా పయనించాము, మరియు సంభోగం లేదా మద్యం లేదా సంపదని వెంబడించే వ్యక్తులను మేము విమర్శించడం లేదు. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గాన్ని తీవ్రమైన నిబద్ధతతో ప్రారంభించిన కారణమేమిటంటే వారు ఇవన్నీ చేసి ఉన్నారు మరియు చివరికి అది వారందరినీ శూన్యముగా నిలిపింది.

“మరోవైపు, అక్కడిదాకా చేరుకోనివారిని ఒప్పించడం చాలా కష్టం. మీరు ఒకరికి ఉపన్యాసం చెప్పి ఇలా అనలేరు: ‘అలా చేయవద్దు, అది మీకు చెడ్డది.’ మీరు పిల్లవాడిగా ఉన్నప్పుడూ మీ అమ్మ మీకు అలాగే చెబుతుంది, మరియు ఆమె వెనక్కి తిరిగిన వెంటనే, మీరు అదే చేయాలని కోరుకుంటారు. ఈ విధానము పనిచేయదు. ఇలా ఉండాలి: ‘ధ్యానాన్ని ప్రయత్నించండి, ఆపై పోల్చండి.’


ఆత్మసాక్షాత్కారం యొక్క అత్యున్నత స్థాయిలు

ప్రశ్న: ఒకరు ఎక్కడ ప్రారంభించాలి?
స్వామి చిదానందజీ: “మేము వారికి పరమహంస యోగానందగారు వ్రాసిన ఒక పుస్తకం ఇస్తాము — ‘ఒక యోగి ఆత్మకథ,’ లేదా ‘వెలుతురున్న చోట’, వారికి అవి కొద్దిగా పరిచయం చేస్తాయి. అప్పుడు మా గురుదేవులు పరమహంస యోగానందగారు మనకు ప్రసాదించిన అద్భుతమైన యోగదా సత్సంగ ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాల ఉపోద్ఘాతం చదవమని ప్రోత్సహిస్తాము. దీనికి పరిచయాన్ని ‘ఆత్మసాక్షాత్కారం ద్వారా అత్యున్నత విజయాలు’ అని పిలుస్తారు. కాబట్టి శీర్షిక కూడా ఇలా చెబుతుంది, ‘మీరు మీ జీవితాన్ని ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారా? అప్పుడు దీనిని పరిశీలించి, మీరెలా భావిస్తున్నారో గమనించండి.’ వై.ఎస్.ఎస్. పాఠాలు, దైనందిన ధ్యాన దినచర్యను రూపొందించుకోవడానికి సూచనలిస్తాయి మరియు కొన్ని నెలల వ్యవధిలో ధ్యాన ప్రక్రియలు ఇవ్వబడతాయి మరియు తొమ్మిది నుండి పది నెలల తరువాత, మీరు నిజమైన ధ్యానిగా మారడానికి పూర్తిగా అవసరమైన ధ్యాన సామగ్రిని పొందుతారు.”

భాగం 2: భౌతిక సాఫల్యత, భావోద్వేగ సమతుల్యత మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం ధ్యానాన్ని ఉపయోగించడం

ప్రశ్న: స్వామీజీ, తన బోధనలలో, యోగానందజీ విజయం సాధించడానికి ఒక వ్యక్తి లేదా ఒక యువకుడు అనుసరించవలసిన ఒక మార్గాన్ని పేర్కొన్నార లేదా ప్రస్తావించారా? విజయం సాధించే మానవుల పరంగా బోధన ఏమి అర్థం చెపుతుంది? యోగానందజీ బోధనలు యువత వారి జీవితంలో విజయాన్ని సాధించడంలో సహాయపడతాయా?
స్వామి చిదానందగారు: “మానవులుగా, మనము విజయానికి కట్టుబడి ఉన్నాము. కానీ, ఆ సమర్థతను, ఆ సాధనాలను ఎలా నిర్వహించాలో తెలుసుకోవాలి. ఆయన (పరమహంస యోగానందజీ) బోధనలు ఆ సాధనాలను బయటకు తీసుకొస్తాయి. ఈ బోధనలకు ఆధారం సమతుల్యత యొక్క భావన, అంటే మన స్వభావానికి భౌతిక అంశ ఉంది: మనకు ఒక శరీరం ఉంది, మనము దానిని పోషించాలి, అనారోగ్యానికి గురైనప్పుడు మనం దానిని జాగ్రత్తగా చూసుకోవాలి, దానిని నయం చేయడానికి మనం ఒక మార్గం కనుగొనాలి…మరియు ఆ సమస్యలన్నీ జీవితంలోని భౌతిక వైపు సంబంధం కలిగి ఉంటాయి. కానీ విషయం ఏమిటంటే మానవాళిలో చాలా భాగం అక్కడే ఆగిపోతుంది.

“ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే, మనకు మానసికమైన, భావోద్వేగాల కోణం కంటే ఎక్కువ ఆధ్యాత్మిక కోణం మన ఉనికికి ఉంది. ఎక్కడైతే మీరు భౌతిక విజయం మరియు శ్రేయస్సును కనుగొంటారో, మరియు ఎక్కడ మీకు భావోద్వేగ సమతుల్యత మరియు అంతర్గత శాంతి ఉందో, మరియు అన్నింటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా, ఉన్నత ప్రయోజనం ప్రకారం మీ జీవితాన్ని నడిపించే జ్ఞానం ఉందో అక్కడ సరియైన సమతుల్యతకు వారి (యోగానందగారి) సాఫల్యతా మార్గం ఉంది — డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, కుటుంబం మరియు పిల్లలను కలిగి ఉండటమే కాదు, నేను దేవుని యొక్క ఒక తేజఃకణాన్ని, అని గ్రహించే ఉన్నత ఉద్దేశ్యం, నేను ఈ భౌతిక శరీరంలో నివసిస్తున్న ఆత్మను, మరియు నా అంతిమ ఉద్దేశ్యం నా జీవితంలోని అన్ని అంశాలలో సంపూర్ణ సాక్షాత్కారం మరియు వ్యక్తీకరణ.”

స్వామీజీ ఇంకా ఇలా అన్నారు: “ఇప్పుడు, మీకు ఆ భావన ఉంటే, జీవితం చాలా ఉత్తేజకరముగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి మానవుడి యోగ్యతలో భాగమైన మొత్తం నైపుణ్యాలు, సమర్థతలు మరియు సామర్థ్యాలకు మీకు ప్రవేశం ఉంది, కాని అవి స్పృహతో చేసే ప్రయత్నం మరియు శ్రద్ధతో మీరు మేలుకొలిపే వరకు అవి పూర్తిగా నిద్రాణమై ఉంటాయి. యోగానందగారి బోధన దానిని అందిస్తుంది. ధ్యానం ద్వారా, సంకల్పశక్తిని అభివృద్ధి చేయడం ద్వారా, ఏకాగ్రతను పెంపొందించుకోవడం ద్వారా, సంపూర్ణ మానవుడిగా తయారుచేసే ఈ లక్షణాలన్నింటినీ అభివృద్ధి చేయడం ద్వారా, మీరు అత్యున్నత భౌతిక విజయం, మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం, సమతుల్యతను మరియు అన్నింటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆరోగ్యం పొందవచ్చు.

“ఆయన 1920లలో యునైటెడ్ స్టేట్స్ కి వచ్చినప్పుడు, యు.ఎస్. చరిత్రలో ఈ దశను ‘గర్జించే ఇరవైలు’ అని పిలుస్తారు, ఎందుకంటే యు.ఎస్. సంపూర్ణంగా అత్యంత ఉత్సుకతతో, మరియు పెట్టుబడిదారీ విధానం యొక్క తత్వశాస్త్రంతో ముందుకు సాగుతోంది. ఆయన చాలా మంది విజయవంతమైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక సంస్థల అధిపతులు మొదలైనవారిని కలుసుకున్నారు., మరియు వారందరూ తమ జీవితంలో కోల్పోయిన ఒక విషయాన్ని యోగానందగారు తీసుకువచ్చారని గుర్తించారు.

“నేను మీకు ఒక ఆహ్లాదకరమైన చిన్న కథను చెబుతాను: ఆయన న్యూయార్క్ నగరంలో ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆయనతో సమావేశమవ్వాలని కోరాడు. అతను వారి హోటల్ గదికి వచ్చాడు మరియు యోగానందగారు నిజంగా ఏదైనా చెప్పడానికి ముందే, అతను సవాలు చేస్తున్నట్లుగా ఇలా అన్నాడు, ‘నేను గొప్ప ధనవంతుడిని, నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను,’ అంటే, ‘మీరు ఇక్కడకి ఎందుకు వచ్చారు?’. యోగానందగారు వెంటనే ఇలా అన్నారు, ‘అవును, కానీ మీరు గొప్ప సంతోషంగా ఉన్నారా?’

తరువాత ఆ వ్యక్తి ఇలా అన్నాడు, ‘ఆయన నన్ను పొందాడు!’ మరియు అతను తన జీవితాంతం క్రియాయోగిగా మారిపోయాడు. బాహ్యంగా పారిశ్రామికవేత్త అయిన ఒక కోట్లాధిపతి, ఆంతరికంగా, అతను ఒక ప్రకాశవంతమైన యోగి.”

భాగం 1: కొత్త తరాలు మరింత వికాసం చెందుతాయి

ప్రశ్న: స్వామీజీ, మీ అభిప్రాయం ప్రకారం, పరమహంస యోగానందగారి బోధనలు యువకులను ఈ రోజుల్లో ఎలా ప్రభావితం చేస్తాయని మీరు భావిస్తున్నారు?
స్వామి చిదానందగారు: “మానవులు ముఖ్యముగా ఆత్మలు అని మీరు అర్థం చేసుకున్నప్పుడు, మీరు దాన్ని ఒక చిన్న మానవజన్మగా చూడలేరు. మనం ‘యువకులు’ అని పిలిచేవారంతా ప్రాచీనమైన ఆత్మలు మరియు వారు ప్రతి మానవునికీ స్వాభావికంగా ఉండేవాటిని నెరవేర్చుకోవడానికి ప్రతి రకమైన పోరాటం మరియు ఆకాంక్షల ద్వారా పయనించారు — ఆనందం కోసం, భద్రత కోసం, ప్రేమ కోసం ప్రయత్నం మరియు మొదలైనవి. వారు దాన్ని [నెరవేర్పు] కనుగొనడానికి చాలా జన్మలు గడిపారు, చివరికి వారు వచ్చారు. మరియు జన్మనెత్తినవారిలో, గత జన్మల నుండి పరిణామ దశలో ఉన్న లక్షలాది మంది ఉన్నారు.

“భగవద్గీతలో, కృష్ణుడు దాని గురించి మాట్లాడాడు. ఆయన అర్జునుడితో ఇలా అంటాడు: ‘తుది లక్ష్యాన్ని చేరకుండా ఈ జన్మ ముగింపుకు చేరుకుంటే ఆందోళన చెందకు, ఎందుకంటే ధ్యానయోగంలో ఎటువంటి ప్రయత్నం వ్యర్థం కాదు.’ అప్పుడు భక్తుడు అదే వాతావరణంలో పునర్జన్మ పొందుతాడు, అక్కడ అతడు లేదా ఆమె దానినే తిరిగి ఎంచుకుంటారు. కాబట్టి, మీరు ‘యువకులు’ అని పిలిచేవారు తెలివైనవారు, బహుశా ఎందుకంటే వారు కొంతవరకు క్రితం జన్మలో యుద్ధసన్నధులైన ఆత్మలు, వారు వీటి అన్నిటిని అనుభవించారు, అందువలన ప్రతిదానిలోనూ, ‘అక్కడ ఉన్నాను, ఆ అది చేశాను’ అనే స్పృహతో ఉంటారు. మరియు వారు తిరిగి వచ్చి ఇలా అంటారు, ‘ఇక నేను ఎంతమాత్రం సమయం వృధా చేయను, నేను ఇక ఎంతమాత్రం జన్మలను వృధా చేయను, మరియు నా ఆత్మ సామర్థ్యాన్ని మరియు నా ఆత్మలో ఉన్న కోరికలను ఆ దివ్య సంపర్కం కోసం నిజంగా నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తాను.’

“జీవులందరూ ఊర్ధ్వముఖంగా పరిణామం చెందుతునట్లే, మానవులు కూడా ప్రాథమిక మానవ యోగ్యత నుండి ఉన్నత పరిణామ స్థితులకు పరిణామం చెందుతారు మరియు జీవితం తర్వాత జీవితంలో వారి సామర్థ్యాన్ని మరింత ఎక్కువగా బాహ్యంగా వ్యక్తపరుస్తారు. మొత్తంగా మానవాళి పరిణామ మరియు సంక్రమణల చక్రాలలో పరిభ్రమించడాన్ని గ్రంథాలలో యుగాలు అని పిలుస్తారు. వారు పైకి క్రిందకి పయనిస్తారు; ప్రస్తుతం, మనము ఊర్ధ్వముఖంగా సాగే యుగంలో ఉన్నాము. మరో మాటలో చెప్పాలంటే, ఇప్పుడు జన్మ తీసుకొంటున్న ఆత్మలు వారి తాత మరియు ముత్తాతల కంటే ఉన్నత పరిణామ దశ నుండి వస్తున్నాయి.… ఈ రోజు పిల్లలను చూడండి; ఈ సహజమైన భావం ఉంది… ‘లేదు, నేను వారి చర్మం యొక్క రంగు కారణంగా ఒకరిపై ద్వేషాన్ని కలిగి ఉండను,’ మరియు ప్రపంచంలోని అన్ని దేశాలలో గత తరాలలో పాతుకుపోయిన ఇతర రకాల మానవ అజ్ఞానాన్ని వారు సహజంగా తిరస్కరించారు.

“వారు కొంచెం ముందస్తు తయారీతో వచ్చినట్లుగా ఉంది, మరియు వారు ఈ ధ్యానం యొక్క భావనకు లోనైన వెంటనే [పరమహంస యోగానందగారు ప్రసాదించినది], సార్వత్రిక ఆధ్యాత్మిక సూత్రాల ఆధారంగా ఉన్న ఈ మార్గం, ‘నా మతం మీ మతానికి వ్యతిరేక మతం, అన్నదానితో సంబంధం లేకుండా ఉంటుంది.’ కానీ మానవ కుటుంబాన్ని విభజించేలా కాకుండా మానవ కుటుంబాన్ని ఏకం చేసే సార్వత్రిక మార్గం ఇది, అది వారికి పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే అక్కడే వారు పరిణామక్రమం అనే నిచ్చెనపై ఉన్నారు. మీరు నా వయస్సులో ఉన్నప్పుడు మీరు దీన్ని చాలా ఎక్కువగా చూస్తారని నేను భావిస్తున్నాను. మీరు వెనక్కి తిరిగి చూసి ఇలా అంటారు, ‘ఓహ్, ఆ తరాలలో ప్రజలు ఏ విధంగా అలా ఉండేవారు?’”

దూరదర్శన్ ఇండియాతో సమావేశం

స్వామీజీతో డిడి న్యూస్ నిర్వహించిన సమావేశాన్ని వీక్షించడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, ప్రపంచంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సమదృష్టితో ఎదుర్కోవడానికి మరియు మన స్వీయ అంతర్గత దివ్య లక్షణాలను కనుగొనడానికి, ధ్యానం మరియు సార్వత్రిక ఆధ్యాత్మికత ఎంత ఆవశ్యకమో ఇందులో ఆయన వివరించారు.

Play Video

వై.ఎస్.ఎస్. ఆశ్రమాలైన రాంచీ, నోయిడా మరియు దక్షిణేశ్వరం లను స్వామి చిదానందగారు సందర్శించిన సందర్భంలోని పత్రికల వార్తాసేకరణలో కొన్నిటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాము. అదనంగా, వై.ఎస్‌.ఎస్. సంగమం 2023 కోసం స్వామీజీ హైదరాబాద్ పర్యటన కూడా వార్తాపత్రికల చేత విస్తృతంగా సేకరించబడింది.

రాంచీ

హిందుస్తాన్ టైమ్స్, రాంచీ, ఝార్ఖండ్
ద పయనీర్, రాంచీ, ఝార్ఖండ్

హైదరాబాద్

దక్షిణేశ్వరం

ద టెలిగ్రాఫ్
ఆజ్ కా బెంగాలీ

స్వామీజీ సందర్శించిన భారతదేశంలోని వివిధ ప్రదేశాల చిత్రాలను వీక్షించడానికి దయచేసి క్రింది బటన్‌ను క్లిక్ చేయండి.

ఇతరులతో షేర్ చేయండి