వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ ప్రారంభోత్సవం

26 జూన్, 2021

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ స్వామి చిదానంద గిరిగారితో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం

జులై 1, గురువారం, 7 గంటలకు (భారత కాలమాన ప్రకారం)

జూలై 1, గురువారం, ఉదయం 7 గంటలకు (భారత కాలమాన ప్రకారం) యోగదా సత్సంగ సొసైటి ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధినాయకులైన శ్రీ స్వామి చిదానంద గిరి ప్రత్యేక ప్రసంగం చేసి వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ ను, లాస్ ఏంజిలిస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం నుండి ప్రత్యక్ష ప్రసారం చేయబడే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ అనేది శ్రీ పరమహంస యోగానంద నిర్దేశించిన సాధన చుట్టూ తమ జీవితాలను నిర్మించుకునే వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. క్రియాయోగులతోను మరియు మానవాళి ఉద్ధరణ కోసం గురుదేవుల కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తమ సమయాన్ని మరియు వనరులను ఉచితంగా వెచ్చించగలిగేవారి కోసం ఏర్పాటయ్యింది. ప్రాచీన క్రియాయోగ శాస్త్రాన్ని మరియు ఆయన “జీవించడం ఎలా” బోధనలను ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనే శ్రీ పరమహంస యోగానందగారి లక్ష్యంలో, వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ ఒక ప్రధాన మైలురాయి అవుతుంది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం యొక్క వీడియో, ప్రత్యక్ష ప్రసారం తర్వాత ఈ పేజీలో అందుబాటులో ఉంటుంది (ఇది వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యు ట్యూబ్ ఛానల్ లో అందుబాటులో ఉండదని దయచేసి గమనించగలరు).

వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ లో నమోదు ఇప్పుడు ప్రారంభమయ్యింది

ఒక ప్రత్యేక వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ (వి.ఎల్.డి.) వెబ్ సైట్ ఇప్పుడు ప్రారంభించబడింది.

మీరు శ్రీ పరమహంస యోగానందగారి బోధనల క్రియాయోగ శిష్యులైతే, ఈ సమయంలో వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్ లో చేరడానికి దరఖాస్తు చేసుకోమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

దయచేసి వి.ఎల్.డి. వెబ్ సైట్ ను సందర్శించి, దానికి సైన్-ఇన్ చేయండి (మీ డివోటీస్ పోర్టల్ ఐ.డి తో):

  • వి.ఎల్.డి. యొక్క ప్రయోజనం, చరిత్ర మరియు కార్యకలాపాల గురించి మరింత తెలుసుకోండి.
  • సమగ్రమైన వి.ఎల్.డి. హ్యాండ్ బుక్ చదవండి, ఇది వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. శిష్యరిక మార్గంలో స్ఫూర్తిదాయకమైన మరియు ఉపయోగకరమైన మార్గదర్శిని.
  • వి.ఎల్.డి.లో సభ్యత్వం కోసం దరఖాస్తును పూర్తి చేయండి.

ఇతరులతో షేర్ చేయండి