యోగానందగారి 125వ జయంతి స్మారకార్థం ఉత్సవాలు నిర్వహించిన భారత ప్రభుత్వం

25 సెప్టెంబర్, 2018

భారతదేశపు అమర పుత్రులలో ఒకరైన మన గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి, ఆధ్యాత్మిక ఔనత్యాన్ని మరియు వారి సేవలను భారత ప్రభుత్వం మరోసారి గుర్తించిందని మరియు ఆయన 125వ జయంతిని స్మారకోత్సవంగా జరపాలని నిర్ణయించిందని తెలియజేయడం మాకెంతో సంతోషాన్ని కలుగజేస్తోంది.

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, జాతీయ అమలు కమిటీ (NIC) సహాయంతో ఇటువంటి సంస్మరణలను నిర్వహిస్తుంది. గౌరవనీయులైన హోంమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పరమహంస యోగానందగారి 125వ జయంతిని పురస్కరించుకుని కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీతో పాటు సాంస్కృతిక శాఖ మంత్రి, డా.మహేష్ శర్మ; మరియు ఇతర ప్రముఖ ప్రభుత్వ అధికారులు, వై.ఎస్.ఎస్. నుండి ప్రతినిధులు కూడా ఉన్నారు.

పరమహంస యోగానందగారి 125వ జయంతిని పురస్కరించుకుని వై.ఎస్.ఎస్. సహకారంతో భారత ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతుంది. ఈ కార్యక్రమాలలో కొన్ని క్రింద పేర్కొనబడ్డాయి:

  • ఇంగ్లీషుతో పాటు అనేక ప్రధాన భారతీయ భాషలలో కూడా పరమహంసగారు వ్రాసిన ఒక యోగి ఆత్మకథ మరియు ఇతర పుస్తకాలను వందలాది లైబ్రరీలు మరియు విశ్వవిద్యాలయాలతో సహా దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం;
  • ఆసక్తిగల వ్యక్తులకు ధ్యాన-యోగ ప్రక్రియలు మరియు బోధనలను వ్యాప్తి చేయడానికి బహిరంగ ఉపన్యాసాలు మరియు సదస్సులను నిర్వహించడం.
  • ఒక యోగి ఆత్మకథ యొక్క ఆడియో పుస్తక రూపాన్ని ప్రధాన భారతీయ భాషలలో రూపొందించడం;
  • పరమహంస యోగానందగారి జీవితం మరియు లక్ష్యం గురించి వివరించే చిత్రాలతో కూడిన చరిత్ర పుస్తక ప్రచురణ;
  • ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థలలోని ఉద్యోగులను చేరుకొని పరమహంసగారి బోధనలను పరిచయం చేయడం.
  • పరమహంసగారి పుస్తకాలు, ఈబుక్స్ మరియు దృశ్య-శ్రవణ సాధనములను ప్రచురించడం.
  • రాంచీలో వై.ఎస్.ఎస్. విద్యా సంస్థల కోసం ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడం.

ఈ వేడుకలు మరియు కార్యక్రమాలు పరమహంసగారి ద్వారా వివరించబడిన భారతదేశపు ప్రాచీన ఆధ్యాత్మిక సంపదను వ్యాప్తి చేయడానికి పవిత్రమైన వాహనాలుగా మారాలని మేము ఆశిస్తున్నాము మరియు ప్రార్థిస్తున్నాము. అదే సమయంలో, ఈ కార్యక్రమాలను నిర్వహించడంలో తోడ్పాటునందించే, లేదా వారి ఉత్సాహభరితమైన భాగస్వామ్యం ద్వారా వాటిని అద్భుతంగా విజయవంతం చేసే సత్యాన్వేషకులు మరియు భక్తులందరికీ మేము ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

మేము మా ప్రియమైన గురుదేవుని 125వ జయంతిని జరుపుకుంటున్నందున మేము మీతో కాలానుగుణ నవీకరణలు మరియు వార్తలను పంచుకోవడం కొనసాగిస్తాము. ఇక్కడ తెలియజేసిన కార్యక్రమాల జాబితాను చూడండి.

భారత ప్రభుత్వ సీనియర్ అధికారులతో సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ (హోమ్ మంత్రి)తో స్వామి స్మరణానందగారు
భారత ప్రభుత్వ సీనియర్ అధికారులతో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో స్వామి ఈశ్వరానందగారు మరియు బ్రహ్మచారి నిష్ఠానందగారితో కలిసి వై.ఎస్.ఎస్. ప్రధాన కార్యదర్శి స్వామి స్మరణానందగారు (ఎడమ నుండి మూడవ వారు): (కుడి నుండి ఎడమకు) డా. మహేష్ శర్మ, సాంస్కృతిక శాఖ మంత్రి; శ్రీ రాజ్‌నాథ్ సింగ్, హోం వ్యవహారాల మంత్రి; శ్రీ అహ్లువాలియా, ఎలక్ట్రానిక్స్ & IT మంత్రి; శ్రీ పీయూష్ గోయల్, రైల్వే మంత్రి; మరియు శ్రీ భూపేందర్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు (పార్లమెంట్).
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. డైరెక్టర్ల బోర్డు సభ్యుడు స్వామి విశ్వానందగారు (కుడి), లాస్ ఏంజిలిస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. మదర్ సెంటర్ నుండి భారత ప్రభుత్వ అధికారులతో సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చారు. ఇక్కడ ఆయన సాంస్కృతిక శాఖ మంత్రి డా.మహేష్ శర్మతో సమావేశమయ్యారు.
రాంచీలోని వై.ఎస్.ఎస్. బాలుర పాఠశాల మరియు కళాశాల మల్టీపర్పస్ హాల్ యొక్క మాస్టర్ ప్లాన్ లోని ఊహా చిత్రాలు మరియు నిధులు మంజూరు చేయబడిన క్రొత్త భవనాలలో ఒకటి (అంతర చిత్రం).

ఇతరులతో షేర్ చేయండి