వై.ఎస్.ఎస్. ఉపకార శిక్షణా కేంద్రం యొక్క పూర్వ విద్యార్థులు ఐఐటీల్లో చేరారు

3 జనవరి, 2022

వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమంలోని మా ఉపకార శిక్షణా కేంద్రానికి చెందిన ముగ్గురు పూర్వ విద్యార్థులు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా ఐఐటీలలో ఎంపికయ్యారు. రోహిణి మిశ్రా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చేరారు; యోగేష్ లోధి ఐఐటి పాట్నాలో చదువుతున్నాడు మరియు అన్షు పాల్ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరడానికి ప్రాధాన్యతనిచ్చింది.

దశాబ్దం క్రితం ప్రారంభమైన ఈ శిక్షణా కేంద్రం వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమ పరిసరాల్లో నివసిస్తున్న సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత శిక్షణను అందిస్తోంది. తొమ్మిది నుండి పన్నెండో తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు వారి పాఠశాల సమయం తర్వాత ఆశ్రమ ప్రాంగణంలో బోధిస్తారు. ఉపాధ్యాయులందరూ అంకిత వై.ఎస్.ఎస్. భక్తులు-వలంటీర్లు, చాలామంది మాజీ ఉపాధ్యాయులు లేదా విద్యారంగానికి సంబంధించిన వారు.

స్వామి స్మరణానంద గిరి మరియు శిక్షణా కేంద్రంలోని భక్త-ఉపాధ్యాయుల బృందంతో ప్రతిభావంతులైన విద్యార్థులు

విద్యార్థులకు ఆయా కోర్సుల్లో సాధారణ పాఠ్యాంశాలతో పాటు ఆంగ్ల భాషితము కూడా బోధిస్తారు. ఈ విద్యార్థులు హిందీ మాధ్యమంలో చదువుతున్నందున, ఆంగ్ల భాషణలో వారి నైపుణ్యాలు మెరుగుపడాలి. వారు తమ పన్నెండో తరగతిని పూర్తి చేసే సమయానికి అన్ని పాఠ్యాంశాలపై సరళమైన ఆంగ్లభాషలో సంభాషించడానికి కావలసిన నేర్పు సాధించే ప్రయత్నం జరుగుతుంది.

అదే విధంగా, విద్యార్థులకు వారి విద్యా ఫలితాలు, అభిరుచులు, వారి ఆర్థిక నేపథ్యం మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకొని వారి జీవనోపాధికి సలహా ఇవ్వబడుతుంది. ఉదాహరణకు, ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులను కలిగిన ఒక విద్యార్థినిని పన్నెండో తరగతి పూర్తి చేసిన తదుపరి రెండేళ్ల కోర్సులో చేరాలని సూచనతో, ఆమె మెడికల్ లాబొరేటరీ అసిస్టెంట్‌గా డిప్లొమా సంపాదించగలిగింది. ఫీజులో కొంత శాతాన్ని భరించడానికి వీలుగా ఆమెకు వై.ఎస్.ఎస్. ద్వారా ఉపకార వేతనం ఇవ్వడం జరిగింది. అలా ఆమె తన చదువును పూర్తి చేసి ఇప్పుడు మంచి ఆసుపత్రిలో పని చేస్తున్నది.

ఈ ముగ్గురు ఐఐటి విద్యార్థులు ప్రతి రంగంలో తమ సత్తా చాటేందుకు మరియు క్రమశిక్షణతో కూడిన జీవనంతో ఉన్నత లక్ష్యాలను సాధించే విధంగా శిక్షణా కేంద్రంలోని ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో మార్గోపదేశం చేశారు. వారి వృత్తి ఎంపికలో కూడా మార్గనిర్దేశం చేశారు.

పరమహంస యోగానందగారి యొక్క ఆధ్యాత్మిక సంస్థతో వారి ఉపాధ్యాయుల ద్వారా ప్రత్యేక సంబంధాన్ని పెంచుకున్న ఈ ముగ్గురు ప్రతిభావంతులైన విద్యార్థులు తమ ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం కోసం వై.ఎస్.ఎస్. ని సంప్రదించారు. వారి విద్యా పనితీరును దృష్టిలో ఉంచుకుని, వై.ఎస్.ఎస్. వారి కళాశాల ఫీజులో ఎక్కువ భాగాన్ని స్కాలర్‌షిప్‌గా అందించి మద్దత్తునిచ్చింది.

para-ornament

దేశమంతటా శ్రీ పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు వివిధ స్వచ్ఛంద, విద్యా మరియు వైద్య కార్యకలాపాలకు తోడ్పాటునిచ్చే యోగదా సత్సంగ సొసైటీతో భాగస్వామ్యమవ్వడానికి, దయచేసి దిగువ పొందుపరిచిన లింక్‌ను క్లిక్ చేయండి:

ఇతరులతో షేర్ చేయండి