యోగదా సత్సంగ పత్రికకు ఒక కొత్త దిశ

16 సెప్టెంబర్, 2021

పరమహంస యోగానందగారు అమెరికా అంతటా ఉన్న తన తరగతులకు చెందిన వేలాది మంది విద్యార్థులతో క్రమం తప్పకుండా పరిచయములో ఉండడానికి, మొదటిసారి 1925లో సెల్ఫ్-రియలైజేషన్ (యోగదా సత్సంగ) పత్రికను ప్రవేశపెట్టినప్పుడు, ఆయన ఇలా అన్నారు, “నేను మీ అందరితో ఈ పత్రిక వాక్యాల ద్వారా మాట్లాడతాను.” ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించిన ఈ పత్రిక ద్వారా దాదాపు ఒక శతాబ్దానికి పైగా, ఆయన గురువులచే ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడానికి నిర్దేశించబడిన కాలాతీత సార్వత్రిక సత్యాలను పాఠకులకు పరిచయం చేయడానికి ఈ పత్రిక ఉపయోగపడింది — అనేక వేల మందికి యోగా యొక్క కాలం చే పరీక్షించబడిన సూత్రాలు మరియు సాంకేతికతలను వారు ఆచరణలో పెట్టి వారి జీవితాలను మార్చుకోవడానికి మరియు దేవునితో ప్రత్యక్ష వ్యక్తిగత అనుభవాన్ని పొందేందుకు ఈ పత్రిక సహాయపడింది.

యోగదా సత్సంగ పత్రిక పరిణామంలో తదుపరి దశ కోసం మా ప్రణాళికలను మీతో పంచుకోవాలనుకుంటున్నాము. ఇవి నేరుగా మా గురువు క్రియాయోగ బోధనల వ్యాప్తిలో ఇటీవలి మైలురాళ్లకు సంబంధించినవి. మీకు తెలిసినట్లుగా, 2019లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వై‌.ఎస్‌.ఎస్. పాఠాల పూర్తి మరియు మెరుగుపరచబడిన ఎడిషన్‌ను ప్రారంభించింది, ఇందులో పరమహంసగారి బోధనలు మరియు ప్రక్రియలు, మరియు ఇప్పటివరకు ప్రచురించబడిన అత్యంత లోతైన వివరణను కలిగి ఉంది,మరియు ఆయన ముప్పై సంవత్సరాలకు పైగా చేసిన లేఖనం, ఉపన్యాసాలు మరియు భక్తులకు అందించిన వ్యక్తిగత సూచనల యొక్క మొత్తము నుండి విస్తృతంగా తీసుకోబడింది. ప్రాథమిక పాఠాల శ్రేణి విడుదలైన తర్వాత, కొత్త క్రియాయోగ సిరీస్ ప్రారంభించబడింది, దాని తర్వాత అనుబంధ పాఠాల శ్రేణి ప్రారంభించబడింది, ఇందులో అనేక కీలక విషయాలపై ప్రెజెంటేషన్‌లు ఉన్నాయి మరియు ఇది చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంది. మరియు త్వరలో మేము అధునాతన పాఠాలను (క్రియాబాన్స్‌కు అందుబాటులో ఉన్నాయి) మరియు వారానికోసారి సత్సంగ విత్ పరమహంస యోగానంద పరంపరని ప్రారంభిస్తాము, ఇది వై‌.ఎస్‌.ఎస్. పాఠాల విద్యార్థులకు జీవితకాల మార్గదర్శకత్వం మరియు సూచనల కొరకు ఇంకొక మూలాన్ని అందిస్తుంది.

కొత్త వై‌.ఎస్‌.ఎస్. పాఠాలు మరియు మా ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లకు వేలాది మంది అన్వేషకుల ప్రతిస్పందన – వై‌.ఎస్‌.ఎస్. విద్యార్థులు మరియు మొదటిసారిగా వై‌.ఎస్‌.ఎస్.ను గురించి కనుగొన్నవారు – చాలా సానుకూలంగా ఉంది, నేటి ప్రపంచంలో పరమహంసగారి బోధనల పరివర్తన శక్తిని మరియు సర్వత్రా సవాళ్లను ఎదురుకొంటానికి వాటి సమయానుకూలమైన ఔచిత్యాన్ని పలువురు ధృవీకరిస్తున్నారు. ఈ విస్తారమైన సమర్పణలను కలిగి ఉండటం కొత్త వై‌.ఎస్‌.ఎస్. పాఠాలు మరియు మా ఆన్‌లైన్ కార్యక్రమాల వల్ల వై‌.ఎస్‌.ఎస్. మరియు ఎస్‌.ఆర్‌.ఎఫ్‌.ల కోసం మన గురుదేవులు ఊహించిన ప్రపంచ ఆధ్యాత్మిక సమాజం మరియు ఫెలోషిప్‌ను గొప్ప మార్గంలో అనుభవించడానికి వారికి సహాయపడిందని చాలా మంది వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా, 1925లో మా పత్రిక మొదటి సంచిక ప్రచురణతో నిరాడంబరంగా ప్రారంభమైన స్ఫూర్తి ప్రవాహం విపరీతంగా విస్తరించి, పరమహంసగారి బోధనల జ్ఞానం మరియు స్ఫూర్తిని ఆయన పత్రికను ప్రారంభించినప్పుడు సాధ్యమయ్యే దానికంటే ఇప్పుడు చాలా ఎక్కువ స్థాయిలో సాధకులకు అందుబాటులోకి తెచ్చింది.

యోగదా సత్సంగ పత్రికకు కొత్త వార్షిక ముద్రణ సంచిక

మన గురుదేవుల బోధనల యొక్క ఇటీవల విస్తరించిన ప్రచునలకు సంబంధించి, మరియు వై‌.ఎస్‌.ఎస్. పాఠాలు మరియు మన ఆన్‌లైన్ సమర్పణల శ్రేణినికి సహాయము చేస్తూ, యోగదా సత్సంగ పత్రిక తన పాత్రను ఎలా ఉత్తమంగా కొనసాగించగలదో అని మేము తాజాగా పరిశీలించాము. మీలో చాలా మందికి తెలిసినట్లుగా, గత రెండు దశాబ్దాలలో మన ప్రపంచం సమాచారం మరియు సూచనలను ప్రచురించే మరియు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు పంపిణీ చేసే విధానంలో భారీ మార్పులను చూసింది. పత్రికలు, వార్తాపత్రికలు మరియు ఇతర ముద్రిత మాధ్యమాలు ప్రభావం తగ్గింది : కాని వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ వీడియో మరియు ఇతర డిజిటల్ మీడియా మునుపెన్నడూ లేనంతగా అనేక రకాల విషయాలను పంచుకోవడానికి అపారమైన అవకాశాలను తెరిచింది. పైన చెప్పినట్లుగా, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ విషయమునుండి నుండి అనేక విధాలుగా ప్రయోజనం పొందింది మరియు అభివృద్ధి చెందింది. ఇక పత్రిక కోసం మా ప్రణాళికలకు వస్తాము.

తక్షణమే ప్రారంభించి, మన పత్రికలో స్పూర్తిదాయకమైన మల్టీమీడియా విషయములతో కూడిన మా ఆన్‌లైన్ కార్యక్రమాలను విస్తరింపజేస్తూనే మేము ప్రచురించే పత్రిక తరుచుదనమును తగ్గిస్తున్నాము (అంటే త్రైమాసికము నుండి వార్షికమునకు). మేము వై‌.ఎస్‌.ఎస్. వెబ్‌సైట్‌లో “యోగద సత్సంగ పత్రిక” అనే ప్రత్యేక విభాగాన్ని రూపొందించే ప్రక్రియలో ఉన్నాము. అదనంగా, వచ్చే ఏడాది ప్రారంభంలో, యోగద సత్సంగ యొక్క ప్రత్యేక పెద్ద- పరిమాణములో ముద్రిత సంచిక, సంవత్సరం ప్రారంభంలో ప్రతి సంవత్సరం ప్రచురించబడుతుంది, ఇది ప్రస్తుత త్రైమాసిక సంచికలకు బదులుగా ఉంటుంది. యోగద సత్సంగ పత్రిక యొక్క ఈ వార్షిక ముద్రిత సంచికలలో పరమహంస యోగానందగారి నుండి మునుపు ప్రచురించని ప్రేరణ వ్యాసాలు, అలాగే ప్రస్తుత మరియు గత వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. అధ్యక్షుల కథనాలు ఉంటాయి. అదనంగా, ఇతర రచయితల కథనాల, స్ఫూర్తిని మరియు ఆచరణాత్మకంగా ఎలా జీవించాలో అనే మార్గదర్శకానికి విస్తృత సమర్పణను అందిస్తాయి; మరియు ఆ సంవత్సరంలోని ప్రముఖ వై‌.ఎస్‌.ఎస్. కార్యక్రమాల వార్తా విశేషాలు కూడా ఉంటాయి.

ఈ ప్రత్యేక వార్షిక సంచికల కోసం మా పాఠకులు ఆసక్తిగా ఎదురు చూస్తారని మేము ఆశిస్తున్నాము; మరియు అదే సమయంలో, సప్లిమెంట్ పాఠాలు మరియు ఇతర పాఠాల క్రమముల ద్వారా ఇప్పుడు వస్తున్న అమూల్యమైన మెటీరియల్‌పై దృష్టి సారించడానికి మరియు గ్రహించడానికి ఈ మార్పు (అంటే త్రైమాసికము నుండి వార్షికమునకు మార్పు) వై‌.ఎస్‌.ఎస్. పాఠాల విద్యార్థులకు ఎక్కువ సమయం ఇస్తుంది, వీటిలో ఎక్కువ భాగం ఇంతకు ముందు ప్రచురించబడలేదు. (వై‌.ఎస్‌.ఎస్. పాఠాల గురించి మరింత తెలుసుకోండి.) నాలుగు త్రైమాసిక సంచికలకు బదులుగా ఒక వార్షిక సంచిక యొక్క ఈ షెడ్యూల్ తదుపరి 2 – 3 సంవత్సరాల వరకు అమలులో ఉంటుంది, ఆ తర్వాత మేము భవిష్యత్ సంవత్సరాల్లో పత్రికకు ఉత్తమ పాత్రను ఇవ్వటము గురించి తిరిగి ఆలోచిస్తాము.

జనవరి 2022లో ప్రచురించబడే 2022 వార్షిక సంచిక తదుపరి ముద్రిత సంచిక అవుతుంది. ఈలోగా, కొత్త యోగదా సత్సంగ ఆన్‌లైన్ వెబ్‌పేజీని ఆస్వాదించడానికి మేము పాఠకులను ఆహ్వానిస్తున్నాము. ఇందులో ఇవి ఉన్నాయి:

  • గతంలో ప్రచురిత పత్రికలో తెలియజేయబడిన మా వెబ్‌సైట్‌లో వేరే చోట వర్ణించబడిన విషయములకు లింకుల క్రమములో అమర్చబడిన జాబితా: బ్లాగ్ ఎంట్రీలు, వై‌.ఎస్‌.ఎస్. వార్తలు మొదలైనవి.
  • అన్ని ఆన్‌లైన్ సేవలు, చర్చలు మరియు గైడెడ్ ధ్యానములను సులభంగా అందుబాటులోకి తీసుకురాగల గ్రంధాలయం.
  • వార్షిక ముద్రణ సంచిక యొక్క డిజిటల్ రూపము (అది అందుబాటులోకి వచ్చినప్పుడు).
ఈ-మెయిల్ ద్వారా వై‌.ఎస్‌.ఎస్. యొక్క నెలవారీ వార్తాలేఖలను స్వీకరించడానికి మీరు సభ్యత్వం ఇంకా చేరకుండా ఉంటే, local.yssofindia.org / enewsletter ని సందర్శించడం ద్వారా ఇప్పుడే అలా చేయమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ప్రతి ఎడిషన్‌లో చాలా కొత్త స్ఫూర్తిదాయక అంశాలు ప్రచురించ బడతాయి,మరియు ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి పంపబడుతుంది. ఈ సంవత్సరం చివరలో మేము మ్యాగజైన్ యొక్క గత సంచికల నుండి ఎంచుకున్న అనేక సంవత్సరాల స్ఫూర్తిదాయకమైన విషయములతో కూడిన ప్రత్యేక ఆన్‌లైన్ గ్రంధాలయమును కూడా ప్రారంభిస్తాము. ఇది పరమహంసగారి, శ్రీ దయా మాత మరియు ఇతర ప్రాముఖ్య రచయితలు వ్రాసిన వందలాది పేజీల విషయాలను కలిగి ఉంటుంది, వారి సందేశమును గత యోగద సత్సంగ పత్రిక పాఠకులు ఆసక్తిగా గ్రహించారు — అలాగే అరుదైన ఫోటోలు మరియు వై‌.ఎస్‌.ఎస్. వార్తలు (ఇప్పుడు వై‌.ఎస్‌.ఎస్. చరిత్ర!). ఈ అసాధారణమైన జ్ఞాన వనరు వై‌.ఎస్‌.ఎస్. వెబ్‌సైట్‌లో ఉంటుంది మరియు వార్షిక ముద్రణా ఎడిషన్‌కు సభ్యత్వం పొందిన వారందరికీ అందుబాటులో ఉంచబడింది. వార్షిక ముద్రణ సంచిక (డిజిటల్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది) మరియు పత్రికలోని గత కథనాల ఆన్‌లైన్ గ్రంధాలయన్ని యాక్సెస్ చేయడానికి యోగదా సత్సంగకు ఎలా సభ్యత్వం చేరాలో అనే దాని గురించి మేము త్వరలో మా యోగదా సత్సంగ పత్రిక వెబ్‌పేజీలో పోస్ట్ చేస్తాము. ఈలోగా, మీరు పత్రిక పేజీలో అనేక ఉచిత కథనాలను యాక్సెస్ చేయవచ్చు మరియు మీరు ఇప్పటికీ అందుబాటులో ఉన్న పత్రిక యొక్క మునుపటి ప్రింట్ సంచికలను కొనుగోలు చేయాలనుకుంటే దిగువ లింక్‌లో మా పుస్తక కోశంలో చేయవచ్చు. భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు పరమహంస యోగానందగారి అద్వితీయ స్వరం మరియు ఆచరణాత్మక బోధనలను మీకు నేరుగా అందించడానికి రూపొందించబడిన ఈ నిర్మాణాత్మకమైన పత్రికను మీరు కొత్తగా లేదా మొదటిసారిగా ఆస్వాదిస్తున్నప్పుడు మీతో పాటు ఈ ప్రయాణంలో మేము కొనసాగాలని అనుకుంటున్నాము.

ఇతరులతో షేర్ చేయండి