కష్ట సమయాలకు పరమహంస యోగానందగారి మార్గదర్శకత్వం.

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమకు మరియు వారి కుటుంబాలకు ఉత్తమమైన మార్గాన్ని కనుగొనడంలో అవగాహన మరియు దిశను కోరుతున్నారు.

అర్ధ శతాబ్దం క్రితమే, పరమహంస యోగానందగారు ప్రపంచం ఉన్నతమైన, మరింత ఆధ్యాత్మిక యుగానికి మారడంలో భాగంగా జరిగే మార్పులను వివరించారు. ఆయన ఖచ్చితమైన టైమ్‌టేబుల్ ఇవ్వనప్పటికీ, ఈ సవాలుతో కూడిన సమయాలను ఎదుర్కోవటానికి చాలా ఆధ్యాత్మిక సలహాలు మరియు ఆచరణాత్మక సలహాలను అందించారు.

పరమహంసగారి గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు, తన పుస్తకం, ది హోలీ సైన్స్‌లో (The Holy Science), పరమాణు యుగం (ద్వాపర యుగం) మన గ్రహం జీవితంలో ఒక కొత్త ఆరోహణ దశ అని వెల్లడించారు. అయితే, ఇటీవల కాలంలో చీకటి యుగం (కలియుగం) ప్రభావం ఇప్పటికీ సమకాలీన నాగరికతపై ఎక్కువగా ఉంది అని శ్రీ పరమహంసగారు ఎత్తి చూపారు. వేల సంవత్సరాల భౌతిక ఆసక్తులలో సృష్టించబడిన ఆలోచనా-నమూనాలు అనేక రకాల ఆచారాలు, సంప్రదాయాలు మరియు మూఢనమ్మకాలలో ప్రతిబింబిస్తాయి, ఇవి మనిషి నుండి మనిషిని, దేశం నుండి దేశాన్ని వేరు చేస్తాయి. మానవత్వం ఈ పురాతన భ్రమలు మరియు అసమానతలను అధిగమించినప్పుడు, మానవ సమాజం మరియు దేశాల మనుగడలో గొప్ప హెచ్చు తగ్గులను పరమహంసగారు అంచనా వేశారు — ఆ తర్వాత కాలంలో ప్రపంచం మొత్తం అసమానమైన రీతిలో పురోగమిస్తుంది.

ఈ విషయంపై శ్రీ పరమహంస యోగానందగారి సలహాలను క్లుప్తంగా వివరిస్తూ, మా గౌరవనీయమైన మూడవ అథ్యక్షులు — గురువుగారి యొక్క తొలి మరియు సన్నిహిత శిష్యుల్లో ఒకరైన శ్రీ దయామాతగారు — ఇలా అన్నారు:

“ప్రపంచ పరిస్థితులు లేదా నాగరికతలు గణనీయమైన మార్పులకు లోనవుతున్నప్పుడల్లా, దానికి ఒక అంతర్లీన సూక్ష్మ కారణం ఎల్లప్పుడూ ఉంటుందని అర్థం చేసుకోవాలని శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు సూచించారు — ఆ కారణం వ్యక్తుల జీవితాలను మరియు ప్రాపంచిక వ్యవహారాలను కర్మ సిద్ధాంతం ప్రభావితం చేస్తుందని. మన వ్యక్తిగత జీవితంలో సవాళ్లతో పాటుగా, ‘దీని నుండి నేను ఏమి నేర్చుకోవాలి?’ అనే సరైన వైఖరి అలవరచుకోవాలి. కాబట్టి ప్రపంచం మొత్తం భగవంతుడు ఉద్దేశించిన పాఠాలను అర్థం చేసుకొనటము ద్వారా మనం ఆథ్యాత్మిక పరిణామంలో ఉన్నతి చెందాలని ఈ సమయంలో మనం గ్రహించాలి.

“మానవజాతి సమతుల్య ఆధ్యాత్మిక జీవన కళను స్వీకరించాలి మరియు అది ఒక ప్రపంచ కుటుంబంగా కలిసి పోవడాన్ని నేర్చుకోవాలి. విస్ఫోటనం చెందుతున్న సాంకేతిక అభివృద్ధి యుగంలో మనం అనుభవించే ఒత్తిళ్లు మరియు ఆందోళనలు ఈ పాఠాలు మనము నేర్చుకోవాలని ఇప్పుడు లేదా తరువాత మనల్ని బలవంతం చేస్తాయి.

“పరమహంసగారు ఈ విషయాన్ని చాలా సంవత్సరాల క్రితమే ఊహించి, చాలాసార్లు మనకు చెప్పారు: ‘ప్రపంచం సరళమైన జీవనానికి తిరిగి రావలసిన రోజు రాబోతుంది. దేవుని కోసం సమయాన్ని వెచ్చించడానికి మన జీవితాలను సరళీకృతం చేసుకోవాలి. మనం మరింతగా సోదరభావంతో జీవించాలి, ఎందుకంటే నాగరికత ఉన్నత యుగంగా పరిణామం చెందడంతో, ప్రపంచం చిన్నదిగా మారుతుందని మనం గుర్తించబోతున్నాం. పక్షపాతం, అసహనం, పోవాలి.’

“ఏసు ఇలా అన్నారు, ‘తనకు తాను వ్యతిరేకంగా విడిపోయిన ఇల్లు నిలబడదు.’ సైన్స్ దేశాలను ఒకదానికొకటి దగ్గరగా తీసుకువచ్చింది, ఒకప్పుడు విస్తారమైన ప్రపంచం ఇప్పుడు ఒక ఇంటి లాగా ఉంది, ప్రతి సభ్యుడు ఒకరితో ఒకరు అనుసంధానించబడి ఇతరులపై ఆధారపడేలా ఉన్నది. ప్రస్తుత కాలంలోని అనైక్య పోకడల మధ్య ఒక చిన్న కుటుంబం కూడా కలిసి ఉండటం ఎంత కష్టమో పరిశీలిస్తే, ప్రపంచంలో ఐక్యత కోసం ఆశించగలమా? ఆశ ఉంది — వ్యక్తిగత కుటుంబాల మధ్య అలాగే వసుదైక కుటుంబం లాగా, ప్రపంచ దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించు కోగలిగితే — నిజమైన శాంతి మరియు ఆధ్యాత్మిక అవగాహనకు అనుకూలమైన లక్ష్యాలు మరియు విలువలను పెంపొందించుకోవడానికి మనం సమయాన్ని వెచ్చిస్తే.”

ఇతరులతో పంచుకోండి