సహాయకరమైన ఆలోచనలు

శ్రీ శ్రీ పరమహంస యోగానంద ప్రసంగాలు మరియు రచనల నుండి సహాయకరమైన ఆలోచనలు

భగవంతుడే ఆరోగ్యానికి, శ్రేయస్సుకు, జ్ఞానానికి మరియు శాశ్వతమైన ఆనందానికి మూలాధారం. భగవంతునితో సంపర్కం ద్వారా మన జీవితాన్ని సంపూర్ణం చేసుకుంటాం. ఆయన లేనిదే జీవితం సంపూర్ణం కాదు. మీకు జీవితాన్ని, శక్తిని మరియు జ్ఞానాన్ని ఇస్తున్న సర్వశక్తివంతమైన శక్తిపై మీ దృష్టిని నిలపండి. మీ మనస్సులోకి ఎడతెగని సత్యం ప్రవహించాలని, మీ శరీరంలోకి ఎడతెగని శక్తి ప్రవహించాలని, మీ ఆత్మలోకి ఎడతెగని ఆనందం ప్రవహించాలని ప్రార్థించండి. మూసిన కళ్ళ చీకటి వెనుకే విశ్వంలోని అద్భుత శక్తులు, గొప్ప సాధువులందరూ ఉన్నారు; మరియు అంతులేని అనంతం ఉన్నది. ధ్యానం చేయండి, తద్ద్వారా మీరు సర్వవ్యాప్త సంపూర్ణ సత్యాన్ని తెలుసుకుంటారు మరియు మీ జీవితంలో మరియు సృష్టి వైభవం అంతటిలోను దాని నిగూఢమైన కార్యశీలతను దర్శిస్తారు.

అజ్ఞానపు చీకటి నుండి మిమ్మల్ని మీరు మేల్కొలుపుకోండి. మాయ అనే మత్తులో నీవు కళ్ళు మూసుకుని ఉన్నావు. మేలుకో! మీ కళ్ళు తెరవండి మరియు మీరు దేవుని వైభవాన్ని దర్శిస్తారు - అన్ని పదార్థాలపై విస్తరించిన దేవుని కాంతి యొక్క విస్తారమైన దృశ్యాన్ని దర్శిస్తారు. నేను మిమ్మల్ని దైవిక వాస్తవికవాదులుగా ఉండమని చెబుతున్నాను, మరియు ప్రశ్నలన్నిటికీ దేవునిలో మీరు సమాధానం కనుగొంటారు.

అన్ని సంపదలు బ్యాంకులు, కర్మాగారాలు, ఉద్యోగాల నుండి మరియు వ్యక్తిగత సామర్థ్యం ద్వారా లభిస్తాయని లక్షల మంది ప్రజలు భావిస్తారు. ఇంకా క్రమానుగతంగా సంభవించే తీవ్రమైన ఆర్థిక మాంద్యాలు జీవితంలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక మరియు భౌతిక దశలను నియంత్రించే పరిచితమైన భౌతిక చట్టాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సూత్రాలు కూడా ఉన్నాయని రుజువు చేస్తాయి. ఆరోగ్యంగా, ధనవంతులుగా, జ్ఞానవంతంగా మరియు సంతోషంగా ఉండటానికి ప్రతిరోజు కృషి చేయండి, ఇతరుల ఆరోగ్యాన్ని, సంపదను మరియు ఆనందాన్ని తీసుకోవడం ద్వారా కాదు, కానీ వారి ఆనందం మరియు సంక్షేమాన్ని మీవిగా చేసుకోవడం ద్వారా. వ్యక్తులు, కుటుంబ సభ్యులు మరియు దేశాల సంతోషం పూర్తిగా పరస్పర సహకారం లేదా నిస్వార్థం యొక్క చట్ట పరమైన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది మరియు ఈ నినాదానికి అనుగుణంగా జీవించడంపై ఆధారపడి ఉంటుంది: "తండ్రీ, మేము ఎల్లప్పుడూ నిన్ను గుర్తుంచుకునేలా మమ్మల్ని దీవించు. సకల దీవెనలు నీ నుండి ప్రవహిస్తాయని మేము మరువకుందుము గాక."

ప్రపంచంలో సంపూర్ణమైన మార్పు కొనసాగుతున్నది. ఇది ఆర్థిక వ్యవస్థను మార్పు తీసుకు వస్తుంది. అమెరికా యొక్క కర్మ వలయంలో నేను ఒక అందమైన సంకేతాన్ని చూస్తున్నాను: ప్రపంచం ఎలా గడిచినా, అమెరికా ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉంటుంది. కానీ అదే విధంగా అమెరికా విస్తారమైన కష్టాలు, బాధలు మరియు మార్పులను అనుభవిస్తుంది....

నాకు స్వంతంగా ఏమీ లేదు, అయినప్పటికీ నేను ఆకలితో ఉంటే నాకు ఆహారం ఇచ్చేవారు ప్రపంచంలో వేలాది మంది ఉంటారని నాకు తెలుసు, ఎందుకంటే నేను వేల మందికి ఇచ్చాను. ఆకలితో అలమటిస్తూ కూడా తన గురించి కాకుండా, అవసరంలో ఉన్న ఎదుటివాడి గురించి ఆలోచించేవాడికి అదే సూత్రం పని చేస్తుంది....

ప్రపంచాన్ని దుప్పటితో కప్పడానికి సరిపడా డబ్బు ఉంది, ప్రపంచానికి సరిపడా ఆహారం తినడానికి ఉంది. సరైన పంపిణీ అవసరం. మనుషులు స్వార్థపరులు కాకపోతే, ఎవరూ ఆకలితో లేదా పేదరికంలో ఉండరు. మనిషి సోదరభావంపై దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్కరూ అందరి కోసం జీవించాలి, అందరినీ తనవారిగా ప్రేమించాలి. మౌంట్ వాషింగ్టన్‌లో ఎవరైనా ఆకలితో ఉంటే, మేమంతా కలిసి ఆ వ్యక్తిని చూసుకుంటామని నేను ఖచ్చితంగా చెప్పగలను. అన్ని దేశాలలోని ప్రజలందరూ అదే సమాజ స్ఫూర్తితో జీవించాలి.

తమ శ్రేయస్సు మాత్రమే కోరుకునే వారు చివరికి పేదలుగా మారతారు లేదా మానసిక అశాంతికి గురవుతారు; అయితే ఎవరైతే మొత్తం ప్రపంచాన్ని తమ కుటుంబంగానే భావించి, సమాజం కోసం లేదా ప్రపంచ శ్రేయస్సు కోసం నిజంగా శ్రద్ధ వహించి పని చేస్తారో, వారికి సూక్ష్మ శక్తులు క్రియాశీలకమై చివరికి న్యాయబద్ధముగా తమకు చెందాల్సిన వ్యక్తిగత శ్రేయస్సును కనుగొన్నట్లుగా తెలుసుకొంటారు. ఇది ఖచ్చితమైన, రహస్యమైన ధర్మ సూత్రం.

రాబోయే ప్రపంచ సంక్షోభాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? సాదాసీదా జీవనం మరియు ఉన్నతమైన ఆలోచనలను అలవర్చుకోవడం ఉత్తమ మార్గం....

మీకు సరిపోయే నివాస స్థలాన్ని ఎంచుకోండి, కానీ మీకు నిజంగా అవసరమైన దానికంటే పెద్దది కాదు, వీలైతే పన్నులు మరియు ఇతర జీవన వ్యయాలు సహేతుకంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకోండి. మీ వస్త్రాలు మీరే తయారు చేసుకోండి; మీ స్వంత ఆహారం మీరు తీసుకోవచ్చు. మీ స్వంత కూరగాయల తోటను పెంచుకోండి మరియు సాధ్యమైతే, గుడ్లు ఉత్పత్తి చేయడానికి కొన్ని కోళ్లను ఉంచండి. తోటలో పని మీరే చేయండి లేకపోతే తోటమాలికి వేతనాలు చెల్లించడంలో మీరు డబ్బును కోల్పోతారు. తప్పుడు మరియు ఖరీదైన సంతోషాలను కోరుకోకుండా జీవితాన్ని సరళంగా ఉంచుకోండి మరియు దేవుడు అందించిన వాటితో సంతోషంగా ఉండండి. మనిషి మనస్సును ఆకర్షించడానికి భగవంతుని ప్రకృతిలో చాలా దాగి ఉంది. విలువైన పుస్తకాలు చదవడానికి, ధ్యానం చేయడానికి మరియు సంక్లిష్టమైన జీవితాన్ని ఆస్వాదించడానికి మీ ఖాళీ సమయాన్ని ఉపయోగించండి. ఒక భారీ ఇల్లు, రెండు కార్లు మరియు సమయానికి చేయవలసిన చెల్లింపులు మరియు మీరు తీర్చలేని తనఖా కంటే - సాధారణ జీవనం, తక్కువ చింతలు మరియు దేవుణ్ణి అన్వేషించే సమయం - ఇవి మంచివి కాదా? మనిషి వచ్చిన చోటికే తిరిగి వెళ్ళాలి; అది చివరికి నెరవేరుతుంది. ఇది అలా కాదని మీరు భావిస్తే, మీరు తప్పుగా భావించినట్లే. కానీ మీ ఇల్లు మరియు పని ఎక్కడ ఉన్నా, విలాసాలను తగ్గించుకోండి, తక్కువ ఖరీదైన బట్టలు కొనుక్కోండి, మీకు నిజంగా అవసరమైన వస్తువులను మీరే సరఫరా చేసుకోండి, మీ స్వంత ఆహారాన్ని పెంచుకోండి మరియు అత్యధికమైన భద్రత కోసం క్రమం తప్పకుండా డబ్బును పక్కన పెట్టండి.

ఈ ప్రపంచం ఎప్పుడూ అల్లకల్లోలం మరియు ఇబ్బందులను కలిగి ఉంటుంది. మీరు దేని గురించి ఆందోళన చెందుతున్నారు? మహాత్ములు భగవంతుడిలో ఎక్కడ ఆశ్రయం పొందారో, ఆ ఆశ్రయానికి వెళ్ళండి, వారు ప్రపంచాన్ని గమనిస్తున్నారు మరియు సహాయం చేస్తున్నారు. మీకు ఎప్పటికీ భద్రత ఉంటుంది, మీకే కాదు, మన ప్రభువు మరియు తండ్రి ద్వారా మీ సంరక్షణకు అప్పగించబడిన ప్రియమైన వారందరికీ.

ప్రభువును మీ ఆత్మకు కాపరిగా చేయండి. జీవితంలో నీడలేని మార్గంలో మీరు వెళ్ళినప్పుడు ఆయన్ని మీ శోధన కాంతిగా చేసుకోండి. అజ్ఞానపు అంధకారంలో ఆయన మీ చంద్రుడు. మేల్కొనే సమయంలో ఆయన మీ సూర్యుడు. మరియు మర్త్య స్థితి యొక్క చీకటి సముద్రాలలో ఆయన మీ ధృవ తార. ఆయన మార్గదర్శకత్వాన్ని కోరండి. ప్రపంచం తన ఎత్తుపల్లాలతో ఇలాగే సాగిపోతుంది. దిశానిర్దేశం కోసం మనం ఎక్కడ వెతకాలి? మన అలవాట్లు మరియు మన కుటుంబాలు, మన దేశం లేదా ప్రపంచం యొక్క పర్యావరణ ప్రభావాల ద్వారా మనలో రేకెత్తించిన దురభిప్రాయాలలో కాదు; కానీ అంతర్గతంగా వెలువడే సత్యం అనే మార్గదర్శక స్వరంలో వెతకాలి.

గుర్తుంచుకోండి, మనస్సు యొక్క అనేక ఆలోచనల కంటే గొప్ప యుక్తి ఏమిటంటే, మీరు లోపల ప్రశాంతత అనుభూతి చెందే వరకు దేవునిపై ధ్యాస నిలిపి కూర్చుని ధ్యానం చేయడం. అప్పుడు ప్రభువుతో ఇలా చెప్పండి, "కోటి భిన్నమైన ఆలోచనలు చేసినా నేను ఒంటరిగా నా సమస్యను పరిష్కరించుకోలేను; కానీ నేను దానిని నీ చేతుల్లో ఉంచడం ద్వారా పరిష్కరించగలను, మొదట భగవంతుని మార్గదర్శకత్వం కోసం అడగండి, ఆపై సాధ్యమయ్యే పరిష్కారం కోసం వివిధ కోణాలలో ఆలోచించడం ద్వారా అనుసరించండి." తనకు తాను సహాయం చేసుకునే వారికి భగవంతుడు సహాయం చేస్తాడు. ధ్యానంలో దేవునికి ప్రార్థన చేసిన తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా మరియు విశ్వాసంతో నిండినప్పుడు, మీరు మీ సమస్యలకు వివిధ సమాధానాలను తెలుసుకోగలుగుతారు; మరియు మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నందున, మీరు ఉత్తమమైన పరిష్కారాన్ని ఎంచుకోగలుగుతారు. ఆ పరిష్కారాన్ని అనుసరించండి, మీరు విజయం సాధిస్తారు. ఈ విధంగా మీ దైనందిన జీవితంలో మత శాస్త్రాన్ని వర్తింపజేసుకోండి.

భయం గుండె నుండి వస్తుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాద భయం నుండి బయటపడినట్లు భావిస్తే, మీరు ప్రతి శ్వాసను విశ్రాంతి తీసుకుంటూ చాలాసార్లు గాఢంగా, నెమ్మదిగా మరియు లయబద్ధంగా శ్వాసించాలి మరియు విడిచిపెట్టాలి. ఇది రక్తప్రసరణ సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది. మీ హృదయం నిజంగా నిశ్శబ్దంగా ఉంటే మీరు అస్సలు భయాన్ని అనుభవించలేరు.

దేవుడు మనకు ఒక అద్భుతమైన రక్షణ సాధనాన్ని ఇచ్చాడు — యంత్ర తుపాకులు, విద్యుత్తు, విష వాయువు లేదా ఏదైనా ఔషధం కంటే శక్తివంతమైనది — అదే మనస్సు. మనస్సును దృఢపరచుకోవాలి....మనస్సును స్వాధీనంలో ఉంచుకోవడమే జీవితపు అతి సాహసమైన భాగం.. మనస్సును పట్టుకోవడం, ఆ నియంత్రిత మనస్సును భగవంతునితో నిరంతరంగా అనుసంధానంలో ఉంచుకోవడం. ఇది సంతోషకరమైన, విజయవంతమైన అస్తిత్వపు రహస్యం....మానసిక శక్తిని సాధన చేయడం ద్వారా మరియు ధ్యానం ద్వారా మనస్సును భగవంతునితో అనుసంధానం చేయడం వల్ల ఇది వస్తుంది....వ్యాధులు, నిరాశలు మరియు విపత్తులను అధిగమించడానికి సులభమైన మార్గం, నిరంతరంగా దేవునితో అనుసంధానంలో ఉండటమే.

నిజమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం, దేవునిలో మాత్రమే ఉంటుంది, "ఆయన్ని కలిగి ఉంటే, ఇక ఏ ఇతర ప్రయోజనలు కూడా గొప్పవి కావు." ఆయనలో మాత్రమే భద్రత, ఏకైక ఆశ్రయం, మన భయాల నుండి తప్పించుకునే ఏకైక మార్గం ఉంటుంది. మీకు ప్రపంచంలో వేరే భద్రత లేదు, వేరే స్వేచ్ఛ లేదు. నిజమైన స్వాతంత్య్రం భగవంతునిలో మాత్రమే ఉంది. కాబట్టి ఉదయం మరియు రాత్రి ధ్యానంలో, అలాగే రోజంతా మీరు చేసే అన్ని పనులు మరియు విధుల్లో ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి గాఢంగా కృషి చేయండి. భగవంతుడు ఉన్న చోట భయం, దుఃఖం ఉండవని యోగం బోధిస్తుంది. ఫెళఫెళమని విరిగిపడుతున్న ప్రపంచాల మధ్య కూడా విజయవంతమైన యోగి కదలకుండా నిలబడగలడు; అతను "ప్రభూ, నేను ఎక్కడ ఉన్నానో, అక్కడికి నీవు రావాలి" అని మననం చేసుకుంటూ సాక్షాత్కారంలో సురక్షితంగా ఉంటాడు.

ఆత్మల సమాఖ్య కోసం మరియు ప్రపంచ ఐక్యత కోసం మన హృదయాల్లో ప్రార్థిద్దాం. మనం జాతి, మతం, వర్ణం, వర్గం మరియు రాజకీయ దురభిప్రాయాల ద్వారా విభజించబడినట్లుగా అనిపించినప్పటికీ, ఇప్పటికీ ఒకే దేవుని పిల్లలుగా మన ఆత్మలలో సోదరభావాన్ని మరియు ప్రపంచ ఐక్యతను అనుభవించగలము. మానవుని యొక్క జ్ఞానోదయ వివేకం ద్వారా దేవునిచే మార్గనిర్దేశం చేయబడే ప్రతి దేశం ఉపయోగకరమైన భాగంగా ఉండే ప్రపంచ ఐక్యతా సృష్టికి మనం కృషి చేద్దాం. మన హృదయాలలో మనమందరం ద్వేషం మరియు స్వార్థం నుండి విముక్తి పొందడం నేర్చుకుందాం. దేశాల మధ్య సామరస్యం కోసం ప్రార్థిద్దాం, తద్ద్వారా వారు ఒక అందమైన కొత్త నాగరికత ద్వారం గుండా చేయి చేయి కలిపి ముందుకు సాగుతారు.

మీరు అన్నిటికంటే ఎక్కువగా ధ్యానం ద్వారా భగవంతుడిని అన్వేషించడంలో నిమగ్నమై ఉండాలని నొక్కి చెబుతున్నాను....ఈ జీవితం యొక్క నీడల వెనుక ఆయన అద్భుతమైన కాంతి ఉంది. విశ్వం ఆయన సాన్నిధ్యపు విశాలమైన దేవాలయం. మీరు ధ్యానం చేసినప్పుడు, ప్రతిచోటా ఆయనకు ద్వారాలు తెరుచుకొని ఉండడాన్ని మీరు కనుగొంటారు. మీరు ఆయనతో అనుసంధానం పొందినప్పుడు, ప్రపంచంలోని ఏ వినాశనాలు, ఆ ఆనందం మరియు శాంతిని తీసివేయలేవు.

ఇతరులతో పంచుకోండి