గురు పూర్ణిమ

25 జూలై, 2018

ఈ ఏడాది జూలై 27న గురు పూర్ణిమ సందర్భంగా పూజ్యనీయులైన అధ్యక్షుడి నుండి ఒక ప్రత్యేక సందేశం

ప్రియుతములారా,

పవిత్రమైన ఈ గురు పూర్ణిమ రోజున, మనం భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులతో కలిసి గురువును గౌరవించే పురాతన సంప్రదాయంలో ఏకమౌదాం — ప్రగాఢమైన తపన కలిగిన సాధకులకు తమ ఆత్మ జాగృతి కొరకు భగవంతుడు పంపే తన దివ్య ప్రేమ మరియు జ్ఞానం యొక్క స్వచ్ఛమైన మాధ్యమంగా కొలువుండే దివ్య స్నేహితుడు మరియు మార్గదర్శిమ ఆత్మ జాగృతి కొరకు. మన ప్రియతమ గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందుల పాదాల వద్ద మీ ప్రేమ మరియు కృతజ్ఞతలు సమర్పిస్తూ, వారి ఆధ్యాత్మిక అనుగ్రహానికి మీ హృదయాన్ని పూర్తిగా సన్నద్ధం చేయండి. మాయ-బంధిత మానవ నైజము నుండి భగవంతుని ఆనంద చైతన్యం యొక్క అపరిమితమైన స్వేచ్ఛ వైపు మనల్ని నడిపించగలిగినటువంటి భగదైక్యమైన ఆత్మ వైపు ఆకర్షితమవడం కంటే ఆధ్యాత్మిక మార్గంలో మనం పొందగలిగే మహిమాన్వితమైన కానుక మరొకటి లేదు.

గురుదేవుని ఆగమనంతో, మీ జీవితంలో ఆత్మ స్వేచ్ఛకు మార్గం తెరుచుకుంటుంది, ఎందుకంటే ఆ ప్రయాణంలో గురువు ద్వారా మరియు ఆయన బోధనల ద్వారా, దేవుడే మీ చేయి పట్టుకొని మార్గనిర్దేశం చేస్తాడు. గురుదేవులు మన చంచలమైన మనస్సును నిశ్చలపరచే పవిత్రమైన సాంకేతిక ప్రక్రియలను, క్రియాయోగ శాస్త్రంలో అందించారు. దేవుని ప్రేమ, సత్య నియమాలకు అనుగుణ౦గా ఎలా జీవి౦చాలో ఆయన భగవత్ ప్రేరేపిత రచనలలో, తన జీవిత గ్రంథంలో మనకు చూపి౦చారు. అంతేకాదు, సమాంతరంగా ఆయన తన బేషరతు ప్రేమను మనకు సదా అందించారు. “దేవుడు నిన్ను నా దగ్గరకు పంపాడు, నేను నిన్ను ఎన్నటికీ విఫలం కానివ్వను” అనే గురుదేవుల వాక్కులను గుర్తుంచుకోండి. ఈ పధంలో అడుగడుగునా ఆ వాగ్దానాన్ని మీ హృదయంలో నిలుపుకోండి. గురుదేవులకు మీపై విశ్వాసం ఉంది, ఎందుకంటే ఆయన మానవ గుణం యొక్క ముసుగు క్రింద నిజమైన “నిన్ను” — దేవుని యొక్క దివ్య లక్షణాలను వ్యక్తీకరించే సామర్థ్యంతో నిండి ఉన్న నీ ఆత్మని, ఆయన చూడగలరు. మానవ అసంపూర్ణతలు మరియు గత తప్పిదాల గురించి ఆలోచించే బదులు, మీకు సహాయం చేయడానికి గురుదేవుని యొక్క అపరిమితమైన శక్తిపై దృష్టి పెడితే అలవాట్లు లేదా కర్మల యొక్క ఏ అడ్డంకులు మీ పురోగతికి అడ్డుగా ఉండవు. గురుదేవులు మనకు అభయమిచ్చారు, “ఒక వ్యక్తి యొక్క కర్మ కంటే దైవజ్ఞానం కల గురువు యొక్క సహాయం మరియు ఆశీర్వాదం మరింత శక్తివంతమైన ప్రభావం గలది. ఒక గురువు యొక్క మార్గదర్శకత్వాన్ని భక్తితో పాటించడం ద్వారా, గత కర్మ యొక్క అంతర్లీనమైన అన్ని నిర్బంధాల నుండి తనను తాను విముక్తం చేసుకోవచ్చు.”

దాతలలో నిజమైన ఉత్తమ దాత గురువు, ఎందుకంటే ఆయన ఆశీర్వాదాలు సదా మనతోనే ఉంటాయి, కానీ ఆయన ఆధ్యాత్మిక సంపత్తికి ఆయన సన్నిధి అనే సౌరభంలో జీవించడానికి మన స్వీయ చిత్తశుద్ధితో చేసే ప్రయత్నాలు మన చేతనను సంపూర్ణంగా సిద్ధంచేయడం కూడా ఆవశ్యకమవుతాయి. మీరు ఆయన బోధనలను లోతుగా అధ్యయనం చేసినప్పుడు, అలాగే ఆయన అందించిన పద్ధతులు మరియు సూత్రాలను సంకల్పంతోనూ ఉత్సాహంతోనూ ఆచరించినప్పుడు, మీరు ఆయన దివ్య చైతన్యము యొక్క స్పందనను మరియు దాని పరివర్తనా శక్తిని అనుభూతి చెందుతారు. అంతేకాదు మీ ప్రయత్నాలు భక్తి ప్రేరేపితమైనప్పుడు, ఇంకా ఆయన ప్రేమపై మీ నమ్మకం పెరిగేకొద్దీ, అహం యొక్క అడ్డంకులైన అసహనం మరియు స్వీయ సంకల్ప వైఫల్యం తొలగిపోవడాన్ని మీరు కనుగొంటారు, ఆయన మీ పురోగతికి మార్గనిర్దేశం చేయడానికి ఇది వీలుకల్పిస్తుంది.

లోతైన మీ నిరంతర ధ్యానాల ద్వారా గురువుతో బలమైన అనుసంధానం కలుగుతుంది, ఎందుకంటే అప్పుడే ఆయన ఉనికి చాలా స్పష్టంగా అనుభూతి చెందుతారు. మీ అందరికీ నా అభ్యర్థన ఏమిటంటే, మన ప్రియతమ గురుదేవులకు మీరు ఇవ్వగల కృతజ్ఞతా కానుక, ఆయన మనకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక సంపత్తిని, ముఖ్యంగా భగవంతుని సంయోగ పద్ధతులను సద్వినియోగం చేసుకోవడమే. మీరు ప్రతిరోజూ మీ ఆత్మ నిశ్శబ్ద దేవాలయంలోకి ప్రవేశించినపుడు, మీ చుట్టూతా ఉన్న గురుదేవుల అపరిమితమైన ప్రేమను అమితంగా అనుభూతి చెందుతూ మీ దివ్య లక్ష్యం — నిత్య స్వీయ సాక్షాత్కారము, భగవదైక్యతకు మీరు మరింత చేరువవుతారు.

సదా భగవంతుని మరియు గురుదేవుల పరివర్తనా దీవెనలు మీపై వర్షించుగాక,

స్వామి చిదానంద గిరి

ఇతరులతో షేర్ చేయండి