కోవిడ్-19 ధార్మిక కార్యకలాపాలు మరియు ప్రసార సాధనాల వార్తా సేకరణ

20 ఏప్రిల్, 2020

కోవిడ్-19 సమయంలో పేదలకు, నిరుపేదలకు చేరువైన వై.ఎస్.ఎస్.

కరోనా వైరస్ మహమ్మారి అంతర్జాతీయ సరిహద్దుల్లో వేగంగా విస్తరిస్తున్న కారణంగా, దానిని నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేయడం ప్రారంభించాయి. భారత ప్రభుత్వం మార్చి 25, 2020 నుండి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది మరియు లాక్ డౌన్ తీరు 2020 మే మొదటివారం వరకు కొనసాగవచ్చని భావిస్తున్నారు.

ఈ విపరీతమైన పరిస్థితి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసింది. కానీ పేదరికం అంచున జీవిస్తున్న వారిపై ఎక్కువ ప్రభావాన్ని చూపింది – రోజువారీ కూలీలు, కార్మికులు, చిన్న అమ్మకందార్లు, యాచకులు, వృద్ధులు మరియు దుర్భలులు. లాక్ డౌన్ విధించిన వెంటనే, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సమాజంలోని ఈ విభాగాలకు ఆహారం మరియు పరిశుభ్రతా సామగ్రిని సరఫరా చేయడం ప్రారంభించింది. అదే సమయంలో, ఈ మానవతా ప్రయత్నాలకు భక్తులందరూ ముందుకు వచ్చి విరాళాలు అందించాలని మేము విజ్ఞప్తి చేశాము.

జొనాలోని 1200 కుటుంబాల కోసం ఉంచిన పరిశుభ్రతా సామగ్రితో స్వామి శ్రీ ఈశ్వరానంద
రాంచీ: జొనాలోని 1200 కుటుంబాల కోసం ఉంచిన పరిశుభ్రతా సామగ్రితో స్వామి శ్రీ ఈశ్వరానంద

మా విన్నపానికి భక్తులు తమ హృదయాలతో ప్రతిస్పందించారు

మురికివాడల్లోని 300 కుటుంబాలకు రేషన్ పంపిణీ చేసే స్వచ్ఛంద సేవకులతో స్వామి శ్రీ అచ్యుతానంద

దక్షిణేశ్వరం: మురికివాడల్లోని 300 కుటుంబాలకు రేషన్ పంపిణీ చేసే స్వచ్ఛంద సేవకులతో స్వామి శ్రీ అచ్యుతానంద

మేము విజ్ఞప్తి చేసిన వెంటనే విరాళాలు రావడం ప్రారంభించాయి. భక్తులు తమ వికసించిన హృదయాలతో నిరుపేద సోదరులు మరియు సోదరీమణుల పట్ల ప్రేమ, దయ మరియు ఔదార్యమును చూపించారు.

వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు ఈ ఉదారమైన సహకారాలతో, మన ఆశ్రమాలు ఉన్న ప్రాంతాల్లోని వేల కుటుంబాలకు ఆహారం మరియు పరిశుభ్రతా సామగ్రిని సరఫరా చేయగలిగింది. అవసరమైన వారిని గుర్తించడానికి స్థానిక అధికారులను వై.ఎస్.ఎస్. సంప్రదిస్తోంది మరియు జొమాటో యొక్క ఫీడింగ్ ఇండియా మరియు స్థానిక క్లబ్ ల వంటి ఇతర స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో బాధిత ప్రజలకు సహాయ సామగ్రిని అందజేయాలని చూస్తోంది.

వై.ఎస్.ఎస్. కేంద్రాలు మరియు మండళ్ళు సందర్భానుసారంగా ఎదిగాయి

నోయిడా చుట్టు ప్రక్కల ఉన్న మురికివాడల్లో సరుకుల పంపిణీ

నోయిడా: నోయిడా చుట్టు ప్రక్కల ఉన్న మురికివాడల్లో సరుకుల పంపిణీ

కోవిడ్-19 సహాయ కార్యక్రమాలను చేపట్టాలని తన కేంద్రాలు మరియు మండళ్ళను అభ్యర్థించడానికి వై.ఎస్.ఎస్. వెనుకాడింది. ఎందుకంటే లాక్ డౌన్ సమయంలో ఈ పని చేయడానికి స్వచ్ఛంద సేవకులను పొందడం వారికి కష్టంగా ఉండవచ్చు. అయితే, అడగాల్సిన అవసరం లేకుండా వై.ఎస్.ఎస్. యొక్క ఎన్నో కేంద్రాలు మరియు మండళ్ళు, దగ్గర ప్రాంతాల్లోని పేదలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. తమ పొరుగున ఉన్న పేదల పట్ల సంరక్షణ వహించడం ద్వారా “ప్రేమను చర్యల ద్వారా వ్యక్తపరిచారు.”

నోయిడా ఆశ్రమం సరఫరా చేసిన సహాయ సామగ్రిని పంపిణీ చేయడానికి సహాయం చేసిన పోలీసులు

నోయిడా: నోయిడా ఆశ్రమం సరఫరా చేసిన సహాయ సామగ్రిని పంపిణీ చేయడానికి సహాయం చేసిన పోలీసులు

పేదలతోపాటు పోలీసులకు, వైద్యులకు వై.ఎస్.ఎస్. వీలున్న విధాలలో అండగా నిలిచింది. వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం పోలీసు సిబ్బందికి వ్యక్తిగతంగా మంచినీటి బాటిళ్ళను, పండ్ల రసాలను, మాస్కులను సరఫరా చేసింది. వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రం – కోయంబత్తూరు వారు తమ ప్రాంతంలోని అనేక వందల మంది వైద్యులకు రక్షణ సామగ్రిని విరాళంగా అందించారు. రాంచీకి సమీపంలోని గ్రామాల్లో దాదాపూ 2700 కుటుంబాలకు స్నానపు సబ్బులను మరియు ఉతుక్కునే సబ్బులను ఇవ్వడం జరిగింది.

దేశవ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళ నుండి మేము స్వీకరిస్తున్న “సేవ” యొక్క ఈ ఫోటోలలో కొన్నింటిని ఈ పేజీలలో మీతో పంచుకుంటున్నాము. వందలాది మంది భక్తులు చేస్తున్న సేవ, వార్తా పత్రికలు మరియు బ్లాగర్ల దృష్టిని ఆకర్షించింది. వారు తమ ప్రసార సాధనలలో ఈ వార్తలను – ముద్రణ మరియు డిజిటల్ రూపంలో రెండింటిలోను ప్రచురించారు. మేము ఆ నివేదికలలో కొన్నింటిని కూడా పంచుకుంటాము.

ఈ సంక్షోభంలో చిక్కుకొన్న వారి హృదయాల్లో ఆశా దీపాన్ని వెలిగించడంలో తమ సమయాన్ని, వనరులను, ఆర్థిక సహాయాన్ని మరియు అన్నిటికీ మించి తమ హృదయపూర్వక ప్రేమ రూపంలో సహకరించిన వై.ఎస్.ఎస్. భక్తులకు మరియు అన్ని భాగస్వామ్య స్వచ్ఛంద సంస్థలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

భగవంతుడు మరియు గురువుల యొక్క సర్వవ్యాపక రక్షణ మరియు ప్రేమ ఆవరణలో మీ అందరినీ ఉంచుకోవాలని మేము హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం.

ఉపశమన సామగ్రితో భక్తులు
ఢిల్లీ: ఉపశమన సామగ్రితో భక్తులు
నిరుపేదలకు ఆహారం అందించే స్వచ్ఛంద సంస్థకు సహాయ సామగ్రిని విరాళంగా అందజేసిన ముంబై కేంద్రం భక్తులు
ముంబై: నిరుపేదలకు ఆహారం అందించే స్వచ్ఛంద సంస్థకు సహాయ సామగ్రిని విరాళంగా అందజేసిన ముంబై కేంద్రం భక్తులు
పంపిణీ నిమిత్తం ధార్మిక సామగ్రిని సిద్ధం చేస్తున్న సన్న్యాసులు
రాంచీ: పంపిణీ నిమిత్తం ధార్మిక సామగ్రిని సిద్ధం చేస్తున్న సన్న్యాసులు
300 కుటుంబాలకు సహాయ సామగ్రి మరియు గురుదేవుల చిత్రపటంతో ఒక భక్తురాలు
హైదారాబాద్: 300 కుటుంబాలకు సహాయ సామగ్రి మరియు గురుదేవుల చిత్రపటంతో ఒక భక్తురాలు
సంచార సాధువులకు ఆహారం పంపిణీ చేస్తున్న పోలీసులతో వై.ఎస్.ఎస్. భక్తులు
హరిద్వార్: సంచార సాధువులకు ఆహారం పంపిణీ చేస్తున్న పోలీసులతో వై.ఎస్.ఎస్. భక్తులు

ప్రసార సాధనాల వార్తా సేకరణ

ఏప్రిల్ 30

ఏప్రిల్ 19

ఏప్రిల్ 11

ఏప్రిల్ 10

ఇతరులతో షేర్ చేయండి