శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి నుండి నూతన సంవత్సర సందేశం 2020

31 డిసెంబరు, 2019

నూతన సంవత్సర సందేశం 2020: సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క శతాబ్ది వార్షికోత్సవం

"దివ్య పిత, నీ అనంతమైన వ్యక్తీకరణలో మేము నిన్ను అనుభూతి చెందేంత వరకు, ప్రతిరోజూ మాకు ఒక కొత్త సంవత్సరంగా, కొత్త కాలక్రమంగా, ఆధ్యాత్మిక అంతర్దృష్టిగా ఉండాలని ఆశీర్వదించు."

ప్రియతములారా,

శ్రీ శ్రీ పరమహంస యోగానంద యొక్క ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబంలోని మన ప్రియతమ స్నేహితులకు, హృదయపూర్వక స్నేహం మరియు ప్రేమలతో సంతోషకరమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు! మన ఆత్మలకు సహజమైన నమ్మకంతో-నిండిన చైతన్యంతో, పైన ఉల్లేఖించబడిన పరమహంసగారి శక్తివంతమైన ప్రార్థన ద్వారా 2020లోకి అడుగిడదాం—ఏడాదిలో ఈ ప్రత్యేక సమయం పురోగతికి, మార్పుకు, పరివర్తనకు, పునరుద్ధరణకు ఒక దివ్య అవకాశాన్ని సూచిస్తుందని తెలుసుకుందాం.

గత క్రిస్మస్ తరుణంలో—ప్రపంచమంతటా ప్రతీచోటనుండి—మీ శుభాకాంక్షలు, బహుమతులు మరియు ప్రేమ, విశ్వాసాలతో కూడిన సందేశాలకు, మీ అందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. మీరు మన గురుదేవుల యొక్క పవిత్ర బోధలను మరియు పద్ధతులను మీ జీవితాల్లో ఒక భాగ౦గా చేసుకున్న చిత్తశుద్ధిని, అంకితభావాన్ని చూడడ౦ నాకు మరియు పరమహంసగారి ఆశ్రమాలలో సేవ చేస్తున్న సన్యాసులందరికీ మీ దివ్య స్నేహాన్ని పొందడం అన్నది మా హృదయాల్ని ఎంతగా స్పృశిస్తుందో మీకు తెలియదు. మీలో ప్రతి ఒక్కరినీ భగవంతుడు ఆశీర్వదిస్తాడు!

గత సంవత్సరం యోగదా సత్సంగ సొసైటీ మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కు ప్రత్యేకమైనది—సంపూర్ణ వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల విడుదలతో—చరిత్రలో ఇది ఒక మైలురాయిగా గురుదేవుల యొక్క బోధనలు విస్తరించాయి. అంతేకాక ఈ నూతన సంవత్సరం కూడా ఎంతో సంతోషకరమైంది—ఇది పరమహంసగారు స్థాపించిన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌ యొక్క శతాబ్ది వార్షికోత్సవం. వంద సంవత్సరాల క్రితం, భగవంతుణ్ణి ఎలా కనుగొనాలి మరియు ఆయనతో ఎలా అనుసంధానమొందాలో అనే దానిపై భారతదేశం యొక్క ప్రాచీన సంపదైన అత్యున్నత పవిత్ర బోధనలను పాశ్చాత్యులకు అందించడానికి ఆయన అమెరికాకు చేరుకున్నారు. ఆయన బోస్టన్‌లో ఓడ దిగినప్పుడు స్నేహితులు లేకుండా ఏకాకిగా ఉన్నప్పటికీ, భారతదేశం యొక్క అనాదిగా కీర్తింపబడే పురాతన సత్య సందేశం కోసం పెరుగుతున్న ఆసక్తితో త్వరలోనే ఆయన్ని అన్వేషక హృదయాలు చుట్టుముటాయి. మన గురుదేవులు అడుగిడిన ప్రతిచోటా, ఆయన ఆత్మమిత్రులను చేసుకోవడమే కాకుండా ఆయన కార్యాచరణం ఈ రోజు ప్రపంచవ్యాప్త సంస్థగా పురొభివృద్ధి చెందడం ద్వారా అనుచరులను మరియు శిష్యులనూ ఆకర్షించారు.

ఈ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములే. ఒక దివ్య సంకల్పాన్ని వికాశింప చేయడంలో సహాయం చేస్తూ, శక్తిని మరియు వేగాన్ని కూడగట్టే ఒక విశ్వ ఉపదేశం, అజ్ఞానం, స్వార్థం మరియు అంధకారం నుండి భగవంతుని కాంతి వైపు మరియు ఆధ్యాత్మిక చైతన్యం వైపు మళ్ళేలా ప్రజలను ఇంకా దేశాలను ప్రోత్సహిస్తున్న, మిమ్మల్ని భూమిపై చెల్లాచెదురుగా ప్రకాశిస్తున్న ఆభరణాలుగా చూస్తున్నాను. నేను ప్రపంచం నలుమూలల నుండి ఐదు, పది, ఇరవై, ముప్పై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. బోధనలను ఆచరిస్తున్న భక్తులను కలిసాను. వారి నయనాలు, ముఖ కవళికలు, ఇంకా వారి పూర్తి అస్తిత్వం నుండి ప్రేమ, మ౦చితన౦, సానుకూల స్ఫూర్తి, అంతర్గత సాక్షాత్కారత ప్రకాశిస్తాయి! ఆచరణాత్మక ఆధ్యాత్మికత నెరవేర్చగల వాగ్దానం అదే.

కాబట్టి ఈ శతాబ్ది సంవత్సరం మనకు మరియు ప్రపంచానికి పరమహంసగారు మరియు వారి గురుశ్రేణి ద్వారా పొందిన ఆత్మ కానుకలు మరియు అవకాశాల ద్వారా పునర్నవీకరింపబడిన ప్రేరణతో మరియు కృతజ్ఞతలతో కూడిన ఒక అద్భుతమైన జీవితకాల జ్ఞాపకం అవుతుంది. మీలో ప్రతి ఒక్కరూ ఎస్.ఆర్.ఎఫ్. వెబ్ సైట్ వీక్షించి ప్రణాళిక చేయబడ్డ ప్రత్యేక కార్యక్రమాల గురించి తెలుసుకొంటారని ఆశిస్తున్నాను.

మన గురుదేవులకు మనం కృతజ్ఞతలు వ్యక్తపరచగల ఒక గొప్ప మార్గం ఏమిటంటే ఆయన బోధనలు మరియు ఆదర్శాలకు ఉదాహరణగా నిలవడం. కనుక ఆ సంకల్పం చేయడానికి ఈ నూతన సంవత్సర ఆరంభం ఒక అద్భుతమైన అవకాశం. మన జీవితాల నుండి ఆధ్యాత్మికం కాని అలవాట్లను—కనీసం వాటిలో కొన్ని—కలుపు మొక్కలుగా తీసేయాలని సంకల్పించుకుందాం!—ఇవి మనల్ని బంధించి, మన౦ ఎలా ఉ౦డాలనుకుంటామో మరియు ఏమి సాధి౦చాలనుకొంటామో దానికి అడ్డుపడి—దేవుని ప్రతిరూపమైన ఆత్మలుగా ఉండకుండా చేస్తుంది.

ఆ సారూప్యతను గ్రహించడానికి, మనం ధ్యానం చేయాలి. మీ సాధారణ ధ్యాన కాలంలో ఇప్పుడు లేదా ఈ సాయంత్రం, నిశ్శబ్దంగా కూర్చోవడానికి కొంచెం సమయం తీసుకోండి. పాఠాల్లో బోధించబడిన ప్రక్రియలను సాధనచేయండి; ఆ సమయంలో మీకు స్ఫూర్తినిచ్చే ఏ అంశంలో లేదా రూపంలోనైనా, దేవునితో నిజాయితీగా మాట్లాడండి. కూటస్థ కేంద్రం వద్ద దృష్టిని సారించి మరియు విధేయత మరియు ఆకాంక్షతో హృదయాన్ని లయ చేయండి—అలా చేస్తే, మీరు ఆధ్యాత్మిక చైతన్యం యొక్క అంతర్గత భరోసాను అనుభూతి నొందుతారు. కొన్నిసార్లు మనకు దేవుని తక్షణ సంకేతాలు మరియు రుజువులు లభించకపోవచ్చు, ఎందుకంటే మనం గొప్ప విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఆయన కోరుకుంటాడు, ఎలాగైతే ఉపయోగంలో ఉన్న కండరం బలంగా ఉంటుందో అలా. భగవంతుడు నిజంగా అక్కడ ఉన్నాడా అని మనం ఆశ్చర్యపోతున్నాము. కానీ ఏసు ఇలా అన్నాడు, “రెండు పిచ్చుకలు ఒక యేగాణీకి అమ్మబడలేదా? మరైతే వాటిలో ఒకటి మీ తండ్రి దృష్టి తప్పి నేలపై పడదు. దేవునికి మన గురించి తెలుసు; అయితే మనం ఆయన గురించి తెలుసుకోవాలి! ఐతే అది ధ్యానం, విశ్వాసం మరియు సానుకూల ఆలోచనలు, సహనంతో కూడిన సాధనతో వస్తుంది—మన ఆధ్యాత్మిక పరిణామంలో తదుపరి దశగా ఎదురయ్యే ప్రతిదాన్ని స్వీకరించడం, మరియు అంతర్గతానుసంధానం మరియు సరైన దృక్పథం కోసం ఎల్లప్పుడూ కృషి చేయడం: “ప్రభూ, ఈ అనుభవం నుండి నేను ఏమి నేర్చుకోవాలనుకుంటున్నావు? నేను ఎలా స్పందించాలని నీవు కోరుకుంటున్నావు? నిర్భయంతో, నా హృదయంలో నీపై ప్రేమతో ఈ మార్గంలో నడిచే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించు.” ఆ దారిలో మీ ప్రయాణం ముగింపులో నిస్సందేహంగా మీరు భగవంతుని కనుగొంటారు.

నా ధ్యానాలలో నేను మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. దేవుని ఆశీర్వాదాలు మీలో ప్రవహి౦చడాన్ని అనుభూతి చె౦ద౦డి. మిమ్మల్ని పరివేష్టించిన దేవుని ప్రేమ యొక్క రక్షణ కవచాన్ని గుర్తుంచుకోండి. ఆత్మల సమైఖ్య కుటుంబంగా ఆ వెలుగులో, ప్రేమతో నింపబడిన, ఈ సంవత్సరం గురుదేవుల బోధనలు చరిత్రలో ఒక మైలురాయిగా మాత్రమే కాకుండా మన స్వంత ఆధ్యాత్మిక జీవితంలో వ్యక్తిగత మైలురాయిని చేద్దాం. గురుదేవుల ఈ అందమైన పదాలను గుర్తుపెట్టుకొండి:

“సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ [యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా] యొక్క ఒక ఉద్దేశ్యం ఏమిటంటే, మనిషికి భగవంతునితో వ్యక్తిగత సంబంధాన్ని పొందే మార్గాన్ని బోధించడం. ఎవరైతే ఆ ప్రయత్నం చేస్తారో, వారు ఆయనను కోల్పోలేరు. మీ హృదయంలో భక్తిగా ఒక వాగ్దానం చేయండి, భగవంతుని కనుగొనాలనే కోరికతో రగిలేలా మిమ్మల్ని ఆశీర్వదించమని, ఇకపై మీరు ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఉండేలా, తండ్రిని ప్రార్థించండి... మీలో ప్రతి ఒక్కరి కోసం నా ప్రార్థన ఏమిటంటే, ఈ రోజు నుండి మీరు దేవుని కోసం అత్యున్నత ప్రయత్నం చేయాలని, మరియు మీరు ఆయనలో స్థాపన పొందేవరకు మీరు ఎప్పటికీ ఆ ప్రయత్నాన్ని ఆపకూడదని."

ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని తన శాంతి, ప్రేమ మరియు సంతోషంతో ఆశీర్వదించాలి.

స్వామి చిదానంద గిరి

ఇతరులతో షేర్ చేయండి