శ్రీ మృణాళినీమాతగారి బోధన

యోగదా సత్సంగ పత్రికలో మొదటిసారిగా ముద్రించబడింది

“ప్రార్థన యొక్క శక్తి”

మానవాళి క్రమక్రమంగా మరింత జ్ఞానము పొందే యుగంలోకి జాగృతమవుతోందని, మనం విడిచిపెట్టిన నిమ్నయుగ పరిమిత మనస్తత్వాలను తొలగించడానికి ఈ ప్రపంచం ప్రయాసపడుతూ, కల్లోల కాలాలను ఎదుర్కొంటుందని పరమహంస యోగానందగారు ముందే ఊహించారు. నేటి మన యుగంలో చీకటిని పారద్రోలే ఆధ్యాత్మిక కాంతి దేదీప్తమవుతుందని ఆయన మనకు హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఈ భౌతిక ప్రపంచంలో జీవితంలో అనివార్యమైన హెచ్చుతగ్గులను మనం అనుభవించినప్పుడు, సామూహిక కర్మల వైరుధ్య ధోరణిలో చిక్కుకున్న నిరపరాధియైన ఆత్మల బాధను చూసినప్పుడు, తరచుగా మనం ఎంత దుర్బలంగా ఉన్నామో అనుభవమవుతాం. అలా౦టి సమయాల్లో, హృదయ౦ “ఎ౦దుకు?” అని మొరపెట్టుకున్నప్పుడు, తగిన సమాధానాన్ని మానవుని అవగాహన కనుగొనలేదు, మాయా తుఫానుల మధ్య మనం దాని పరిమిత పరిధిని దాటి మన రక్షణ స్వర్గధామంగా ఉన్న దివ్యమూర్తి వైపు చూడాల్సి ఉంటుంది.

విశ్వంలోని ప్రతిదీ భగవంతుని ఆలోచన నుండే ఉనికిలోకి వచ్చింది. మనము ఆయన బిడ్డలము. మన ఆలోచనలను, పనులను ఆయన సర్వసాధ్యమైన సంకల్పంతో అనుసంధానించడం వల్ల, మనము మర్త్య నిస్సహాయత అనే భ్రాంతి నుండి విముక్తి పొందాము మరియు ఈ ప్రపంచంలో మంచి కోసం మనలో కలిగి ఉన్న సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరం వాస్తవికంగా గ్రహించాము. ఆత్మ యొక్క స్వాభావికమైన విశ్వాసం, నమ్మకము మరియు బేషరతుగా ప్రేమించబడతామనే అవగాహన నుండి జాలువారే ప్రార్థన, ఈశ్వరుడి స్వస్థతా శక్తి యొక్క అపరిమితమైన జలాశయాన్ని ఆకర్షిస్తుంది. మన౦ అ౦తర్గత౦గా, నిజమైన భక్తితో, హృదయ చిత్తశుద్ధితో ఆయనతో మాట్లాడినప్పుడు, ఏకాగ్రమైన ఆలోచనా శక్తితో మన ప్రార్థనను నింపినపుడు, అది సృజనాత్మక దివ్య చైతన్యంలో యథార్థతను సంతరించుకుంటుంది. మనం దృశ్యమానం చేస్తున్న సహాయం భగవంతుని సర్వశక్తిమత్వంతో బలోపేతమై, మన జీవితాల్లో మరియు ఇతరుల జీవితాల్లో నిశ్చయాత్మక ఫలితాలతో సాకారమయ్యే శక్తిని పొందుతుంది. “అనేకమంది జనులు ఈ సంఘటనల గమనాన్ని సహజంగా మరియు అనివార్యంగా భావిస్తారు,” అని గురుదేవులు మాకు చెప్పారు. “ప్రార్థన ద్వారా ఎలాంటి సమూలమైన మార్పులు సాధ్యమవుతాయో వారికి తెలియదు.” ప్రార్థన అనేది మనకు అవసరమైన సమయాల్లో విశ్వ కుటుంబాన్ని చేరుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మరియు తక్షణ మార్గాలలో ఒకటి. ఆ చైతన్యంలో, బాధకు కారణమయ్యే ఒక పరిస్థితి గురి౦చి మన౦ తెలుసుకున్నప్పుడు, మన మొదటి ప్రతిస్ప౦దన ఎప్పుడూ ప్రార్థి౦చడ౦గా ఉ౦డాలి, అ౦టే ప్రభావితులైన వారిని కాపాడే భగవంతుని ప్రేమలో పరివేష్టింపబడి ఉండనివ్వండి. అలా చేయడం ద్వారా, ధార్మిక మానవ ప్రయత్నాల ద్వారా అందించబడిన సహాయానికి మరింత శక్తిని నింపే దేవుని ఆశీర్వాదాలు వారికి జాలువారే మార్గాన్ని మన౦ విస్తృత౦ చేస్తాము; మరియు ఆయన శాంతి, భరోసాల కోసం మన స్వీయ హృదయాలను వికసింపచేస్తాము.

దేవునితో గాఢమైన అంతర్గత అనుసంధానం ఉండడం వల్ల, స౦దేహాస్పద స్థితులను, అశాంత స్థితులను నిశ్చలంగా చేసి, ఇతరుల కోస౦ మన౦ చేసే ప్రార్థనల సామర్థ్యాన్ని పె౦పొ౦దిస్తు౦ది, ఆయన ప్రేమ, సత్య నియమాల ప్రకార౦ జీవి౦చడానికి మన౦ శ్రమించే చిత్తశుద్ధి కూడా అలాగే ఉ౦టు౦ది. గురుదేవులు మనకు గుర్తు చేసినట్లుగా: “ఒక ఆత్మ యొక్క మంచితనం లక్షలాది మంది సామూహిక కర్మను సమర్థవంతంగా తటస్థీకరిస్తుంది.” భావసారూప్యతగల ఇతర ఆత్మలతో మనం కలిసినప్పుడు, మన వ్యక్తిగత ప్రార్థనల ప్రభావ౦ ఎ౦త ఎక్కువగా ఉ౦టు౦దో కూడా ఆయనకు తెలుసు కాబట్టి, గురుదేవులు తన ప్రపంచవ్యాప్త సమాజ సేవలో భాగ౦గా ప్రప౦చవ్యాప్త ప్రార్థనా మండలిని స్థాపి౦చారు. ఆయన ఆశ్రమాల్లో ఉన్న మనమంతా ప్రతిరోజూ చేస్తున్నట్లే, ప్రత్యేక అవసరంలో ఉన్న ఆయన పిల్లలందరికీ దేవుని ఆశీస్సులను పొందడానికి ఈ ఐక్య ప్రయత్నంలో మీ స్వీయ దైనందిన ప్రార్థనల ద్వారా పాల్గొనాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అటువంటి ప్రార్థన ద్వారా, ప్రతి సానుకూల ఆలోచన మరియు కార్యం ద్వారా, మీరు ఈ లోకంలో సర్వోన్నత స్వస్థత మరియు ఉపకార ప్రదాత అయిన దేవుని కాంతిని మరియు ప్రేమను పెంచడానికి సహాయం చేస్తున్నారని గ్రహించండి.

“నిత్యజీవితంలో క్రియాయోగం యొక్క ఆశీస్సులు”

[యోగదా సత్సంగ పత్రిక నుండి సారాంశం]

ద్వంద్వాలతో, సాపేక్షతలతో కూడిన ఈ ప్రపంచంలో మనం చాలా బాధను, దుఃఖాన్ని, వ్యధను, సంక్షోభాలను అనుభవిస్తాం. ఎలా జీవించాలనే దానిపై శాస్త్రీయ పరిజ్ఞానం ఖచ్చితంగా అవసరం. మన జీవితాల్లోకి మరింత భౌతిక సంపద, మరింత భౌతిక “యంత్ర పరికరాలను” తీసుకువచ్చేది కాకుండా, జీవనశైలికి అవసరమైన విద్య కావాలి. మానవజాతిలో కానరానిది అదే—ప్రప౦చ౦లో నేడు అన్ని సమస్యలకు, కష్టాలకు కారణమవుతో౦ది. మన గురుదేవులు పరమహంస యోగానందగారు తన క్రియాయోగ బోధనలలో పాశ్చాత్య దేశాలకు తీసుకువచ్చినది అదే.

యుగయుగాలుగా, జీవనశాస్త్రం మానవాళికి పదేపదే అందించబడింది. దేవుని స్వభావం అనంతమైన ఓర్పు, ఎందుకంటే భగవంతుడు (ఆయనను మనం జగన్మాతగా నిర్వచిస్తాం) తన పిల్లల పట్ల అంతులేని ప్రేమ మరియు సహనంతో ఎలా కొనసాగగలడు, ఓర్పుతో మనకు గుర్తుచేస్తూ: “ఇది నా జగత్తు; దీనిని నేను సృష్టించాను. దీనిని యోగ్యమైనదిగా, సుందరంగా తయారు చేశాను. మీ అందరినీ నేనే సృష్టించాను. నిన్ను మంచివాడిగా, అందంగా రూపొందించాను. పవిత్ర గ్రంథాల్లో మీకు ఉపదేశించాను, ఈ ప్రపంచాన్ని అందంగా ఉంచడానికి, మీ జీవితాలను నాతో సామరస్యంగా ఉంచుకోవడానికి మీరు ఏమి చేయాలో పదే పదే అవతారాల ద్వారా మరియు సాధువుల స్వరాల ద్వారా మరియు వారి ఉదాహరణల ద్వారా మీకు తెలియజేశాను, మీ జీవితాలను నాతో సామరస్యంగా ఉంచడానికి, తద్ద్వారా మీరు ఈ భూమిపై నా సౌందర్యాన్ని, ఆనందాన్ని మరియు శాంతి, శ్రేయస్సులను అభివ్యక్తీకరిస్తారని—దేన్నైతే నేను సృష్టించానో అది నేను మాత్రమే కొనసాగిస్తాను. అయినా, ఈ ప్రపంచానికి నువ్వేం చేశావు?”

అనేక విధాలుగా ఆధునిక సంస్కృతి, ఒక గొప్ప మాయాశక్తితో, భగవంతుడిని దూరం చేయడానికి, విశ్వం యొక్క “శాస్త్రీయ” దృక్పథం నుండి మరియు దైనందిన జీవితం నుండి ఆయనను విస్మరింపజేయడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ భగవంతుడు, అనంతమైన తన ఆలోచన ద్వారా మాత్రమే సృష్టించబడి, పోషించబడుతున్న ఈ సృష్టిలో ఈశ్వరుడే సర్వోన్నత సత్యంగా మానవుడు నిరాకరించినంత కాలం ప్రపంచం ఎన్నటికీ శాశ్వతమైన ఆనందాన్ని, శాంతిని లేదా బాధల నుండి విముక్తిని తెలుసుకోజాలదు.

మన బాధలకు కారణ౦

బాధపడే వారందరి గురించి, మనం మనస్సులో ఆలోచించినప్పుడు ప్రశ్న, సందేహాల సమయ౦ ఉద్భవిస్తుంది: “దేవుడు ఉంటే ఆయన ఈ బాధను ఎ౦దుకు అనుమతిస్తాడు? నా జీవితంలోకి ఈ బాధ ఎందుకు వచ్చింది? దేవుడు నా ప్రార్థనలను వింటాడా?” భయ౦కరమైన ఉపద్రవాలు, యుద్ధాలు, విపత్తులతో బాధపడుతున్న లక్షలాదిమ౦దిని చూసినప్పుడు, మన౦ ఇలా ఆలోచి౦చకు౦డా ఉ౦డలేము: “దేవుడు ఎక్కడున్నాడు? ఆయన మానవజాతిని గొప్ప జనసామాన్యముగా, మనల్ని ఈ కష్టాల ప్రపంచంలోకి విసిరి, ఆపై వెనక్కి తీసుకుంటాడా?”

భగవంతుడు ఉన్నాడు. ఆయన ఆలకిస్తాడు, అంతేకాదు ఆయన ప్రతిస్పందిస్తాడు. సాధువులు మరియు దివ్యగురువుల జీవితాలలో దృష్టాంతాలను మనం చూశాము. ఒక సాధారణ వ్యక్తి జీవితంలో కూడా, ఆ అనంత చైతన్యాన్ని కేవలం ఒక్క క్షణం స్పృశించినపుడు, బహుశా ఏదైనా ప్రార్థన అనుగ్రహించబడినప్పుడు, ఒక రవంత అనుభూతి పొందుతాడు: “ఓహ్, భగవంతుడు వాస్తవం; ఆయన ప్రతిస్పందిస్తాడు!” ఆధునిక నిస్సారమైన ఆలోచనా విధానం, ఇది “అశాస్త్రీయమైనది” అని మనకు చెబుతో౦ది. కానీ మన గురుదేవులు పరమహంస యోగానందగారి వంటి మహానుభావులు, జీవితం గురించి మన ప్రశ్నలన్నింటికీ పరిపూర్ణమైన సమాధానాలు ఇచ్చే లోతైన శాస్త్రం ఒకటి ఉందని ధృవీకరిస్తారు. ఇదే యోగ శాస్త్రం.

భగవంతుడు వెనక్కి ఉపసంహరించుకోలేదు. ఆయన మనలను తన స్వరూపములోనే సృష్టించాడు; ఆయన తన అనంత చైతన్యంలో కొంత భాగాన్ని వ్యక్తిత్వంలో నిక్షిప్తం చేసి ఇలా చెప్పాడు, “ఇప్పుడు నువ్వు ఆత్మవి, నా అనంత ప్రకృతిలో ఒక భాగాన్ని అభివ్యక్తీకరించడానికి నేను నిన్ను నా మాయా ప్రపంచంలోకి పంపిస్తున్నాను”—కేవలం ఆత్మలుగా వ్యక్తీకరించబడిన శుద్ధ చైతన్య అస్థిత్వం మాత్రమే కాక, సూక్ష్మ జీవశక్తి, ఆపై ప్రకృతి సిద్ధమైన శరీరము యొక్క పరిమిత వేర్వేరు శరీరాలలో ఆవరించి ఉన్నజీవులు, భౌతిక శరీరము మరియు శక్తుల యొక్క విస్తారమైన విశ్వం మధ్య ఉంచబడ్డాయి.

కానీ ఏమి జరుగుతుంది? మనిషి ఆ మాయలో చిక్కుకుంటాడు. పరమహంసగారు మాయను విశ్వ సమ్మోహనంగా పిలిచేవారు. సృష్టి నాటకాన్ని ఆడటానికి, భగవంతుడు ఈ ప్రపంచం నిజమైనదని మరియు మనం ఆయన నుండి వేరు చేయబడ్డామని మన చైతన్యానికి శక్తివంతంగా సూచిస్తున్నాడు. ఆ సమ్మోహకరమైన సూచన చాలా బలమైనది కాబట్టి, మనము దానిని నమ్ముతాము—మనము విశ్వసృష్టి ప్రక్రియ యొక్క అంతిమ ఫలితాన్ని మాత్రమే దర్శిస్తాము: భౌతిక ప్రపంచం మరియు మన బలహీనమైన భౌతిక శరీరాలు. భగవంతుడిలో ఉన్న మన మూలాన్ని, మన ఆనందకరమైన, అమర దివ్య స్వభావాన్ని, ఆయనతో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్న మన అస్థిత్వాన్ని మరచిపోతాం. అందుకే మనం బాధపడటం మొదలవుతుంది.

కానీ బయటపడటానికి ఒక మార్గం ఉంది. భగవంతుడు తనను తాను ఈ అనేకత్వముగా సృష్టించుకున్నప్పుడు అమలులోకి తెచ్చిన విశ్వ నియమాలు—ఆయన ఉనికి నుండి బాహ్యంగా వెలువడి, వ్యక్తీకరించబడిన సమస్త జీవులు మరియు ప్రకృతి యొక్క ఈ అనంతాన్ని తన నుండి దూరంగా ఉంచినప్పుడు—దివ్య నియమాలు ప్రతికూలంగా పనిచేస్తాయి మరియు ఆ జ్ఞానం యొక్క వినియోగమే యోగ శాస్త్రం యొక్క సంక్షేపం మరియు సారాంశం.

ధ్యానం మరియు క్రియాయోగం గురించి మరింతగా తెలుసుకోండి

ఇతరులతో షేర్ చేయండి