స్మారక దీర్ఘ ధ్యానం

ఆదివారం, మే 7, 2023

ఉదయం 9:40

– సాయంత్రం 4:00 వరకు

(భారతీయ కాలమానం)

ఈ కార్యక్రమం గురించి

నేను వారి వద్ద శిక్షణ కోసం వెళ్ళినప్పుడు శ్రీయుక్తేశ్వరులు ఇచ్చిన సలహా నాకు బాగా గుర్తుంది. ఆయన ఇలా అన్నారు: ‘మంచి సహచరులతో కలిసి ధ్యానించు. నీ మనస్సులోని పాల నుండి ఆత్మసాక్షాత్కారపు వెన్న చిలకడానికి వారు సహాయం చేస్తారు. ప్రాపంచికమైన మాయా జలాలతో కలసి పాలు వాటిపైన తేలలేవు. వెన్న ఆ కపట నీటిపై సులువుగా తేలుతుంది.’

— పరమహంస యోగానంద

స్వామి శ్రీయుక్తేశ్వర గిరి గారి ఆవిర్భావ దినం (బుధవారం, మే 10) సందర్భంగా, ఆ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేక ఆరు గంటల ఆన్‌లైన్‌ ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసులు ఇంగ్లీషులో నిర్వహించారు. శక్తిపూరణ వ్యాయామాలతో కార్యక్రమం ప్రారంభమైంది, తరువాత ప్రేరణాత్మక పఠనాలు, నియమిత సమయాలపాటు కీర్తనలు మరియు ధ్యానం. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ యొక్క అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో కార్యక్రమం ముగిసింది.

వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • భాగం I: ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 1:00 వరకు
  • విరామం: మధ్యాహ్నం 1:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు
  • భాగం II: మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4:00 వరకు

స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి గారి ఆవిర్భావ దినం (బుధవారం, మే 10) సందర్భంగా, వారి స్మారకార్థం నిర్వహించబడిన ప్రత్యేక దీర్ఘ ధ్యానం, మా చైతన్యాన్ని పరమగురుదేవులతో అనుసంధింపచేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది.

ఈ శుభ సందర్భంలో, స్వామి శ్రీయుక్తేశ్వరుల క్రియాయోగ బోధనల ఆధ్యాత్మిక వారసత్వానికి — కృతజ్ఞతలు అర్పించడం సంప్రదాయంగా ఉంది. మన దివ్య గురుదేవుల ఆత్మ-విముక్తి బోధనలను ప్రోత్సహించడానికి మరియు వ్యాప్తిచేయడానికి మీ విలువైన విరాళం ఉపయోగించబడుతుంది.

విరాళాన్ని సమర్పించాలని మీరు భావిస్తే, క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో షేర్ చేయండి