శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల మహాసమాధి

స్మారకోత్సవ ఆన్‌లైన్ ధ్యానం

మంగళవారం, సెప్టెంబర్ 26, 2023

ఉదయం 6:30

– ఉదయం 8:00

(భారతీయ కాలమానం)

ఈ కార్యక్రమం గురించి

శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు “యోగం యొక్క అవతారం”గా ఒక యోగావతార్ గా గౌరవించబడ్డారు. ఒక యోగి ఆత్మకథ లో, పరమహంస యోగానందగారు ఆ మహాగురువు యొక్క దివంగత మనవడు శ్రీ ఆనంద మోహన్ లాహిరీ యొక్క ఈ పలుకులను పంచుకున్నారు: “ప్రవక్తగా ఆయన అద్వితీయత, యోగవిముక్తి ద్వారాల్ని మొట్టమొదటిసారిగా మానవులందరి కోసం తెరుస్తూ, క్రియాయోగమనే ఒక నిర్దిష్ట పద్ధతిని ఆచరణాత్మకంగా నొక్కి చెప్పడంలో ఉంది. ఆయన జీవితంలో గోచరించిన లౌకిక ఘటనల సంగతి అలా ఉంచి, నిజంగా ఆ యోగావతారులు, యోగవిద్యలోని పూర్వపు జట్టిలతల్ని తగ్గించి సాధారణ బుద్ధికి అవగాహన అయ్యేటట్టుగా ఫలవంతమైన సరళత్వాన్ని సాధించడం అద్భుతాలన్నిటికీ పరాకాష్ఠ.”

శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల మహాసమాధి స్మారకోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సెప్టెంబర్ 26వ తేదీన, వై.ఎస్.ఎస్. సన్యాసి ఒక ప్రత్యేక ఆన్‌లైన్ ధ్యానాన్ని నిర్వహించారు. ఒక గొప్ప యోగి పరమాత్మతో ఏకత్వ స్థితిలో శరీరం నుండి స్పృహతో అంతిమంగా నిష్క్రమించడమే మహాసమాధి.

ప్రారంభ ప్రార్థనతో ధ్యానకార్యక్రమం మొదలయ్యి, నియమిత సమయంపాటు పఠనం, కీర్తనగానం మరియు ధ్యానంతో కూడి ఉన్నది. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో కార్యక్రమం ముగిసింది.

ఈ సందర్భంగా ఈ ఆన్‌లైన్ కార్యక్రమంతో పాటు, మా ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళలో వ్యక్తిగతంగా పాల్గొనే వివిధ స్మారకోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా మీరు సాంప్రదాయక సమర్పణ చేయాలనుకుంటే, దయచేసి దిగువ ఇవ్వబడిన లింక్‌లో మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీకు మేము ప్రగాఢ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల ప్రత్యేక కృప మరియు ఆశీస్సులకు కృతజ్ఞతగా మీ సమర్పణను స్వీకరిస్తాము.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో షేర్ చేయండి