సన్యాసం : అంకితభావం, ఆదర్శం భక్తి కలిగిన పరిత్యాగ జీవితం

వంద సంవత్సరాల క్రితం, 1915 జూలైలో, పరమహంస యోగానందగారు  భారతదేశంలోని శ్రీరాంపూర్‌లో తన గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి నుండి సన్యాస దీక్షను స్వీకరించడం ద్వారా ఆయన భారతదేశపు ప్రాచీన సన్యాసుల పరంపరలో భాగస్వాములయ్యారు. ఈ సంఘటన ఇరవై రెండేళ్ళ ముకుంద లాల్ ఘోష్ జీవితంలో ఒక మలుపు మాత్రమే కాదు, ఆ సమయంలో ఆయన స్వామి యోగానందగిరిగా మారారు. ఆ పరిణామం 20వ శతాబ్దంలో ప్రపంచ ఆధ్యాత్మికతపై అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. ఆయన తన సన్యాస వారసత్వ నిర్మాణంలో భాగంగా స్థాపించిన సన్యాసుల సంప్రదాయం కారణంగానైనా దానిని ఒక అద్భుతమైన మలుపుగానే పరిగణించాలి.

ఈ రోజు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సన్యాస సమూహాలతో పరమహంస యోగానందగారి సన్యాస పరంపర వర్ధిల్లుతోంది. ఈ సన్యాస పరంపర వై.ఎస్.ఎస్. యొక్క వృద్ధిని సుస్థిరం చేసింది. భారత ఉపఖండంలో యోగా యొక్క విస్తృత వ్యాప్తికి అది దోహదపడుతోంది.

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుడు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు 2019లో వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలోని స్మృతి మందిరంలో సన్యాస పరంపరలో చేరిన నూతన దీక్షాపరులతో
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుడు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు 2019లో వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలోని స్మృతి మందిరంలో సన్యాస పరంపరలో చేరిన నూతన దీక్షాపరులతో

ఆయన స్థాపించిన సన్యాస పరంపర గురించి వివరిస్తూ, పరమహంసజీ ఇలా వ్రాశారు: “నాకు సంబంధించినంత వరకు, సన్యాస పరంపరలోని ఒక సన్యాసిగా అన్నిటినీ పూర్తిగా పరిత్యజించడమే, ఏ ప్రాపంచిక బంధంతో రాజీపడకుండా నా జీవితాన్ని పూర్తిగా భగవంతుడికి ఇవ్వాలనే నా హృదయంలో ఉన్న ప్రగాఢ కోరికకు ఏకైక సమాధానం….

“ఒక సన్యాసిగా, నా జీవితం భగవంతుని యొక్క అపరిమిత సేవలో, ఆయన సందేశంతో హృదయాలను ఆధ్యాత్మికంగా మేల్కొల్పడానికి అంకితమియ్యబడింది. నా గురువు నుండి నేను పవిత్ర ప్రతిజ్ఞను స్వీకరించిన క్షణం నుంచి, నేను అనుసరించిన మార్గంలో ఉన్నవారి కోసం, ధ్యానము, యోగ యొక్క ఆదర్శనీయ కర్తవ్య పాలన ద్వారా భగవంతుడిని అన్వేషించే మరియు సేవించే జీవితంలో పూర్తిగా అంకితమవ్వాలని భావించే వారి కోసం, నేను ఈ ఆదిశంకరుని సన్యాస పరంపరకు చెందిన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీని శాశ్వతంగా కొనసాగేలా ప్రారంభించాను. భగవంతుడు, నా గురువు మరియు పరమగురువులు నా ద్వారా ప్రారంభించిన ఈ సంస్థాగత కార్యం…తమ జీవితాలను పరిత్యజించి, భగవంతునిపై అనంతమైన ప్రేమతో, అత్యున్నత లక్ష్యాల కోసం అంకితం చేసిన వారి నిర్వహణలో కొనసాగుతోంది.”

వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో సన్యాసులతో ఒక అనియమిత సమావేశంలో స్వామి చిదానందగారు
(మధ్యలో మాట్లాడుతున్నవారు).

"నేను స్వామి పరంపరలోని సన్యాసిగా మారాను"

  శ్రీ పరమహంస యోగానంద

“గురువుగారూ, నేను బెంగాల్-నాగ‌పూర్ రైల్వేలో ఎగ్జిక్యూటివ్ పదవిని స్వీకరించాలని మా నాన్న చాలా తీవ్రంగా కోరుకుంటున్నారు. కానీ నేను దానిని గట్టిగా తిరస్కరించాను.” నేను ఆశగా, “అయ్యా, మీరు నన్ను స్వామి పరంపరలోని సన్యాసిని చేయరా?” అని నేను నా గురువు [స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి] వైపు అభ్యర్థనగా చూస్తూ విన్నవించుకున్నాను. గతంలో, నా సంకల్పం యొక్క లోతును పరీక్షించడానికి, ఇదే అభ్యర్థనను తిరస్కరించిన మా గురువుగారు ఈరోజు దయగా నవ్వారు.

“మంచిది, రేపు నేను నీకు సన్యాస దీక్ష ఇస్తాను.” అని ఆయన నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు, “నువ్వు సన్యాసిగా ఉండాలనే కోరికను కొనసాగించినందుకు నేను సంతోషిస్తున్నాను. లాహిరీ మహాశయులు తరచూ ఇలా అంటారు: ‘మీరు దేవుడిని మీ వేసవి అతిథిగా ఆహ్వానించకపోతే, మీ జీవితంలోని శీతాకాలంలో ఆయన రాడు.’”
“ప్రియమైన గురువుగారూ, పూజ్యులైన మీ వలే సన్యాస పరంపరకు అంకితమవ్వాలనే నా కోరికను నేను ఎప్పటికీ వదులుకోలేను,” అంటూ నేను ఆయనను చూసి ఎనలేని ఆప్యాయతతో నవ్వాను….

జీవితంలో భగవంతునుకి ద్వితీయ స్థానం కేటాయించడమనేది నా ఊహకైనా అందని విషయం. విశ్వ చైతన్యం యొక్క ఏకైక యజమాని ఆయనే. జీవికి ఒక జీవితం నుండి మరో జీవితాన్ని నిశ్శబ్దంగా బహుమతులుగా ఇస్తాడు. మనిషి భగవంతునికి ప్రతిఫలంగా అందించగలిగే బహుమతి ఒక్కటే ఉంది – అదే ప్రేమ. ఆ ప్రేమను అందిచడమా? లేదు మానుకోవడమా? అనే నిర్ణయాధికారం ఆయా వ్యక్తులదే….

ఆ తర్వాతి రోజు నా జీవితంలో మరపురాని రోజు. ఆరోజు నాకు బాగా గుర్తు. 1915 జూలై మాసం. ఆరోజు గురువారం. బాగా ఎండగా ఉంది. కళాశాల నుండి నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన కొన్ని వారాల తర్వాత, తన శ్రీరాంపూర్ ఆశ్రమంలోని బాల్కనీలో, గురువుగారు కొత్త తెల్లటి పట్టు వస్త్రాన్ని సన్యాసుల సాంప్రదాయ కాషాయ వర్ణంలో ముంచారు. ఆ గుడ్డ ఆరిన తర్వాత, నా గురువు నన్ను సన్యాసిగా గుర్తిస్తూ దానిని నా చుట్టూ కప్పారు….

నేను శ్రీయుక్తేశ్వర్ గారి ముందు మోకరిల్లి, మొదటిసారిగా నా కొత్త పేరును ఆయన ఉచ్చరించడం విన్నప్పుడు, నా హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగింది. ముకుంద అనే ఈ బాలుడు ఏదో ఒకరోజు సన్యాసి యోగానందగా మారాలని ఆయన ఎంత ప్రేమగా, అవిశ్రాంతంగా శ్రమించారో! నేను శంకర భగవానుని సుదీర్ఘ సంస్కృత శ్లోకం నుండి కొన్ని శ్లోకాలను ఆనందంగా పాడాను:

మనస్సు, బుద్ధి, అహంకారం, అనుభూతి;
ఆకాశం, భూమి, లోహాలు ఇవేవీ నేను కాదు.
నేనే ఆయన, నేనే ఆయన, ఆశీర్వదించబడిన ఆత్మ, నేనే ఆయన!
నాకు పుట్టుక లేదు, మరణం లేదు, కులం లేదు;
నాన్న, అమ్మ, నాకు ఎవరూ లేరు.
నేనే ఆయన, నేనే ఆయన, ఆశీర్వదించబడిన ఆత్మ, నేనే ఆయన!
ఎగిరే విమానాలకు ఆవల, నేను నిరాకారుడిని,
నేను సర్వ వ్యాపిని;
నేను ఏ బంధానికీ బద్దుడను కాను;
నేను స్వేచ్ఛగా వుంటాను, ఎప్పటికీ స్వేచ్ఛగా ఉంటాను,
నేనే ఆయన, నేనే ఆయన, ఆశీర్వదించబడిన ఆత్మ, నేనే ఆయన!

క్రియాయోగా యొక్క ప్రాచీన ధ్యాన శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలనే పరమహంసజీ యొక్క నిర్దిష్ట లక్ష్యం అమెరికాలో సన్యాస పరంపర యొక్క చారిత్రాత్మక విస్తరణతో సమగ్రంగా ముడిపడి ఉంది. స్వామి యోగానందగారి క్రియాయోగా మిషన్ యొక్క సన్యాసుల మూలాలు ఆధునిక కాలంలో క్రియాయోగా వంశ స్థాపకుడు మహావతార్ బాబాజీతో మొదలై పరమహంస యోగానందగారి గురువు శ్రీయుక్తేశ్వర్ గారిని యోగానందగారు కలవటంతో తిరిగి మొదలయ్యాయి. శతాబ్దాలుగా తప్పిపోయిన క్రియా శాస్త్రాన్ని బహిరంగంగా బోధించే ప్రక్రియను ప్రారంభించడానికి బాబాజీ మొదట గృహస్థుడైన లాహిరీ మహాశయుని నియమించారు. 1894లో అలహాబాద్ ‌లో జరిగిన కుంభమేళాలో మహావతార్ బాబాజీని కలిసే వరకు శ్రీయుక్తేశ్వర్ గారు కూడా తన గురువు లాహిరీ మహాశయుని వలె (భార్య మరణించిన వాడైనప్పటికీ) గృహస్థు. వారి సమావేశం ఎలా జరిగిందో శ్రీయుక్తేశ్వర్ గారి మాటలలో: “సుస్వాగతం స్వామీజీ,” బాబాజీ ఆప్యాయంగా పలికారు.

“అయ్యా, నేను స్వామిని కాను,” అని నేను గట్టిగా జవాబిచ్చాను.

“స్వామి నామాన్ని నేను ఎవరికి దైవికంగా ప్రసాదించానో వారు దానిని ఎప్పటికీ వదులుకోరు.” ఆ సాధువు నన్ను సరళంగానే సంబోధించారు, కానీ ఆయన మాటలలో లోతైన సత్యం ధ్వనించింది. నేను తక్షణమే ఆ ఆధ్యాత్మిక ఆశీః తరంగాలలో మునిగిపోయాను.

బాబాజీ కొత్త స్వామితో ఇలా అన్నారు: “కొన్ని సంవత్సరాలలో నేను మీకు పాశ్చాత్య దేశాలలో యోగా వ్యాప్తి కోసం శిక్షణ ఇవ్వగల ఒక శిష్యుడిని పంపుతాను.” ఆ శిష్యుడు పరమహంస యోగానందేనని, ఆ తర్వాతి కాలంలో పరమహంసజీకి మహావతార్ బాబాజీ ద్వారా వ్యక్తిగతంగా ధృవీకరించబడింది. యోగానందను శిక్షణ కోసం పంపే ముందు శ్రీయుక్తేశ్వర్ ‌గారిని స్వామిగా చేయడం ద్వారా, బాబాజీ ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగా యొక్క ప్రధాన ప్రసారం, భారతదేశం యొక్క ప్రాచీన సన్యాస సంప్రదాయానికి చెందిన అధీకృత పరిత్యాగులచే సాధించబడుతుందని నిర్ధారించారు.

 

పరమహంస యోగానందగారు, చేతులు పైకెత్తి, తన ప్రియమైన శిష్యుడు, జేమ్స్ జె. లిన్ ‌ను ఆశీర్వదించారు. వీరికి ఆయన అప్పుడే సన్యాసం, ప్రసాదించి రాజర్షి జనకానంద నామాన్ని ఇచ్చారు; ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం, లాస్ ఏంజిలిస్, ఆగస్ట్ 25, 1951.

1970లో, మదర్ సెంటర్ లో స్వామి శ్యామానందకు, శ్రీ దయామాతగారు సన్యాసుల కాషాయ వస్త్రాన్ని కప్పారు.

1970లో, మదర్ సెంటర్ లో స్వామి శ్యామానందకు, శ్రీ దయామాతగారు సన్యాసుల కాషాయ వస్త్రాన్ని కప్పారు.

1925లో లాస్ ఏంజిలిస్ ‌లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాన్ని స్థాపించిన తర్వాత, తమ జీవితాలను పూర్తిగా భగవదన్వేషణకు అంకితం చేయాలనే కోరికతో వచ్చిన స్త్రీ పురుషులకు పరమహంసగారు  క్రమంగా శిక్షణనివ్వడం ప్రారంభించారు. శ్రీ దయామాతగారు, శ్రీ జ్ఞానమాతగారు, మరియు ఇతర లోతైన అంకితభావం గల ప్రారంభ శిష్యుల రాకతో, కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలిస్ ‌లోని మౌంట్ వాషింగ్టన్ ‌లోని కొండపై ఉన్న ఆశ్రమం క్రమంగా పెరుగుతున్న పరిత్యాగుల నిలయంగా మారింది. వీరిలో ఆయన స్ఫూర్తిని, ఆదర్శాలను నింపారు. తనకు తాను సన్యాసియైన ఆయన, సన్యాస జీవితానికి స్వయంగా ఉదాహరణగా నిలిచారు. తాను ప్రారంభించిన ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక, మానవతా కార్యాన్ని నిరంతరాయంగా కొనసాగించడానికి, తన బోధనల వ్యాప్తికి ఆయన తన మిషన్ యొక్క భవిష్యత్ బాధ్యతను అప్పగించిన తన సన్నిహిత శిష్యులకు నిర్దిష్ట మార్గదర్శకాలను కూడా ఇచ్చారు. ఈ రోజు, ఆయన తన జీవితకాలంలో ఆశ్రమవాసులకు అందించిన లోతైన ఆధ్యాత్మిక సలహాలు, క్రమశిక్షణ కొత్త తరాల వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులకు కూడా అందించబడుతున్నాయి.

ఈ విధంగా, పరమహంస యోగానందగారి ద్వారా, భారతదేశంలోని ప్రాచీన సన్యాస పరంపర అమెరికాలో లోతైన, శాశ్వతమైన మూలాలను ఏర్పరచుకుంది. అర్హత కలిగిన పాశ్చాత్యులను ప్రోత్సహించడంతో పాటు, పరమహంసజీ సనాతన సన్యాస సంప్రదాయానికి ఒక నూతన ఒరవడిని సృష్టించారు. పవిత్రమైన సన్యాస దీక్షను, ఆధ్యాత్మిక నాయకత్వాన్ని, అటు మహిళలకు, ఇటు పురుషులకు ఇరువురికీ ఇవ్వడమే ఆయన సమయంలో జరిగిన ఒక అసాధారణమైన పరిణామం. వాస్తవానికి ఆయన, సన్యాస దీక్షను ఇచ్చిన మొదటి ఎస్.ఆర్.ఎఫ్. సన్యాస శిష్యురాలు ఒక మహిళ — శ్రీ దయామాతగారు. ఆ తరువాత అర్ధ శతాబ్దానికి పైగా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క ఆధ్యాత్మిక అధిపతిగా ఆమె పనిచేశారు.

శ్రీ దయామాతగారు అధ్యక్షత వహించిన సమయంలో భారతదేశంలోని సన్యాస పరంపరకు చెందిన పీఠాధిపతి — శ్రీ పూరీ శంకరాచార్య స్వామి భారతీ కృష్ణ తీర్థ — 1958లో తన మూడు నెలల అమెరికా పర్యటనలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కు అతిథిగా ఉన్నారు. భారతదేశ చరిత్రలో శంకరాచార్యులవారు (ఎనిమిదవ శతాబ్దపు సన్యాస పరంపరను పునర్వ్యవస్థీకరించిన ఆదిశంకరుని వారసుడు) పశ్చిమ దేశాలకు ప్రయాణించడం ఇదే మొదటిసారి. జగద్గురు శంకరాచార్యులు శ్రీ దయామాతగారు పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని కలిగి ఉన్నారు. బాబాజీ ఆదేశానుసారం పరమహంస యోగానందగారు ప్రారంభించిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమాలలో సన్యాస పరంపరను మరింతగా విస్తరించడానికి ఆమెకు అధికారిక ఆశీర్వాదాన్ని ఇచ్చారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆయన బహిరంగంగా ఇలా అన్నారు: “నేను సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ [యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా]లో అత్యున్నత ఆధ్యాత్మికత, సేవ మరియు ప్రేమను దర్శించాను. వారి ప్రతినిధులు ఈ సూత్రాలను బోధించడమే కాకుండా, వాటిని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తారు కూడా.”

శంకరాచార్యులతో శ్రీ శ్రీ దయామాతగారు
మార్చి 1958లో పూరీలోని గోవర్దన్ మఠానికి చెందిన జగద్గురు శ్రీ శంకరాచార్య భారతీ కృష్ణ తీర్థ, శ్రీ దయామాతాజీతో కలిసి సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ హెడ్ ‌క్వార్టర్స్, లాస్ ఏంజిలిస్ లో

పరమహంస యోగానందగారు నిర్దేశించిన కార్యాన్ని కొనసాగించడం

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సన్యాసులు వివిధ హోదాల్లో సేవలందిస్తూ పరమహంసజీ యొక్క కార్యాన్ని కొనసాగిస్తున్నారు — భారతదేశం అంతటా వార్షిక బహిరంగ సమావేశ పర్యటనలు, తరగతులను నిర్వహించడం, సత్సంగాలలో ప్రసంగించడం, ఔట్ ‌రీచ్ కార్యక్రమాలలో ప్రజలకు ఆతిథ్యం ఇవ్వడం, ఆఫీసు పని చేయడం, సొసైటీ యొక్క ఆశ్రమాలు, కేంద్రాల నిర్వహణ వంటి వాటితో పాటు ధ్యాన మండళ్ళ నిర్వహణ, వై.ఎస్.ఎస్. పుస్తకాలు, రికార్డింగుల ప్రచురణ, పంపిణీ, వివిధ ఆధ్యాత్మిక విషయాలపై కౌన్సెలింగ్ వంటివాటిని పర్యవేక్షిస్తుంది.

భక్తుడితో మాట్లాడుతున్న వై.ఎస్.ఎస్. ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానందగారు
A YSS monk distributes Essential Items to the Needy
మౌంట్ వాషింగ్టన్ వద్ద దయామాతాజీతో స్వామిలు కృష్ణానంద, భావానంద మరియు స్మరణానంద గారులు
వై.ఎస్.ఎస్._ప్రధాన_కార్యదర్శి_స్వామి_ఈశ్వరానందగారు_సమీక్ష_భక్తులు
ఉత్తరాఖండ్‌లోని ద్వారహాట్‌లో సోలార్ దీపాలను పంపిణీ చేస్తున్న వై.ఎస్.ఎస్. సన్యాసి
YSS monastics planning Ashram activities
వై.ఎస్.ఎస్. గురుగ్రామ్ ధ్యాన కేంద్రం ప్రతిష్ఠాపన సందర్భంగా పల్లకీ మోస్తున్న వై.ఎస్.ఎస్. సన్యాసులు
అలహాబాద్, 2019లోని కుంభమేళాలో ప్రభాత్ ఫెరీలో వై.ఎస్.ఎస్. సన్యాసులు

"భగవంతుడే ప్రథముడు, ఎల్లవేళలా భగవంతుడే, కేవలం భగవంతుడే"

శ్రీ మృణాళినీమాత

యోగాదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క నాల్గవ అధ్యక్షురాలు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులనుద్దేశించి (2011-2017) చేసిన వ్యాఖ్యల నుండి సంగ్రహాలు

శ్రీ శ్రీ మృణాళినీమాత

ప్రియతమా,

గత కొన్ని సంవత్సరాలుగా మన గురువుగారి ఆశీస్సులతో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ [యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా] వేగంగా వృద్ధి చెందింది. ఈ కార్యం మరో కొత్త శకంలోకి విస్తరిస్తోంది. సన్యాసులుగా జీవితాన్ని అంకితం చేయడానికి వచ్చిన మాతో చాలా సంవత్సరాల క్రితం గురువుగారు మాట్లాడిన మాటలు మేము చాలా తరచుగా గుర్తు చేసుకుంటూ ఉంటాము: “నేను ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు, సంస్థే నా దేహం అవుతుంది. మీరందరూ నా చేతులు, కాళ్ళు, నా వాక్కు అవుతారు.” ఈ సమర్పిత జీవితం ఓ మహదవకాశం. అత్యుత్తమ స్వేచ్ఛానుభవం. దానిని హృదయపూర్వకంగా స్వీకరించే ప్రతి ఒక్కరూ ఆ జగదీశ్వరుడైన ప్రభువు యొక్క ప్రకాశించే అణువు అవుతారు. ప్రతి ఒక్కరూ కార్య పూర్తికి అవసరమైన సహకారాన్ని అందిస్తారు. దీని ద్వారా గురుదేవుని సంస్థ ఆ భగవానుని ప్రేమను, దైవిక స్ఫూర్తిని నిరంతరం కొనసాగించవచ్చు.

నేడు ప్రపంచం చాలా ఆధ్యాత్మిక ప్రమాణాలను, నైతికతలను కోల్పోయింది. సన్యాసుల మార్గాన్ని ఎంచుకునే వారు ఆ సాధారణ భౌతిక నిబంధనలకు అతీతమైన జీవితాన్ని గడపాలనే ఆత్మాభీష్టం, సామర్థ్యాలకు ప్రతిస్పందనగా అలా చేస్తారు. అలా వచ్చేవారిలో కొద్దిమంది మాత్రమే సన్యాసాన్ని స్వీకరించినప్పటికీ, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపి, ఇతరులనేకుల ముందు ఆ ఉన్నత విలువలను, ఆదర్శాలను నిలపడానికి ఉపయోగపడతారు. ప్రజలు దేవునికి మాత్రమే చెందిన భిన్నమైన, ప్రత్యేకమైన జీవిత స్వచ్ఛతను అట్టి వారి నుంచి అనుభూతి చెందుతారు. నిరాడంబరత, విధేయత, పవిత్రత, విశ్వాసం అనే ప్రమాణాలకు కట్టుబడి, ధ్యానంలో పట్టుదలతో చేసే వినయపూర్వకమైన ప్రయత్నం కారణంగా, భక్తునిలో విపరీతమైన మార్పులు వస్తాయి. అతను నివసించే చిన్న కసాయి దుకాణం కూడా ఆధ్యాత్మికతతో శోభిల్లుతుంది. ఇతరులు అది ఏమిటో చెప్పలేరు, కానీ వారు తమను ఉద్ధరించే, తమను భగవంతునికి చేరువచేసే ఒకానొక ప్రకాశం (ఆరా) ఆ భక్తుని వద్ద ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు. వినయపూర్వకమైన భక్తుడు దానిని ప్రదర్శించడు. నిజానికి, ఆయనకు దాని గురించి తెలియకపోవచ్చు కూడా.

ఆధ్యాత్మిక మార్గంలో తనను తాను అంకితం చేసుకోవడం కంటే గొప్ప కర్తవ్యం లేదు – సాధించగలిగే గొప్ప విజయం లేదు, శాశ్వతత్వమైన గొప్ప కీర్తి లేదు. విజయం సాధించినవాడు, ఆత్మశుద్ధితో సేవ చేసేవాడు, భగవంతుడు మరియు గురువులతో కలిసి సామరస్యంగా, నిశ్శబ్దంగా, తనకే తెలియకుండా ప్రపంచంలోని వేలాది మందిలో పరివర్తన తెస్తాడు. ఒకరోజు దేవుని సన్నిధిలో అతను వెనక్కి తిరిగి చూసి, “అయ్యో, పవిత్రమైన మాత మరియు గురుదేవులు ఆ అత్యంత సాధారణమైన జీవితాన్ని ఎలా కొనసాగించారు?” అనికోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా గురువుగారు నిర్దేశించిన ఆ పవిత్ర కార్య వృద్ధికి కారణం ఆయన ఆధ్యాత్మిక కుటుంబంలోని వారు – సన్యాసుల సంఘం మరియు అనేక మంది గృహస్థ శిష్యులు – గురూజీ బోధనలు మరియు ఆయన స్ఫూర్తికి సజీవ ఉదాహరణలుగా మారడానికి తమ జీవితాలను అంకితం చేసినవారు.

సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ [యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా] యొక్క జవ జీవాలు గురువుగారే. ఆశ్రమాలలో మనం గడిపే దైనందిన జీవితంలో ఆయన స్ఫూర్తి నిండి ఉంది. వారు ఆశ్రమంలో నిత్యం నిర్వహించే అనేక విధుల నుంచి గురుదేవుల యొక్క సన్యాసులు, సన్యాసినులు వారి ప్రవర్తనలో, వారి నడవడిలో, వారి ఆలోచనలో, వారి అంతరంగంలో, అనేక విషయాలను నేర్చుకుంటారు – వారు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే: “నేను నా గురువుగారు జీవించిన ఆ ఆధ్యాత్మిక దీక్షకు చెందిన ఆదర్శాలకు, నన్ను నేను సమర్పించుకున్నాను: భగవంతుడే ప్రధానం, ఎల్లవేళలా భగవంతుడే, కేవలం భగవంతుడే.” ఎవరి జీవితం నిజంగా ఆ ఆదర్శానికి అంకితం చేయబడిందో, అతను నిరంతరం గురూజీ ఆశీస్సులు పొందే వ్యక్తి, అతను ఇతరులకు సేవ చేయడానికి తగిన సాధనంగా మారే వ్యక్తి, తన జీవితం ద్వారా దేవుని ప్రేమను వ్యక్తం చెయ్యగలిగిన వ్యక్తి, ప్రేమగా అర్థం చేసుకోగల వ్యక్తి, శ్రద్ధ వహించగల వ్యక్తి, ఏసు యొక్క క్షమాగుణం, కృష్ణుని జ్ఞానం – ఇతర దైవిక లక్షణాలన్నింటినీ అతను తన జీవితంలో చాలా అందంగా, చాలా ఆనందంగా ప్రదర్శించగలడు. ఆయన స్థాపించిన ఈ ఆశ్రమాలలో కేవలం మన స్వీయ ముక్తి కోసం మాత్రమే కాకుండా, ఇతరుల ముక్తి కోసం మరియు మానవాళి ఉద్ధరణ కోసం గురుదేవులు అందించిన ఈ దివ్య ప్రస్థానాన్ని శాశ్వతంగా కొనసాగించే అవకాశం లభించడం మన అదృష్టం. మనం ఎంతో ధన్యులం.

ఆహ్వానం

కుటుంబ బాధ్యతలు లేని ఒంటరి పురుషులు, సన్యాసాశ్రమాలలో పరిత్యాగిగా భగవంతుని అన్వేషించి, ఆయనను సేవించడంలో తమను తాము అంకితం చేసుకోవాలనే హృదయపూర్వకమైన కోరిక ఉన్నవారు మరింత సమాచారం కోసం రాంచీలోని యోగదా సత్సంగ శాఖ ఆశ్రమాన్ని సంప్రదించగలరు.

ఇతరులతో షేర్ చేయండి