రోజంతా ప్రార్థన చేయడానికి ప్రపంచవ్యాప్తంగా చేరడం

3 ఏప్రిల్, 2020

కరోనావైరస్ మహమ్మారి కారణంగా అనేక దేశాలలో ఆరోగ్య సంక్షోభం వుంది, మీరు సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నారని మేము ఆశిస్తు, మీ కోసం ప్రార్థిస్తున్నాము. మనమందరం నిర్దేశించని భూభాగం గుండా నడవాల్సిన ఈ సమయంలో, వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. భక్తులు సందర్భానుసారంగా నిలబడి, విశ్వాసం, ధైర్యం, ఆధ్యాత్మిక బలం, మరియు ఒకరికొకరు మద్దతు వంటి వారి సహజమైన ఆత్మ లక్షణాలను వ్యక్తీకరించడం, మరియు గాఢమైన ప్రార్థనలతో చూడడం ఎంతో హృదయపూర్వకంగా ఉంది.

ప్రార్థన యొక్క శక్తిని నొక్కి చెబుతూ, పరమహంస యోగానందగారు ఇలా అన్నారు: “చాలా మంది మనుష్యులు సంఘటనల గమనాన్ని సహజంగా మరియు అనివార్యంగా భావిస్తారు. ప్రార్థన ద్వారా ఎలాంటి సమూల మార్పులు సాధ్యమో వారికి చాలా తక్కువ తెలుసు.” మీకు తెలిసి ఉండవచ్చు, వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు ప్రార్థనలు కోరిన వారి కోసం ప్రతిరోజూ ప్రార్థిస్తారు, మరియు భక్తులందరికీ మరియు యావత్ ప్రపంచ క్షేమం కోసం కూడా ప్రార్థిస్తారు. అనేక సంవత్సరాలుగా, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి సభ్యులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండలీలలో మరియు భక్తులు వారి వ్యక్తిగత గృహాలలో కూడా ఈ ప్రయత్నానికి శక్తివంతంగా సహకరిస్తున్నారు.

మనందరి ఏకాగ్రత మరియు సమూహ ప్రయత్నం ద్వారా మన ప్రార్థనల శక్తిని మరింత ప్రభావవంతంగా చేయవచ్చు. యోగదా సత్సంగ సొసైటీ ఆశ్రమాలలో, సన్యాసులందరూ ఇతరుల స్వస్థత కోసం మరియు ప్రపంచ సామరస్యం మరియు శాంతి కోసం ప్రతిరోజూ దిగువ ఇవ్వబడిన నిర్దిష్ట సమయాల్లో ప్రార్థిస్తారు. ఈ సమయాలలో ప్రార్థనా మండలిలో చేరాలని కోరుకునే వారిని మేము ఆహ్వానిస్తున్నాము. (అన్ని సమయాలు భారతీయ కాలమానం ప్రకారం.):

ఉదయం 7:50 – 8:00 వరకు
మధ్యాహ్నం 2:50 – 1:00 వరకు
సాయంత్రం 6:50 – 7:00 వరకు

ఈ సమయాలు మీకు సౌకర్యవంతంగా ఉంటే, మీరు సెల్ఫ్-రియలైజేషన్ ఆశ్రమాలలో స్వస్థత ప్రార్థన సేవల సమయంలో పాల్గొనడాన్ని కూడా పరిగణించవచ్చు. మరింత సమాచారం ఎస్.ఆర్.ఎఫ్. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

పైన పేర్కొన్న సమయాలు మీ దైనందిన కార్యపట్టికకి అనుకూలంగా గనుక లేకుంటే, మీ దినచర్యకు సరిపోయే మరేదైనా సమయంలో ప్రార్థన చేయాలని మేము సూచిస్తున్నాము. మీ ప్రార్థనల ముగింపులో, పరమహంసగారు బోధించిన విధంగా స్వస్థత చేకూర్చే శాస్త్రీయ పద్ధతిని మీరు అవలంబించవలసినదిగా మేము సిఫార్సు చేస్తున్నాము.

ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలిని స్థాపించినప్పుడు, పరమహంసగారు ఇలా అన్నారు: “వేల మంది ప్రార్థనలు ఏకమైనప్పుడు, శాంతి మరియు దివ్య స్వస్థత యొక్క శక్తివంతమైన ప్రకంపనలు ఆశించిన ఫలితాలను వ్యక్తపరచడంలో మరియు సహాయపడటంలో అమూల్యమైనవి.”

ఈ ప్రోత్సాహకరమైన ఆలోచన మీకు బలాన్ని తెస్తుంది మరియు మా సామూహిక ప్రార్థనలన్నింటినీ ప్రపంచాన్ని అందుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. మరియు మీరు ఎప్పుడు కూడా ఆ దివ్య రక్షణ కోటలో సురక్షితంగా ఉండండి.

వీడియో: స్వామి చిదానంద గిరి గారు పరమహంస యోగానందగారి స్వస్థత పద్ధతిని దిశా నిర్దేశం చేస్తూ మార్చి 14న మార్గనిర్దేశిత ధ్యానం మరియు ఆధ్యాత్మిక హామీ సందేశ ముగింపులో అందజేసారు. ఇతరుల కోసం మరియు ప్రపంచం శాంతి కోసం ప్రార్థించే వారి స్వంత ప్రయత్నాలలో భాగంగా, స్వామి చిదానందగారితో స్వస్థత ప్రార్థన చేయాలనుకునే వారి కోసం మేము ఈ సారాంశాన్ని అందిస్తున్నాము.

ఇతరులతో పంచుకోండి