క్రీస్తు మీతోనే ఉన్నాడని ఎప్పుడు తెలుసుకుంటారు?

ఒక క్రిస్మస్ సందేశం

క్రీస్తు మీతోనే ఉన్నాడని ఎప్పుడు తెలుసుకుంటారుఇరవై శతాబ్దాల క్రితం ఏసు, క్రీస్తు చైతన్య మనే ఊయలలో జన్మించాడు. అతని విశ్వజనీన క్రీస్తు చైతన్యం ప్రతి జ్ఞానిలోను తిరిగి అవతరించింది. రాబోవు క్రిస్మస్ కు మీలో సర్వాంతర్యామి అయిన క్రీస్తు జననాన్ని వీక్షించటానికి మీ ఆత్మను విస్తరించుకుని సిద్ధంగా ఉన్నారా?

ఏసు జన్మదినాన్ని బహుమతులు, పండుగలతో జరుపుకోవడ౦ ఆయన జీవిత౦లోని ఆదర్శాలపట్ల కొ౦త భక్తి, శ్రద్ధలను తెలియజేస్తుంది. కానీ, క్రిస్మస్ పవిత్ర సమయాన విశ్వమానవ సౌభ్రాతృత్వం, సకల జీవరాశులపట్ల ప్రేమ అనే కొత్త చైతన్యంల పుట్టుకను మీలో అనుభూతి చెందడానికి, ధ్యానించి, మీ మనస్సును సంసిద్ధం చేసుకోవడమనేది అసలైన క్రిస్మస్ వేడుక. మీ మది నుండి అహంకార, పక్షపాతాలను తరిమికొట్టండి తద్ద్వారా మీరు ప్రేమతో వికసించిన మీ మదిలో సర్వవ్యాపకమైన క్రీస్తు చైతన్యాన్ని ఆదర్శంగా నిలుపుకోగలరు.

క్రిస్మస్ సమయాన ప్రలోభాల పరీక్షలకు మీ ధ్రుఢ సంకల్పం ఓటమిచెందలేదని మీరు కనుగొన్నట్లయితే, నిజానికి క్రీస్తు మీలో జన్మించాడని తెలుసుకోండి. వచ్చే క్రిస్మస్ లో మీరు వ్యాకులతతో శిలువ వేయబడినప్పుడు మీలోని శాంతిని సంరక్షించుకోగలిగితే, క్రీస్తు మీతో ఉన్నాడని తెలుసుకోండి. క్రిస్మస్ లో అశాంతి అలోచనల గుంపులు దండెత్తినప్పటికీ, మీరు గాఢమైన ఆనందోత్సాహాలతో ధ్యానం చేయగలిగితే, ధ్యానం యొక్క దివ్య ఆనందంగా క్రీస్తు మీలో వ్యక్తమయ్యాడని తెలుసుకోండి.

ఇతరుల దుర్జనత్వమనే చిత్రవధ ద్వారా మీరు క్రోధానికి గురికానప్పుడు, మీరు క్రీస్తు కోస౦ సన్నద్ధమయ్యారని తెలుసుకో౦డి. మీపట్ల ఎవరికైనా ద్వేష౦ ఉన్నప్పటికీ మీరు అ౦దరిపట్ల ప్రేమను అనుభూతి చెందినప్పుడు, క్రీస్తు కోస౦ మీలో ఒక పూజా వేదిక సృష్టించబడిందని తెలుసుకో౦డి.

మీరు ధ్యానం యొక్క అంతులేని పారవశ్యాన్ని మీలో ఎప్పుడు అనుభూతి చెందగలుగుతున్నారంటే, క్రీస్తు ఎప్పటికీ మీతోనే ఉన్నాడని తెలుసుకోండి, మరియు మీరు అమరమైన చైతన్యంలో నిజమైన క్రిస్మస్ పండుగను ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజు, ప్రతి ఏట, అనంతకాలం వరకూ జరుపుకుంటారు.

(ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్: ద రిసరక్షన్ ఆఫ్ క్రైస్ట్ వితిన్ యూ నుండి సారాంశం: పరమహంస యోగానందగారి రచన)

ఇతరులతో పంచుకోండి