హృదయంలో సరళతను అలవరచుకోవడం

శ్రీ పరమహంస యోగానందగారి జ్ఞాన వారసత్వం నుండి

సరళమైన జీవితం సంతోషకరమైన జీవితం

సరస్సు దగ్గర ధ్యానం — సిల్హౌట్

ఆనందం బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండదు; బదులుగా, ఇది జీవితంలోని సరళమైన ఆనందాలలో మరియు అన్నింటికంటే, లోతైన ధ్యానం యొక్క నిత్య నవీన ఆనందంలో కనుగొనబడుతుంది….

సరళమైన, నిజమైన, మరియు శాశ్వతమైన ఆత్మ-సంతోషాలను అంటిపెట్టుకుని సంతోషంగా ఉండండి. అవి లోతైన ఆలోచన, ఆత్మపరిశీలన, ఆధ్యాత్మిక ప్రేరణ మరియు ధ్యానం ద్వారా వస్తాయి.

ఆధునిక జీవితం చాలా అసంతృప్తికరంగా మారుతోంది. ఇది మీకు ఆనందాన్ని ఇవ్వదు. జీవితంలో చాలా విషయాలు, చాలా కోరికలు ఉంటున్నాయి. మరిన్ని మంచి కార్లు మరియు దుస్తులు మరియు వినోదాలు — ఇవన్నీ మరిన్ని చింతలు కలిగిస్తాయి! “అవసరాలు” అని పిలవబడే వీటి నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోండి మరియు దేవునితో ఎక్కువ సమయం గడపండి. మీ జీవితాన్ని సరళంగా చేసుకోండి. మీరు అంతర్గతంగా సొంతంగా సంతోషంగా ఉండండి.

ఆధునిక మానవుని యొక్క ఆనందం, మరింత ఎక్కువగా పొందడం మీద ఆధారపడి ఉంది మరియు ఇతరులకు ఏమి జరిగినా పట్టింపు లేదు. కానీ ఎక్కువ ఆడంబరాలు లేకుండా తక్కువ చింతలతో సరళంగా జీవించడం మంచిది కాదా? మీకు ఉన్న దానిని మీరు ఆస్వాదించలేనంతగా మీ జీవితాన్ని గడపడంలో ఆనందం లేదు….మానవజాతి ఎక్కువ భౌతిక వస్తువుల అవసరం అనే స్పృహ నుంచి బయటపడే సమయం వస్తుంది. సాధారణ జీవితంలో మరింత భద్రత మరియు శాంతిని పొందుతారు.

ఒత్తిడి మరియు ఆర్థిక చింతలను తగ్గించుకోవడానికి జీవితాన్ని సరళీకృతం చేసుకోండి

సంక్లిష్టమైన భౌతిక జీవితం కళ్ళకు మరియు హోదా యొక్క స్థితి స్పృహకు మాత్రమే ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ కొద్దిమంది మాత్రమే “ఇది ఏ ధరతో కూడిన పదార్థ సౌలభ్యం” అని తెలుసుకుంటారు. ఆర్థిక బానిసత్వం, భయాందోళనలు, వ్యాపార చింతలు, అన్యాయమైన పోటీ, విభేదాలు, స్వేచ్ఛ లేకపోవడం, వ్యాధి, కష్టాలు, వృద్ధాప్యం మరియు మరణం — ఇవన్నీ భౌతిక పదార్థాలతో కూర్చబడిన జీవితం యొక్క ఫలితమే. జీవితంలో అందం, ప్రకృతి మరియు భగవంతుని యొక్క అనేక వ్యక్తీకరణలను ప్రశంసించడానికి సమయం లేనట్లయితే చాలా కోల్పోయినట్లే.

తగిన నివాస స్థలాన్ని ఎంచుకోండి, కానీ మీకు నిజంగా అవసరమైన దానికంటే పెద్దది కాదు, మరియు వీలైతే పన్నులు మరియు ఇతర జీవన వ్యయాలు సహేతుకంగా ఉండే ప్రాంతంలో ఎంచుకోండి….బూటకమైన మరియు ఖరీదైన సుఖాల కోసం వెంపర్లాడకుండా, జీవితాన్ని సరళంగా ఉంచుకొని భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తిగా బ్రతకాలి. మనిషి మనస్సును ఆకర్షించడానికి భగవంతుని స్వభావంలో చాలా దాగి ఉంది. విలువైన పుస్తకాలు చదవడానికి, ధ్యానం చేయడానికి మరియు సంక్లిష్టత లేని జీవితాన్ని ఆస్వాదించడానికి మీ ఖాళీ సమయాన్ని ఉపయోగించండి. ఒక భారీ ఇల్లు, రెండు కార్లు మరియు బాకీ యొక్క చెల్లింపులు మరియు మీరు తీర్చలేని తనఖా కంటే — తక్కువ చింతలు కలిగి, దేవుణ్ణి అన్వేషించడానికి కావాల్సినంత సమయం దొరికే సాధారణ జీవనం ఉత్తమం కాదా?

దేవుడు తన అనంతమైన దయతో మనకు తన ఆనందాన్ని, తన ప్రేరణను, నిజమైన జీవితాన్ని, నిజమైన జ్ఞానాన్ని, నిజమైన ఆనందాన్ని, మరియు మన జీవితంలోని వివిధ అనుభవాల ద్వారా నిజమైన అవగాహనను ఇస్తాడు. కానీ దేవుని మహిమ కేవలం ఆత్మ యొక్క నిశ్శబ్దంలో, ఆయనతో అనుసంధానం కావడానికి మనస్సు యొక్క అంతర్గత ప్రయత్నం యొక్క తీవ్రతలో మాత్రమే బహిర్గతమవుతుంది. అక్కడే మనం సత్యాన్ని కనుగొంటాము. వెలుపల, మాయ చాలా బలంగా ఉంది; చాలా కొద్ది మంది మాత్రమే బాహ్య పరిసరాల యొక్క ప్రభావాల నుండి బయటపడగలరు. ప్రపంచం దాని అనంతమైన సంక్లిష్టతలు మరియు విభిన్న అనుభవాలతో సాగుతూ ఉంటుంది. ప్రతి జీవితం కొత్తది మరియు ప్రతి జీవితం భిన్నంగా జీవించాలి. అన్ని జీవులకు ఆధారం భగవంతుని నిశ్శబ్ద స్వరం — పువ్వుల ద్వారా, పవిత్ర గ్రంథాల ద్వారా మరియు మన మనస్సాక్షి ద్వారా — అందమైన అన్ని విషయాల ద్వారా మనలను ఆ భగవంతుని నిశ్శబ్ద స్వరం పిలుస్తుంది. అటువంటి జీవితమే విలువైన జీవనం.

ముఖ్యమైన వాటి కోసం సమయాన్ని వెచ్చించండి

తెలివి తక్కువగా మెరిసే బంగారం వంటి భౌతిక విషయాల వెంటబడి, ఆధ్యాత్మిక పరమైన సువర్ణావకాశాలను వృధా చేసుకోవద్దు. “అనవసరమైన అవసరాలు” అని నేను పేర్కొన్న దాని కోసం మరియు శరీర అవసరాలను తీర్చడానికి నిరంతరం ఆత్రుత పడుతూ ఉంటే దేవునికి సమయం ఎక్కడ ఉంటుంది? దానికి బదులుగా జీవితాన్ని సరళీకృతం చేసుకోండి. అలా ఆదా చేసిన సమయాన్ని ధ్యానంలో భగవంతునితో-అనుసంధానానికి మరియు జీవితానికి నిజమైన పురోగతికి అవసరమైన శాంతి మరియు సంతోషాలను సాధించడం కోసం ఉపయోగించండి.

భగవంతుడు సరళమైన వాడు. మిగతావన్నీ సంక్లిష్టంగా ఉంటాయి.

సమస్త సృష్టిలో సముద్రంలా ప్రవహించే అనంతమైన భగవంతుని సాక్షాత్కారం కోసం భగవంతునిలో లంగరు వేయండి. భగవత్ సాక్షాత్కారాన్ని పొందే ప్రయత్నం చేయడం ఈ స్వల్పకాల జీవితంలో చాలా విలువైనది. అప్పుడు ఆనందం నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది.

ఇతరులతో పంచుకోండి