హైతీ లో భూకంపం వచ్చిన సందర్భంగా శ్రీ దయామాతగారి నుండి ప్రత్యేక సందేశం

జనవరి 2010

ప్రియమైన ప్రజలారా,

హైతీలో విధ్వంసకర భూకంపం గురించి తెలుసుకున్నప్పటి నుంచి, గురుదేవ శ్రీ పరమహంస యోగానందగారి ఆశ్రమాలలో ఉన్న మనమందరం ప్రభావితమైన వారి కోసం ప్రగాఢంగా ప్రార్థిస్తున్నాము, అలాగే మన ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి సభ్యులు కూడా కొనసాగుతున్న ఈ ప్రయత్నంలో మాతో చేరాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. హైతీ ప్రజలు అనుభవిస్తున్న బాధలను చూస్తే హృదయవిదారకంగా ఉంది మరియు ఈ విషాదం తర్వాత వారు జీవితాని ఎదుర్కొనేందుకు మన నిరంతర సహాయం చాలా అవసరం. వారు తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి భౌతిక వనరులను మాత్రమే కాకుండా, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి ధైర్యం మరియు ఇబ్బందుల నుండి త్వరగా ఉపశమనం పొందేందుకు మన ప్రార్థనల యొక్క ఆధ్యాత్మిక మద్దతు కూడా అవసరం. శారీరకంగా మరియు మానసికంగా నయం అవటానికి వారు చేసే ప్రయత్నాలలో వారిని బలోపేతం చేయడానికి మరియు భగవంతుని యొక్క ఎల్లప్పుడూ ఉండే సహాయాము పొందటానికి వారి గ్రహణశక్తిని పెంచడానికి — మరియు అవసరమైన వారిని ఉద్ధరించడానికి ప్రార్థన యొక్క శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దని గురుదేవులు మనలను కోరారు.

ఇలాంటి విపత్తులు జీవితం యొక్క అనిశ్చిత స్వభావాన్ని మనకు గుర్తు చేస్తాయి. మరియు చాలా మంది అడిగే ప్రశ్న ఏమిటంటే, “ఇది జరగడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు?” మన దృక్పథం చాలా పరిమితం అయినందున మన మానవ మేధస్సుతో మనల్ని పూర్తిగా సంతృప్తిపరిచే సమాధానాన్ని కనుగొనలేము. మనం సృష్టి యొక్క సమగ్ర దృశ్యంలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే చూస్తాము; భగవంతుడు మాత్రమే మొత్తం చూస్తాడు మరియు మన అనుభవాల యొక్క లోతైన ఉద్దేశ్యాన్ని తెలుసుకుంటాడు. మనస్సుతో అర్థం చేసుకోవడం మరియు హృదయంతో ఏమి జరిగిందో అంగీకరించడం కష్టంగా ఉన్న ఆ సమయాల్లో, ఈ అల్లకల్లోల ప్రపంచంలో మనకు గొప్ప ఆశ్రయం మరియు ఓదార్పు ఇవ్వగలిగిన ఆయనను మనం ఆశ్రయించాలి. మనం భయానికి లేదా నిరుత్సాహానికి లొంగిపోవడానికి నిరాకరిస్తే, పరిస్థితులు ఆయనపై మన విశ్వాసాన్ని పరీక్షించినప్పటికీ, అన్ని పరీక్షల నుండి మనల్ని గట్టెక్కించగలిగే ఆయన అనంతమైన ప్రేమతో మనల్ని మనం సర్దుబాటు చేసుకోగలుగుతాము. అంతిమంగా, వాస్తవానికి, మనం ఈ పెళుసుగా ఉండే భౌతిక రూపం కాదు, నాశనం చేయలేని ఆత్మ అని గ్రహించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు — మన జీవితాలకు ఎప్పుడు తన సంరక్షణ ఇచ్చే ఆయనలో మనం స్థిరంగా ఉంటే, ప్రతి సవాలును అధిగమించే వనరులు మనలో ఉన్నాయని గ్రహిస్తాము.

దేవుని పిల్లలుగా, మనం మానవాళి యొక్క ఒక విస్తారమైన కుటుంబానికి చెందినవారము, మరియు ఈ ప్రపంచంలోని బాధలను తగిచ్చడానికి సహాయపడవలసిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిపై ఉంది, ఎందుకంటే మన సంచిత ఆలోచనలు మరియు చర్యలు మన స్వంత విధిని మరియు ఇతరులను, మంచిగాను లేదా చెడుగాను ప్రభావితం చేస్తాయి. నిస్వార్థత మరియు శ్రద్ధతో మనము చేసే ప్రతి చర్య ద్వారా క్లిష్ట పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించడానికి మనం ఎంత చేయగలమో మనకు తెలియదు. హైతీ ప్రజల పట్ల సానుభూతి మరియు ప్రేమపూర్వక శ్రద్ధ వెల్లివిరుస్తుంది, ఇది కరుణామయ హృదయాల ద్వారా అవసరమైన వారికి స్వస్థత చేకూర్చడానికి మరియు స్వాంతన కలిగించడానికి నిరంతరం పనిచేస్తున్న దైవ శక్తిని సూచిస్తుంది. దేవుడు మనలను ఎక్కడ ఉంచినా అతని వెలుగు మరియు ప్రేమను అందించే వారిగా మనము ఉండాలని, మరియు బాధపడుతున్న ఆత్మల అందరి కోసం మనము నిరంతర మద్దతు మరియు ప్రార్థనలను అందించాలని సంకల్పిద్దాం. మన సానుకూల ఆలోచనలు మరియు చర్యల ద్వారా, దేవుని సర్వశక్తిమంతమైన సంకల్పంతో మన సంకల్పాన్ని ఏకం చేయవచ్చు మరియు ఆయన (దేవుడు) మనందరికీ ఆశ్రయం కల్పించే ఆయన గొప్ప ప్రేమను అనుభవించవచ్చు.

మీకు దేవుడి ప్రేమ మరియు ఆశీస్సులతో,

శ్రీ దయామాత

ఇతరులతో షేర్ చేయండి