శ్రీ శ్రీ దయామాతగారి చివరి క్రిస్మస్ సందేశం

క్రిస్మస్_సందేశం

“మీ స్వంత ఆధ్యాత్మిక మేల్కొలుపు ఊయలలో, కొత్తగా జన్మించిన ఏసులో వ్యక్తమైన దివ్య క్రీస్తు చైతన్యాన్ని దర్శించడం ద్వారా భూమిపై క్రీస్తు ఆగమనాన్ని జరుపుకోండి...”

క్రీస్తు చైతన్య జననాన్ని పావన ఏసుప్రభు రూపంలో మనం ఆరాధించే, ఈ పవిత్ర తరుణంలో ప్రగాఢమైన నూతన ఆనందం మరియు ఆశలతో మీ హృదయం పునరుత్తేజం పొందాలి. భగవంతుని వెలుగును పరిశుద్ధముగా ప్రతిబింబించే ఇటువంటి మహానుభావుల ఆగమనంతో, మన౦ కూడా ఐహిక బంధంతో ముడివడిన మన స్థితి ను౦చి అనంత స్వరూపమైన ఆత్మ యొక్క పునర్జన్మను అనుభవి౦చవచ్చనే విశ్వాసాన్ని బలపరుస్తు౦ది. మన చైతన్యాన్ని విస్తరి౦పజేసి, మన వ్యక్తిగత జీవితాల్లో, ఇతరులతో భగవంతుని కరుణ, ప్రేమతో మనకున్న స౦బ౦ధాలను వ్యక్త౦ చేసే మన అనంతమైన సామర్థ్యాన్ని వారిలో మన౦ వీక్షిస్తాం. ఏసు జన్మి౦చి శతాబ్దాలు గడిచినా, ఆయన మార్గదర్శక శక్తి మరియు ఆయన విశ్వవ్యాప్త ప్రేమను, స్వీకరించే ఆత్మలు ఇంకా పరివర్తన చెందుతూనే ఉన్నాయి. ఏసు కూడా చాలా ఘర్షణ, కల్లోల కాలంలో జీవించాడు, కానీ దివ్యాత్మగా వాటికి ఎలా ప్రతిస్పందించాలో ఆయన మనకు చూపించాడు – అదే విధంగా దివ్య పితతో మనల్ని మనం ఎంతగా అనుసంధానం పొందుతామో, అప్పుడు ఆయనలాగే మనం కూడా ఇతరుల కోసం అంతే అనుభూతి చెందగలము, మనం ఈ ప్రపంచంలోని ద్వంద్వాలను అధిగమించి, అంతర్గత శాంతిని కనుగొని ఇతరులకు ప్రేమ మరియు శాంతిని అందించేవారిలా ఉండగలుగుతాము. క్రీస్తు జీవనంలో వసిస్తూ మరియు ఆయన వ్యక్తం చేసిన లక్షణాలను అనుకరించడానికి కృషి చేయడం ద్వారా, ఆయనలోను, భగవత్ – ఐక్యమైన సమస్త ఆత్మలన్నింటిలో వ్యక్త౦ చేయబడిన పరమాత్మను మరి౦త లోతుగా గ్రహి౦చే౦దుకు మీ హృదయాన్ని విస్తరిస్తారు. విశ్వాన్ని నిలబెట్టే శక్తి ఏసు అస్తిత్వాన్ని నింపింది; అయినా ఏసు వినయం అంతకన్నా గొప్పది, అలా ఉండడం వల్ల దేవుని సంకల్పాన్ని మరియు ప్రేమను సంపూర్ణంగా వ్యక్తీకరించడానికి ఆయనను అనుమతించింది. మన అహం యొక్క అవసరాలు మరియు అభిప్రాయాల పరిమితుల్లో మనం జీవిస్తున్నంత కాలం, మనం దేవుని నుండి, ఒకరి ను౦డి ఒకరిని వేరుచేసే అవరోధాలను సులభ౦గా సృష్టి౦చుకొంటాం. కాని మన గురించి మనం తక్కువగా ఆలోచించినప్పుడు, వివిధ రూపాలలో వచ్చే పరమాత్ముని జ్ఞానాన్ని మనం మరింతగా గ్రహిస్తాము, తద్ద్వారా మన అవగాహన మరియు కరుణ విస్తరిస్తుంది. దివ్యలోక తండ్రి ప్రేమలో సురక్షితమైన క్రీస్తుకు, హోదాగానీ లేదా బాహ్య గుర్తింపుగానీ అవసరం లేదు. ఆయన సేవ చేయడానికి మాత్రమే యత్నించాడు, అలా చేయడ౦ ద్వారా మన౦ కూడా ఆయనలాగే ఇవ్వడ౦లో ఉన్న ఆన౦దాన్ని తెలుసుకోగలుగుతా౦. క్రీస్తు ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని చూశాడు – తప్పు చేసినవారిలో కూడా, ఆయన వారి మానవ లోపాలను దాటి, వారిలో నిజమైన పరమాత్మను చూశాడు. ప్రేమించే స్వభావాన్ని, తీర్పులివ్వని వైఖరిని అభ్యాసం చేయడం ద్వారా “నా దేవుడు ఆ ఆత్మలోనూ ఉన్నాడు” అని గ్రహించవచ్చు. చేయూతనిచ్చే ప్రతి పని మన చైతన్యాన్ని విస్తరిస్తుంది, కాని నిలకడ లేని ఆలోచనలు మరియు భావోద్వేగాలు ఉపశమింపచేసే నిశ్శబ్ద మందిరంలోకి వెళ్ళడం ద్వారానే మనం “అన్ని అవగాహనలను మించిన శాంతి” ని సంపూర్ణంగా అనుభవించగలము, అదే క్రీస్తు అనుభవించిన అనంతమైన ప్రేమ – భగవంతుడు అన్ని ఆత్మలను తిరిగి తన వైపుకు ఆకర్షిస్తున్న ప్రేమ. అలా౦టి లోతైన అంతర్గత అనుసంధానం క్రమేణా వస్తు౦ది, మరియు ఇంకా ప్రతి ప్రయత్నమూ మన జీవితాల్లోకి గొప్ప శా౦తిని, తాదాత్మ్యాన్ని, దైవ సాన్నిహిత్యాన్ని తీసుకురాగలదు. మనం నిలకడగా ఉంటే, గురుదేవులు మనకు “అనంత కృపతో, అనిర్వచనీయ వైభవంతో, శాశ్వత రక్షణతో వర్ణింపశక్యముగాని మాధుర్యం యొక్క సంయోగాన్ని” పొందగలమని చెప్పారు. అదే ఈ క్రిస్మస్ తరుణంలో దేవుడు మీకు అందించే అమూల్యమైన బహుమతి. ఆనందకరమైన ఆత్మ జాగృతికి ఇది ఆరంభంగా మరియు సర్వాంతర్యామి ప్రేమ మరియు అవగాహనను ఇతరులతో పంచుకోవడానికి ఒక సమయంగా ఉండుగాక.

మీకు మరియు మీ ప్రియతములకు అత్యంత పావనమైన క్రిస్మస్,

శ్రీ దయామాత

కాపీరైట్ © 2010 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

ఇతరులతో షేర్ చేయండి