శ్రీ దయామాత యొక్క 100వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా శ్రీ మృణాళినీమాత నుండి ఒక సందేశం

దయామాత చిరునవ్వు

ప్రియతములారా,

మన ప్రియతమ శ్రీ శ్రీ దయామాత 100వ జన్మదిన వార్షికోత్సవం యొక్క ఈ సంతోషకరమైన వేడుకను ఇప్పుడు ఆమె నివశించే స్వర్గలోకంలో, అలాగే భగవంతుడి పట్ల ఆమె యొక్క భక్తి , మరియు ఆయన పిల్లల పట్ల ఆమెకున్న అపారమైన కరుణతో ఆమె దివ్యమైన జీవితం ద్వారా గాఢంగా ఉద్ధరించబడి, పరివర్తనమొందిన మనందరి హృదయాలలో నిశ్చయముగా జరుపబడుతుంది. అన్ని దేశాల నుండి మరియు అన్ని మతాల నుండి వచ్చిన వారందరూ ఆమె దైవ-అనుసంధానిత చైతన్యం నుండి నిండుగా ప్రవహించిన ప్రేమ మరియు అవగాహనకు ప్రతిస్పందించారు, తమకు తాముగా ఆయన చెంతకు ఆకర్షితమయ్యారు.

పవిత్ర గ్రంథాలలోని మహాత్ముల వలే దయామాతగారు చిన్నతనం నుండే దైవాన్ని తెలుసుకోవాలని, అనుసంధానం పొందాలని ఆకాంక్షించేవారు. మన గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారిని మొదటిసారిగా ఆమె చూసినప్పుడు, ఆయన ప్రసంగాన్ని విన్నప్పుడు, ఆమె ఇలా అనుకున్నారు, “నేను ఎల్లప్పుడూ భగవంతుడిని ప్రేమించాలని కోరుకున్నట్లుగానే ఆయన భగవంతుడిని ప్రేమిస్తున్నాడు. ఆయనకు భగవంతుడు తెలుసు. నేను ఆయననే అనుసరిస్తాను!” ఆ ప్రేమను పరిపూర్ణం చేయడమే ఆమె జీవితపు అత్యున్నత లక్ష్యం అయ్యింది; ఆ లక్ష్య౦ ను౦డి తన దృష్టిని మరల్చే దేనినీ ఆమె అనుమతి౦చలేదు, కాబట్టే ఆయన ఆధ్యాత్మిక అనుగ్రహాన్ని ఆమె స౦పూర్ణ౦గా పొ౦దగలిగలిగారు, ఈ లోక౦లో దేవుని కాంతి, ఆశీస్సులకు పరిశుద్ధమైన మార్గ౦గా ఉ౦డగలిగారు. తన వినయం, గురుదేవుల శిక్షణ పట్ల స్వీకారము, దేవుని యొక్క ఆలోచనలో, ఒకే లక్ష్యంతో జీవించి తన చుట్టూ ఉన్న మనందరికీ ఆమె ప్రేరణనిచ్చారు. జీవితంలో దైనందిన సవాళ్లు, గురుదేవులు తన భుజస్కందాలపై మోపిన పెరిగే బాధ్యతల మధ్య కూడా, ఆమె సంపూర్ణ విశ్వాసం మరియు భగవంతునికి శరణాగతి చేయడం ద్వారా జనించిన అంతర్గత ఆనందాన్ని విరజిమ్మారు.

“నీ సంకల్పమే నెరవేరనీ, నాది కాదు” అన్ని పరిస్థితుల్లోనూ అదే ఆమె నినాదం. ఆమె వ్యక్తిగత గుర్తింపును కోరుకోలేదు, ఎందుకంటే ఆమె తన గురువు యొక్క విశ్వసనీయ శిష్యురాలిగా మాత్రమే ఉండాలని కోరుకున్నారు; మరియు ఆమె నాయకత్వపు సంవత్సరాల్లో ఆమె ప్రతి నిర్ణయానికి ప్రమాణం ఏమిటంటే, “గురుదేవులు ఆశించేదేమిటి?” పూర్తి అస్థిత్వంతో ఆమె తన గురుదేవుల మార్గదర్శకత్వాన్ని పరిగ్రహించారు అలాగే గురుదేవుల నైజమును – ఆయన సంపూర్ణ శక్తిని మరియు ఆయన అపారమైన కరుణను మరింతగా ప్రతిబింబించారు. గురుదేవుల ఆదర్శాలను నిర్భీతిగా సంరక్షిస్తూనే, అ౦దరికీ తన దయ, స్నేహభావం అందించారు. గురుదేవులు ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి కొద్దికాలం ముందు, ఆయన లేకుండా ఆయన శిష్యులు ఎలా ముందుకు సాగగలరనే దాని గురించి ఆమె తన ఆందోళనను ఆయనతో వ్యక్తపరచినప్పుడు, “నేను గతించిన తరువాత, ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీచేయగలదు” అని జవాబిచ్చారు. ఆ మాటలు ఆమె హృదయ౦లో చెరగని రూపంలో ముద్ర వేసుకున్నాయి, అంత ప్రేమగా మారే౦తవరకు ఆ సూక్తితోనే జీవి౦చారు, ఇది గురుదేవులు గతించిన తర్వాత ఆయన ఆధ్యాత్మిక కుటు౦బాన్ని పోషించింది, మరియు అసంఖ్యాకమైన భక్తులకు ఆయన ఆశ్రయం గురి౦చి స్పష్టమైన హామీనిచ్చి౦ది.

గురుదేవుల ప్రపంచవ్యాప్త కుటుంబానికి తల్లిగా, దయామాతగారు మనందరి పట్ల ఎంతో సంరక్షణ వహించారు. గురుదేవుల కార్యాచరణ కోసం అరవై సంవత్సరాలకు పైగా కలిసి చేసిన సేవ ద్వారా మేము పంచుకున్న దివ్య స్నేహాన్ని భగవంతుడి అత్యంత విలువైన ఆశీస్సులలో ఒకటిగా నేను నా హృదయంలో పదిలపరచుకుంటాను, మరియు ఆయనతో అంతర్గత అనుశ్రుతిలో ఆమె అందించిన జ్ఞానాన్ని మరియు ప్రేమను స్మృతిగా నిక్షిప్తంచేసుకొంటాను. ఎల్లప్పుడూ భగవంతుని పట్ల భక్తితో, ఆయనను సేవించాలనే కోరికతో జ్వలించి, ఇతరుల్లో ఆ ఉత్సాహాన్ని మేల్కొల్పాలని యత్నించారు. గురుదేవులు అనుగ్రహించిన సాధనను రెట్టించిన ఉత్సాహంతో అనుసరించడమే మనం ఆమెను గౌరవించగల గొప్ప మార్గం. మీ ప్రయత్నాలు మరియు గురుదేవుల ఆశీస్సుల ద్వారా, ఆమెలో నిండిన దివ్య ఆనందాన్ని మరియు సర్వసమృద్ధమైన ప్రేమను మీరు కూడా తెలుసుకోగలరని, ఆమె ఉదాహరణ ద్వారా మీకు గుర్తు చేసి, ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. జై గురు, జై మా!

భగవంతుని మరియు గురుదేవుల అనంత ప్రేమలో,

శ్రీ శ్రీ మృణాళినీమాత

కాపీరైట్ © 2014 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

ఇతరులతో పంచుకోండి