స్వామి శ్రీయుక్తేశ్వర్ ఆవిర్భావ దినం

స్మారక ధ్యానం

బుధవారం, మే 10, 2023

ఉదయం 6:30

– ఉదయం 8:00 వరకు

(భారతీయ కాలమానం)

ఈ కార్యక్రమం గురించి

నేను ఇప్పటినుండి అనంతం వరకు, నీవు అతి బలహీన మానసిక స్థితిలో ఉన్నా లేక ఉత్కృష్ట జ్ఞానావస్థలో ఉన్నా నీ శాశ్వతమైన స్నేహితునిగా ఉంటాను. నీవు తప్పు చేసినా నీ స్నేహితునిగానే ఉంటాను, ఎందుకంటే ఇతర సమయాల్లో కన్న అప్పుడే నీకు నా స్నేహం ఎక్కువ అవసరమవుతుంది.

— స్వామి శ్రీయుక్తేశ్వర్

“జ్ఞానము యొక్క అవతారం” జ్ఞానావతార్ గా గౌరవించబడే పరమహంస యోగానందగారి గురువు స్వామి శ్రీయుక్తేశ్వరుల ఆవిర్భావ దినాన్ని (మే 10) పురస్కరించుకొని ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి ఆన్‌లైన్‌ స్మారక ధ్యానాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమం ఉదయం 6:30 నుండి ఉదయం 8:00 (భారత కాలమానం) వరకు మన ఆన్‌లైన్‌ వేదికపై ఆంగ్లంలో నిర్వహించబడింది. నియమిత సమయాలపాటు కీర్తనలు మరియు ధ్యానం, తరువాత ఆధ్యాత్మిక ప్రసంగం దీనిలో ఉన్నాయి.

స్వామి శ్రీయుక్తేశ్వరుల గురించి మరింతగా తెలుసుకోవడానికి, వీటిని అన్వేషించడానికి మీరు ఇష్టపడవచ్చు:

ఈ శుభ సందర్భంలో, వారి క్రియాయోగ బోధనల ఆధ్యాత్మిక వారసత్వానికి — స్వామి శ్రీయుక్తేశ్వరులకు కృతజ్ఞతలు అర్పించడం సంప్రదాయంగా ఉంది. మన దివ్య గురుదేవుల ఆత్మ-విముక్తి బోధనలను ప్రోత్సహించడానికి మరియు వ్యాప్తిచేయడానికి మీ విలువైన విరాళం ఉపయోగించబడుతుంది.

విరాళాన్ని సమర్పించాలని మీరు భావిస్తే, క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో షేర్ చేయండి