మహావతార్ బాబాజీ స్మృతి దినం

(ఒక వై.ఎస్.ఎస్. సన్యాసిచే ధ్యానం మరియు ఆధ్యాత్మిక ప్రసంగం)

మంగళవారం, జులై 25, 2023

ఉదయం 6:30

– ఉదయం 8:00 వరకు

(భారతీయ కాలమానం)

ఈ కార్యక్రమం గురించి

ఎవరైనా భక్తితో బాబాజీ నామమును ఉచ్చరిస్తే ఆ భక్తునికి తక్షణమే ఆధ్యాత్మిక దీవెన లభిస్తుంది.

— లాహిరీ మహాశయులు

ఈ యుగంలో మరుగునపడిన క్రియాయోగం యొక్క శాస్త్రీయ ధ్యాన ప్రక్రియను పునరుద్ధరించిన మహావతార్ బాబాజీ గౌరవార్థం, జులై 25వ తేదీని స్మారక దినంగా మనం జరుపుకుంటాం.

1920లో ఈ రోజున, పరమహంస యోగానందగారు అమెరికాకు వెళ్ళే ముందు కోల్ కత్తాలోని వారి ఇంటికి బాబాజీ విచ్చేశారు. తాను చేపట్టబోయే కార్యానికి, దైవం నుండి తగిన హామీ కావాలని యువకుడైన యోగానందుడు గాఢంగా ప్రార్థిస్తున్నాడు; ఎప్పుడైతే అక్కడకు మహావతార్ బాబాజీ వచ్చారో, అతడితో ఆయన ఇలా అన్నారు: “నీ గురువుగారి ఆదేశాల్ని అనుసరించి అమెరికా వెళ్ళు. భయపడకు, నీకు రక్ష ఉంటుంది. పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడానికి నేను ఎంపిక చేసినవాడివి నువ్వే.”

ఈ సమావేశాన్ని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) మహావతార్ బాబాజీ స్మృతి దినంగా పాటిస్తుంది. మహావతార్ బాబాజీ గౌరవార్థం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒక ఆన్‌లైన్ ధ్యానాన్ని ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు.

ఈ పవిత్రమైన తరుణంలో సాంప్రదాయక విరాళం మీరు సమర్పించాలనుకొంటే, దయచేసి క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో షేర్ చేయండి