వై.ఎస్.ఎస్. భక్తులు నిర్వహించే ఆన్‌లైన్ ధ్యాన కార్యక్రమములు

(ఇంగ్లీష్ మరియు ఇతర భారతీయ భాషలు)

ఈ కార్యక్రమం గురించి

సన్యాసులు నిర్వహించే ధ్యాన కార్యక్రమాలతో పాటు వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రము యొక్క ప్రతి వారం క్యాలెండర్ లో భక్తులు నిర్వహించే ధ్యాన కార్యక్రమాలను కూడా మేము అందిస్తున్నాము.

ధ్యాన సమయం వివరాలు

ఉదయం జరిగే ధ్యాన కార్యక్రమములు

ఉదయం 6:40 – ఉదయం 8:00 వరకు (ఇంగ్లీష్)

శనివారం మరియు ఆదివారం మినహా ప్రతిరోజు

ఉదయం 6:40 – ఉదయం 8:00 వరకు (హిందీ)

ఆదివారం మినహా ప్రతిరోజు

సాయంత్రం జరిగే ధ్యాన కార్యక్రమములు

సాయంత్రం 5:10 – సాయంత్రం 6:30 వరకు (హిందీ)

మంగళవారం మినహా ప్రతిరోజు

సాయంత్రం 6:10 – రాత్రి 7:30 వరకు (ఇంగ్లీష్)

మంగళవారం మరియు బుధవారం మినహా ప్రతిరోజు

సాయంత్రం 6:10 – రాత్రి 8:30 వరకు (ఇంగ్లీష్)

ప్రతి బుధవారం

సాయంత్రం 6.10 – రాత్రి 7.30 వరకు (తెలుగు)

ప్రతి నెల మొదటి మరియు మూడవ శుక్రవారాలు

సాయంత్రం 6.10 – రాత్రి 7.30 వరకు (తమిళం)

ప్రతి నెల మొదటి మరియు మూడవ సోమవారాలు

సాయంత్రం 6.10 – రాత్రి 7.30 వరకు (కన్నడం)

ప్రతి బుధవారం

సాయంత్రం 6.10 – రాత్రి 7.30 వరకు (బెంగాలీ)

ప్రతి నెల రెండవ మరియు నాల్గవ సోమవారాలు

ప్రతి ధ్యాన కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామాల సామూహిక అభ్యాసంతో ప్రారంభమవుతుంది. దాని తర్వాత ప్రారంభ ప్రార్థన, ఆధ్యాత్మిక దైనందిని చదవడం, విశ్వగీతం పాడడం, అనంతరం కొద్దిసేపు నిశ్శబ్ద ధ్యానం ఉంటాయి. అనంతరం పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియను అభ్యాసం చేయడం మరియు ముగింపు ప్రార్థన ఉంటాయి. ఈ ధ్యాన కార్యక్రమాలలో ప్రతి దానిలో విశ్వగీతమును ఆంగ్లము మరియు ధ్యానము నిర్వహించబడుతున్న భాషలో పాడబడతాయని దయచేసి గమనించండి.

బుధవారం సాయంత్రం జరిగే సుదీర్ఘ ధ్యాన కార్యక్రమం యొక్క వివరాలు:

సుదీర్ఘ ధ్యాన కార్యక్రమం, శక్తిపూరణ వ్యాయామాల సామూహిక అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ప్రారంభ ప్రార్థన, స్ఫూర్తిదాయకమైన పఠనాలు, భక్తి సంకీర్తన మరియు రెండు సార్లు 30-50 నిమిషాల పాటు నిశ్శబ్ద ధ్యానం ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ఈ ధ్యాన కార్యక్రమం ముగుస్తుంది.

సన్యాసులు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్న రోజుల్లో ఈ ఆన్‌లైన్ ధ్యాన కార్యక్రమాలు నిర్వహించబడవని దయచేసి గమనించగలరు.

ధ్యాన కార్యక్రమాలలో ఎలా పాల్గొనాలో తెలియకపోతే దయచేసి సందర్శించండి: “ఆన్‌లైన్ ధ్యాన కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి