శ్రీ శ్రీ రాజర్షి జనకానంద

సంక్షిప్త జీవిత చరిత్ర రూపణ

రాజర్షి జనకానందగారు (జేమ్స్ జె.లిన్) పరమహంస యోగానందగారికి ప్రియమైన శిష్యుడు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క అధ్యక్షుడిగా మరియు ఆధ్యాత్మిక అధిపతిగా ఆయనకు మొదటి వారసుడిగా ఫిబ్రవరి 20, 1955 నుండి ఆయన పరమపదించే వరకు పనిచేశారు. మిస్టర్ లిన్ మొదట 1932లో పరమహంసగారి నుండి క్రియాయోగ దీక్షను తీసుకున్నారు; ఆయన ఆధ్యాత్మిక పురోగతి చాలా వేగంగా ఉండింది, గురువుగారు 1951లో రాజర్షి జనకానంద అనే సన్యాసి బిరుదును ఆయనకు ఇచ్చేవరకు ఆయనని “సెయింట్ లిన్” అని ప్రేమగా పిలిచేవారు.
శ్రీ శ్రీ రాజర్షి జనకానంద

పరమహంస యోగానందగారితో ఆయన గడిపిన సమయాన్ని గురించిన ఒక అందమైన వర్ణనతో పాటు అనేక ఛాయా చిత్రాలను, ఇక్కడ చూడవచ్చు

ఈ జీవిత చరిత్ర రూపణ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రచురించిన రాజర్షి జనకానంద: ఎ గ్రేట్ వెస్ట్రన్ యోగి (Rajarsi Janakananda: A Great Western Yogi) పుస్తకం నుండి సేకరించారు. ఈ పుస్తకంలో మరింత వివరమైన జీవిత చరిత్ర మరియు ఆయన ప్రసంగాల నుండి కొన్ని సంగ్రహాలు ఉన్నాయి. ఇది ఆయనతో పరమహంసగారి వ్యక్తిగత కరస్పాండెన్స్ యొక్క అరవైకి పైగా పేజీలను కలిగి ఉంది – వారు పంచుకున్న సన్నిహిత ఆధ్యాత్మిక అనుసంధానము యొక్క సంగ్రహావలోకనం అందించే మార్గదర్శకత్వం మరియు ప్రేమ మాటలు, గురు-శిష్యుల సంబంధాల లోతును శక్తివంతంగా తెలియజేస్తాయి.

రాజర్షి ప్రసంగాల యొక్క సంక్షిప్త ఆడియో రికార్డింగ్‌ల రెండు సీడీలు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క కలెక్టర్ సిరీస్ లోని పరమహంస యోగానందగారి అరుదైన రికార్డ్ చేసిన ప్రసంగాలతో పాటు చేర్చబడ్డాయి:

Self-Realization: The Inner and the Outer Path

In the Glory of the Spirit

ఇతరులతో పంచుకోండి