ఏసుక్రీస్తు

ఏసుక్రీస్తు

పరమహంస యోగానందగారి ముఖ్యమైన లక్ష్యాలలో ఒకటి ఏమిటంటే “భగవాన్ కృష్ణుడు బోధించిన అసలైన యోగములోను మరియు ఏసుక్రీస్తు బోధించిన అసలైన క్రైస్తవంలోను ఉన్న సంపూర్ణ సామరస్యాన్ని మరియు ప్రాథమిక ఏకత్వాన్ని వెల్లడించడం; మరియు ఈ సత్యసూత్రాలు అన్నీ, నిజమైన మతాలకు సాధారణ శాస్త్రీయ పునాదులని చూపించడం.”

పెద్ద సంఖ్యలో ప్రజలకు, ఏసు విశ్వాసం, ప్రేమ మరియు క్షమాపణ యొక్క సరళమైన తత్వాన్ని ప్రతిపాదించారు. ఆయన తరచుగా కాలాతీత నైతికతతో నిండి ఉన్న ఉపమానాలను మాట్లాడేవారు. కానీ తన దగ్గరి శిష్యులకు లోతైన సత్యాలను ఆయన బోధించేవారు, మరింత ప్రాచీన యోగ తత్వశాస్త్రం యొక్క లోతైన అధిభౌతిక భావనలలో కలిగి ఉన్న సంబంధిత సత్యాలను బోధించారు.

ఏసు శిష్యులు ఆయనను ప్రశ్నించినప్పుడు, “నీవు వారితో ఉపమానాలలో ఎందుకు మాట్లాడావు?” ఆయన ఇలా సమాధానమిచ్చారు, “ఎందుకంటే స్వర్గ రాజ్యం యొక్క రహస్యాలు తెలుసుకోవడం మీకు ఇవ్వబడింది, కానీ అది వారికి ఇవ్వబడలేదు….అందుకే నేను వారితో ఉపమానాలతో మాట్లాడతాను: ఎందుకంటే చూసినా చూడ లేరు; మరియు వారు విన్నా కూడా వినలేరు, అర్థం చేసుకోలేరు” (మాత్యు 13:10,11,13).

ఏసు అసలు బోధనలపై పూర్తి అవగాహన–ధ్యానయోగం యొక్క నిగూఢమైన ప్రక్రియలను తన శిష్యులకు ప్రసాదించిన వాస్తవంతో సహా–పరమహంస యోగానందగారి ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్: ద రిసరెక్షన్ ఆఫ్ ద క్రైస్ట్ వితిన్ యు (The Second Coming of Christ: The Resurrection of the Christ Within You) అనే గ్రంథంలో సువార్తల మీద లోతైన వ్యాఖ్యానంలో వెల్లడించబడినది: ఆ రచనా పరిచయంలో, యోగానందగారు ఇలా వ్రాశారు:

“ఏసుక్రీస్తు నేడు సజీవముగా మరియు చురుకుగా ఉన్నారు. ఆత్మలో మరియు అప్పుడప్పుడు ప్రపంచములో జ్ఞానోత్పత్తి కలిగించడానికి అదృశ్యముగా పని చేస్తున్నారు. ఏసు పర లోకంలో తన ఆనందకరమైన చైతన్యాన్ని ఆస్వాదించడంతో సంతృప్తి చెందలేదు. ఆయన మానవజాతి పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. మరియు దేవుని అనంతమైన రాజ్యంలోకి ప్రవేశించడానికి దివ్య స్వేచ్ఛను సాధించడానికి తన అనుచరులకు మార్గాలను అందించాలని కోరుకుంటున్నారు. ఆయన నిరాశ చెందారు, ఎందుకంటే ఆయన పేరుపై స్థాపించబడిన చర్చిలు మరియు దేవాలయాలు, తరచుగా సంపన్నమైనవి మరియు శక్తివంతమైనవి, కానీ ఆయన నొక్కి చెప్పిన అనుసంధానం – దేవుడితో నిజమైన అనుసంధానం ఎక్కడ ఉంది? అన్నింటిలోనూ మొట్టమొదటగా మానవ ఆత్మలలో మందిరాలు స్థాపించబడాలని ఏసు కోరుకుంటున్నారు; అప్పుడు ఆరాధన కోసం ప్రార్థన స్థలాలు బాహ్యంగా స్థాపించవచ్చు. బదులుగా చూర్చియానిటీలో, లెక్క లేనన్ని భారీ కట్టడాలలో విస్తారమైన సమ్మేళనాలు జరుపబడుతున్నాయి, లోతైన ప్రార్థన మరియు ధ్యానం ద్వారా క్రీస్తుతో నిజంగా సన్నిహితంగా ఉన్న ఆత్మలు కొన్ని మాత్రమే ఉన్నాయి.

“క్రీస్తు మరియు కృష్ణుడు ప్రతిపాదించిన దేవునితో అనుసంధానం యొక్క అసలైన బోధనల పునరుద్ధరణ ద్వారా ఆత్మల దేవాలయాలలో దేవుడిని పునః స్థాపించడమనే కార్యం నిమిత్తం, నేను మహావతార్ బాబాజీ చేత పశ్చిమ దేశాలకు పంపబడ్డాను….

“బాబాజీకి క్రీస్తుతో ఎప్పుడూ సన్నిహిత సంబంధముంటూనే ఉంది. వీరిద్దరూ కలసి ముక్తిప్రదమయిన స్పందనలను ప్రసరింపజేస్తూనే ఉంటారు. అంతే కాకుండా వీరు, ఈ యుగంలో మోక్షప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు రూపకల్పన చేశారు.”

ఇతరులతో పంచుకోండి