గురు-శిష్య సంబంధం

పరమహంస యోగానంద గురువు

గురువు పాత్ర

నిజమైన గురువు సాధారణ ఆధ్యాత్మిక ఉపాధ్యాయులు కాదు, దేవునితో ఐక్యతను సాధించి, తద్వారా ఇతరులను ఆ లక్ష్యం వైపు నడిపించే సమర్ధత కలిగి ఉంటారు.

సంస్కృత గ్రంథాలు గురువును “అంధకారాన్ని పారదోలేవాడు”గా (గు = అంధకారము, మరియు రు = పారదోలేది) వివరించాయి. గురువు మరియు శిష్యుడి మధ్య అత్యంత వ్యక్తిగత ఆధ్యాత్మిక బంధం ద్వారా భగవంతునిలో విముక్తిని కనుగొనడంలో సహాయపడటమే గురువు యొక్క పాత్ర, శిష్యుని నమ్మకమైన ఆధ్యాత్మిక ప్రయత్నం మరియు గురువు ప్రసాదించిన దైవిక దీవెనల యొక్క సంగమము. భగవద్గీతలో, అర్జునుడు ఆదర్శ భక్తుడికి, ఒక పరిపూర్ణ శిష్యుడికి చిహ్నముగా నిలిచాడు.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాల విద్యార్థులు క్రియాయోగ దీక్ష తీసుకొన్న తరువాత పరమహంస యోగానందులవారికి మరియు ఆయన గురు పరంపరకు, శిష్యులు అవుతారు.

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు – వై‌.ఎస్‌.ఎస్. గురువుల శ్రేణిలో చివరివారు

పరమహంస యోగానందులవారు పరమపదించే ముందు, వై.ఎస్‌.ఎస్. గురువులలో ఆయన చివరి వ్యక్తిగా ఉండాలనేది దేవుడి కోరిక అని పేర్కొన్నారు. ఆయన సంస్థలో తరువాతి శిష్యులు లేదా అధ్యక్షులు ఎప్పటికీ గురు బిరుదును స్వీకరించరు.

ఈ దైవిక శాసనం మత చరిత్రలో ప్రత్యేకమైనది కాదు. సిక్కు మతాన్ని స్థాపించిన గొప్ప సాధువు గురునానక్ గారు పరమపదించిన తరువాత, గురువుల సాధారణ వారసత్వం ఉంది. ఈ శ్రేణిలోని పదవ గురువు ఆ గురువులలో చివరివాడినని, ఇకనుండి బోధనలే గురువుగా పరిగణించబడతాయని ప్రకటించారు.

పరమహంసగారు తన పరమపదించిన తరువాత కూడ, ఆయన స్థాపించిన సంఘం, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా తన కృతిని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇలా అన్నారు, “నేను వెళ్ళిపోయిన తరువాత బోధనలే గురువు అవుతాయి….బోధనల ద్వారా మీరు నాకు మరియు నన్ను పంపిన గొప్ప గురువులతో అనుసంధానంలో ఉంటారు.”

ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానందగారు మరియు ఆయన గురువును గురించి మరింత చదవండి.

గురు-శిష్యుల సంబంధం గురించి ఆడియో ప్రసంగాలు:

ఇతరులతో షేర్ చేయండి